డీఎస్సీ పరీక్ష కోసం ‘మృత్తికలు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి? | what are topics should be read for DSC exam ? | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పరీక్ష కోసం ‘మృత్తికలు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి?

Published Fri, Oct 10 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

what are topics should be read for DSC exam ?

 -ఎం.కృష్ణప్రియ, శాంతినగర్
మృత్తికలు అవి విస్తరించి ఉన్న రాష్ట్రాలను మ్యాప్ పాయింట్ ఆధారంగా గుర్తించి అధ్యయనం చేయాలి. క్రమక్షయ రకాలను అభ్యసించేటప్పుడు ఏయే రాష్ట్రాల్లో ఏ రకమైన క్రమక్షయం అధికంగా ఉందో గుర్తించాలి. క్రమక్షయం వల్ల నేలల్లో తరిగిపోతున్న సారవంతమైన మృత్తికలు, వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో విస్తృతంగా అభ్యసించాలి. ఈ అంశాలన్నింటినీ క్రమపద్ధతిలో విశ్లేషణాత్మకంగా చదివితే ఈ పాఠ్యాంశం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు.             
 ఇన్‌పుట్స్: జంపాన సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ
 
 ఎడ్యూ న్యూస్: జనవరి 4న ‘సెట్-2014’
 స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్(సెట్-టీఎస్, ఏపీ)- 2014ను వచ్చే ఏడాది జనవరి 4న ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. 27 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుందని ‘సెట్’ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర రెడ్డి తెలిపారు. సెట్ రాయాలనుకునే అభ్యర్థులు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 లేట్ ఫీజుతో నవంబర్ 8లోగా, రూ.200 లేట్ ఫీజుతో నవంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష రాయాలంటే సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పదోన్నతులకు కూడా ఈ పరీక్షను పరిగణనలోకి తీసుకుం టారు. అర్హులైన అభ్యర్థులు తెలుగు మాధ్యమ ంలో కూడా ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. వెబ్‌సైట్: www.apset.org
 
 ఉద్యోగుల గమ్యస్థానం.. లండన్
 ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులు లండన్ మహానగరంలో పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, టోటల్ జాబ్స్.కామ్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా  నిర్వహించిన ఈ సర్వేలో ఎక్కువ మంది లండన్‌లో పని చేయడానికి ఆసక్తి చూపారు.  189 దేశాల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా వివిధ వర్గాలకు చెందిన 2 లక్షల మందిని ప్రశ్నించగా.. ప్రతి ఆరుగురిలో ఒకరు తమకు లండన్‌లో పనిచేయాలనుందని తెలిపారు. లండన్(16 శాతం మంది) తర్వాత న్యూయార్క్(12.2), పారిస్(8.9), సిడ్నీ(5.2), మాడ్రిడ్(5), బెర్లిన్(4.6), బార్సిలోనా(4.6), టొరంటో(4.2), సింగ పూర్(3.9), రోమ్(3.5) నగరాలు ఉద్యోగుల గమ్యస్థానాలుగా ఉన్నాయి. సర్వే వివరాల ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది విదేశాల్లో పనిచేయాలని కోరుకుంటున్నారు. అయితే బ్రిటన్‌లో కేవలం 44 శాతం మంది మాత్రమే విదేశాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం.  
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 వైజాగ్ స్టీల్ ప్లాంట్
 విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
 ఖాళీల సంఖ్య: 81; విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్.
 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్-2014 అర్హత అవసరం.
 ఎంపిక: ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 20
 వెబ్‌సైట్: www.vizagsteel.com
 
 టీసీఐఎల్
 న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ఎలక్ట్ట్రికల్ ఇంజనీర్
 పోస్టుల సంఖ్య: 3
 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో  రెండేళ్ల అనుభవం ఉండాలి.
 
 వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 17
 వెబ్‌సైట్: www.tcilindia.com
 
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
 బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్
 ఖాళీలు: 13
 అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22
 వెబ్‌సైట్: www.belindia.com
 
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 అర్హతలు: సీఏ/ పీజీ డిప్లొమా ఇన్ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా పీజీ ఉండాలి. 15 ఏళ్ల అనుభవం అవసరం.
 నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి.
 ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22
 వెబ్‌సైట్: www.sbi.co.in
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్  ఎడ్యుకేషన్ అండ్ రీసెర్‌‌చ
 తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
 అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 29
 వెబ్‌సైట్: www.iisertvm.ac.in
 
కాంపిటీటివ్ కౌన్సెలింగ్:  క్యాంపస్ న్యూస్
 ఐఐటీ-హైదరాబాద్
 ఏ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఐటీ-హైదరాబాద్.. మూడు రోజుల వ్యవధి ఉన్న ‘ఆల్వేస్ క్యారీ యువర్ కెమెరా’ అనే స్వల్పకాలిక కోర్సును అందిస్తోంది. డిజిటల్, అనలాగ్ ఫొటోగ్రఫీ అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. కెమెరాకు సంబంధించిన ప్రాథమిక అంశాలతోపాటు మంచి ఫొటోలను చిత్రీకరించడానికి మెళకువలు, నైపుణ్యాలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సులో భాగంగా థియరీతో పాటు ప్రాక్టికల్ తరగతులను నిర్వహిస్తారు. ఈ స్వల్పకాలిక కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందిస్తారు.
 ఏ ఐఐటీ హైదరాబాద్‌లోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్... అడ్వాన్స్‌డ్ బిజినెస్ అనలిటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. కోర్సు కాలవ్యవధి 5 రోజులు.
 
 కోర్సు తేదీలు: డిసెంబర్ 24 నుంచి 28 వరకు.
 ఏ ఐఐటీ హైదరాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్... నవంబర్ 1, 2 తేదీల్లో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్స్ టెక్నిక్స్‌పై టెకిప్ వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. టెకిప్ కాలేజీల్లో రిజిస్టర్‌అయిన కళాశాలలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.   
 
 హైదరాబాద్ విద్యార్థికి ఆక్స్‌ఫర్డ్ బిజినెస్ స్కూల్ స్కాలర్‌షిప్
 www.sbs.ox.ac.uk
 ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బిజినెస్ స్కూల్.. ఆక్స్‌ఫర్డ్ ఎస్‌ఏఐడీ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ విద్యార్థులకు, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఇచ్చే ‘ది స్కాల్ సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ స్కాల్ స్కాలర్‌షిప్‌నకు హైదరాబాద్‌కు చెందిన నిఖిల్ నాయర్ ఎంపికయ్యారు. సోలార్ ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఈ ఏడాది (2014-15) ఎంబీఏలో ప్రవేశం పొందిన నిఖిల్ నాయర్‌కు ఈ స్కాలర్‌షిప్ కింద ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు మొత్తం లభిస్తుంది. అంతేకాకుండా నివాస ఖర్చులకు గాను ప్రతి ఏటా ఎనిమిది వేల పౌండ్లు లభిస్తాయి. 2004లో ఏర్పాటైన స్కాల్ సెంటర్ ఫర్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అందించే స్కాల్ స్కాలర్‌షిప్స్‌కు ప్రతి ఏటా గరిష్టంగా ఐదుగురిని ఎంపిక చేస్తారు. ఈ ఏడాది నలుగురిని ఎంపిక చేయగా వారిలో నిఖిల్ నాయర్ కూడా ఉన్నారు. క్రిస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేసిన నిఖిల్ నాయర్ ప్రస్తుతం కెన్యాలోని ఎం-కోపా సోలార్ అనే కంపెనీకి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.   
 
 ఎంఐటీ - ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు
  http://web.mit.edu/
 ప్రపంచంలో తొలిసారి యాభై ఏళ్ల క్రితమే వీడియో గేమ్స్‌ను ఆవిష్కరించిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. తాజాగా మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గేమ్ డిజైనింగ్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగాల్లో మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్)కు తెరతీసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ఆర్కేడ్ అనే పేరుతో కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ వరుసలో తొలుత అక్టోబర్ 8న ఎడ్యుకేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను ప్రారంభించగా, అక్టోబర్ 22 నుంచి గేమ్ డిజైన్ విభాగంలో మూక్స్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయంతో అభ్యసించే ఆస్కారం ఉన్న ఈ మూక్స్ పూర్తిగా ఉచితం. మూక్స్ విధానంలోని ఈ కోర్సులను కేవలం ఆన్‌లైన్ లెక్చర్స్, ట్యూషన్స్, మెటీరియల్‌కే పరిమితం కాకుండా గ్రూప్-స్టడీ పద్ధతికి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు ఎంఐటీ ఎడెక్స్ వెబ్‌సైట్ నుంచి పూర్తి వివరాలు పొందొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement