రీపోలింగ్‌లో 53 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: జంగ్‌పురా నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన రీపోలింగ్‌లో 53 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంలు మొరాయిండంతో సరాయ్ కాలే పోలింగ్ బూత్‌లో ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో 813 ఓటర్లు శనివారం నిర్వహించాల్సిన రీపోలింగ్‌లో ఓటు వేయాల్సి ఉండగా కేవలం 438 మంది మాత్రమే ఓటు వేశారు. వీరిలో 269 మంది పురుషులు, 169 మంది మహిళలు ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.