హైదరాబాద్ : గోదావరి పుష్కర దుర్ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి 30మంది బలయ్యారన్నారు. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన సోమయాజులు కమిటీ ఇప్పటివరకూ చంద్రబాబును విచారించలేదన్నారు.
దీన్నిబట్టే కమిషన్ నివేదిక ఏవిధంగా ఉంటుందో చెప్పవచ్చని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 30మంది మరణిస్తే, కృష్ణా పుష్కరాల ప్రారంభానికి ముందే 30 గుళ్లను కూల్చేశారని పార్ధసారధి మండిపడ్డారు. ఇక పుష్కరాల పేరుతో అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగానే పుష్కర పనుల్లో జాప్యం చేసి, నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్ట్లు ఇవ్వడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు. పుష్కర నిధులపై విజిలెన్స్ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాల దుర్ఘటన జరిగి నేటికి ఏడాది అయింది.
godavari pushkaralu stamped, Justice Cy Somayajulu committee,chandrababu naidu, గోదావరి పుష్కరాల తొక్కిసలాట, జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్, చంద్రబాబు నాయుడు