JULURUPADU
-
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
Omicron Variant: అలసత్వం వద్దు... అప్రమత్తత ముద్దు
మొదటి, రెండో కరోనా వేవ్ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరి యంట్‌తో కరోనా విజృంభించడం, అక్కడ నుండి వివిధ దేశాలకు విచ్చేసిన ప్రయాణికుల ద్వారా విస్తరిస్తుండటంతో ఆందోళన మొదలయింది. ఈ ప్రమాదకర వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించే రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పలు దేశాలలో గంటగంటకు ఆంక్షలు పెరుగుతున్నాయి. పలు దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ మనదేశంలోనూ అడుగుపెట్టింది. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాలనుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలిస్తారు, నెగిటివ్ వచ్చిన వారిని కూడా వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైంది. ప్రజలందరూ తప్పకుండా రెండు డోసులు టీకా వేసుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. (చదవండి: విద్యార్థులు బలిపశువులు కారాదు!) తెలంగాణలో అర్హులైన వారిలో 90 శాతానికి పైగా మొదటి డోసు టీకా వేసుకున్నారని 47 శాతం మందికి పైగా రెండు డోసులు వేసుకున్నారని, ఇంకా 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. 100% వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ప్రజలలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా బయట తిరగడం, మాస్కులు ధరించకుండా, కనీసం భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ల వాడకం కూడా పూర్తిగా తగ్గించి వేశారు. 85 శాతం నుంచి 90 శాతం వరకు మాస్కులు ధరించకుండా, శానిటైజర్లు వాడకుండా తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్‌లో, సినిమాహాల్లో, మార్కెట్లలో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు వంటి జన సమర్థం అధికంగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కూడా మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. (BR Ambedkar: అంబేడ్కర్ బాటలో తెలంగాణ) అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభమవడం, గురుకుల పాఠశాలలో కూడా భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంతో అక్కడ అక్కడ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం మొదలయింది. ఖమ్మం జిల్లా వైరా గురుకులంలో 29 మందికి, రంగారెడ్డి జిల్లా ముత్తంగి లోని బాలికల గురుకులంలో 47 మంది విద్యార్థినిలకు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకింది. ఇలా జగిత్యాల జిల్లా తాటి పెళ్లి గురుకుల పాఠశాలలో తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు లోని కస్తూరిబా గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ శివారులోని టెక్ మహీంద్రా వర్సిటీలో 25 మంది విద్యార్థులకు వైరస్ అంటుకున్నది. బాలలు జాతి సంపద, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వారికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించి పరిరక్షించవలసిన తరుణంలో, మౌలిక వసతుల కల్పన, కోవిడ్ నిబంధనలు పాటించకుండా గురుకులాలు ప్రారంభించడంతో విద్యార్థులు వైరస్ బారిన పడుతుండడం బాధాకరం. కరోనా సమసిపోయింది అన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సంగతిని పట్టించుకోవడం లేదు. మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు తగ్గిపోయిందని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం మళ్లీ మూడవ దఫా వైరస్ విస్తరిస్తున్నదని, కార్పొరేటు పెత్తందార్లు, పెట్టుబడిదారుల లాబీయింగ్ వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ప్రచారం జరుగుతున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా మాస్కుల వాడకం, శానిటైజర్లను ఉపయోగించడం తప్పకుండా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలందరూ ఒక దగ్గరికి చేరకూడదు. కనీస రక్షణ చర్యలు పాటించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే రాబోయే 1, 2 నెలలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. అందుకని విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించడం చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుండి మానవాళిని కాపాడడానికి తక్షణమే కనీస రక్షణ చర్యలు అవలంబించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం సంబంధిత కార్యనిర్వాహక శాఖలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... - తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్ -
ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..
జూలూరుపాడు: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనుకతండా గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. నీళ్ల కోసం ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండా గ్రామంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. రెండు వారాల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వివరించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు కూడా పని చేయడంలేదని, బిందె నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది) చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల -
భద్రాద్రి జిల్లాలో ఏడు శతాబ్దాల నాటి బావి
అద్భుత కట్టడాలకు ఆలవాలం కాకతీయుల కాలం.. వారి శిల్పకళ ప్రతిభ అనిర్వచనీయం.. నిర్మించి శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని నైపుణ్యం వారి సొంతం.. ఆ కోవలోకే వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఉన్న కాకతీయులు నిర్మించిన రాజా బావి.. 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో ఇక్కడి సామంతరాజులు నిర్మించిన ఆ బావి ఇంకా పదిలంగానే ఉంది. కానీ నేటి పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంతో చారిత్రక కట్టడం నిరాదరణకు గురవుతోంది. జూలూరుపాడు, భద్రాద్రి జిల్లా : శత్రుదేశాల సైన్యాల నుంచి రక్షించుకోవడానికి నాటి సామంతరాజులు ఒక రహస్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడును అనువైన ప్రాంతాంగా ఎంచుకున్నారు. అక్కడ నీటి అవసరాలకోసం సువిశాలమైన అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో రాతి కట్టడంతో రాజా బావిని నిర్మించారు. రాజా బావి పైభాగాన చుట్టూ 10గదులను నిర్మించారు. బావిలోకి మెట్లు 30 అడుగుల లోతు వరకు ఉంటాయి. ఈ బావికి చుట్టూ ఉన్న గదుల పై కప్పు 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఒకే రాయి ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నేళ్లు పూడిక తీయకపోవడంతో బావి లోతు ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఈ బావిని డంగు సున్నం, రాళ్లతో కట్టడంతో నేటికీ ధృడంగా ఉంది. వరంగల్ వరకు సొరంగం..! సాధారణంగా రాజులు తమ రహస్య స్థావరాలకు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగానే ఈ బావికి కూడా సొరంగ మార్గం ఇటు వరంగల్ కోట వరకు.. అటు ఖమ్మం ఖిల్లా వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో ఉంచారని స్థానికంగా ప్రచారంలో ఉంది. దీంతో బావిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బావి కొంతవరకు ధ్వంసమైంది. పట్టించుకుంటే మంచి వనరు.. రాజా బావిలోని నీటిని గతంలో గ్రామ ప్రజలతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తాగేందుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం బావి చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతోపాటు పూడికతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో నీళ్లు సాధారణంగా అయిపోవని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్నో గ్రామాలకు తాగునీటిని అందించిన ఈ బావికి అధికారులు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బావిని మంచినీటి వనరుగా చేసేకుంటే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఆ దిశగా పాలకులు, అధికారులు ఆలోచించాలి. -
తాగునీటికి రోడ్డెక్కిన మహిళలు
జూలూరుపాడు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు గుండెపుడి గ్రామంలో ఆందోళనకు దిగారు. గుండెపుడితండా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పబ్లిక్ ట్యాప్‌ను ఓ వ్యక్తి పగలగొట్టి తీసివేయడంతో మూడు రోజుల నుంచి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో తండా ప్రజలకు తాగడానికి బిందెడు నీళ్లు దొరకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు భీష్మించుకొని కూర్చున్నారు. ఈఓపీఆర్డీ జగదీశ్వరరావు, ఏఎస్సై కృష్ణారావు, పోలీసు సిబ్బంది వచ్చి ఆందోళన విరమించాలని కోరినా మహిళలు అంగీకరించలేదు. సర్పంచ్ రావాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండుటెండను సైతం మహిళలు లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా కొనసాగించారు. సమస్యను పరిష్కరిస్తానని సర్పంచ్ విజయనిర్మల హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. రాస్తారోకో సుమారు గంటకు పైగా జరగడంతో జూలూరుపాడు–చండ్రుగొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పాల్వంచలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు పాల్వంచ : పట్టణంలోని తెలంగాణనగర్ కాలనీలో మంచినీరు రావడం లేదని, తక్షణం అధికారులు స్పందించి తాగునీరు అందించాలని కాలనీ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ వేసవికాలంలో తాగునీరు లేక అల్లాడి పోతున్నామని, మున్సిపాలిటీ నుంచి పంపించే ట్యాంకర్లు ఒకరోజు వస్తే మరొక రోజు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం మంచినీటి పైపులైన్ల జాయింట్లు తొలగించారని, వీటిని నాలుగు నెలలుగా అమర్చక పోవడంతో మంచి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో కొంగ ఉమ, ఉస్సేన్బీ, రాధ, వెంకటరమణ, శకుంతల, మల్లిక పాల్గొన్నారు. -
