తోటి నటుడ్ని ఆటపట్టించిన స్టార్ హీరో!
పెద్దగా ఎండలేదు. వాతావరణం శాంతియుతంగా ఉంది. పరిసరాల్లో పెద్దగా అలికిడి లేదు. ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. అమెరికన్ నటుడు జోన్హా హిల్ కూడా సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాడు. చెవుల్లో హియర్‌ఫోన్స్.. మధురమైన పాటలు వింటున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి ఫోన్ పట్టుకొని పరిగెత్తుకొచ్చాడు. ఫొటో ఫొటో అంటూ బెదరగొట్టాడు. జోన్హా హిల్ బెదిరిపోయాడు. కాస్తా తెరుకొని చూస్తే.. హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో.. స్టన్ అయ్యాడు జోన్హా హిల్.
'ద వోల్ఫ్ ఆఫ్ వాల్‌స్ట్రీట్' సినిమాలో తన సహ నటుడైన జోన్హా హిల్‌ను ఇలా ఆటపట్టించాడు డికాప్రియో. ఒక్కసారిగా ఫొటో ఫొటో అంటూ డికాప్రియో మీదపడటంతో ఏంటో అర్థం కాక బెదిరిపోయాడు హిల్. నిజానికి ఈ ఇద్దరు మంచి స్నేహితులు. ఆస్కార్ వేడుకల్లోనూ కలిసి కామెడీ షోలు చేశారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడిని కాస్తా ఆటపట్టించడానికి 'టైటానిక్' స్టార్ ఇలా బెదరగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.