jampana sudhakar
-
పూర్తిగా సౌరశక్తితో విద్యుదీకరించిన గ్రామం?
సోషల్ - కంటెంట్ (ఎస్ఏ) నీటి సమస్యను తగ్గించి, నీటిపారుదల వ్యవస్థను పటిష్ట పరచడాన్ని ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా చేర్చారు. ఈ ప్రణాళిక ప్రారంభం నాటికే దేశంలో ఉన్న 158 భారీ; 226 మధ్య తరహా; 95 పొడిగించే, పునరుద్ధరించే, ఆధునికీకరించే పథకాలను ఈ ప్రణాళికా కాలంలో కొనసాగించారు. ఉత్తర భారత దేశంలో అత్యంత వాలు ఉన్న పర్వతీయ స్థలాకృతి కృత్రిమ నీటిపారుదలకు అనుకూలంగా లేదు. నీటిపారుదల, విద్యుచ్ఛక్తి భారతదేశంలో ప్రణాళికా కాలానికి ముందు 22.6 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణానికి నీటిపారుదల సామర్థ్యం ఉంది. ఇది 1993-94 సంవత్సరాంతానికి 85 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దీంట్లో 31.8 మిలియన్ హెక్టార్లు భారీ, మధ్యతరహా; 53.2 మిలియన్ హెక్టార్లు చిన్నతరహా పథకాల కింద ఉంది. దీంట్లో 76.3 మిలియన్ హెక్టార్ల భూమి మాత్రమే నీటిపారుదలను వినియోగించుకుంటోంది. 1974-75 నుంచి ఆయకట్టు ప్రాంత అభివృద్ధిని చేపట్టారు. నీటిపారుదల ఉత్పత్తి, వినియోగాల మధ్య అంతరాన్ని పూరించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రాలు బీహార్, తమిళనాడు, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక మాదిరి నుంచి ఎక్కువ నీటిపారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం నీటిపారుదల కింద సాగయ్యేవిధంగా మార్పు దశలో ఉంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో అతి స్వల్ప (్ఱ20%) నీటి పారుదల సాంద్రత ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా చెరువులు, జలాశయాల నుంచి నీటిని మళ్లించే పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల లాంటి ఉపరితల జల పథకాలున్నాయి. నీటిపారుదల వసతుల ప్రగతి భారతదేశం వ్యవసాయిక దేశమైనందువల్ల సమర్థమైన నీటిపారుదలతో కూడిన పంటల వ్యవస్థ ఉన్నప్పుడే దేశంలోని అధిక జనాభా, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చగలుగుతాం. పంచవర్ష ప్రణాళికల ప్రధాన ఉద్దేశం ఇదే. దేశంలోని నీటిపారుదల అభివృద్ధికి అనేక భారీ, మధ్యతరహా, చిన్ననీటి పారుదల పథకాలను చేపట్టారు. 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్నవి భారీ నీటి పారుదల పథకాలు. వీటిని నదులపై నిర్మిస్తారు. 2,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు ఆయకట్టు ఉండేవి మధ్యతరహా నీటి పారుదల పథకాలు. వీటిని నదులు, ఉపనదులపై నిర్మిస్తారు. 2,000 హెక్టార్లలోపు ఆయకట్టు ఉండేవి చిన్న తరహా పథకాలు. భూగర్భజల పథకాలు, ఉపరితల జల పథకాలు ఈ కోవలోకి వస్తాయి. సాధారణ బావులు, ఎక్కువ లోతులేని గొట్టపు బావులు, పంపుసెట్ల సాయంతో నీటిని పైకి తోడే లోతైన గొట్టపుబావులు భూగర్భ జల పథకాల్లోకి వస్తాయి. జల విద్యుచ్ఛక్తి పథకాలు జలవిద్యుత్ శక్తి ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. స్వాతంత్య్రానంతరం దీని అభివృద్ధికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. దీన్నే తెల్లబొగ్గు అని కూడా అంటారు. ఇది ఎంతగా ఉపయో గించినా తరగని శక్తి. ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ శక్తిగా మారుస్తారు. దీన్ని ఒకసారి అభివృద్ధి పరిస్తే శతాబ్దాలపాటు జలవిద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. జలవిద్యుచ్ఛక్తిని కొన్ని అనుకూల పరి స్థితుల్లోనే ఉత్పత్తి చేయగలుగుతాం. అవి: వేసవిలో కూడా నిరాటంకంగా నీటిని సరఫరా చేయగలిగే నది లేదా పెద్ద జలాశయం ఉండాలి. ఎత్తు నుంచి నీరు జాలువారడానికి వీలైన నిమ్నోన్నతం ఉండాలి. నదీజలం ఘనీభవించడానికి వీలులేని కనిష్ఠ శీతోష్ణస్థితి అవసరం. జీవనదులు లేని చోట జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వ చేయడానికి వీలుగా అధిక వర్షపాతం ఉండాలి. భారతదేశంలోని ముఖ్య బహుళార్థ సాధక పథకాలు భాక్రానంగల్ పథకం: హిమాచల్ ప్రదేశ్‌లో సట్లేజ్ నదిపై భాక్రా, నంగల్ అనే ప్రదేశాల్లో రెండు ఆనకట్టలు నిర్మించారు. ఇది 1204 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దేశంలోనే అతి పెద్ద పథకం. ఈ పథకం ద్వారా 11,000 కి.మీ పొడవైన ప్రధాన కాలువలు, 3,400 కి.మీ ఉపకాలువలతో 14.6 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతిని కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారు దల, జలవిద్యుచ్ఛక్తి. దీని ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. బియాస్ పథకం: ఇది బియాస్ జలాలను సట్లేజ్ జలాలతో కలుపుతుంది. ఇది రెండు భాగాలుగా ఉంది. ఎ) బియాస్- సట్లేజ్ల కలయిక బి) బియాస్ నదిపై పాంగ్ వద్ద నిర్మించిన ఆనకట్ట. ఇది 1020 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం ద్వారా 17 లక్షల హెక్టార్ల భూమికి నీటి వసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి. ఈ పథకం ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. దామోదర లోయ పథకం: జార్ఖండ్‌లోని దామోదర్ నది ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. వీటి ద్వారా 1181 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 4.