justice cy somayajulu committee
-
' గోదావరి పుష్కరాల నివేదికను బయట పెట్డండి'
హైదరాబాద్: కృష్ణా పుష్కరాల లోపు రాజమండ్రి పుష్కర తొక్కిసలాట నివేదిక బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రచార యావ కారణం గానే పుష్కరాల్లో 29 అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. సంవత్సరం పూర్తయినా విచారణ నివేదిక ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
ఆ దుర్ఘటనను ఇంకా మర్చిపోలేదు..
హైదరాబాద్ : గోదావరి పుష్కర దుర్ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి 30మంది బలయ్యారన్నారు. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన సోమయాజులు కమిటీ ఇప్పటివరకూ చంద్రబాబును విచారించలేదన్నారు. దీన్నిబట్టే కమిషన్ నివేదిక ఏవిధంగా ఉంటుందో చెప్పవచ్చని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 30మంది మరణిస్తే, కృష్ణా పుష్కరాల ప్రారంభానికి ముందే 30 గుళ్లను కూల్చేశారని పార్ధసారధి మండిపడ్డారు. ఇక పుష్కరాల పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే పుష్కర పనుల్లో జాప్యం చేసి, నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్‌లు ఇవ్వడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. పుష్కర నిధులపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాల దుర్ఘటన జరిగి నేటికి ఏడాది అయింది. godavari pushkaralu stamped, Justice Cy Somayajulu committee,chandrababu naidu, గోదావరి పుష్కరాల తొక్కిసలాట, జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్, చంద్రబాబు నాయుడు -
పుష్కర తొక్కిసలాటపై నేడు బహిరంగ విచారణ
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాల పరిశీలన ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు నెలాఖరుతో ముగియనున్న కమిషన్ కడువు రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది జూలై 14వ తేదీన జరిగిన తొక్కిసలాటపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీవై సోమయాజులు ఏక సభ్య కమిషన్ మంగళవారం మరోసారి బహిరంగ విచారణ చేపట్టనుంది. పుష్కర తొక్కిసలాటలో 29 మృతి చెందగా 52 మంది వరకూ గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ గడువు గత మార్చి 29తో ముగియగా మరో మూడు నెలలు గడువు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెల 29తో ముగిసిపోతోంది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని ఈ విషయంలో విచారించలేదు. ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ను విచారించాలని ఆఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. అయితే ఆధారాలు చూపిస్తే విచారించేందుకు అవకాశం ఉందో? లేదో ? పరిశీలిస్తామని గతంలో జస్టిస్ సోమయజులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో మంగళవారం న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సమర్పించిన వీడియో క్లిపింగ్‌లు, ఇతర ఆధారాలను రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోమయాజులు పరిశీలిస్తారు. ఈ ఆధారాలను ఆయన పరిశీలించిన తరువాతైనా ఈ కేసులో రెండు రకాలుగా నివేదికలు ఇచ్చిన కలెక్టర్‌ను విచారిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. -
గోదావరి పుష్కర దుర్ఘటనపై న్యాయవిచారణకు కమిటీ
గోదావరి పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాట జరిగి, 25 మంది మరణించిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. విచారణకు ఆరు నెలల గడువు విధించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది. పుష్కరాల మొదటి రోజున సీఎం చంద్రబాబు పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేయడం, ఆరోజు చాలామంది భక్తులు వేచి చూడాల్సి వచ్చి.. చివరకు అందరినీ ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 25 మంది మరణించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా ఎంతోమంది ఆరోజు గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించింది.