
గోదావరి పుష్కర దుర్ఘటనపై న్యాయవిచారణకు కమిటీ
గోదావరి పుష్కరాల తొలిరోజునే తొక్కిసలాట జరిగి, 25 మంది మరణించిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. విచారణకు ఆరు నెలల గడువు విధించింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఈ కమిటీని ప్రభుత్వం నియమించింది.
పుష్కరాల మొదటి రోజున సీఎం చంద్రబాబు పుష్కరఘాట్లో పుణ్యస్నానం చేయడం, ఆరోజు చాలామంది భక్తులు వేచి చూడాల్సి వచ్చి.. చివరకు అందరినీ ఒకేసారి వదలడంతో తొక్కిసలాట జరిగి 25 మంది మరణించడం లాంటి ఘటనలు జరిగాయి. ఇంకా ఎంతోమంది ఆరోజు గాయపడ్డారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించింది.