K Krithivasan
-
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్‌లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్‌లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
టీసీఎస్ కొత్త సీఈవో ట్రాక్ రికార్డ్, జీతం ఎలా ఉన్నాయంటే?
సాక్షి, ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో కంపెనీ వెటరన్ కె. కృతివాసన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.సంస్థ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్‌గా ఉన్న కృతివాసన్ కొత్త సీఈవోగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. (గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు) చెన్నై నుంచి ముంబైక షిప్ట్ అవ్వడమే పెద్ద చాలెంజ్ టీసీఎస్ సీఈవోగా కంటే, చెన్నై వదిలి ముంబైకి మారడమే పెద్ద సవాల్ అని సీఈవోగా ఎంపికైన తరువాత తొలిసారి నిర్వహించిన శుక్రవారం నాటి మీడియా మీట్లో కృతివాసన్ చమత్కరించారు. మార్కెట్లో వచ్చే ప్రతి సవాల్ ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. టాప్ఇండియన్ ఐటీ కంపెనీల సహచరులతో పోలిస్తే చాలా ఆలస్యంగా 58 ఏళ్లకు కీలక పదవికి ఎంపికయ్యారు అనేది నిపుణుల మాట. కాగా కీలక సమయంలో గత ఆరేళ్లుగా కంపెనీకి సీఎండీగా ఉన్న గోపీనాథన్, కంపెనీ చరిత్రలోనే తొలిసారి నాలుగేళ్ల ముందే కంపెనీని వీడారు. అయితే కృతివాసన్‌కు బాధ్యతల అప్పగింతల్లో భాగంగా గోపీనాథన్ సెప్టెంబర్ 15 దాకా కంపెనీలో కొనసాగుతారు. తాజాగా కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అయితే కొత్త సీఈవో కృతివాసన్ సీఈవో, చదువు తదితర అంశాలపై భారీ ఆసక్తి నెలకొంది. అత్యధిక వేతనం పొందుతున్న ఐటీ దిగ్గజాల సీఈవోల జాబితాలో గోపీనాథన్ ఐదో స్థానంలో ఉన్నారు. 2021-22 లో రూ. 25.75 కోట్లగా ఉన్న జీవితం 2023-23లో 26.6 శాతం పెరిగింది. దీంతో కృతివాసన్ ఎంత వేతనం పొందనున్నారనేది హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఎవరీ కృతివాసన్ చెన్నైకి చెందిన కృతివాసన్ 1989లో టీసీఎస్‌లో చేరారు. 34 సంవత్సరాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. హంబుల్‌గా, ప్రేమగా ఉండే కృతివాసన్‌కి అంతర్గతంగా మంచి గుర్తింపు ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుండి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. టీసీఎస్‌లో కీర్తివాసన్ డెలివరీ, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ మరియు సేల్స్‌లో వివిధ బాధ్యతలు, ఇతర రోల్స్ నిర్వహించారు. అలాగే టీసీఎస్ Iberoamerica , ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడుగాను, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు. సభ్యుడుగాను ఉన్నారు. కృతివాసన్ శాలరీ అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగులలో ఒకరైన కె. కృతివాసన్ 2018-19లో రూ. 4.3 కోట్ల జీతం తీసుకున్నారు. తాజా పదోన్నతితో ఎంత ప్యాకేజీ, ఇతర ప్రయోజనలు లభించనున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు.