Jelly
-
ఇక్కడి మామిడి తాండ్రకు 200 ఏళ్ళ చరిత్ర ..
-
Mamidi Tandra: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ సహజసిద్ధంగా తయారీ గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు. తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు తొక్కతో పచ్చడి మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఆదాయం బాగుంటుంది. –రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం -
ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్ అడ్రస్‌గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు. 60 టన్నులు.. రూ.66 లక్షలు ప్రస్తుత సీజన్లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు. గుజ్జు తీసి.. చక్కెర వేసి.. పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో గుబులు ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకూ.. ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తక్కువ రేటు మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. – కఠారి సురేష్, ఆత్రేయపురం ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. -చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం -
యథేచ్ఛగా జెల్లీ ఫిష్ వేట
తుస్సుమంటున్న చేపల వేట నిషేధం మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు జీవనోపాధి లేక.. అంటున్న మత్స్యకారులు ఇప్పటికీ అందని నష్టపరిహారం ఒక పక్క సముద్రంలో చేపల వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు చెబుతుంటే.. మరో పక్క జెల్లీ షిష్ వేట యథేచ్ఛగా సాగుతోంది. వేట నిషేధానికి ముందే నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించనందున.. జీవనోపాధికి మరో దారి లేక జెల్లీ షిష్ వేట సాగుతోందని పలువురు మత్స్యకారులు అంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉంది. ఇంతవరకూ మత్స్యకారులకు ఒక్క పైసా కూడా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. జెల్లీ షిష్ వేట విషయం నిజమేనని అధికారులూ అంగీకరిస్తున్నారు. కాట్రేనికోన (ముమ్మిడివరం) : సముద్ర జలాలలో మత్స్య సంపద ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజులు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు దళారులతో చేతులు కలపడంతో జెల్లీ ఫిష్ (రోఫిలిమా ఇస్యూలెంటమ్) వ్యాపారం జోరుగా సాగుతోంది. నెలవారీ మామూళ్లతో కాకినాడ కేంద్రంగా జెల్లీ ఫిష్ ఎక్స్‌పోర్టు భారీగా సాగుతోంది. మత్స్యకారులు వేటాడి తెచ్చిన జెల్లీ ఫిష్‌లను సిమెంట్ కుండీలు, తార్పాలతో కట్టిన మడులలో ఉప్పు వేసి ఊరబెట్టి టన్నులు చొప్పున ఎగుమతి చేస్తున్నారు. చేపల వేట నిషేధం ఎందుకు? మత్స్య సంపద పునరుత్పత్తి కాలంలో చేపల వేట, పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలు, చమురు సంస్థలతో సముద్ర జలాలు కలుషితమై గుడ్లు పెట్టేందుకు విఘాతం కలుగుతుంది. మత్స్యసంపద అభివృద్ధి కోసం చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలం (నిషేధ సమయం)లో చేపలను వేటాడితే ఏపీ సముద్ర జల మత్స్య (క్రమబద్దీకరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిఉంది. మత్స్య శాఖ, కోస్టల్, మెరైన్, ఎన్పోర్సుమెంట్ విభాగాలు సంయుక్తంగా పని చేసి నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిఉంది. పలు గ్రామాల్లో యథేచ్ఛగా వేట... ఉప్పాడ, కోనపాపపేట, భైరవపాలెం, దరియాలతిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్ప తదితర ప్రాంతాలో భారీ ఎత్తున జెల్లీ ఫిష్‌లను సేకరించి ఎగుమతులు చేస్తున్నారు. సుమారు 30 కేజీల బరువు ఉన్న జెల్లీ ఫిష్ రూ.1,800ల నుంచి రూ.2,500లకు ధర పలుకుతుంది. నీటిలో తేలియాడుతూ జీవించే జెల్లీ.. మే, జూన్ నెలలో అధికంగా వస్తుంది. ధర అధికంగా ఉండడంతో మత్స్యకారులు వేట నిషేధాన్ని లెక్క చేయడం లేదు. చక్రం తిప్పుతున్న హోం గార్డు! చేపల వేటను నియంత్రించాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లతో నిద్ర మత్తులో జోగుతున్నారు. జెల్లీ ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులను భయపెట్టి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేయడంలో ఒక హోం గార్డు చక్రం తిప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. జెల్లీ ఫిష్‌కు మంచి డిమాండ్ జెల్లీ ఫిష్‌ను చైనా, థాయిలాండ్, జపాన్, మలేషియా, ఇండోనేషియా, కొరియా తదితర దేశాలలో ఆహారంగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారంలో ఇన్ గ్రీడియంట్స్గా తీసుకోవడంతో మంచి డిమాండ్ ఉంది. జెల్లీ ఫిష్‌లో మంచి పోషకవిలువలు అధికంగా ఉండడంతో సలాడ్స్, ఐస్‌క్రీమ్, రోస్టెడ్ చికెన్ విత్ జెల్లీ ఫిష్, రోస్టెడ్ డక్ అండ్ జెల్లీ ఫిష్ సలాడ్స్, న్యూడిల్స్గా వంటలు తయారు చేస్తుంటారు. జీవనోపాధి లేక... చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు చెల్లించ వలసిన నష్ట పరిహారాన్ని నేటికీ ఇవ్వలేదు. దీంతో నిషేధ సమయంలో జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకారులు ఉపాధి కోసం జెల్లీ ఫిష్ చేపల వేట చాటుమాటున చేస్తున్నారు. నిషేధ సమయానికి ముందే నష్ట పరిహారం అందజేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదోమోనని పలువురు అంటున్నారు. ఈ విషయంపై ఎఫ్డీఓ రాంబాబును వివరణ కోరగా సముద్ర జలాలలో నిషేధం ఉందని, పాయలలో జెల్లీ ఫిష్‌లను మత్యుకారులు పట్టుకుంటున్నారని అంగీకరించారు. -
ప్రపంచంలో అత్యంత చిన్న స్మార్ట్ ఫోన్ లాంచైంది!