‘గూడెం’లో కలపండి
జూలూరుపాడు, ఏన్కూరు మండలాల వాసుల డిమాండ్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన.. ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి కొత్తగూడెం: జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో కలపాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. వేలాది మంది ప్రజలు కొత్తగూడెం మండలంలోని విద్యానగర్ కాలనీ నుంచి పాదయాత్రగా బయలుదేరి బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలపాటు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాకు అతి సమీపంలో ఉన్న జూలూరుపాడు, ఏన్కూరు మండలాలను ఆ జిల్లాలోనే కలపాలని జేఏసీ కన్వీనర్ లకావత్ గిరిబాబునాయక్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోనే ఆయా మండలాలను ఉంచడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఎం.వి.రవీంద్రనాథ్‌కు వినతిపత్రం అందచేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మాళోతు రాందాస్‌నాయక్, గుగులోతు ధర్మానాయక్, ఎల్లంకి కృష్ణయ్య, చీమలపాటి భిక్షం, కోకన్వీనర్ వాంకుడోత్ వెంకన్న, రోకటి సురేష్, గురునాథం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లావుడ్యా హభుమా, కట్రం మోహన్‌రావు, చింతా జగన్నా«థం, సపావట్ దేవి, వాసం రామకృష్ణ, కట్రం నరసింహారావు, కాన్షీరాంనాయక్, రాజేష్‌నాయక్, రమేష్‌నాయక్, చందర్‌నాయక్, లావుడ్య సత్యనారాయణ, బాలాజీ, శాంతిలాల్ పాల్గొన్నారు. -
చెట్టుని ఢీకొన్న పెళ్లి వ్యాన్: 9 మందికి తీవ్రగాయాలు
జూలూరుపాడు (ఖమ్మం జిల్లా): జూలూరుపాడు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం సోమలగూడెం గ్రామానికి చెందిన 9 మంది బృందం ముదిగొండకు పెళ్లికి వెళ్లి వస్తుండగా వ్యాను అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో సరళ, రామారావు, నర్సింహారావు, శేషారత్నం, ధనలక్ష్మి, ప్రమీల, సాయి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
17 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
జూలూరుపాడు (ఖమ్మం) : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని యలమంద అనే వ్యక్తి అద్దె ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 17 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సివిల్ సప్లై ఆర్ఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆర్ఐ కె.నరసింహారావు తెలిపారు. -
బైక్, బొలెరో ఢీ: ఒకరికి తీవ్రగాయాలు
జూలూరుపాడు (ఖమ్మం జిల్లా) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దండుమిట్టతండాకు చెందిన మాలోత్ నాగు(50) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు వద్ద బుధవారం ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు కుంట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. -
‘డూప్లికేటుగాళ్లు’పై ఆర్డీఓ విచారణ
జూలూరుపాడు : అటవీ భూముల్లో పోడు నరికి సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల ఆమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోగస్ పట్టాలు జారీ చేసిన వారి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‘డూప్లికేటుగాళ్లు’ అనే శీర్షికన ఈనెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికారులు అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలపై విచారణ చేపట్టాలంటూ కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహశీల్దారు కార్యాలయంలో ఆర్డీఓ బుధారం విచారణ చేపట్టారు. బోగస్ పట్టాతో మోసపోయిన వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా సురేష్, అతని భార్య ఉమ ఆర్డీఓను కలిశారు. తాము మోసపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గుగులోతు సరోజ, బాదావత్ విజయ, గుగులోతు సుజాత, భూక్యా జ్యోతి పేరు మీద ఉన్న బోగస్ పట్టాలను ఆర్డీఓ పరిశీలించారు. పట్టాపాస్ పుస్తకాలపై ఉన్నవి కలెక్టర్, భద్రాచలం ఐటీడీఓ పీఓ సంతకాలు కావని, ఇవి ఫోర్జరీ అని గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వ ముద్ర కూడా కాదని తేల్చారు. పట్టాపాస్ పుస్తకాలపై పోడు రైతు భార్యాభర్తల ఫొటోలు ఉండాలి కానీ, ఒకరిది మాత్రమే ఉందన్నారు. వీటిపై అప్పటి జూలూరుపాడు తహశీల్దారు డి.