JK
-
పూంచ్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు రాజ్‌నాథ్ సింగ్ పరామర్శ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై బుధవారం సమీక్షించిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ అధికారుల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను కలిశారు. ఈ సంఘటనపై దర్యాప్తు తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా రాజ్‌నాథ్ వెంట ఉన్నారు. అలాగే రాజౌరీ జిల్లాలో సైనికుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పౌరులను పరమర్శించారు. కాగా డిసెంబర్ 21న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే సైనికులు ప్రతిదాడి చేయగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అనంతరం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఉగ్రదాడిపై దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి వెళ్లింది. సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ములో పర్యటించారు. పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి ముందు పౌరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆర్మీకి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారత పౌరులను బాధపెట్టే ఏ పొరపాట" ఆర్మీ చేయలేదని అన్నారు. ‘మీరు దేశ రక్షకులు. అయితే దేశ భద్రతతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకునే బాధ్యత కూడా మీపై ఉందని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దేశ పౌరులను బాధపెట్టే తప్పులు మీరు చేయకూడదు’ అని తెలిపారు. -
సినిమాలోనూ అన్నదమ్ములే!
తమిళసినిమా: జేకే,జయకాంత్ సోదరద్వయం తిరుపతిస్వామి కుటుంబం అనే చిత్రం ద్వారా కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. విశేషం ఏమిటంటే వీరు చిత్రంలోనూ అన్నదమ్ములుగా నటించారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయకిగా, జయన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో దేవదర్శిని, మయిల్‌స్వామి, ముత్తురామన్, కే.అమీర్, కవిరాజ్, సిజర్‌మనోహర్ ముఖ్యపాత్రలను పోషించారు. జేకే.గుడ్ ఫిలింస్ బాబూరాజ్, జేమ్స్ ఫిలింస్ మురుగానంద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేశ్ షణ్ముగం దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకు ముందు అరసు, గంభీరం చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాబురాజ్, జాఫర్ఆష్రాఫ్ నిర్మించారు. చిత్ర వివరాలను నిర్మాతల్లో ఒకరైన బాబూరాజ్ తెలుపుతూ తాను సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో 25 ఏళ్లగా నిర్మాణ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. కాగా ఈ తిరుపతిస్వామి చిత్రాన్ని తన ఇద్దరు కొడుకులు జేకే, జయకాంత్లను కథానాయకులుగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్నానని తెలిపారు.మన పక్కింటిలోనో, ఎదురింటిలోనో కనిపించే సగటు మనిషిలాంటి పాత్ర తిరుపతిస్వామిలో ఉంటుందన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెళ్లి సాయం చేసే ఆయనకు ఒక అధికారం, రాజకీయ బలం ఉన్న వ్యక్తితో సమస్య ఎదురవుతుందన్నారు. దాన్ని ఆయన కొడుకులు బుద్ధిబలంతో ఎలా ఎదుర్కొన్నారన్నదే తిరుపతిస్వామి చిత్రం అన్నారు. చిత్రం పూర్తి అయ్యిందని, సెన్సార్ సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్ అందించడంతో పాటు మంచి కుటుంబ కథా చిత్రం అంటూ ప్రశంసించారని తెలిపారు. తిరుపతిస్వామి చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
కాశ్మీర్ లో ఎన్నికలపై దాడి చేసే కుట్ర భగ్నం
జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలను భగ్నం చేసేందుకు, వోటు వేయాలనుకున్న ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు విఫలం చేశాయి. జమ్మూ ప్రాంతంలోని డోడా జిల్లాలోని పూనేజా-భదర్వాహ్ ఏరియాలోని రంట్ సాకా అడవుల్లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలను పోలీసులు చేజిక్కించుకున్నారు. పోలీసులు రంట్ సాకా అడవుల్లోని కొండకోనల్లో భదానీ నాలా పక్కన దాదాపు 48 గంటల పాటు వెతికి, 8 కిలోల ఆర్డ డీ ఎక్స్, ఆరు ఆధునిక ఆయుధాలను, ఏడు గ్రెనేడ్లు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని, కమ్యూనికేషన్ పరికరాలు,పాకిస్తానీ కరెన్సీ, రెండు డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉగ్రవాదుల సాయంతో విదేశీ ఉగ్రవాదులు ఈ స్థావరాన్ని నిర్మించారు. ఈ స్థావరం నుంచి ఉగ్రవాదులు ఎన్నికలను భగ్రం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం లభించిన తరువాత భద్రతాదళాలు ఈ ఏరియాలో సోదాలు జరిపాయి. భదర్వాహ్ - డోడా ఉధమ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ పోటీలో ఉన్నారు.