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, వరదల నియంత్రణ, విద్యుత్ ఉత్పత్తి, నౌకాయానం. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లబ్ధి పొందుతున్నాయి. హీరాకుడ్ పథకం: ఒడిశాలో సంబల్పూర్ సమీపంలో మహానదిపై నిర్మించారు. ప్రపంచంలో పొడవైన ఆనకట్టల్లో ఇది ఒకటి. దీని ద్వారా 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2.5 లక్షల హెక్టార్లు భూమికి నీటిపారుదల సౌకర్యం అందిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి, వరదల నియంత్రణ. ఒడిశా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతోంది.నాగార్జున సాగర్ పథకం: దీన్ని కృష్ణానదిపై నిర్మించారు. భారీ నీటిపారుదల పథకాల్లో ఇది ఒకటి. దీని ద్వారా 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. 8.3 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తుంగభద్రా పథకం: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో మల్లాపూర్ వద్ద తుంగభద్రా నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 3.5 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. దీని ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. కోసీ పథకం: బీహార్- నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో కోసీ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 386 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటిపారుదల, విద్యుత్ ఉత్పాదన. ఈ పథకం ద్వారా బీహార్, నేపాల్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. చంబల్ పథకం: ఇది చంబల్ నదిపై నిర్మించిన ఆనకట్ట. దీంట్లో మూడు ఆనకట్టలున్నాయి. దీనివల్ల 386 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.66 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కలుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుదుత్పాదన. ఈ పథకం ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయి. గండక్ పథకం: బీహార్‌లోని వాల్మీకి నగర్ వద్ద గండక్ నదిపై దీన్ని నిర్మించారు. దీని ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 14.88 లక్షల హెక్టార్ల భూమికి నీటివసతి కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రయోజనం పొందుతున్నాయి. రామ్ గంగా పథకం: ఉత్తరప్రదేశ్‌లో రామ్ గంగా నదిపై నిర్మించారు. దీని ద్వారా 198 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ పథకం వల్ల 5.75 లక్షల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతి కల్పిస్తున్నారు. దీని ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి పారుదల, విద్యుత్ ఉత్పాదన, వరదల నియంత్రణ. ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. -
డీఎస్సీ పరీక్ష కోసం ‘మృత్తికలు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి?
-ఎం.కృష్ణప్రియ, శాంతినగర్ మృత్తికలు అవి విస్తరించి ఉన్న రాష్ట్రాలను మ్యాప్ పాయింట్ ఆధారంగా గుర్తించి అధ్యయనం చేయాలి. క్రమక్షయ రకాలను అభ్యసించేటప్పుడు ఏయే రాష్ట్రాల్లో ఏ రకమైన క్రమక్షయం అధికంగా ఉందో గుర్తించాలి. క్రమక్షయం వల్ల నేలల్లో తరిగిపోతున్న సారవంతమైన మృత్తికలు, వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో విస్తృతంగా అభ్యసించాలి. ఈ అంశాలన్నింటినీ క్రమపద్ధతిలో విశ్లేషణాత్మకంగా చదివితే ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు. ఇన్పుట్స్: జంపాన సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ ఎడ్యూ న్యూస్: జనవరి 4న ‘సెట్-2014’ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్(సెట్-టీఎస్, ఏపీ)- 2014ను వచ్చే ఏడాది జనవరి 4న ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. 27 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుందని ‘సెట్’ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర రెడ్డి తెలిపారు. సెట్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 లేట్ ఫీజుతో నవంబర్ 8లోగా, రూ.200 లేట్ ఫీజుతో నవంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష రాయాలంటే సెట్లో ఉత్తీర్ణత సాధించాలి. పదోన్నతులకు కూడా ఈ పరీక్షను పరిగణనలోకి తీసుకుం టారు. అర్హులైన అభ్యర్థులు తెలుగు మాధ్యమ ంలో కూడా ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. వెబ్సైట్: www.apset.org ఉద్యోగుల గమ్యస్థానం.. లండన్ ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులు లండన్ మహానగరంలో పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, టోటల్ జాబ్స్.కామ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువ మంది లండన్‌లో పని చేయడానికి ఆసక్తి చూపారు. 189 దేశాల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మందిని ప్రశ్నించగా.. ప్రతి ఆరుగురిలో ఒకరు తమకు లండన్‌లో పనిచేయాలనుందని తెలిపారు. లండన్(16 శాతం మంది) తర్వాత న్యూయార్క్(12.2), పారిస్(8.9), సిడ్నీ(5.2), మాడ్రిడ్(5), బెర్లిన్(4.6), బార్సిలోనా(4.6), టొరంటో(4.2), సింగ పూర్(3.9), రోమ్(3.5) నగరాలు ఉద్యోగుల గమ్యస్థానాలుగా ఉన్నాయి. సర్వే వివరాల ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది విదేశాల్లో పనిచేయాలని కోరుకుంటున్నారు. అయితే బ్రిటన్‌లో కేవలం 44 శాతం మంది మాత్రమే విదేశాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 81; విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్-2014 అర్హత అవసరం. ఎంపిక: ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 20 వెబ్సైట్: www.vizagsteel.com టీసీఐఎల్ న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్ట్రికల్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య: 3 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 17 వెబ్సైట్: www.tcilindia.com భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ ఖాళీలు: 13 అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.belindia.com స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: సీఏ/ పీజీ డిప్లొమా ఇన్ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా పీజీ ఉండాలి. 15 ఏళ్ల అనుభవం అవసరం. నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.sbi.co.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 29 వెబ్సైట్: www.iisertvm.ac.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్: క్యాంపస్ న్యూస్ ఐఐటీ-హైదరాబాద్ ఏ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఐటీ-హైదరాబాద్.. మూడు రోజుల వ్యవధి ఉన్న ‘ఆల్వేస్ క్యారీ యువర్ కెమెరా’ అనే స్వల్పకాలిక కోర్సును అందిస్తోంది. డిజిటల్, అనలాగ్ ఫొటోగ్రఫీ అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. కెమెరాకు సంబంధించిన ప్రాథమిక అంశాలతోపాటు మంచి ఫొటోలను చిత్రీకరించడానికి మెళకువలు, నైపుణ్యాలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సులో భాగంగా థియరీతో పాటు ప్రాక్టికల్ తరగతులను నిర్వహిస్తారు. ఈ స్వల్పకాలిక కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందిస్తారు. ఏ ఐఐటీ హైదరాబాద్‌లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్... అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కోర్సు కాలవ్యవధి 5 రోజులు. కోర్సు తేదీలు: డిసెంబర్ 24 నుంచి 28 వరకు. ఏ ఐఐటీ హైదరాబాద్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్... నవంబర్ 1, 2 తేదీల్లో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్స్ టెక్నిక్స్‌పై టెకిప్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. టెకిప్ కాలేజీల్లో రిజిస్టర్‌అయిన కళాశాలలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. హైదరాబాద్ విద్యార్థికి ఆక్స్ఫర్డ్ బిజినెస్ స్కూల్ స్కాలర్షిప్ www.sbs.ox.ac.uk ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బిజినెస్ స్కూల్.. ఆక్స్ఫర్డ్ ఎస్ఏఐడీ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ విద్యార్థులకు, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఇచ్చే ‘ది స్కాల్ సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ స్కాల్ స్కాలర్‌షిప్‌నకు హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ నాయర్ ఎంపికయ్యారు. సోలార్ ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ ఏడాది (2014-15) ఎంబీఏలో ప్రవేశం పొందిన నిఖిల్ నాయర్‌కు ఈ స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు మొత్తం లభిస్తుంది. అంతేకాకుండా నివాస ఖర్చులకు గాను ప్రతి ఏటా ఎనిమిది వేల పౌండ్లు లభిస్తాయి. 2004లో ఏర్పాటైన స్కాల్ సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అందించే స్కాల్ స్కాలర్‌షిప్స్‌కు ప్రతి ఏటా గరిష్టంగా ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఈ ఏడాది నలుగురిని ఎంపిక చేయగా వారిలో నిఖిల్ నాయర్ కూడా ఉన్నారు. క్రిస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన నిఖిల్ నాయర్ ప్రస్తుతం కెన్యాలోని ఎం-కోపా సోలార్ అనే కంపెనీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంఐటీ - ఫ్రీ ఆన్లైన్ కోర్సులు http://web.mit.edu/ ప్రపంచంలో తొలిసారి యాభై ఏళ్ల క్రితమే వీడియో గేమ్స్‌ను ఆవిష్కరించిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గేమ్ డిజైనింగ్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగాల్లో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్)కు తెరతీసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ఆర్కేడ్ అనే పేరుతో కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ వరుసలో తొలుత అక్టోబర్ 8న ఎడ్యుకేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కోర్సులను ప్రారంభించగా, అక్టోబర్ 22 నుంచి గేమ్ డిజైన్ విభాగంలో మూక్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయంతో అభ్యసించే ఆస్కారం ఉన్న ఈ మూక్స్ పూర్తిగా ఉచితం. మూక్స్ విధానంలోని ఈ కోర్సులను కేవలం ఆన్లైన్ లెక్చర్స్, ట్యూషన్స్, మెటీరియల్‌కే పరిమితం కాకుండా గ్రూప్-స్టడీ పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు ఎంఐటీ ఎడెక్స్ వెబ్సైట్ నుంచి పూర్తి వివరాలు పొందొచ్చు. -
ఎయిర్ కూలర్లో ఉపయోగించే గడ్డి?
సహజ ఉద్భిజ సంపద భారతదేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. ఇవి స్పష్టమైన ఆవరణ వ్యవస్థలుగా ఏర్పడ్డాయి. వర్షపాతం కలగడానికి, జలగ్రాహక ప్రాంతాల్లో మృత్తికల పరిరక్షణ, అభివృద్ధి, ప్రవాహాల క్రమబద్ధీకరణ, నీటిని నిల్వ చేసే శక్తి పెంపుదల, ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటంలో అటవీ వనరులు ఉపయోగపడుతున్నాయి. భూ స్వరూపం, శీతోష్ణస్థితి, మృత్తికలు, జల పరిస్థితులు వంటివి అడవుల రకం, లక్షణాలను అధికంగా ప్రభావితం చేస్తాయి. హిమాలయాల్లోని ఆల్ఫైన్ ఉద్భిజాలు దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో సతతహరిత, అర్థ సతత హరిత, శుష్క ఆకురాల్చే, తృణ భూములు, పొద అడవులు, ఆల్ఫైన్ ఉద్భిజాలు వంటి అడవులున్నాయి. మృత్తికలు, పరీవాహాలు వంటి స్థానిక పరిస్థితుల వల్ల వీటి రకాల్లో కొద్దిపాటి మార్పులుండవచ్చు. కోస్తా తీరాల్లోని ఉపాంత, వరద ప్రాంతాల్లో మడ అడవుల వంటి రకాలున్నాయి. రాష్ట్రాల్లో అటవీ విస్తరణ 2000 - 2001వ సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో 6,75,538 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 77,265 చ.కి.మీ., హర్యానాలో అత్యల్పంగా 1754 చ.కి.మీ. అటవీ భూమి ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ర్ట, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెప్పుకోదగినంత అటవీ భూమి ఉంది. ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చినప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా (62.1%), హర్యానాలో అత్యల్పంగా (3.8%) అడవులు ఉన్నాయి. మొత్తం మీద అడవుల సాంద్రత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అత్యధికంగా ఉంది. దీనికి భిన్నంగా హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలున్న వాయువ్య భారతదేశంలో చాలా తక్కువగా అడవులు ఉన్నాయి. భారతదేశ సగటు అటవీ ప్రాంత శాతం (20.55%) కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 16. అవి.. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, ఒడిశా, మధ్యప్రదేశ్, గోవా, కేరళ, మణిపూర్, అసోం, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీగఢ్, జార్ఖండ్. మిగిలిన రాష్ట్రాల్లో దేశ సగటు అటవీ విస్తీర్ణం కంటే తక్కువగా ఉంది. అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా అటవీ ప్రాంతం ఎక్కువగానే ఉంది. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20%; పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60% మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో 33% భూభాగంలో అడవులు ఉండాలి. మనదేశంలో అడవుల విస్తీర్ణం చాలా తక్కువ. కాబట్టి పర్యావరణ పరిరక్షణ, అటవీ ఆధార పరిశ్రమల అభివృద్ధి కోసం అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిలో భాగంగా పలచగా, అల్పంగా అడవులున్న అనార్ధ్ర, ఆర్ధ్ర అనార్ధ్ర ప్రాంతాలైన వాయువ్య భారతదేశం, దక్కన్ పీఠభూమిలో తుమ్మ, వేప, చింత, పండ్ల మొక్కలు వంటి శుష్కతను తట్టుకునే అడవుల అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. తుఫాను సమయాల్లో వచ్చే ఉప్పెనలను అడ్డుకోవడానికి కోస్తా ప్రాంతాల్లోని లోతట్టు మైదానాల్లో సరుగుడు, కొబ్బరి, జీడిమామిడి, తాటి, ఈత వంటి వనాలను అభివృద్ధి చేయాలి. పురాతన అభయారణ్యాల్లో టేకు, గుగ్గిలం, మంచిగంధం, రోజ్‌వుడ్, చిర్, దేవదారు, పైన్ మొదలైన అధిక వాణిజ్య విలువలు ఉన్న మొక్కలను నాటి ఎస్టేట్లను అభివృద్ధి చేయాలి. సామాజిక అడవుల పెంపకం, వ్యవసాయ ప్రాంతాల పరిసరాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలి. ప్రజలకు పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేసి, వారందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. దీనికి అవసరమైన భూమి, ధనం, నారు, రాయితీలు, రుణాలు, సాంకేతిక సహాయం అందజేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అడవుల విస్తీర్ణం - రకాలు ఉష్ణమండల తేమ సతత హరిత అడవులు: వీటినే అర్ధ సతత హరిత అడవులు అని కూడా అంటారు. 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతమున్న కొండ ప్రాంతాల్లో ఈ అరణ్యాలు ఉంటాయి. 500 - 1500 మీ.ల ఎత్తయిన కొండ ప్రాంతాల్లో 45 - 70 మీ.ఎత్తు వరకు ఈ వృక్షాలు పెరుగుతాయి. ఉదా: పశ్చిమ కనుమల్లో ఉన్న రోజ్‌వుడ్, నల్లతుమ్మ, తెల్సూర్ జాతులు; పశ్చిమ బెంగాల్, షిల్లాంగ్ పీఠభూమి ప్రాంతాల్లో ఉండే గురుజాన్, టూన్, ఐరన్‌వుడ్, ఎబొనీ, చంపక వృక్షం, సిమార్, లారెన్ జాతులు. ఈ వృక్షజాతుల నుంచి లభించే అటవీ ఉత్పత్తులైన కలప, వెదురు, వంట చెరకును కాగితం, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఎత్తయిన ప్రాంతాల్లో వృక్షాలను వినియోగించుకోవడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ తక్కువ. అర్ధ సతత హరిత అడవులు పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. 1. పశ్చిమ కనుమల దక్షిణ భాగం - కేరళ, కర్ణాటక 2. ఈశాన్య రాష్ట్రాలు - అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్ 3. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అండమాన్ - నికోబార్ దీవుల్లోని మైదానాల్లో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు: 100 - 200 సెం.మీ. వర్షపాతం కురిసే కొండ, పీఠభూమి ఉపరితల ప్రాంతాల్లో ఈ ఉద్భిజాలు ఉంటాయి. ఇవి ఆర్థికంగా ముఖ్యమైన అడవులు. వీటిలో ప్రధానమైన వృక్షజాతి - టేకు, మంచిగంధం. ఈ అడవులు ఎక్కువగా పశ్చిమ కనుమలు, శివాలిక్ కొండలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్పూర్ పీఠభూమిలో ఉన్నాయి. కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం వంటివి వీటి ప్రధాన అటవీ ఆధార పరిశ్రమలు. ఉష్ణమండల శుష్క ఆకురాల్చు అడవులు: ఈ ఉద్భిజాలు 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో, ద్వీపకల్ప పీఠభూముల్లో అధికంగా పెరుగుతాయి. గంగా మైదానం; థార్ ఎడారి, హిమాలయాలు, పశ్చిమ కనుమల మధ్య ఉన్న విశాల భాగంలో ఈ అడవులు పెరుగుతాయి. కలప, కాగితం, కొయ్య సామగ్రి వంటి పరిశ్రమల్లో ఈ అడవులు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ ఉద్భిజాలు 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిల్లో మృత్తిక సంబంధ కారణాల వల్ల అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు, నల్లతుమ్మ వృక్షాలు వంటి రకాలు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, సముద్రానికి దగ్గరగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. మడ అడవులు: ఇవి ఎక్కువగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు. పోటుపాట్లకు గురయ్యే ఉప్పు, మంచినీటి ప్రాంతాల్లో పెరుగుతాయి.వీటిలో ఎక్కువగా మడచెట్లు ఉంటాయి. బెంగాల్ డెల్టాలో ఉండే మడ అడవుల్లో ఎక్కువగా సుంద్రినివా వృక్ష జాతులు పెరుగుతాయి. కాబట్టి వీటిని సుందర వనాలు అంటారు. సమశీతోష్ణ అడవులు: వీటినే అల్ఫైన్ రకపు అడవులు అని కూడా అంటారు. ఇవి హిమాలయాల్లో 1600 - 3000 మీ.ల వరకు ఎత్తు ఉన్న ప్రాంతాల్లో, 100 - 200 సెం.మీ.ల వర్షపాతం కలిగే పర్వతాల్లో తేమతో కూడిన సమశీతోష్ణ మండల అడవులు ఉంటాయి. ఇవి మధ్య హిమాలయ శ్రేణుల్లో ఏర్పాటవుతాయి. సమశీతల సతత హరిత, శృంగాకార వృక్షాల్లో ముఖ్యమైన జాతులు.. దేవదారు, సిడార్, వెదురు, జూనిఫర్, సిల్వర్ఫెర్లు మొదలైనవి పెరుగుతాయి. ఇవి కర్రగుజ్జు, అగ్గిపెట్టెలు, హస్తకళలు, టర్పన్ టైన్, రైల్వే స్వీపర్లు వంటి పరిశ్రమలకు ఉపయోగపడుతూ ఆర్థిక, వాణిజ్య విలువలు కలిగి ఉన్నాయి. గతంలో అడిగిన ప్రశ్నలు 1. రూసా గడ్డి అధికంగా లభించే జిల్లా ఏది? (డీఎస్సీ 2002) 1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్ 3) విశాఖపట్నం 4) మహబూబ్‌నగర్ 2. మనదేశంలో అడవులు అత్యధిక శాతం ఉన్న రాష్ర్టం ఏది? (డీఎస్సీ 2008) 1) మధ్యప్రదేశ్ 2) అరుణాచల్ ప్రదేశ్ 3) హర్యాన 4) హిమాచల్‌ప్రదేశ్ 3. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? (డీఎస్సీ 2006) 1) 1951 2) 1952 3) 1954 4) 1958 సమాధానాలు: 1) 2; 2) 2; 3)2. ప్రాక్టీస్ బిట్స్ 1. భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల అడవులు ఉన్నాయి? 1) 6 2) 7 3) 8 4) 9 2. సుందర వనాలు ఉన్న రాష్ర్టం ఏది? 1) అసోం 2) బీహార్ 3) పశ్చిమ బెంగాల్ 4) 1, 3 3. పొద అడవులు అధికంగా ఉన్న రాష్ర్టం? 1) మిజోరాం 2) హర్యానా 3) రాజస్థాన్ 4) ఉత్తరాంచల్ 4. ఎయిర్ కూలర్లో ఉపయోగించే గడ్డి? 1) సైప్రస్ 2) చిర్ 3) కుష్ 4) సెమూల్ 5. ఆల్ఫైన్ వృక్ష జాతులను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం? 1) పవనాలు 2) ఎత్తు 3) సూర్యరశ్మి 4) తీర ప్రాంతం 6. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను ఎప్పుడు ప్రారంభించారు? 1) 1973 2) 1975 3) 1976 4) 1977 7. సిమ్లిపాల్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఛత్తీస్‌గఢ్ 3) ఒడిశా 4) అసోం 8. బీడీ పరిశ్రమల్లో ఉపయోగించే ఆకు? 1) మహల్ 2) కెందు 3) కిర్ 4) మోదుగ 9. ఘనా పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? 1) గుజరాత్ 2) మహారాష్ర్ట 3) అసోం 4) రాజస్థాన్ 10. నందాదేవి బయోస్పియర్ రిజర్వ ఏ రాష్ర్టంలో ఉంది? 1) సిక్కిం 2) హిమాచల్ ప్రదేశ్ 3) ఉత్తరాఖండ్ 4) జమ్మూ కాశ్మీర్ సమాధానాలు: 1) 1; 2) 3; 3) 2; 4) 3; 5) 2; 6) 1; 7) 3; 8) 2; 9) 4; 10) 3. -
రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి?
భారతదేశ ఉనికి - క్షేత్రీయ అమరిక ట్రాన్స హిమాలయ మండలం హిమాద్రికి ఉత్తరంగా ట్రాన్స హిమాలయ మండలం ఉంది. ఈ మండలంలో కారకోరం, లడక్, జస్కర్, కైలాస్, కున్లున్, హిందూకుష్, పామీర్ పర్వత శ్రేణులున్నాయి. పామీర్ ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి. దీన్ని ప్రపంచపు పై కప్పు అని కూడా అంటారు. కారకోరం శ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తయిన శిఖరం ఓ2 (గాడ్విన్- ఆస్టిన్). దీని ఎత్తు 8,611మీ. గంగా - సింధు మైదానం ఈ మైదానాలు ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్య విస్తరించి ఉన్నాయి. సింధు నది ముఖ ద్వారం నుంచి గంగానది ముఖ ద్వారం వరకు వ్యాపించి ఉన్న మైదానాన్ని బృహత్ మైదానం అంటారు. దీని పొడవు 3,200 కి.మీ. వెడల్పు అతి తక్కువగా అసోంలో ఉంది. జార్ఖండ్‌లో 160 కి.మీ., ఉత్తర ప్రదేశ్‌లో 280 కి.మీ వెడల్పు ఉంది. గంగా - సింధు మైదానంలో నాలుగు ముఖ్యమైన భూ స్వరూపాలున్నాయి. అవి... 1. భాబర్: ఇది శివాలిక్ కొండల పాదాల వెంట హిమాలయ నదులు తెచ్చిన గులకరాళ్లు, గ్రావెల్, కంగ్లామరేట్ వంటి వాటితో ఏర్పడిన మండలం. విసనకర్ర ఆకారంలో ఉంటుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించింది. 2. టెరాయి: దట్టమైన అడవులతో కూడిన చిత్తడి ప్రాంతం. 3. భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలం లో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘భంగర్’ అంటారు. 4. ఖాదర్: టెరాయికి దక్షిణంగా నవీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘ఖాదర్’ అంటారు. కల్లార్ లేదా రే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో శుష్క ప్రదేశంలో ఉన్న వ్యవసాయానికి పనికిరాని చవుడు, లవణం, స్ఫటిక నేలలను కల్లార్ లేదా రే అంటారు. ప్రాంతాల వారీగా బృహత్ మైదానాలను కింది విధంగా విభజించారు. 1. పంజాబ్ - హర్యానా మైదానాలు 2. రాజస్థాన్ మైదానాలు 3. గంగా మైదానాలు 4. బ్రహ్మపుత్ర లోయ గంగా మైదానాలు గంగా మైదానం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 3.75 లక్షల చ.కి.మీ. ఈ మైదానం ఆగ్నేయంగా వాలి ఉంది. గంగ దాని ఉపనదులు యమున, గండక్, గోగ్రా, గోమతి, కోసి, సోన్ నదులు ఈ మైదానంలో ప్రవహిస్తున్నాయి. మధ్య గంగా మైదానం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తరించింది. ఇది భంగర్, ఖాదర్ మైదానాలతో కూడి ఉంది. బ్రహ్మాపుత్ర లోయ: బ్రహ్మపుత్ర మైదానం ముఖ్యంగా అసోం రాష్ర్టంలో ఉంది. దీనిలో టెరాయి పరిస్థితులు ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమి ఇది బృహత్ మైదానాలకు దక్షిణంగా అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది. దీని వైశా ల్యం 16 లక్షల చ.కి.మీ. దీని సరాసరి ఎత్తు 600మీ.నుంచి 900మీ. ఈ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పునకు వాలి ఉంది. ద్వీపకల్ప పీఠభూమిలో అవశిష్ట పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదా: ఆరావళి పర్వతాలు, తూర్పు, పశ్చిమ కనుమలు ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులు: వాయువ్యం లో ఆరావళి పర్వతాలు, ఉత్తరాన బుందేల్ ఖండ్ పీఠభూమి, ఈశాన్యంలో రాజ్‌మహల్ కొండలు, దక్షిణాన పడమటి చివరన పడమటి కనుమలు, తూర్పు చివరన తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప పీఠభూమిని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్ పీఠభూమి. ఈ రెండు పీఠభూములను నర్మదా నది వేరు చేస్తోంది. మాల్వా పీఠభూమి: మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఆరావళి పర్వతాలు, దక్షిణాన వింధ్య పర్వతాలు, ఈశాన్యంలో బుండి కొండ లు ఉన్నాయి. దీనికి తూర్పున ఉన్న భాగాన్ని చోటా నాగపూర్ పీఠభూమి అంటారు. ఇది జార్ఖండ్‌లో ఉంది. చోటా నాగ్‌పూర్ ప్రాంతాన్ని పశ్చిమ జర్మనీలో ‘రూర్ ప్రాంతం’తో పోలుస్తారు. దక్కన్ పీఠభూమి సరిహద్దులు: ఉత్తరాన సాత్పురా పర్వతశ్రేణి, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. ఈ పీఠభూమి ఎత్తు పశ్చిమాన 900 మీ., తూర్పున 300 మీ. దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి త్రిభుజాకారంలో తూర్పునకు వాలి ఉంది. దక్కన్ పీఠభూమిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. దక్కన్ పీఠభూమి ఉత్తర, వాయువ్య ప్రాంతాలను మహారాష్ర్ట పీఠభూమి అంటారు. ఇది బసాల్ట్ శిలలతో ఏర్పడింది. దక్కన్ పీఠభూమి ఆగ్నేయ భాగాన్ని ఆంధ్రా పీఠభూమి అని, దక్షిణ భాగాన్ని కర్ణా టక పీఠభూమి అని పిలుస్తారు. ఇవి ఆర్కియన్, నీస్ శిలలతో ఏర్పడ్డాయి. నర్మద, తపతి నదుల మధ్య సాత్పురా పర్వత శ్రేణి ఉంది. ఈ శ్రేణి తూర్పు భాగాన్ని మైకాల పీఠభూమి అంటారు. సాత్పురా పర్వతాల్లో ఎత్తయిన ప్రాంతం మధ్యప్రదేశ్‌లోని మహదేవ్ కొండల్లో పచ్మరి సమీపంలో ఉంది. పశ్చిమ కనుమలు వీటిని సహ్యాద్రి శ్రేణి అని కూడా పిలుస్తారు. ఇవి మహారాష్ర్టలోని ఖందేష్ నుంచి ప్రారంభమై దక్షిణాన కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నాయి. గ్రానైట్, నీస్ వంటి కఠిన శిలలతో ఏర్పడ్డాయి. నీలగిరి కొండలు, సహ్యాద్రి కొండలు గడలూరు సమీపంలో కలుస్తున్నాయి. నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఉదక మండలం సమీపంలో ఉన్న దొడబెట్ట(2637మీ.). కేరళలోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం(2695మీ.) ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తయినది. తూర్పు కనుమలు తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగపూర్ పీఠభూమి, దక్షిణాన నీలగిరి కొండలతో కలుస్తున్నాయి. ఇవి చార్నకైట్, ఖొండలైట్ వంటి శిలలతో ఏర్పడ్డాయి. వీటిని ఉత్తర భాగంలో ‘ఉత్తర కొండలు’, దక్షిణ భాగంలో ‘తమిళనాడు కొండలు’, మధ్య భాగంలో ‘కడప శ్రేణులు’గా పేర్కొంటారు. తూర్పు కనుమల్లో అతి ఎత్తయిన స్థలం (1506మీ) విశాఖపట్నం జిల్లాలో, రెండో ఎత్తయిన స్థలం ఒడిశాలోని గంజాం జిల్లాలోని మహేంద్రగిరి (1501మీ)లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల కొండలు, పాల కొండలు, వెలి కొండలు, ఎర్రమల కొండలు, శేషాచలం కొండలు తూర్పు కనుమల్లో అంతర్భాగం. తీర మైదానాలు భారతదేశంలో తీర మైదానాలను రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. పశ్చిమ తీర మైదానం 2. తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం: గుజరాత్‌లోని రాణా ఆఫ్ కచ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఈ మైదానాన్ని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. గుజరాత్ - గుజరాత్ తీరం గోవా, మహారాష్ర్ట - కొంకణ్ తీరం కర్ణాటక - కెనరా తీరం కేరళ - మలబార్ తీరం తూర్పు తీర మైదానం: పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్ - వంగ తీరం ఒడిశా - ఉత్కల్ తీరం / కళింగ తీరం ఆంధ్రప్రదేశ్ - సర్కార్ తీరం తమిళనాడు - కోరమండల్ తీరం నదులు భారతదేశంలోని నదులను స్థూలంగా రెండు ప్రధాన సముదాయాలుగా విభజించవచ్చు. 