Job responsibilities
-
ఉద్యోగాలకు ముందుకొస్తున్న మహిళలు
ముంబై: ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా 2021 నుంచి 2024 మధ్యకాలంలో టైర్–2, 3 ఇతర నాన్ మెట్రో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆప్నా డాట్ కో’ వెల్లడించింది. ముఖ్యంగా టైర్–2, 3 పట్టణాల నుంచి మహిళా అభ్యర్థుల దరఖాస్తులు మూడు రెట్లు పెరిగినట్టు తెలిపింది. మెట్రోలకు వెలుపల ఉద్యోగాల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, డిజిటల్ అనుసంధానత, నియామకాల్లో వస్తున్న మార్పులు చిన్న పట్టణాల్లోనూ వివిధ రంగాల్లో మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది. → టైర్–2, 3 పట్టణాల్లో సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, అడ్మిన్, బ్యాక్‌ఆఫీస్, కస్టమర్ సపోర్ట్‌లో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. 55 శాతం మంది మహిళలు ఈ ఉద్యోగాల్లోనే చేరుతున్నారు. → అంతేకాదు కఠిన పరిస్థితులు ఉండే క్షేత్రస్థాయి అమ్మకాలు, డెలివరీ, లాజిస్టిక్స్‌లోనూ కొందరు పనిచేసేందుకు సుముఖత చూపుతున్నారు. → క్షేత్రస్థాయి విక్రయాల్లో ఉద్యోగానికి 6 లక్షలు, డెలివరీ, లాజిస్టిక్స్ ఉద్యోగాలకు 2.5 లక్షల దరఖాస్తులు, సెక్యూరిటీస్ సేవల ఉద్యోగాలకు 1.5 లక్షల దరఖాస్తులు 2021–2024 మధ్యకాలంలో వచ్చాయి. → లక్నో, జైపూర్, ఇండోర్, భోపాల్, సూరత్, నాగ్‌పూర్, కోయింబత్తూర్ మహిళలకు ఉపాధి కేంద్రాలు. ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై ఉద్యోగ దరఖాస్తుల్లో 45% ఇక్కడివే. -
ఉద్యోగాన్ని ప్రేమించండి!
* ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేస్తున్న కలెక్టర్ * జిల్లా స్థాయి అధికారులకు లిటరేచర్ మెమంటో ఇందూరు : జిల్లా పరిపాలనలో.. అభివృద్ధిలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు జిల్లా కలెక్టర్ యోగితా రాణా. ప్రజా ఫిర్యాదులను, ప్రభుత్వ పనులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సత్వరమే పరిష్కారం చూపడం లేదనే ఉద్దేశంతో ‘టాప్ ప్రియారిటీ’ అనే స్టాంపు ముద్రను తయారు చేయించి ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అధికారుల ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేయడానికి మరో సారి తనవంతు ప్రయత్నం చేశారు. అదేటంటే లిట్రేచర్ మెమంటో...! దీనిని కలెక్టర్ ప్రత్యేకంగా తయారు చేయించి జిల్లా స్థాయి అధికారులందరికీ అందజేశారు. అందులో ఏముందంటే...? ఉద్యోగాన్ని, నావృత్తిని నేను ప్రేమిస్తాను.. నా ఉద్యోగపు పని నన్ను ప్రేరణను ఇస్తుంది.. నా తోటి ఉద్యోగులను గౌరవిస్తాను.. ప్రతిరోజూ గుణాత్మకమైన మార్పుతో పనిని మొదలు పెడతాం.. నా ఉద్యోగం, పనిపై విశ్వాసం ఉంటుంది.. దీనిని నేను స్ఫూర్తిగా తీసుకుని నిత్య ఉద్యోగంలో ఆచరిస్తాను.. అని ఇంగ్లీషులో రాసి ఉంది. ఈ మెమోంటోను అధికారులు తమ టేబుల్‌పై పెట్టుకోవాలని, రాగానే ప్రతిరోజూ దానిని చదవాలని కలెక్టర్ సూచించారు. ఈ మెమోంటో ఏ జిల్లా స్థాయి అధికారి చాంబర్లో చూసిన దర్శనమిస్తోంది. జిల్లా కలెక్టరే స్వయంగా ఉద్యోగ బాధ్యతలను తెలియజేసేందుకు ఈ విధంగా చొరవ తీసుకోవడంపై ఉద్యోగులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బాధ్యతలు చేపట్టిన అర్బన్ ఎస్పీ త్రిపాఠి
సాక్షి, గుంటూరు : అర్బన్ పోలీసు జిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు అర్బన్ ఎస్పీగా పనిచేసిన రాజేష్‌కుమార్‌ను ఐపీఎస్‌ల విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించడంతో వెయింటింగ్‌లో ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన త్రిపాఠి అర్బన్ జిల్లాపరిధిలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతలు, ట్రాఫిక్, రాజధాని పరిధిలో అను సరించాల్సిన విధానాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ త్రిపాఠి విలేకరులతో మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో అర్బన్ జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్బన్ ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏఎస్పీలు జె.భాస్కరరావు, శ్రీనివాసరావు, వెంకటప్పలనాయుడు, డీఎస్పీలు సంతోష్, శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్డీఎస్పీ మెహర్‌బాబా, డీసీఆర్బీ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, మహిళ పోలీసు స్టేషన్ డీఎస్పీ కమలాకర్‌రావు, సీసీఎస్ డీఎస్పీలు ప్రకాష్‌రావు, శ్రీనివాసరావులతోపాటు, పలువురు సీఐలు ఉన్నారు. -
అవసరమైతే 20 గంటలు పనిచేస్తా
జేసీ సత్యనారాయణ కలెక్టరేట్లో బాధ్యతల స్వీకరణ రాంనగర్ : బంగారు తెలంగాణ కోసం అవసరమైతే 20 గంటలు పనిచేసేందుకు కూడా వెనుకాడబోనని నూతన జాయింట్ కలెక్టర్‌గా సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన జేసీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వంద శాతం విజయవంతం అయ్యే విధంగా పని చేస్తానని తెలిపారు. ఉద్యోగులందరి సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లానుంచి కొన్ని కీలక పథకాలు మొదలు పెడుతుందని, వాటిని సజావుగా పూర్తి చేసేందుకు తన శక్తి మేరకు పని చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం డీఆర్ఓ నిరంజన్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, నల్లగొండ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు బోకేలు అందజేసి అభినందనలు తెలిపారు.