jammuandkashmir
-
జమ్ము కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి
-
జమ్ము కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి
పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 39 మంది జవాన్లు మృతిచెందారు. అవంతిపొరలోని గొరిపొరలో మెయిన్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముందుగా కాల్పులు జరిపి, అనంతరం వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు. బాంబు పేలుడు దాటికి వాహనం తునాతునకలై, 39 మంది మృతిచెందగా, మరో 40 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్‌లోకి కారును తీసుకెళ్లి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. కారు నడిపిన ఉగ్రవాదిని పుల్వామా ప్రాంతానికి చెందిన అదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 2018లో అతడు జైషే మహ్మద్‌లో చేరాడు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీ సీఆర్పీఎఫ్ ఆర్ఆర్ భట్నాగర్‌తో రాజ్‌నాథ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉగ్రదాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. అవంతిపురలో జవాన్ల మృతి వార్త నన్ను తీవ్ర కలవరానికి గురిచేసిందని, ఈ దారుణ ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాడిపై విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
స్కూల్‌పై బాంబు దాడి.. విద్యార్థులకు తీవ్రగాయాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం మధ్యాహ్నాం ఓ ప్రైవేటు పాఠశాలలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. కాకపోరాలోని నర్బల్ ప్రాంతంలో ఫలాహ్-ఇ-మిలాత్ పాఠశాలలో మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా బాంబు దాడి జరగడంతో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు పాఠం బోధిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు సంభవించందని, చాలా మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయని ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు మీడియాకు తెలిపారు. సమచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్ : భద్రతాబలగాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బిన్నర్‌లో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భధ్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గరు తీవ్రవాదులు మృతి చెందారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటన స్థలంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
-
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ కూడా భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సబ్జార్ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరివేయగా.. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్లో ఎల్వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ట్రాల్‌లోని ఓ ఇంటిలో అబు జరార్ అలియాస్ సబ్జార్ అహ్మద్, ఓ పాకిస్థానీ ఉగ్రవాదితో కలిసి నక్కి ఉండగా.. భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుమట్టాయి. ఈ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ ప్రాణాలు విడిచాడు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక, ఉడీకి సమీపంలో ఉన్న రాంపూర్‌లో తెల్లవారుజామున ఎల్వోసీ మీదుగా అనుమానాస్పద కదలికలు ఉండటంతో వెంటనే అలర్ట్ అయిన సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఉడీ సెక్టార్లో శుక్రవారం జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాక్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఉడీ సెక్టార్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. వారిని సైన్యం ఏరిపారేసింది. -
ఉగ్రకాండ: కశ్మీర్లో భీకర కాల్పులు..
శ్రీనగర్: గత కొన్నాళ్లుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న జమ్మూకశ్మీర్ శనివారం ఉదయం కాల్పులతో దద్దరిల్లింది. సైము ట్రాల్ సెక్టార్లో శనివారం ఉదయం ఉగ్రవాదులు మాటువేయడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దీంతో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు పొంచి ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఇక, రాంపూర్ సెక్టార్లో చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా.. వారి ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ మరికొందరు ఉగ్రవాదులు నక్కినట్టు భావిస్తున్న భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. తాజా ఎదురుకాల్పులతో ఇక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. -
భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ షురూ!
ఉగ్రవాదులు వరుస బ్యాంకు లూటీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో వారిని ఉక్కుపాదంతో అణిచేందుకు సైన్యం దక్షిణ కశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో భారీ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ చేపట్టింది. తుర్కవాన్ గావ్ ప్రాంతంలోని 20 గ్రామాలను దిగ్బంధించి భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. షోపియన్ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ పై దాడి చేసి.. ఐదు సర్వీస్ రైఫిళ్లు ఎత్తుకెళ్లిన మిలిటెంట్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. భద్రతా దళాల భారీ ఆపరేషన్ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో యువత గుమిగూడి.. జవాన్లపై రాళ్లు రువ్వుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే రెండు గంటల వ్యవధిలో పుల్వామా జిల్లాలో రెండు వేర్వేరు బ్యాంకుల్లోకి ఉగ్రవాదులు చొరబడి నగదు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.50 కి వాహిబుగ్‌లో ఉన్న ఇలాకి దెహతి బ్యాంకులోకి నలుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించి సిబ్బందిపై తుపాకి గురిపెట్టి రూ.3-4 లక్షల నగదుతో పరారయ్యారు. బ్యాంకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దొంగలను పట్టుకోవడానికి వేట ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30కి అదే జిల్లాలో జమ్మూ కశ్మీర్ బ్యాంకు నెహమా శాఖలో కూడా మిలిటెంట్లు దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గత మూడు రోజులు నుంచి దక్షిణ కశ్మీర్‌లోని బ్యాంకులపై మిలిటెంట్లు వరసగా దాడులు చేస్తున్నారు.