1. హిమాలయ నదులు 2. ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు: గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు మొదలైనవి. గంగానది: జన్మస్థానం - హిమాలయాల్లోని గంగోత్రి హిమానీనదం. రెండు ప్రధాన సెలయేర్లు అలకానంద, భగీరథ - దేవ ప్రయాగ వద్ద కలిసి గంగానది ఏర్పడింది. నదుల్లో అతి పొడవైంది గంగానది. ఉత్తరప్రదేశ్ 1450కి.మీ, బీహార్‌లో 445 కి.మీ, పశ్చిమ బెంగాల్లో 520 కి.మీలు పొడవున ఈ నది ప్రవహిస్తోంది. బంగ్లాదేశ్‌లో గంగానదిని పద్మానదిగా పిలుస్తారు. బ్రహ్మపుత్రానది బంగాళాఖాతంలో కలవడానికి ముందు పద్మానదిలో కలుస్తుంది. యమున, గండక్, గోగ్రా, గోమతి, కోసి, శారద, రామగంగ, చంబల్, సోన్, దామోదర్ వంటివి గంగా ఉపనదులు. గంగానది ఉపనదుల్లో పెద్దది - యమున. గంగా, యుమున, సరస్వతి నదుల సంగమం ‘త్రివేణి సంగమం. సింధు నది: దీని జన్మస్థలం టిబెట్‌లోని మానససరోవరం. సింధునది పొడవు 2,880 కి.మీ. భారతదేశంలో దీని పొడవు 709 కి.మీ. ఈ నది చీనాబ్, రావి, జీలం, బియాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులను కలిగి ఉంది. భారత్‌లో జమ్మూ - కాశ్మీర్ ద్వారా మాత్రమే సింధునది ప్రవహిస్తోంది. సింధునది పాకిస్థాన్‌లోని కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మాదిరి ప్రశ్నలు 1. భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న భారతదేశ దీవి? 1) గ్రేట్ నికోబార్ 2) అండమాన్ 3) మినికాయ్ 4) లక్షదీవులు 2. బంగాళాఖాతంలో ఉన్న దీవుల సంఖ్య? 1) 247 2) 223 3) 32 4) 36 3. హిమాద్రికి దక్షిణంగా ఉన్న హిమాలయ పర్వతశ్రేణి? 1) శివాలిక్ 2) అత్యున్నత హిమాలయాలు 3) సహ్యాద్రి 4) హిమాచల్ 4. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాష్ట్రాల్లో శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు లవణం, స్ఫటిక భూభాగాలను ఏమంటారు? 1) టెరాయి 2) భంగర్ 3) కల్లార్ లేదా రే 4) ఖాదర్ 5. అబు కొండల్లోని గురుశిఖర్ ఏ పర్వతశ్రేణిలో ఉంది? 1) వింధ్య 2) ఆరావళి 3) సాత్పురా 4) తూర్పు కనుమలు 6. ఓ2శిఖరం ఏ హిమాలయ శ్రేణిలో ఉంది? 1) హిమాచల్ 2) హిమాద్రి 3) ట్రాన్స హిమాలయాలు 4) శివాలిక్ 7. గంగా సింధు మైదానాల విస్తీర్ణం? 1) 5,000 చ.కి.మీ. 2) 7,00,000 చ.కి.మీ. 3) 16,00,000 చ.కి.మీ. 4) 10,000 చ.కి.మీ. 8. పామీర్ పీఠభూమి ఏ హిమాలయాల శ్రేణిలో ఉంది? 1) బాహ్య 2) మధ్య 3) అంతర 4) ట్రాన్స 9. రాజస్థాన్‌లోని ఖేత్రి గనులు దేనికి ప్రసిద్ధి? 1) ఇనుము 2) వెండి 3) బంగారం 4) రాగి 10. భారతదేశంలో కర్కటరేఖ ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది? 1) 7 2) 8 3) 6 4) 9 11. భారతదేశంలో ముందుగా సూర్యోదయం అయ్యే రాష్ర్టం? 1) మేఘాలయ 2) అరుణాచల్ ప్రదేశ్ 3) త్రిపుర 4) హిమాచల్ ప్రదేశ్ 12. హిమాలయ పర్వత రాజ్యంగా ప్రసిద్ధి చెందింది? 1) టిబెట్ 2) భూటాన్ 3) చైనా 4) నేపాల్ 13. లక్షదీవుల రాజధాని? 1) పుదుచ్ఛేరి 2) కవరత్తి 3) పోర్టబ్లెయర్ 4) సిల్వసా 14. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న దీవి? 1) పాంబన్ 2) మినికాయ్ 3) టెరెస్సా 4) ట్రింకట్ 15. కిందివాటిలో కేంద్రపాలిత ప్రాంతం కానిది? 1) పాండిచ్చేరి 2) త్రిపుర 3) లక్షదీవులు 4)దాద్రానగర్ హవేలి సమాధానాలు 1) 1; 2) 2; 3) 4; 4) 3; 5) 2; 6) 3; 7) 2; 8) 4; 9) 4; 10) 2; 11) 2; 12) 4; 13) 2; 14) 1; 15) 2.