స్మార్ట్ ఫోన్ 4 అంగుళాలు ఉన్నాయంటేనే చాలా చిన్నదంటాము. అలాంటిది వాటికంటే అత్యంత చిన్నగా కేవలం 2.45 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లేతో ఓ స్మార్ట్ ఫోన్ బుధవారం లాంచ్ అయింది. జెల్లీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను షాంఘై కంపెనీ యూనిహెర్ట్జ్ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ను ఇది సపోర్ట్ చేస్తోంది. డ్యూయల్ సిమ్(నానో+నానో), 4జీ కనెక్టివిటీ కూడా ఇది కలిగి ఉంది. పెరల్ వైట్, స్పేస్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో ఈ జెల్లీ ఫోన్ ను కంపెనీ అందుబాటులోకి వచ్చింది. రెండు ఆప్షన్లు 1జీబీ ర్యామ్/8జీబీ రోమ్, 2జీబీ ర్యామ్/16రోమ్, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, క్వాడ్ కోర్ 1.1 గిగిహెడ్జ్ ప్రాసెసర్, 950ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.వీటితో పాటు రిమూవబుల్ బ్యాటరీ, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్ కు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ధర కేవలం 59 డాలర్లుగానే కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.3,785. -
మామిడి తాండ్ర ఉత్పత్తిపై అధ్యయనం
∙కోస్తాలో మండపీతల పెంపకంపై ప్రత్యేక దృష్టి ∙కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : జిల్లాలోని నాలుగు ప్రధాన కేంద్రాలుగా 14 గ్రామాల్లో ఏటా 4,200 టన్నుల మేర మామిడితాండ్ర ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉద్యాన, మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ద్వారా ఉత్పత్తి అవుతున్న మామిడి తాండ్ర తయారీలో సాంకేతిక పరమైన అంశాలను జత చేస్తే వీరికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు లభిస్తాయన్నారు. తొండంగి, పండూరు, కోరుకొండ, ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఉన్న మామిడితాండ్ర తయారీదారులకు అవసరమైన మెళకువలు నేర్పించడం ద్వారా, సోలార్ డ్రైయర్ల వినియోగించే ప్రక్రియ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చన్నారు. మామిడితాండ్ర ఉత్పత్తిపై అధ్యాయనం చేయడానికి ఒక ఏజెన్సీని గుర్తించాలని డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారిని, ఉద్యానవనశాఖ అధికారులను కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఈ అధ్యాయనానికి అవసరమైన కన్సల్టెన్సీకి జిల్లాకు వినూత్న కార్యక్రమాల అమలు కోసం విడుదలైన నిధుల నుంచి ఫీజు చెల్లిస్తామన్నారు. మండ పీతల పెంపకం జిల్లాలో పల్లం, చిరయానం ప్రాంతాల్లో మండపీతలను పెంచే రైతులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులకు కల్టెకర్ అరుణ్‌కుమార్ సూచించారు. మండపీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 300 చెరువులకు మండపీతల సీడ్ అవసరమని ఈ ఉత్పత్తి కేంద్రం త్వరలో బాపట్లలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా తాళ్లరేవు మండలం పోలేకుర్రులో ఉన్న 176 రొయ్యల చెరువుల పనితీరును కూడా పరిశీలించి మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు జిల్లాలోని లంక గ్రామాలైన కేదారలంక, థానేలంక, ఊబలంక వంటి ప్రాంతాల్లో రైతులను గ్రూపులుగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లుగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులకు సూచించారు. కూరగాయల గ్రేడింగ్ కేంద్రం ఏర్పాటుకు పెదపట్నంలో స్థలాన్ని కేటాయించాలని అమలాపురం ఆర్డీవోకు ఫోన్లో సూచించారు. మడికి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ఈ మార్కెట్‌ను వేరొక ప్రాంతానికి మార్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ పనులను సమీక్షించారు. ఈ ఏడాది 3 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఎం.సుబ్బారావు, మత్స్యశాఖ ఏడీలు కె.కనకరాజు, శ్రీనివాసరావు, రామతీర్థం, ఉద్యానవనశాఖ ఏడీలు కె.గోపీకుమార్, సిహెచ్.శ్రీనివాసులు, కె.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటిప్
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ బ్యాగులో లిప్‌బామ్ కానీ పెట్రోలియం జెల్లీ చిన్న బాటిల్‌ను కానీ పెట్టుకొని తీరాల్సిందే. అలా చేస్తే పొడిబారిన పెదాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు.