భక్తులపై తేనెటీగల దాడి
- పది మందికి గాయాలు
జమాలయ్యదర్గా(మహానంది): జమాలయ్య దర్గా వద్ద తేనెటీగల దాడిలో పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. నంద్యాలకు చెందిన సుమారు 20 మందికిపైగా భక్తులు జమాలయ్యదర్గా వద్ద స్వామివారికి పూజలు చేసేందుకు వచ్చారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని వంటలు చేసుకునేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్లుండి తేనేటీగలు వారిపై దాడి చేయడంతో చిన్నారులతో కలిపి సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం అక్కడే ఉన్న తిమ్మాపురం గ్రామానికి చెందిన యువకులు వేణు, సయ్యద్, తదితరులు వారికి సేవలందించారు. ఇదిలా ఉండగా గత గురువారం సైతం తేనెటీగలు దాడి చేయడంతో ఐదుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు.