jal
-
గిరిజనుల తరఫున పోరాటం: రాహుల్
ధన్‌బాద్: గిరిజన ప్రజలకు నీరు, అడవి, భూమి(జల్–జంగిల్–జమీన్)పై హక్కుల ను, గిరిజన యువతకు ఉపాధిని కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జరిగిన రోడ్ షోలో ప్రసంగించారు. రాష్ట్రంలో జోడో యాత్ర మూడో రోజుకు చేరుకుంది. జిల్లాలోని తుండిలో శనివారం రాత్రి బస చేసిన రాహుల్ ఆదివారం గోవింద్పూర్ నుంచి తిరిగి యాత్రను మొదలుపెట్టారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం కాకుండా కాపాడటం, యువతకు గిరిజనులకు న్యాయం దక్కేలా చేయడమే యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆర్థిక అసమానతలు, నోట్లరద్దు, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలు దేశంలోని యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం యాత్ర తిరిగి కొనసాగి బొకారో జిల్లాలోకి ప్రవేశించింది. బొకారో వైపు సాగుతూ గోధార్ కాళి బస్తీ వద్ద ఆయన బొగ్గు గని కార్మికులు, వారి పిల్లలతో ముచ్చటించారు. మధ్యాహ్నానికి యాత్ర బొకారో చేరుకుంది. భోజనానంతరం జెనామోర్ నుంచి మొదలైన యాత్ర రామ్‌గఢ్ జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలోని గోలా వద్ద జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. -
మీ ఆస్తులు అమ్మకండి..!
న్యూఢిల్లీ: జేపీ ఇన్ఫ్రాటెక్ – గృహ కొనుగోలుదారుల కేసులో మాతృసంస్థ– జైప్రకాశ్ అసోసియేట్ లిమిటెడ్ (జేఏఎల్)కు బుధవారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ఐదుగురు ప్రమోటర్లుసహా 13 మంది డైరెక్టర్లు తమ వ్యక్తిగత ఆస్తులు అమ్మకూడదని నిర్దేశించింది. వ్యక్తిగత లేదా సన్నిహిత కుటుంబ సభ్యులు, లేదా డిపెండెంట్ సభ్యుల ఆస్తులు విక్రయిస్తే కోర్టు ధిక్కారంసహా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌నూ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. అనుబంధ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించి బకాయిల మొత్తాన్ని గృహ కొనుగోలుదారులకు చెల్లించాల్సిందేనని మాతృసంస్థ– జేపీ అసోసియేట్స్‌కు స్పష్టంచేసిన సుప్రీంకోర్టు అప్పటి వరకూ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఆస్తుల అమ్మకాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. రూ.275 కోట్ల డిపాజిట్‌కు నిర్దేశం... దీనితోపాటు డిసెంబర్ 14వ తేదీలోగా రూ.150 కోట్లు, డిసెంబర్ 31వ తేదీలోపు రూ.125 కోట్లు మొత్తం రూ.275 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. బకాయిలకు సంబంధించి రియల్టీ సంస్థ బుధవారం సమర్పించిన రూ.275 కోట్లు డిమాండ్ డ్రాఫ్ట్‌ను కూడా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్వేరర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆమోదించింది. కేసు తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు డైరెక్టర్లు అందరూ కోర్టుకు హాజరుకావాలని నిర్దేశించింది. దివాలా న్యాయసంబంధ సమస్యలను ఎదుర్కొంటున్న జేపీ ఇన్ఫ్రాటెక్, నోయిడాలోని వివిధ ప్రాజెక్టులకు గాను గృహ కొనుగోలుదారులకు దాదాపు రూ.2,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ కేసులో నాన్–ఇన్స్టిట్యూషనల్ డైరెక్టర్లు అందరూ తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలను అందజేయాలని నవంబర్ 13న అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తన అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేయరాదని జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లకు అంతక్రితమే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆభరణాలు అమ్మి అయినా... ‘‘మంచి పిల్లల తరహాలో ఇవ్వాల్సింది ఇచ్చేయండి. మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కొనుక్కోడానికి జీవితకాలం దాచుకున్న పొదుపులను పాడుచేయకూడదు. మీ కుటుంబ ఆభరణాలను తనఖా పెట్టండి. లేదా అమ్మేయండి. మధ్య తరగతి నుంచి వసూలు చేసిన సొమ్ము వారికి అందాల్సిందే.’’ అని మాతృ సంస్థ డైరెక్టర్లను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసులో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ, జేపీ నిధులను మళ్లించిందని అన్నారు. సంస్థ వ్యవహారాల విచారణకు ఫోరెన్సిక్ ఆడిట్ అవసరమని వివరించారు. నష్టపోయిన వారి వివరాలతో వారం లోపు ఒక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసులో న్యాయ సహాయకునిగా ఉన్న న్యాయవాది పవన్ శ్రీ అగర్వాల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు 32,000 మంది జేపీ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టుల్లో తమ ఫ్లాట్స్ బుక్‌చేసుకుని, ఇన్స్టాల్మెంట్లు చెల్లిస్తున్నారని చిత్రా శర్మా అనే వ్యక్తి సహా పలువురు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో కంపెనీపై జరుగుతున్న దివాలా ప్రొసీడింగ్స్‌పై సెప్టెంబర్ 4న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రూ.526 కోట్ల బకాయిలకు సంబంధించి ఐడీబీఐ బ్యాంక్ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఆగస్టు 10న ఎన్సీఎల్టీ అడ్మిట్ చేసింది. ఆ వెంటనే ‘ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి’ అంటూ వందలాది మంది జేపీ ఇన్ఫ్రాటెక్ హోమ్ బయ్యర్లు ఆందోళన బాట పట్టారు. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంటు ప్లాంట్లు
♦ ఏపీ సహా ఇతర రాష్ట్రాల యూనిట్లలో కొన్నింటి విక్రయం ♦ డీల్ విలువ రూ. 15,900 కోట్లు న్యూఢిల్లీ: సిమెంటు రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) తమ సిమెంటు వ్యాపారంలో కొంత భాగాన్ని అల్ట్రాటెక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 15,900 కోట్లు. గత నెలలో కర్ణాటక ప్లాంటును కూడా విక్రయించాలని యోచించినప్పటికీ... తాజాగా దాన్ని పక్కన పెట్టడంతో ఒప్పందం విలువ రూ. 16,500 కోట్ల నుంచి రూ. 15,900 కోట్లకు తగ్గింది. కర్ణాటక ప్లాంటు వార్షికోత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని 17.2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లను, 4 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను (యూపీ) అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు బోర్డు ఆమోదించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు జేఏఎల్ వెల్లడించింది. కర్ణాటకలోని షాబాద్ ప్లాంటును మినహాయించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. మొత్తం డీల్ విలువ రూ. 15,900 కోట్లు కాగా, గ్రైండింగ్ యూనిట్ పనుల పూర్తి కోసం గాను యూటీసీఎల్ మరో రూ.470 కోట్లు చెల్లిస్తుంది. 9-12 నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తి కాగలదని జేఏఎల్ తెలిపింది. ఒప్పందం అనంతరం ఆంధ్రప్రదేశ్ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జేఏఎల్ వద్ద మొత్తం 10.6 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ప్లాంట్లు మిగులుతాయి. అటు అల్ట్రాటెక్ సామర్థ్యం 91.1 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. తమ అంచనాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ పూర్తికావటానికి 12-14 నెలలు పట్టొచ్చని స్టాక్ ఎక్స్చేంజీలకు అల్ట్రాటెక్ తెలిపింది. వేల కోట్ల రుణాలతో సతమతమవుతున్న జేపీ అసోసియేట్స్‌కి తాజా డీల్‌తో కొంత ఊరట లభించనుంది. తాజా పరిణామంతో జేఏఎల్ షేర్లు బీఎస్ఈలో 3.66 శాతం పెరిగి రూ. 7.64 వద్ద, అల్ట్రాటెక్ షేర్లు 1.09 శాతం పెరిగి రూ. 3,227 వద్ద ముగిశాయి. -
ఆస్కార్ బరిలో ‘జల్’
న్యూఢిల్లీ: జాతీయ అవార్డు సాధించిన చిత్రం ‘జల్’ 87వ అస్కార్ అవార్డుల రేస్‌లో నిలిచింది. ఉత్తమ చిత్రం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిల్లో ఈ చిత్రానికి నామినేషన్లు దక్కాయి. ఈ సినిమాకి గిరిష్ మాలిక్ దర్శకత్వం వహించగా.. సోనూనిగమ్, బిక్రమ్ ఘోష్ నేపథ్య సంగీతాన్ని అందించారు.