jeevitha jail
-
సినీనటి జీవితకు నాన్‌బెయిలబుల్ వారెంట్
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో సినీ నటి జీవితకు సిటీ సివిల్ కోర్టు మంగళవారం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జీవిత ఇచ్చిన రూ.25 లక్షల చెక్ బౌన్స్ అయిందంటూ పరంధామయ్య రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ నాన్‌బెయిబుల్ వారెంట్‌తో జీవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవటంతో పోలీసులు వెనుదిగిరారు. కాగా మరో చెక్ బౌన్స్ కేసులో జీవితకు ఇటీవలే ఎర్రమంజిల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా కూడా విధించిన విషయం తెలిసిందే. -
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
-
చెక్‌బౌన్సు కేసు.. జీవితకు బెయిల్
హైదరాబాద్ : చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు బెయిల్ లభించింది. సోమవారం మధ్యాహ్నం జీవిత 25 లక్షల రూపాయల జరిమానాను చెల్లించడంతో ఎర్రమంజిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు కోర్టు జీవితకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది. తీర్పు వెలువడిన వెంటనే జీవిత కోర్టులో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. అందుకు సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు జరిమానా, జైలుశిక్ష విధించింది. -
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
-
చెక్‌బౌన్స్ కేసు: జీవితకు రెండేళ్ల జైలు
చెక్‌బౌన్సు కేసులో సినీనటి, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. రూ. 25 లక్షల జరిమానా కూడా విధించారు. 2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్‌రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, అనేకసార్లు ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని శేఖర్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో చివరకు 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది. (ఇంగ్లీషు కథనం)