Jharkhand team
-
చరిత్ర సృష్టించిన ధోని జట్టు.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యంతో..!
Jharkhand Sets World Record In First Class Cricket: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సొంత జట్టు జార్ఖండ్ రికార్డుల మోత మోగించింది. ఏకంగా 1008 పరుగుల లీడ్‌ని సాధించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 1000కి పైగా లీడ్ సాధించిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ముంబై (1948-49లో మహారాష్ట్రపై 958 పరుగుల లీడ్) రికార్డ్‌ని బద్ధలు కొట్టడంతో పాటు మ్యాచ్‌ను డ్రా చేసుకుని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా జార్ఖండ్ జట్టు పలు అపప్రదలను కూడా మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 591 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించకపోగా, రెండో ఇన్నింగ్స్‌ని కూడా డిక్లేర్ చేయకుండా ఆడి క్రికెట్ అభిమానుల చీత్కారాలను ఎదుర్కొంది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా.. కేవలం రికార్డుల కోసమే జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ఆడిందని (ఫాలో ఆన్ ఇవ్వకుండా) నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 880 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ సాధించిన ఈ స్కోర్ రంజీ చరిత్రలో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. జార్ఖండ్ స్కోర్‌లో 3 శతకాలు, 3 అర్ధ శతకాలు నమోదయ్యాయి. వికెట్‌కీపర్ కుమార్ కుశాగ్రా (266) డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, నదీమ్ (177), విరాట్ సింగ్ (107) శతకాలు బాదారు. అనంతరం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకే కుప్పకూలడంతో జార్ఖండ్‌కు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో జార్ఖండ్.. నాగాలాండ్‌ను ఫాలో ఆన్‌కు ఆహ్వానిస్తుందని అంతా ఊహించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 417 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 591 పరుగులు కలుపుకుని జార్ఖండ్‌కు 1008 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: పేలిన జార్ఖండ్ డైనమైట్లు.. రంజీ చరిత్రలో భారీ స్కోర్ నమోదు -
ఎదురులేని రైల్వేస్ జట్టు
రాజ్‌కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్‌తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది. -
జార్ఖండ్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం
⇒టీమ్ బస చేసిన హోటల్లో అగ్ని ప్రమాదం ⇒విజయ్ హజారే రెండో సెమీస్ నేటికి వాయిదా న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు బసచేసిన హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఈ ప్రమాదం సంభవించడంతో మ్యాచ్‌ను వాయిదా వేశారు. ద్వారకలోని ‘వెల్కమ్’ ఫైవ్ స్టార్ హోటల్లో జార్ఖండ్ జట్టుతో పాటు తమిళనాడు జట్టు ఆటగాళ్లు బస చేశారు. బెంగాల్ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం ఆటగాళ్లు ఉదయం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఊహించని పరిణామంతో జార్ఖండ్ జట్టు బిత్తరపోయింది. సకాలంలో ఆటగాళ్లు, అధికారులను వేరే ప్రదేశానికి తరలించడంతో ప్రమాదం తప్పింది. కానీ వారికి సంబంధించిన వస్తువులతో పాటు స్పోర్ట్స్ కిట్స్ హోటల్లోనే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేసి వేదికను పాలెం ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్ నుంచి ఫిరోజ్‌షా కోట్ల మైదానానికి మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా సోమవారం జరగనుంది. ‘మేము టిఫిన్ చేస్తున్న సమయంలో ఫైర్ అలారం మోగింది. అప్పటికే గదులన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. వెంటనే మేమంతా పరుగెత్తాం’ అని జార్ఖండ్ ఆటగాడు జగ్గీ తెలిపాడు. దాదాపు 30 అగ్నిమాపక యంత్రాలు 3 గంటల పాటు శ్రమించి మంటలని అదుపులోకి తెచ్చాయి. -
ధోని జట్టు నాకౌట్‌కు
కళ్యాణి (పశ్చిమ బెంగాల్): మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో తొలిసారి జార్ఖండ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ పోరుకు అర్హత సంపాదించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన కశ్మీర్ జట్టు 43 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఒవైస్ షా (59), కెప్టెన్ పర్వేజ్ రసూల్ (45) రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో నదీమ్ 5, కౌషల్ సింగ్ 2 వికెట్లు తీశారు. తర్వాత 185 పరుగుల లక్ష్యాన్ని జార్ఖండ్ 35 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుమార్ దేవబ్రత్ (94 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్ ధోని 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్... సర్వీసెస్ చేతిలో ఓడిపోవడం జార్ఖండ్‌కు కలిసొచ్చింది. గ్రూప్ ‘డి’లో హైదరాబాద్, జార్ఖండ్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... మెరుగైన రన్‌రేట్‌తో జార్ఖండ్ ముందంజ వేసింది.