Jidimetla
-
నాలుగు నెలల క్రితం వివాహం.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన భర్త..
సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): కట్టుకున్న ఇల్లాలు ఇష్టం లేకపోవడంతో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్ కళావతినగర్‌కు చెందిన హారిక(19), నవీన్‌కుమార్ భార్యాభర్తలు. వీరికి నాలుగు క్రితం వివాహం కాగా నవీన్‌కుమార్ ఎస్ఆర్ నగర్‌లోని న్యూఎరా లేడీస్ టైలర్స్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 15న ఉదయం 10.30 గంటకు భార్యను బస్సు ఎక్కించిన నవీన్‌కుమార్ తెలిసిన వారి నుంచి డబ్బులు వచ్చేది ఉందని, వాటిని తీసుకువస్తానని చెప్పాడు. కాగా అదే రోజు సాయంత్రం 4 గంటలకు నవీన్‌కుమార్ ఫోన్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అయితే 16వ తేదీ ఉదయం 10 గంటలకు నీ బ్యాగ్‌లో లెటర్ ఉంది చూడమని హారికకు మెసెజ్ పంపాడు. దీంతో లెటర్‌ను తీసి చూడగా ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు.. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను’ అని రాసి ఉంది. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త జాడ కోసం అతడి తమ్ముడు, చెల్లెలికి ఫోన్ చేయగా రాలేదని చెప్పారు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆదివారం హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలకూటవిషాన్ని జనం పైకి చిమ్ముతున్నారు!
హైదరాబాద్: జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో వంద వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇతర రసాయనిక, రీసైక్లింగ్ పరిశ్రమలున్నాయి. వాటిల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాం టి ఏర్పాట్లే లేవు. గాఢత అధికంగా ఉన్న వ్యర్థాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. ఆ ఊసే పట్ట డంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని యాజమాన్యాలు ఎప్పుడో గాలి కొదిలేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు. మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నింపి శివారు ప్రాంతా ల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్ చేస్తున్నా రు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు. ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబో స్తున్నారు. వ్యర్థాల డంపింగ్‌తో కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, తదితర పారిశ్రామికవాడ లు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. భూగర్భజలాలు విషతుల్యం ఇలా.. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిపిన అధ్యయనంలో జీడిమెట్ల ప్రాంతంలో భూగర్భజలాలు విషతుల్యమైనట్లు తేలింది. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలను ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భార లోహాలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. జీడిమెట్ల, సుభాష్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలోనూ ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రజలు కోరుతోందిది.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న, పారిశ్రామిక వ్యర్థజలాలను ఆరుబయట, బోరుబావుల్లోకి వదిలిపెడుతున్న పరిశ్రమలను మూసివేయాలి. పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖ లకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించాలి. ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి. నాలాలు, చెరువులు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి వాటిని పీసీబీ, జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి. పీసీబీ వివరణ ఇదీ.. జీడిమెట్ల ప్రాంతంలో పరిశ్రమల ఆగడాలపై ‘సాక్షి’పీసీబీ అధికారులను వివరణ కోరగా.. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. నిబంధనల ప్రకారం నడుచుకోని పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలపడం గమనార్హం. మేము పదేళ్లుగా సుభాష్‌నగర్‌లో ఉంటున్నం. మా నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా రీసైక్లింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నరు. రసాయనాలు నిండిన డ్రమ్ములు, కవర్లను ఇక్కడకు తీసుకొచ్చి రీసైక్లింగ్ చేస్తుండటంతో ఇళ్లల్లోకి విపరీతమైన దుర్వాసన వస్తోంది. కడిగిన నీటిని నాలాలు, రోడ్లపై పారబోస్తున్నరు. దీంతో తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నం. మా ఇళ్లలో బోరుబావుల్లోనూ విష రసాయనాలు నిండిన నీళ్లే వస్తున్నయ్. ఈ నీటిని తాగితే చర్మరోగాలు వస్తున్నయ్. లక్ష్మి మనోవేదన ఇది.. ఈ ఆవేదన వీరిద్దరిది మాత్రమే కాదు.. జీడిమెట్ల, కుత్భుల్లాపూర్ పరిసరాల్లో నివసిస్తున్న 60 కాలనీలు, బస్తీల్లోని వేలాది మందిది. ఆ ప్రాంతంలో సుమారు వంద వరకు ఉన్న బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష రసాయన వ్యర్థాలతో గాలి, నీరు, నేల కాలుష్య కాసారంలా మారాయి. జనంపైకి విషం చిమ్ముతున్న పరిశ్రమల ఆగడాలు శ్రుతిమించుతుండటంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను కట్టడిచేయడంలో పీసీబీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ ‘మా మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు నివసిస్తున్నయ్. మా అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న కోపల్లి ఫార్మా పరిశ్రమ నుంచి ఐదేళ్లుగా రాత్రిపూట విపరీతమైన దుర్వాసన వస్తోంది. గతంలో పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా జూలై 2019లో పరిశ్రమను మూసేశారు. తిరిగి 15 రోజుల్లోనే పరిశ్రమ మళ్లీ తెరుచుకుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా దుర్వాసన వస్తుండటంతో శ్వాస కోశవ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నం’ –లింగారావు ఆవేదన ఇది.. -
వ్యర్థం.. కానుంది ‘అర్థం’!
నగరంలో నాలాలు పొంగిపొర్లడానికి ప్రధాన కారణం వాటిల్లో నీరు పారే దారి లేకుండా పేరుకుపోయిన వ్యర్థాలు. ఈ వ్యర్థాల్లో కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీ అండ్ డీ) వేస్ట్ ఎక్కువగా ఉంటోంది. నాలాల సమస్యే కాదు.. రోడ్లపైనే వేస్తుండటం ప్రమాదాలకు కారణమవుతోంది. నడిచే బాటలు తగ్గిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలో సీఅండ్‌డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. ఈ రీసైక్లింగ్ నుంచి వెలువడే ఉత్పత్తులను వివిధ అవసరాలకు వినియోగించవచ్చు. ఇలా రెండు రకాలుగా ప్రయోజనం ఉండటంతో జీహెచ్ఎంసీ దీనిపై దృష్టి సారించింది. నగరంలో రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల సీఅండ్‌డీ వేస్ట్ వెలువడుతున్నట్లు అంచనా. దీని రీసైక్లింగ్‌కు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసే నాలుగు ప్లాంట్లకు టెండర్లు పిలిచారు. వీటిని దక్కించుకున్న రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ సంస్థ (హైదరాబాద్ సీఅండ్‌డీ వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్) 2 ప్రాంతాల్లో పనులు చేపట్టింది. జీడిమెట్ల ప్లాంట్ దాదాపు పూర్తయింది. శుక్రవారం ప్లాంట్ పనితీరును జీహెచ్ఎంసీ ఇంజనీర్లు, రాంకీ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్ట్ వ్యయం రూ.15 కోట్లు.. ►జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రభుత్వం 17 ఎకరాల స్థలం కేటాయించగా, 2018, జనవరి నుంచి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.15 కోట్లు. ►శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా చేస్తారు. ►వేస్ట్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్.. ఇలా రెండు విభాగాలుగా పనులు చేస్తున్నారు. రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్ బ్లాక్‌లు తయారు చేస్తారు. వ్యర్థాలను క్రషింగ్ ద్వారా కంకరగా, కోర్, ఫైన్ ఇసుకగా మారుస్తారు. ఈ కంకరను రోడ్ల లెవెల్ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్ స్కేపింగ్ పనులకు వాడొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్, యాప్ అందుబాటులోకి బిల్డర్లు, ప్రజలు సీ అండ్ డీ వేస్ట్‌ను తరలించేందుకు సంబంధిత నంబర్‌కు ఫోన్ చేస్తే సంస్థ వాహనాల ద్వారా తరలిస్తారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టోల్‌ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21111111, మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారా సమాచారమిచ్చినా తరలిస్తున్నారు. దీనికిగాను ప్రస్తుతం టన్నుకు రూ.256 వసూలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభమయ్యాక టన్నుకు రూ.342 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యర్థాలను సొంతంగానే తరలిస్తే ఖర్చు తగ్గుతుంది. అయితే వీటిని తరలించే వాహనాలు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ఎం ప్యానెల్ జాబితాలో నమోదై ఉండాలి. లేకపోతే భారీ జరిమానాతోపాటు వాహనాలనూ సీజ్ చేస్తారు. ప్రయోజనాలు... ►ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలుండవు. ►రీసైక్లింగ్‌తో పేవర్ బ్లాక్‌లు, కెర్బ్ స్టోన్లు, ఇసుక, ఇటుకలు తదితరమైనవి ఉత్పత్తి చేసి పునర్వినియోగించడం వల్ల సహజ వనరులు వృథాకావు. ఠి కాలుష్యం తగ్గుతుంది. కలెక్షన్ పాయింట్ల ఏర్పాటు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల మెటీరియల్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో జీడిమెట్లలో సీ అండ్ డీ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు బల్దియా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాంకీ ఎన్విరో బయోమెడికల్ వేస్ట్ బిజినెస్ హెడ్ ఎ.సత్య తెలిపారు. సీ అండ్ డీ వేస్ట్ సేకరించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
మృత్యుశకటాలు
నగరంలో బుధవారం వాహనాలు బీభత్సం సృష్టించాయి. జీడిమెట్ల, ఉప్పల్ ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో లారీలు ఢీ కొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉప్పల్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఒకరిని బలిగొంది. అత్తాపూర్‌లో అదుపు తప్పిన కారు ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... వెంటాడిన మృత్యువు జీడిమెట్ల: పండుగకు ఊరికివెళ్లి అటోలో నగరానికి తిరిగివస్తున్న వారిని సిమెంట్ లారీ రూపంలో మృత్యువు కబలించింది.. ఈ విషాద ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ శంఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా కాల్వాలా గ్రామానికి చెందిన వెంకన్న(45) భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. సంక్రాంతి పండగ నిమిత్తం అతను భార్య శశిరేఖ, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం నగరానికి తిరిగివస్తూ ఇద్దరు కుమార్తెలను కుత్బుల్లాపూర్‌లో వదిలి బాలానగర్ వెళ్లేందుకు ఆటోలో బయలుదేరాడు అటోలో అటో డ్రైవర్ అనిల్, అతని కుమారుడు (2), వెంకన్న, శశిరేఖ ఉన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న అటోను షాపూర్నుండి కుత్బుల్లాపూర్ వైపు వస్తున్న సిమెంట్ లారీ డీ కొట్టడంతో వెంకన్న కిందపడటంతో లారీ అదే వేగంతో అతని తలపైనుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శశిరేఖ తలకు తీవ్ర గాయం కాగా అటో డ్రైవర్ అనిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతని కుమారుడు(2) తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు అత్తాపూర్: రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని గాంధీనగర్‌లో ఓ కారు భీభత్సం సృష్టించింది. రోడ్డుకే అనుకొని ఉన్న ఓ ఇంటి బయట ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన ఉత్తమ్ (19), మరో ముగ్గురితో కలిసి హోండా ఎక్స్‌క్లాస్ కారులో రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్ వైపు వెళుతున్నాడు. హిమాయత్‌సాగర్ గాంధీనగర్ బస్తీ వద్దకు రాగానే వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పింది. రోడ్డుకే అనుకొని ఉన్న తమ ఇంటి ముందు నిల్చొని మాట్లాడుకుంటున్న మల్లేష్ (60), వీరాబాబు (40)లను ఢీకొనడంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందగా, వీరాబాబుకు రెండు కాళ్లు విరిగాయి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరాబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. మల్లేష్ కుటుంబసభ్యుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. వీరాబాబును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రయాణిస్తున్న కారులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదానికి కారుకుడైన ఉత్తమ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లుగా గుర్తించారు. ఉప్పల్‌లో.. ఒకరి దుర్మరణం ఉప్పల్: అతి వేగంగా వచ్చిన ఓ కారు ఉప్పల్‌లోని వరంగల్ జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో వృద్దురాలు అక్కడికక్కడే మృతిచెందగా మరో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉప్పల్ దేవేందర్‌నగర్‌కు చెందిన ఇటికాల యాదమ్మ (60) స్థానిక కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తుంటుంది. బుధవారం మార్కెట్‌కు వస్తుండగా బోడుప్పల్ వస్తున్న కారు అదుపు తప్పి యాదమ్మను ఢీకొట్టింది. అంతటితో ఆగక ముందు వెళ్తున్న మరో కారు ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. యాదమ్మ కుమారుడు నర్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైకును ఢీకొన్న లారీ ఒకరి మృతి, మరొకరికి గాయాలు మేడ్చల్: మేడ్చల్ –గండిమైసమ్మ రోడ్డులో బాసిరేగడి వద్ద బుధవారం మధ్యాహ్నం బైక్‌ను లారీ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. సీఐ రాజశేఖరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జీడీమెట్ల సాయిబాబా నగర్ కు చెందిన వెంకటసత్యనారాయణ రాజు(46), గాంధీనగర్‌కు చెందిన చంద్రప్రకాష్(35), సాయిబాబానగర్‌కు చెందిన గోవిందరాజు(52) వెల్డింగ్ పని చేసేవారు. బుధవారం మధ్యాహ్నం వారు ముగ్గురు కలిసి అయోధ్య చౌరస్తా నుండి గండిమైసమ్మ వైపువెళుతుండగా బాసిరేగడి సమీపంలో మలుపు వద్ద వెనుక నుండి వస్తున్న అతివేగంగా వెళుతున్న లారీ ఒక్క సారిగా ఎడమ వైపు తిప్పడంతో బైక్ అదుపు తప్పి లారీ వెనుక చక్రాల కిందకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో చంద్రప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా, గోవిందరాజు, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు . మేడ్చల్ పోలీసులు బాధితులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి మృతదేహాన్ని మేడ్చల్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చేపా చేపా ఎక్కడున్నావ్?
సాక్షి,హైదరబాద్: అది జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ కొల్లా చెరువు. గురువారం ఉదయం ఆ చెరువులో పడవలు పరుగులు తీశాయి. ఈ పరుగు పతకాల కోసం కాదు.. చేపల కోసం. చిక్కిన ప్రతి చేపనూ ‘బంగారు’ పతకం కంటే గొప్పగా భావిస్తూ జాలర్లు ముందుకు దూసుకుపోయారు.