June 5th
-
5 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం లేటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ , ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ , ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 5 నుంచి పరీక్షలు జరుగుతాయని ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ పరీక్షలు ఈనెల 12న, పీజీ పరీక్షలు ఈనెల 11న ముగియనున్నట్లు తెలిపారు. -
5న ఎస్కేయూ పాలకమండలి సమావేశం
ఎస్కేయూ : వర్సిటీ పాలక మండలి సమావేశం జూన్ 5న వర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఎజెండా రూపొందిస్తున్నారు. నూతన పాలకమండలి ఏర్పాటైన తరువాత రెండో దఫా ఎస్కేయూలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు చర్చించనున్నారు. -
రేపు టీఎస్ లాసెట్ ఫలితాలు విడుదల
వరంగల్ : మూడేళ్ల ఎల్ఎల్బీ , ఐదేళ్ల లా, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో గతనెల 19వ తేదీన నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ సెట్ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి విడుదల చేయనున్నారని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా లాసెట్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. -
మహిళలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వరా ?
రంగారెడ్డి (ఘట్కేసర్) : జనాభాలో 3 శాతం ఉన్న రెడ్డి, వెలమలకు 10 మంత్రి పదవులు కేటాయించారని, 50 శాతం ఉన్న మహిళలకు మాత్రం ఒక్క పదవీ కేటాయించకుండా వారిని అవమానిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏనూతుల నాగేష్‌మాదిగ అన్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమానికి నాగేష్‌మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనాభాలో సగం ఉన్న మహిళలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటులేకుండా చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని, లేనిపక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాలని కోరుతూ నగరంలోని ఇందిరాపార్కు దగ్గర జూన్ 5వ తేదీన చేపట్టనున్న మహిళా గర్జనకు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంగి జగన్‌మాదిగ ఆధ్వర్యంలో మహిళా గర్జన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. -
జూలై 5న ఏపీ అగ్రిసెట్
తిరుపతి: అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ అగ్రిసెట్-2015ను తిరుపతి ప్రధాన కేంద్రంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అగ్రిసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ. గిరిదర్‌కృష్ణ తెలిపారు. అచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన వెబ్సైట్ నుంచి దరఖాస్తులను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు అఖరి తేది జూన్ 18 గా నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. ఏపీకి కేవలం 67 సీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిలో61 సీట్లను అగ్రికల్చర్ పాలిటెక్నిక్, మరో ఆరు సీడ్ టెక్నాలజీకి కేటాయించామన్నారు. జూలై 5న అగ్రిసెట్ ప్రవేశ పరీక్షను తిరుపతి, గుంటూరు జిల్లా బాపట్లలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
5 నుంచి ఆర్టీసీ సమ్మె
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : విజయనగరం జోనల్ పరిధిలోని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 5వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జోనల్ ఈడీ ఏ. రామకృష్ణకు ఆ సంఘం జోనల్ కమిటీ మంగళవారం సమ్మె నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర నాయకుడు దామోదరరావు మాట్లాడుతూ జోనల్ పరిధిలో కార్మిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు విధుల కేటాయింపు, మహిళా కండక్టర్లకు రూట్ చార్ట్ తయారీ వంటి పలు అంశాలలో సీనియార్టీని పాటించకుండా ఎన్ఎంయూ సంఘం నేతలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై విశాఖ అర్బన్ డిప్యూటీ సీటీ ఎం వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. పని భారాన్ని పెంచడం వల్ల విధుల్లో నాణ్యత కొరవడుతోందని, అదే సమయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నారు. డబుల్ డోర్ ఉన్న బస్సులలో విధులను ప్రత్యేకంగా గు ర్తించాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన 23 డిమాండ్లతో కూడిన సమ్మెనోటీసు అందజేసినట్టు తెలిపారు. జూన్ 5వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమ్మెపై అవగాహనకు జోనల్ పరిధిలోని 27 డిపోల ఎదుట ఈనెల 30న నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీనివాసరాజు, రీజియన్ కార్యదర్శి పి.భానుమూర్తి, కెవిరమణ, వివిధ డిపో కమిటీల సభ్యులు పాల్గొన్నారు.