janata dal united
-
జార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ మధ్య సీట్ల పంపకాలు ఖరార య్యాయి. బీజేపీ 68, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 2, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 1 స్థానంలో పోటీ చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ– సిల్లి, రామ్‌గఢ్, గోమియా, ఇచాగర్, మాండు, జుగ్సాలియా, డుమ్రి, పాకూర్, లోహర్దగా, మనోహర్పూర్, జేడీయూ– జంషెడ్పూర్ వెస్ట్, తమర్ స్థానాల నుంచి, ఎల్జేపీ (ఆర్) ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20ల్లో రెండు దళల్లో పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటించనున్నారు. -
‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’
పాట్నా: బిహార్‌లో ఎన్డీయే కూటమికి టాటా చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్ యునైటెడ్(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్). బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జేడీయూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. మరోవైపు.. బీజేపీకి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్ కుమార్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
బిహార్ సీఎంగా మళ్లీ నితీశ్
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో నెగ్గిన ఎన్డీయే కూటమి ముందే ప్రకటించినట్టుగా సీఎం పగ్గాలు నితీశ్‌కే అప్పగించింది. ఆదివారం పట్నాలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా నితీశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 243 సీట్లున్న అసెంబ్లీలో 125 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సుపరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న నితీశ్‌కుమార్ కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల సమస్యను ఎదుర్కోవడంలో విఫలం కావడంతో చాలా మంది ఆయనకు వ్యతిరేకమయ్యారు. గత అసెంబ్లీతో పోల్చి చూస్తే నితీశ్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీ–యూ) బలం 71 నుంచి 43కి పడిపోయింది. అయినప్పటికీ ముందుగా చేసిన నిర్ణయానికి కట్టుబడి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మిస్టర్ క్లీన్ ముద్ర ఉన్న నితీశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. గవర్నర్‌ని కలుసుకున్న నితీశ్ ఎన్డీయే శాసనసభా పక్షనాయకుడిగా ఎన్నికైన వెంటనే నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫాగూ చౌహాన్‌ను కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయనని కోరారు. ఎన్డీయే పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం నితీశ్ విలేకరులతో మాట్లాడుతూ సోమవారమే తాను పదవీ ప్రమాణం చేయనున్నట్టుగా చెప్పారు. ‘‘ఎన్డీయే కూటమిలో నాలుగు పార్టీల ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖని గవర్నర్‌కి సమర్పించాను. గవర్నర్ ఆదేశం మేరకు సోమవారం సాయంత్రం 4–4:30 మధ్య రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాను’’అని చెప్పారు. ఎన్డీయే కూటమి సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్ర యాదవ్, ఎన్నికల ఇన్చార్జ్ ఫడ్నవీస్ హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా తార్ కిశోర్ బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఈసారి ఇద్దరిని వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కతిహర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తార్ కిశోర్ ప్రసాద్, బెత్తాహ్ ఎమ్మెల్యే రేణుదేవిలను డిప్యూటీ సీఎంలుగా దాదాపు ఖరారు అయినట్టే. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నాయకునిగా తార్ కిశోర్ ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయనే డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడతారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సుశీల్ కుమార్ మోదీకి కేంద్రంలో పదవి అప్పగించే అవకాశాలున్నాయి. బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనే ప్రసాద్ పేరు ప్రతిపాదించారు. బీజేపీఎల్పీ ఉప నేతగా రేణు దేవిని ఎన్నుకోవడంతో ఆమెకు కూడా డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరీ తార్కిశోర్ ప్రసాద్ ? రాజకీయవర్గాల్లో పెద్దగా పరిచయం లేని ప్రసాద్ (52) ఎంపికపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రసాద్ వెనుకబడిన కల్వార్ సామాజిక వర్గానికి చెందినవారు. కతిహర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. తార్ కిశోర్, రేణు దేవి -
కేంద్ర ప్రభుత్వంలోకి జేడీ(యూ)
పట్నా: బిహార్ అధికార పక్షం జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధికారికంగా నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిలో భాగస్వామిగా మారిపోయింది. శనివారం జరిగిన పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు నితీశ్ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కేంద్ర కేబినెట్ లోకి ప్రవేశించేందుకు జేడీ(యూ)కు మార్గం సుగమం అయ్యింది. మహాకూటమి నుంచి నిష్క్రమించి బీజేపీ కూటమితో నితీశ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తన వర్గీయులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉంటే జేడీ(యూ) సమావేశం జరుగుతున్న సమయంలో శరద్ మద్ధతుదారులు, ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో నితీశ్ ఇంటి బయట భద్రతను భారీగా పెంచారు. లాలూ విసుర్లు... ఇది జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశం కాదని, బీజేపీ భేటీ అని, వాళ్లే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎద్దేవా చేశారు. కుంభకోణాల నుంచి బయటపడేందుకు నితీశ్, సుశీల్ మోదీలు పబ్లిక్‌గా ముక్కు ముక్కు రాసుకుంటున్నారని లాలూ పేర్కొన్నారు. -
నోట్ల రద్దు: ఆ భూ ఒప్పందాల మర్మమేమిటి?
పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పెద్ద నోట్ల రద్దుకు కొద్దిరోజుల ముందే బిహార్‌లో బీజేపీ నేతలు పార్టీ కార్యాలయాల కోసం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై దుమారం రేగుతోంది. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికే బీజేపీ నేతలు ఇలా భూములు కొనుగోలు చేశారని, అత్యంత గోప్యంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు గురించి బీజేపీ నేతలకు ముందే తెలిసిందని, అందుకే పార్టీ కార్యాలయాల కోసం ఉద్దేశించిన భూముల కొనుగోళ్లను గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ముందు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని అధికార జేడీయూ ఆరోపించింది. పార్టీ కార్యాలయాల కోసం 23 భూ ఒప్పందాలను బీజేపీ కుదుర్చుకుంది. ఇందులో ఎక్కువశాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జరగడంతో ఈ అంశాన్ని జేడీయూ అస్త్రంగా వాడుకొని కమలదళాన్ని ఇరకాటంలో నెట్టాలని చూస్తోంది. ‘పెద్దనోట్ల రద్దు గురించి వారికి ముందే తెలుసు. అందుకే ఆగస్టు, సెప్టెంబర్లలో భూ ఒప్పందాలు చేసుకున్నారు’ అని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ రేటు కన్నా తక్కువ ధరకు వీటిని రిజిస్టర్ చేయించుకున్నారని, దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ బిహార్ శాఖ కొట్టిపారేస్తున్నది. ఈ ఒప్పందాలన్నీ చెక్కుద్వారానే జరిగాయని, ఇందులో బ్లాక్ మనీ ప్రమేయమే లేదని బిహార్ బీజేపీ చీఫ్ మంగళ్ పాండే తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనలమేరకు పార్టీ యూనిట్లన్నీ కార్యాలయాలు సమకూర్చుకోవడానికి చాలాకాలంగా భూ కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాయని, ఆ ప్రక్రియ ఇటీవల ముగియడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లు జరిపించినట్టు ఆయన చెప్పారు. -
మళ్లీ హత్యలు చేస్తానన్న ఎమ్మెల్యేపై వేటు
పట్నా: బిహార్‌లో అధికార జేడీయూ ఇద్దరు చట్ట సభ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్, ఎమ్మెల్సీ రాణా గంగేశ్వర్ సింగ్‌లను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్టు ఆ రాష్ట్ర జేడీయూ అధ్యక్షుడు వశిష్ట్ నరైన్ సింగ్ చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్న జేడీయూ కోర్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్‌కు ఈ విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. భగల్ పూర్ జిల్లా గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదో సారి ఎన్నికైన గోపాల్ మండల్.. తాను మళ్లీ హత్యా రాజకీయాలు చేస్తానని, గతంలో మాదిరిగా మళ్లీ హత్యలు చేస్తానని ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించారు. గతంలో ఆయనపై చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్సీ రాణా గంగేశ్వర్.. జాతీయ గీతం బానిసత్వానికి గుర్తు అని, దీన్ని మార్చాలని వ్యాఖ్యానించారు. రాణా గంగేశ్వర్ గతేడాది బీజేపీని వీడి జేడీయూలో చేరారు. -
ఈ ఓటమి మోదీ.. అమిత్ షా.. అందరిదీ: శరద్ యాదవ్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ఏ ఒక్కరిదో కాదని.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇలా మొత్తం అందరిదీ అవుతుందని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. నిజానికి మొదట్లో తమకు కూడా కొంత అనుమానం ఉందని, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం బిహార్‌లో దిగిపోయిందని తెలిపారు. ఈ ఎన్నికలను కమ్యూనలైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయని, బీఫ్, రిజర్వేషన్లు.. ఇలా అన్ని అంశాలను తెరమీదకు తెచ్చారని అన్నారు. అవార్డు వాప్సీ.. లాంటి అంశాలన్నింటి ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉందన్నారు. కేవలం బిహార్‌లోనే కాదు, మొత్తం దేశంలో బలహీన వర్గాలు తిరగబడినా, దాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కులవ్యవస్థలో వేల ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఓటర్లుగా వాళ్లు ముందుకొచ్చారని శరద్ యాదవ్ చెప్పారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఆ విషయంలో వేలు పెట్టడంతో అది వాళ్లకు ఎదురు దెబ్బగా మారిందని విశ్లేషించారు. ఇక మహాకూటమి విజయం కూడా ఏ ఒక్కరిదో కాదని.. ఇది మొత్తం కూటమి గెలుపని తెలిపారు.