janaberi
-
అపూర్వ ఆదరణ
సాక్షి, ఖమ్మం: రాజన్నపై గిరిజనుల గుండెల్లో నిండిన అనురాగం ఆయన తనయపై పూల వర్షమై కురిసింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెను అభిమానంతో అడుగడుగునా ఆశీర్వదించారు. గ్రామగ్రామాన జనం పరుగుపరుగున ఎదురొచ్చి స్వాగతం పలికారు. పినపాక పోటెత్తింది...భద్రాద్రి జనగోదారైంది...దమ్మపేట దమ్ముచూపింది...ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచారయాత్ర జనభేరికి లభించిన అపూర్వ స్పందన. జిల్లాలో షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచార యాత్ర జనభేరి మూడోరోజు మంగళవారం ఉదయం 9.45 గంటలకు మణుగూరు నుంచి ప్రారంభమైంది. అశ్వాపురం మండలం మిట్టగూడెం, చింత్రియాల క్రాస్‌రోడ్డు, సీతారాంపురం, మొండికుంట, బూర్గంపాడు మండలం ఈరవెండిల మీదుగా షర్మిల ప్రచార యాత్ర సారపాక వైపు కదలింది. దారిపొడవునా గిరిజనులు ప్రచార రథానికి ఎదురొచ్చి పూలవర్షం కురిపించారు. డప్పువాయిద్యాలతో అడుగడుగునా ఆమెకు నీరాజనం పలికారు. ఉదయం 11.45 గంటలకు ప్రచారయాత్ర సారపాక శివారుకు చేరుకుంది. భారీగా జనం కదలిరావడంతో సారపాక జన ప్రవాహాన్ని తలపించింది. మహిళలు ఎదురొచ్చి ప్రచార వాహనంపై పూలు చల్లి షర్మిలను ఆశీర్వదించారు. సారపాక సెంటర్లో భారీగా హాజరైన ప్రజలకు వాహనం పై నుంచి షర్మిల అభివాదం చేశారు. అనంతరం ప్రచారరథం భద్రాచలం వైపు కదిలింది. గోదావరి బ్రిడ్జిపైకి ప్రచారం రథం చేరుకోగా వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భద్రాద్రి.. జనగోదారి.. భద్రాచలం బ్రిడ్జి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఎటు చూసినా వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణుల జాతరే. ఉదయం 11.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు భద్రాచలంలో ప్రచార యాత్ర సాగింది. అంబేద్కర్ సెంటర్లో షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. ఫ్యాన్‌గుర్తు, సుత్తికొడవలి నక్షత్రం గుర్తులకు ఓటు వేయాలని ఆమె అనగానే.. ప్రతిగా ఇరుపార్టీల కార్యకర్తలు ఈ రెండు గుర్తులకు మన ఓటు అంటూ నినదించారు. గిరిజన సాంప్రదాయంగా విల్లంబును ఎక్కుపెట్టి ఇరుపార్టీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. అంబేద్కర్ సెంటర్లో ప్రసంగం ముగిసిన అనంతరం ప్రచారయాత్ర మళ్లీ సారపాక వైపు కదిలింది. ఇక్కడికి భారీగా జనం తరలిరావడంతో షర్మిల వారినుద్దేశించి ప్రసంగించారు. అలాగే నాగినేనేప్రోలు రెడ్డిపాలెంలో కార్యకర్తల అభిమానం కాదనలేక ఆమె ప్రసంగిస్తూ.. ఇంత చిన్న ఊరిలో 6 రాజన్న విగ్రహాలు పెట్టారని, మీ అభిమానం, అప్యాయత ఎప్పటికీ మరువలేనని ఆమె గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. బూర్గంపాడు, మొరంపల్లిబంజరలలో భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మొత్తంగా పినపాక నియోజకవర్గం ప్రజలు షర్మిల యాత్రకు హారతి పట్టారు.మోరంపల్లి బంజర మీదుగా పాల్వంచ నుంచి ఈ యాత్ర అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లిలోకి ప్రవేశించింది. దమ్ముచూపిన దమ్మపేట.. వైఎస్ఆర్సీపీ అశ్వారావుపేట అసెంబ్లీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు షర్మిలకు ముల్కలపల్లిలో స్వాగతం పలికారు. డప్పువాయిద్యాలతో పార్టీ శ్రేణులు ప్రచారయాత్రలో పాల్గొనగా...షర్మిలను చూసేందుకు, ప్రసంగం వినేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఇక్కడి నుంచి దమ్మపేట చేరుకునే సరికి రాత్రి 7.30 గంటలు అయింది. నియోజకవర్గంలో పలు మండలాల నుంచి జనం తరలిరావడంతో దమ్మపేట హోరెత్తింది. ఇక్కడ ఎటు చూసినా జనమే. షర్మిల ప్రసంగంలో వైఎస్ఆర్, జగన్ పేర్లను ప్రస్తావించినప్పుడల్లా జనం జేజేలు పలికారు. వైఎస్ఆర్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు పాలనలో మీకోసం ఏమైనా చేశారా..? అని ఆమె ప్రజలను ఉద్దేశించి అనడంతో.. లేదు..లేదు అంటూ వారు ప్రతిగా చేసిన నినాదాలతో దమ్మపేట మార్మోగింది. పరుగు పరుగున వచ్చి.. పర్యటన ఆద్యంతం రాజన్న తనయను చూసేం దుకు ప్రజలు పరుగుపరుగున వచ్చి ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ప్రచార రథంలో ఆమె కనిపించేంత వరకు వచ్చి చూశా రు. కొంతమంది తమ ఇళ్లలో ఉన్న పూలను తీసుకొచ్చి అభిమానంతో ఆమె ప్రచార వాహనంపై చల్లారు. షర్మిల ప్రసంగం రాజన్నను మళ్లీ ఒక్కసారి గుర్తు చేసిందని, తండ్రికి తగ్గతనయులు జగన్, షర్మిల అంటూ ఈసందర్భంగా పలువురు అనుకోవడం కనిపించింది. ఈ ప్రచారయాత్రలో షర్మిల వెంట ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులు పాయం వెంకటేశ్వర్లు, వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చిన భద్రాచలం సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం నాయకులు విఎల్‌ఎన్ రెడ్డి, నేతలు పాయం ప్రమీల, వీరారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బిగ్గెం శ్రీనివాస్‌రెడ్డి, పాకలపాటి చంద్రశేఖర్,జూపల్లి ఉపేంద్రబాబు, సారేపల్లి శేఖర్, బత్తుల అంజి, ఆకులమూర్తి, బీమా శ్రీధర్, బీమనాథుల అశోక్‌రెడ్డి, జల్లేపల్లి సైదులు, సీపీఎం నేతలు బి.వెంకట్, అన్నవరపు కనకయ్యలు ఉన్నారు. -
జనభేరి విజయవంతం చేయండి
అనంతపురం అర్బన్, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 15 నుంచి రెండ్రోజుల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జనభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఎస్ఆర్ఐటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. మహానేత వైఎస్ఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరూ జనభేరిలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే దూరదృష్టి ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా వైఎస్ జగన్‌కు ఉందన్నారు. రాష్ట్ర ఆస్తులు, అప్పులను బ్యాలెన్స్ చేయడానికి మరో 15 ఏళ్లు పడుతుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని, లంచాలకు రుచిమరిగారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అవినీతికి చిరుమానా అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బాబు చేసేందీమీ లేదన్నారు. సువర్ణపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ‘మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ను, ఆయన కుటుంబాన్ని విమర్శించారు. చివరకు ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇవాళ జేసీ బ్రదర్స్, మరికొంత మంది నాయకులు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. వీరందరికీ ప్రజలు తప్పకుండా శిక్ష వేస్తార’న్నారు. సినిమా వాళ్లకు ఓటేసే పరిస్థితి పోయింది ‘ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. సినిమా వాళ్లకి ఓట్లేసే పరిస్థితి ఏమాత్రం లేదు. గతంలో హిందూపురం నుంచి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, హరికృష్ణ ఆ ప్రాంతానికి కనీసం నీళ్లు తెప్పించారా?’ అని రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్ హయాంలో హిందూపురానికి నీళ్లొచ్చాయన్నారు. ఆ విషయం అక్కడి ప్రజలకే తెలుసన్నారు. ఇవాళ సినీనటుడు బాలకృష్ణను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ ప్రాంత వాసులను మభ్యపెట్టడమేనన్నారు. సినిమా చరిష్మాను అడ్డం పెట్టుకుని గెలిచే చాన్స్ లేదన్నారు. అక్కడ నవీన్ నిశ్చల్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు వై వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ డీసీసీబీ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు పైలా నరసింహయ్య, మధుసూదన్ రెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, తోపుదుర్తి చందు, ఆలూరు సాంబశివారెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జ్ చుక్కలూరు దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అనంత'లో విజయమ్మ వైఎస్ఆర్ జనభేరి
-
రేపటి నుంచి జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. శుక్రవారం రాత్రి అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘జనభేరి’ పేరిట సాగే జగన్ జిల్లా పర్యటనకు గురించి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు నుంచి రాజమండ్రిలో అడుగు పెడతారు. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి అమలాపురంలో బస చేస్తారు. 17న ఉదయం 9 గంటలకు అమలాపురంలో పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మండపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రికి సామర్లకోట చేరుకుని అక్కడే బస చేస్తారు. 18న ఉదయం పిఠాపురంలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం ఏలేశ్వరం నగర పంచాయతీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు తుని చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు రోడ్ షోలకు హాజరు కావాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఎన్నికల నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జగన్ అమలాపురం మున్సిపాలిటీలో పర్యటించనుండడం అభ్యర్థుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు జక్కంపూడి తాతాజీలు మాట్లాడుతూ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కుడుపూడి త్రినాథ్, పితాని చిన్న, నల్లా రమేష్, పంపన పద్మలత, వాసంశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. -
జనభేరికి సన్నద్ధం
‘చలో నరసరావుపేట’ నినాదంతో మార్చి ఆరో తేదీన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జనభేరి’ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రామిరెడ్డిపేటలోని తన కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారందరితో కలసి అయోధ్యరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే జనభేరి సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు. ఆ సభలో ఆయన సమక్షంలో తనతో పాటు అనేక మంది నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోత్నునట్టు చెప్పారు. ఈ సభకు హాజరయ్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి, పార్టీ విధివిధానాలపై జగన్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరిన తరువాత నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. రాష్ట్రానికి దిశ, దశా నిర్ధేశించగల నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్,బీజేపీలు తీరని అన్యాయం చేశాయి : మర్రి రాజశేఖర్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడి ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతాపార్టీ కూడా సీమాంధ్రులను మురిపించి అన్యాయానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో జగన్ ఒక్కరే మొదటి నుంచి సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ దేశంలోని జాతీయ నాయకులందరిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి వేదనలను పెడచెవిన పెట్టి విభజనకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారంలోకి రానున్నట్లు తెలియజేస్తున్నాయన్నారు. జగన్ సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని తమ ఇబ్బందులను తొలగించేది జగన్ ఒక్కరేనని భావిస్తున్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, సమన్యాయం అంటే ఏమిటో ఇప్పటికీ చంద్రబాబుకు తెలియదన్నారు. కాంగ్రెస్‌వారిని చేర్చుకొని చ ంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని, రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించిన రాష్ట్ర మంత్రులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జనభేరి సభకు ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు స్వచ్ఛంధంగా తరలిరానున్నట్లు చెప్పారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మాచర్లలో ఓదార్పు యాత్రను కూడా జగన్ నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు, వినుకొండ నియోజవకర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నన్నపనేని సుధ ఇంకా ఆళ్ల పేరిరెడ్డి పాల్గొన్నారు.