Joint Collector posts
-
ఏపీలో పాలన పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి వారి ఇబ్బందులను పరిష్కరించి భరోసా కల్పించే లక్ష్యంతో ప్రతి జిల్లాకు మూడో జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి. రాష్ట్రంలో అదనంగా 13 జాయింట్ కలెక్టర్ (కేడర్) పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేసీ పోస్టులను మూడు విభాగాలుగా రీ డిజిగ్నేషన్ చేయడంతోపాటు పర్యవేక్షించాల్సిన విభాగాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. తద్వారా పరిపాలనా వ్యవస్థ జిల్లాల స్థాయిలో బలోపేతం కావడంతోపాటు లోపరహితంగా, శరవేగంగా సేవలు అందనున్నాయి. అందరి సంక్షేమమే లక్ష్యం.. ‘అవినీతికి తావులేని, జవాబుదారీ పరిపాలన అందించడంతోపాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘మిషన్ మోడ్’లో నిర్వహించాలని నిర్ణయించాం. చిట్టచివరి వ్యక్తికి కూడా సత్వర సేవలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను తెచ్చింది. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు కీలక బాధ్యతలు చేపట్టడానికి ముందు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం అవసరం. స్టేట్ సివిల్ సర్వీస్ (ఎస్సీఎస్), నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ (నాన్ ఎస్సీఎస్) అధికారులు ఐఏఎస్‌లుగా ప్రమోషన్ పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో పనిచేసిన మంచి ట్రాక్ రికార్డు ఉండటం అవసరం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మూడో జేసీ పోస్టు మంజూరు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 3 విభాగాలుగా జేసీలు ► ప్రస్తుతం ఉన్న జాయింట్ కలెక్టర్–1ను జాయింట్ కలెక్టర్– రైతు భరోసా, రెవెన్యూ (ఆర్బీ– ఆర్)గా ప్రభుత్వం మార్చింది. ఇందులో సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. ► జేసీ–గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వి, డబ్ల్యూఎస్–డి)ని కొత్తగా సృష్టించారు. దీన్ని సీనియర్ టైమ్ స్కేలు, అంతకంటే ఎక్కువ స్థాయి ఐఏఎస్ అధికారితో భర్తీ చేస్తారు. ► ప్రస్తుతం ఉన్న జేసీ–2ను జాయింట్ కలెక్టరు – ఆసరా, సంక్షేమం అని మార్చారు. ఇందులో ఎస్సీఎస్, నాన్ ఎస్సీఎస్ అధికారులను(స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేడర్) నియమించనున్నారు. జేసీ– ఆసరా–సంక్షేమం (ఏ అండ్ డబ్ల్యూ) (పర్యవేక్షించే విభాగాలు) ► గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఏ –డీడబ్ల్యూఎంఏ) ► అన్ని రకాల సంక్షేమం (మహిళా శిశు సంక్షేమం, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ వెల్ఫేర్, మైనారిటీల సంక్షేమం) ► పరిశ్రమలు – వాణిజ్యం ► దేవదాయ 4 స్కిల్ డెవలప్మెంట్. జేసీ– గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి (వీ, డబ్ల్యూఎస్–డి) (పర్యవేక్షించే విభాగాలు) ► గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్లు ► పంచాయతీరాజ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం ► పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య ► పురపాలక, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం ► మీసేవ– ఆర్టీజీ, ఐటీఈ, సి విభాగాలు ► ఇంధన, జలవనరుల శాఖలు మినహా అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాలు -
జిల్లాకు మరో జేసీ
సాక్షి, అమరావతి: పాలనా వ్యవస్థలో మరింత జవాబుదారీతనం తీసుకురావడానికి.. అవినీతి రహితంగా పాలన సాగించడానికి.. సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమ ఫలాలు అందించడానికి జిల్లా యంత్రాంగంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరేసి జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం సృష్టించనుంది. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కొత్తగా నియమితులు కానున్న జేసీకి అప్పగించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకంగా పనిచేస్తున్న విషయం విదితమే. కొత్తగా జాయింట్ కలెక్టర్ పోస్టు ఏర్పాటుచేస్తుండడంతో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో మొత్తం ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. పని విభజన విషయంలో ముగ్గురు జేసీలకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. ఏ జాయింట్ కలెక్టర్ ఏ పథకాలను పర్యవేక్షించాలో, ఏఏ విభాగాలను చూడాలనే విషయంలో ఉన్నతాధికారులు విస్పష్టంగా జాబితా రూపొందించారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలు.. సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా, సజావుగా అందించాలన్నదే ఈ మార్పు లక్ష్యమని సమాచారం. ఈ ముగ్గురు జేసీలు జిల్లా కలెక్టర్‌కు పాలనలో సహకారం అందిస్తారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేలులో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించే ముందే వారికి క్షేత్రస్థాయిలో పాలన అనుభవం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ సివిల్ సర్వీసు (ఎస్సీఎస్) అధికారులకు, నాన్–ఎస్సీఎస్ అధికారులకూ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో విశేష అనుభవం అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మార్పులు ఇలా.. 1 జాయింట్ కలెక్టర్–1ను ఇక మీదట జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ)గా పునర్యవస్థీకరించనున్నారు. వీరిని జేసీ–ఆర్బీ అండ్ ఆర్గా పిలుస్తారు. వీరు రైతు భరోసా మొదలు వ్యవసాయం, అనుబంధ రంగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇసుక, గనులు, ఎక్సైజ్, శాంతిభద్రతలు తదితర విభాగాలకూ బాధ్యత వహించాలి. రెవెన్యూ విభాగం, సబ్ కలెక్టర్లనూ పర్యవేక్షించాలి. 2 ‘జాయింట్ కలెక్టర్–విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్’ అని కొత్త పోస్టు సృష్టించనున్నారు. వీరిని జేసీ–వీ అండ్ డబ్ల్యూఎస్‌గా పిలుస్తారు. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. 3 ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్–2ను జాయింట్ కలెక్టర్–హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌గా పునర్యవస్థీకరించనున్నారు. ఇది నాన్–క్యాడర్ పోస్టు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఎస్సీఎస్/నాన్–ఎస్సీఎస్ కేడర్‌ను ఈ పోస్టులో నియమిస్తారు.వీరు జిల్లాలో వైద్య, ఆరోగ్య విభాగం, విద్యా శాఖను పర్యవేక్షిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దిశ చట్టం అమలు బాధ్యతలు చూడనున్నారు. -
జిల్లాకు లోటు : మంత్రి సునీత
అనంతపురం సెంట్రల్ : జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ బదిలీ జిల్లాకు లోటు అని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డ్వామా హాలులో జిల్లా యంత్రాంగం, బ్యాంకర్ల ఆధ్వర్యంలో జేసీ సన్మానించారు. మంత్రి సునీత మాట్లాడుతూ...జేసీ సత్యనారాయణ బదిలీపై వెళుతుండడంతో ఇంటిలోని వ్యక్తి బయటకు పోతున్నట్లుగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారన్నారు. ఎక్కడున్నా జిల్లా సంక్షేమం గురించి పట్టించుకోవాలని కోరారు. మళ్లీ జిల్లాకు తెప్పించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ఉద్యోగులందరూ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణను అభినందించారు. కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్, ఏపీజీపీ ఆర్ఎం నరసయ్య, ఎల్డీఎం జయశంకర్, నాబార్డు జీఎం నరసింహరావు పాల్గొన్నారు. జేసీకి ఏపీజీబీ ఆర్ఎం సన్మానం అనంతపురం అగ్రికల్చర్: తూర్పుగోదా వరి జిల్లాకు బదిలీ అయిన జిల్లా జా యింట్ కలెక్టర్ బి.సత్యనారాయణను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు ఘనంగా సన్మానించారు. శని వారం స్థానిక రీజనల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్ఎం లక్ష్మీనరసయ్య, ఇత ర అధికారులు సత్యనారాయణకు శాలు వా, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. జేసీగా సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. కలెక్టర్ లేని లోటును కనబడకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించారన్నారు. ఎక్కడున్నా మంచి అధికారిగా అందరి మన్ననలు పొందాలని అకాంక్షను వ్యక్తం చేశారు. జేసీకి ఘన వీడ్కోలు అనంతపురం సెంట్రల్ : జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు జిల్లా ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రెవెన్యూ భవన్లో వీడ్కోలు సభ నిర్వహించారు. డీఆర్వో హేమసాగర్ మాట్లాడుతూ... జేసీ సత్యనారాయణ లేని లోటు ఈ జిల్లాకు తీరనది అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్య వచ్చిన ముందుండి పరిష్కరించే వారని గుర్తు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ దంపతులను అధికారులందరూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విందులో అధికారులతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. -
భూములకు హద్దులు గుర్తించండి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ రాసుపల్లి,(ఎన్పీకుంట) : రాసుపల్లి భూములలో ఏర్పాటు చేయబోయే అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 1200 ఎకరాల అసైన్డ, శివాయిజమా, పట్టాభూమలను గుర్తించి హద్దులను గుర్తించాలని సర్వే అధికారులను జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారానికల్లా పనులు పూర్తికావాలని అన్నారు. ఎన్టీపీసీ, ఎపీ జెన్కో, ట్రాన్సకో అధికారులకు మంగళవారం ఆయన భూముల వివరాలను వివరించారు. పి.కొత్తపల్లి, ఎన్పీకుంట, వెలిగెల్లు గ్రామాల పరిదిలో సుమారు 7688.08 ఎకరాలు భూమిని గుర్తించడం జరిగిందన్నారు. భూముల స్వాధీనం గురించి ఇప్పటికే రైతులతో చర్చలు కూడా జరిపినట్లు వివరించారు. ఏకమొత్తంలో పరిహారం అందేలా చూడాలంటూ తీర్మానం చేయడంతో విషయాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కొత్త జీవోల ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా చూడటం జరుగుతుందన్నారు. నాలుగు రోజుల్లో పనులు పూర్తి మొదట విడతలో భాగంగా అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టును నేషనల్ దర్మల్ పవర్‌కార్పొరేషన్, సోలార్‌పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టడం జరుగుతోందని తహశీల్దార్ రత్నమయ్య తెలిపారు. అందులో భాగంగా మొదట విడతలో 1200 ఎకరాలకు సంబందించిన పూర్తి వివరాలను సేకరించడం జరిగిందని దీనిని 5 బ్లాక్‌లుగా ఏర్పాటు చేసి బౌండరీలు గుర్తించడం నాలుగు రోజులలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. జెసీ వెంట నెడ్‌క్యాప్ ఎడి శివప్రసాద్, ఎన్టీపీసీ సుందర్, ఎపీజెన్‌కో, ట్రాన్స్‌కో మేనిజింగ్ డెరైక్టర్లు ఎడి మశ్చేంద్రనాథ్, మిట్కాన్ కన్సల్టెన్సీ సీనియర్ విపి దీపక్జూడ్, రెవెన్యూ అధికారులు , విఆర్ఓలు పాల్గొన్నారు.