నాగుబాయి పేరుతో సంతకం చేసి ఉందని చెప్పారు. ఈ పట్టా పాస్ పుస్తకాలు ఎవరిచ్చారని బాధిత రైతులను ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై బాధితులు మాట్లాడుతూ వినోభానగర్ గ్రామానికి చెందిన భూక్యా అనిల్ ఎకరానికి రూ.10 వేలు చొప్పున తీసుకుని చేయించాడని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తుంటే మీరేందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్డీఓ ప్రశ్నించారు. దీనిపై వారు సమాధానం ఇస్తూ తమకు ఏమీ తెలియదని, అనిల్ చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చామని తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, పట్టాలు తిరిగి ఇవ్వాలని కోరారు. గుగులోతు సరోజ భర్త గుగులోతు నరసింహారావు మూడెకరాలకు రూ.30 వేలు, మల్లయ్య అనే రైతు తమ పెద్ద కూతురు బాదావత్ విజయ పేరు మీద పట్టా చేసినందుకు ఐదెకరాలకు రూ.50 వేలు, చిన్న కూతురు గుగులోతు సుజాత పేరు మీద పట్టా పాస్ పుస్తకం ఇచ్చినందుకు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు, భూక్యా జ్యోతి భర్త రాంబాబు ఎనిమిదెకరాలకు రూ.80 వేలు పట్టా పాస్ పుస్తకాల కోసం భూక్యా అనిల్‌కు ఇచ్చినట్లు వివరించారు. తమతోపాటు వినోభానగర్, ఏన్కూరు మండలంలోని అక్కినాపురంతండా, కేసుపల్లి, నాచారం గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పట్టాలు చేయిస్తానని అనిల్ డబ్బులు తీసుకున్నాడని తెలిపా రు. దీంతో ఆర్డీఓ వీరి నుంచి స్టేట్ మెంట్‌ను రికార్డు చేయాలని తహశీల్దారు తోట విజయలక్ష్మి ఆదేశించారు. దీంతో ఆర్ఐలు బాధిత పోడు రైతుల నుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్థానిక ఎస్సై ఎన్.గౌతమ్‌ను పిలిపించి ఈ కేసు విషయాన్ని ఆర్డీఓ చర్చించారు. కఠిన చర్యలు తప్పవు బోగస్ పాస్ పుస్తకాలు ఇప్పించిన భూక్యా అనిల్ అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆర్డీఆఓ దేశించారు. దీనికి భూక్యా అనిల్ తనపై కావాలనే తమ గ్రామానికి చెందిన ఓ పోడు రైతు వీరందరితో ఫిర్యాదు చేయించాడని చెప్పడంతో ఆర్డీఓ స్పందించారు. వీరిద్దరిని అదుపులోకి విచారించాలని, నిజ నిజాలు తెలుస్తాయని ఎస్సైతో అన్నారు. విచారణ అనంతరం ఆర్డీఓ విలేకరులతో మాట్లాడారు. పట్టా పాస్‌పుస్తకాలు బోగస్విగా గుర్తించామని తెలిపారు. జూలూరుపాడు మండలంలో 1,090 మందికి పోడు పట్టాలు ఇచ్చామని, వీరికి 3301.73 ఎకరాలు భూమి కేటాయించామని అన్నారు. వినోభానగర్ గ్రామంలో 32.46 ఎకరాలకు మాత్రమే పట్టాలు జారీ అయ్యాయని తెలిపారు. ఏనిగ్జిర్-6లో నమోదు చేసి, స్కానింగ్ కూడా జరిగిందని, అయితే ఇంకా 30 నుంచి 40 మాత్రమే నమోదు కాలేదని అన్నారు. బోగస్ పట్టా పాస్ పుస్తకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు చెందిన సంతకాలు మాత్రం కావని అన్నారు. అదేవిధంగా డీఎఫ్ఓ సంతకం అవునో కాదో తనకు తెలియదని, అప్పటి తహశీల్దారు డి.నాగుబాయి సంతకం చేశారని తెలిపారు. ఖాళీ పాస్ పుస్తకాలు ఎలా బయటకు పోయాయని అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఇలాంటి బోగస్ పట్టా పాస్ పుస్తకాలు చాలా ఉండే అవకాశం లేకపోలేదని, పూర్తి స్థాయిలో విచారణ జరగిన తర్వాత తెలుస్తుందని అన్నారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. -
పిడుగుపాటుకు దంపతులు బలి జూలూరుపాడు,
పిడుగుపాటుకు దంపతులు బలి జూలూరుపాడు, న్యూస్‌లైన్: పిడుగుపాటు దంపతులను బలితీసుకుంది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన భార్య,భర్తలు భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) గురువారం పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.... భూక్యా దీప్లా, పద్మ రోజు వారి పనిలో భాగంగా పత్తి పంటకు మందు కొట్టేందుకు పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం వస్తుండడంతో పొలంలో ఉన్న వేప చెట్టు కిందకు చేరారు. ఇంతలోనే అకస్మాత్తుగా పిడుగు పడడంతో వారిరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. పొలానికి వెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో దీప్లా బంధువులు వెళ్లి చూడగా చెట్టు కింద ఇరువురు చనిపోయి కనిపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు ఆర్ఐ కె.నరసింహారావు, వీఆర్ఓ వీరన్న, ఎస్ఐ ఆర్.అంజయ్య సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనతో సాయిరాంతండాలో తీవ్ర విషాదం నెలకొంది.