kakinada SEZ
-
పారిశ్రామిక వెలుగులు
-
కాకినాడ సెజ్‌కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్ఈజడ్లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్‌తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది. మరోవైపు.. కేజీపీఎల్కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్‌వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్లలో ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ఈ రైల్వేలైన్ కేఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్‌్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. -
సాగర తీరానికి ‘భారత్‌మాల’
పచ్చని చెట్లు ..తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీరం ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామికంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. జాతీయ రహదారి నిర్మాణం కాకినాడ–తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన పారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి.. ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు ఇప్పటికే అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా మన జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్ని కృష్ణ, ఆర్డీఓ కాకినాడ చదవండి: ప్రేమను గెలిపించిన పిడకల సమరం పిల్లకు పాలు.. తల్లికి కూల్ డ్రింక్ -
యనమలకి చిన్న మెదడు చితికినట్లుంది
సాక్షి, అమరావతి: రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీలను ముఖ్యమంత్రికి ముడిపెట్టిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి చిన్న మెదడు చితికినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్, అరబిందో కంపెనీల మధ్య షేర్ల విక్రయాన్ని రాజకీయం చేస్తూ యనమల చేసిన ప్రకటనపై కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అరబిందో కంపెనీ రైతుల నుంచి భూములను లాక్కోలేదు. జీఎంఆర్ నుంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ రైతుల నుంచి భూములను తీసుకున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది. మరి అప్పుడు మీరేం చేశారు? మీ హయాంలోనే ఇదంతా జరిగింది’ అని పేర్కొన్నారు. కాకినాడలో సెజ్‌కు శ్రీకారం చుట్టి ఇవాళ నీతులు వల్లించడం యనమలకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. (లక్షన్నర మందికి 3 లక్షల ఎకరాలు) ►కంపెనీలు తమ వాటాలను విక్రయించడం అతి సహజం. ఒకవేళ అదే తప్పయితే హెరిటేజ్ కంపెనీ షేర్లను ఫ్యూచర్ గ్రూపునకు ఎందుకు అమ్మారు? ►కాకినాడ సెజ్ వ్యవహారంలో జీఎంఆర్‌కే లాభం చేకూర్చాలనుకుంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన ఎంతో విలువైన కమర్షియల్ భూముల్లో వేల కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఎందుకు వెనక్కుతీసుకుంటారు? మీకు ఆమాత్రం తెలియదా? ►మ్యాట్రిక్స్ ప్రసాద్ మీ పార్టీ వారితో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే మంచి పారిశ్రామికవేత్తా? అదే ప్రసాద్ సాక్షిలోనో, మీకు నచ్చని మరోచోటో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే చెడ్డ పారిశ్రామికవేత్తగా చిత్రీకరిస్తారా? ►సీఎం జగన్ పాదయాత్ర సమయంలో కాకినాడ వచ్చినప్పుడు సెజ్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆ దిశగా మేం కృషి చేస్తుంటే మేమేదో కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలా? ►మీ హయాంలో 600 ఎకరాల్లో దివీస్ హేచరీస్ ఏర్పాటు యత్నాలపై ప్రజలు తిరగబడ్డ విషయాన్ని మరిచారా? ►చంద్రబాబు హయాంలో దేశవ్యాప్తంగా 82 ప్రభుత్వ ఆస్తులను అమ్మితేఅందులో 52 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని మరచిపోవొద్దు. కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్‌ను విక్రయించిన ఘనత మీదే. -
అరబిందో చేతికి కాకినాడ సెజ్
సాక్షి, అమరావతి: జీఎంఆర్ కాకినాడ సెజ్‌లో మెజార్టీ వాటాను అరబిందో గ్రూపు కొనుగోలు చేసింది. కాకినాడ సెజ్ (కేసెజ్) లిమిటెడ్‌లోని 51 శాతం వాటాను అరబిందో గ్రూపునకు చెందిన అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. కేసెజ్ అనుబంధ కంపెనీ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం వాటాను అరబిందో రియల్టీకి బదలాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఈ 51 శాతం వాటాను అప్పులతో కలిపి రూ.2,610 కోట్లకు విక్రయిస్తున్నామని, ఇందులో మొదటి విడతగా రూ.1,600 కోట్లు చెల్లించే విధంగాను మిగిలిన మొత్తం రూ.1,010 కోట్లు రెండు మూడేళ్లలో చెల్లించే విధంగా ఒప్పం కుదుర్చుకుంది. ఇంకా ఈ విక్రయానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది. అప్పుల భారం తగ్గించుకోవడంలో భాగంగా వాటా విక్రయించినట్లు జీఎంఆర్ గ్రూపు పేర్కొంది. మార్చి 2020 నాటికి జీఎంఆర్ గ్రూపునకు మొత్తం నికర అప్పులు రూ.26,300 కోట్లుగా ఉన్నాయి. సుమారు 10,400 ఎకరాల్లో జీఎంఆర్ మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో 5,000 ఎకరాలు పోర్టు ఆథారిత సెజ్‌గా అనుమతులు తీసుకుంది. దీనికి తోడు కోన గ్రామం వద్ద వాణిజ్య అవసరాల కోసం ఓడ రేవును కూడా నిర్మిస్తోంది. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా 2019లో అరబిందో రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు వాణిజ్య, నివాస సముదాయాలు నిర్మిస్తున్న అరబిందో రియల్టీ సంస్థ ఇప్పుడు కేసెజ్‌లో మెజార్టీ వాటాను దక్కించుకుంది. ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో జీఎంఆర్ గ్రూపు షేరు క్రితం ముగింపు ధరతో పోలిస్తే 14.18 శాతం పెరిగి రూ.24.15 చేరుకొని చివరకు 11.11 శాతం వృద్ధితో రూ.23.50 వద్ద ముగిసింది. -
అరబిందో రియల్టీ చేతికి జీఎంఆర్ కాకినాడ సెజ్
ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరిలో గల కాకినాడ సెజ్ లిమిటెడ్(కేఎస్ఈజెడ్)ను అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల్డింగ్ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువ రూ. 2,610 కోట్లుకాగా.. తొలి దశలో రూ. 1,600 కోట్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండు, మూడేళ్లలో రూ. 1,010 కోట్లు లభించనున్నట్లు వివరించింది. డీల్‌లో భాగంగా కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌లో కేఎస్ఈజెడ్కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వివరించింది. షేరు జూమ్ కేఎస్ఈజెడ్ విక్రయానికి అరబిందో రియల్టీతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో జీఎంఆర్ ఇన్ఫ్రా కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.25 వద్ద ఫ్రీజయ్యింది. పోర్ట్ ఆధారిత మల్టీ ప్రొడక్ట్ ప్రత్యేక ఆర్థిక మండలిగా కేఎస్ఈజెడ్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
మా భూములు మాకిచ్చేయండయ్యా
సాక్షి, కొత్తపల్లి : ‘అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాం.. మా భూములు మాకిచ్చేయండి’.. అంటూ రైతులు పోలీసుల కాళ్ల మీద పడ్డా ఖాకీల హృదయం కరగలేదు.. బాధిత రైతులతో పాటు వారికి మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతుల పోరాటాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెజ్ బాధిత రైతులు వారం కిందట సమావేశమై సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు చింతా సూర్యనారాయణమూర్తి పొలంలో నాట్లు వేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆదివారం సూర్యనారాయణమూర్తితో కలిసి మూలపేట నుంచి కొత్తమూలపేటకు బయలుదేరారు. సెజ్ ప్రాంతాల్లో అప్పటికే మోహరించిన సుమారు 500 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు వారిని అడ్డుకున్నాయి. అలాగే పొన్నాడ శివారు రావివారుపోడు, రమణక్కపేటకు చెందిన సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు బావిశెట్టి నారాయణస్వామి, పెనుమల్లు సుబ్బిరెడ్డి తదితరులతో పాటు సీపీఎం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ నరసింహం, సీపీఎం జిల్లా కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, సీపీఎం నేత కూరాకుల సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేసి అన్నవరం, పిఠాపురం, కొత్తపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా తమ భూములు తమకిచ్చేయాలంటూ ఓ రైతు పోలీసు కాళ్లపై పడ్డాడు. 1983 భూసేకరణ చట్ట ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తమకు పరిహారం ఇవ్వాలని వారు వేడుకున్నారు. అనంతరం మొత్తం 147 మందిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సెజ్ ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. రైతులకు మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ నేత దొరబాబును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండ సెజ్ రైతులకు మద్దతు తెలిపేందుకు పిఠాపురం నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ పిఠాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు, వైఎస్సార్ సీపీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌తో పాటు పలువురిని నాగులాపల్లిలో అరెస్ట్ చేసి తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తమ భూముల కోసం పోరాడుతున్న రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా రైతులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్‌లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఖండించారు. -
మరో స్విస్ చాలెంజ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని న్యాయస్థానం తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో స్విస్ చాలెంజ్ విధానానికి సిద్ధపడుతోంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటు చేయనున్న వాణిజ్య పోర్టు కోసం స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ వాణిజ్య పోర్టు ఏర్పాటు కోసం స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జీఎంఆర్ సంస్థ సమర్పించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో జీఎంఆర్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మౌలిక సదుపాయాలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఒకవేళ స్విస్ చాలెంజ్‌లో జీఎంఆర్ ఎంపిక కాకపోయినప్పటికీ సదరు సంస్థకే భూమి లీజు వసూలు అధికారం కట్టబెట్టాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. పోర్టును మారుస్తూ... వాస్తవానికి మొదట్లో ఇక్కడ కేవలం క్యాప్టివ్ పోర్టు.. అంటే సొంత అవసరాలకు (సెజ్‌లోని కంపెనీల అవసరాల కోసం) మాత్రమే పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకినాడ సెజ్‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం వద్ద ఈ పోర్టు ఏర్పాటు కానుంది. ఇక్కడ వాణిజ్య పోర్టును నిర్మించుకుంటామనే ప్రతిపాదనను జీఎంఆర్ సంస్థ తెరమీదకు తెచ్చింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే అదనుగా స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేసేందుకు వీలుగా జీఎంఆర్ ముందుగానే ప్రతిపాదనలను కూడా సమర్పించింది. జీఎంఆర్ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం స్వీకరించి... స్విస్ చాలెంజ్ విధానానికి తెరలేపింది. ఈ పోర్టు ఏర్పాటు కోసం ఎంపికైన కంపెనీతో 30 సంవత్సరాలపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి రెండు విడతలుగా. ఒక్కో విడతలో పదేళ్లపాటు ఒప్పందాన్ని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అంటే మొత్తం 50 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉంటుందన్నమాట. బిడ్డింగ్‌లో నెగ్గకపోయినా! జీఎంఆర్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా స్విస్ చాలెంజ్ విధానంలో కంపెనీలను బిడ్డింగ్‌ను పిలవనున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో జీఎంఆర్ ఎంపిక కాకపోయినప్పటికీ పోర్టుకు ఇచ్చే భూములకు లీజు వసూలు చేసుకునే అధికారాన్ని మాత్రం ఆ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాకినాడ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొత్తం వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కాకినాడ సెజ్‌కు లోకేశ్ గిఫ్ట్
అమరావతి: కాకినాడ సెజ్‌కు అసాధారణ, ప్రత్యేక అధికారాలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు కల్పించిన అధికారాలను కాకినాడ సెజ్ భూములున్న ప్రాంతంలో రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. సెజ్ భూములున్న గ్రామాలలో పంచాయతీల తీర్మానం అవసరం లేకుండా సెజ్‌లో ఎలాంటి పరిశ్రమలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలపై ఆయా గ్రామ పంచాయతీలు ఎలాంటి స్థానిక పన్నులూ వసూలు చేసుకునే వెసులుబాటు ఉండదు. నారా లోకేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించి ఫైలు వేగంగా కదులుతోంది. తొమ్మిదిలో 5 గ్రామాలు వ్యతిరేకించినా.. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి, పొండంగి మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల పరిధిలో 8,672 ఎకరాలలో సెజ్ ఏర్పాటైంది. సెజ్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఉండే అధికారాలను రద్దు చేయాలంటూ గత ఏడాది ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై సంబంధిత తొమ్మిది గ్రామ పంచాయతీల అభిప్రాయం తెలియజేయాలంటూ 2016 సెప్టెంబరు 20వ తేదీన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించింది. సెజ్ భూములపై గ్రామ పంచాయతీల అధికారాల రద్దు అంశంపై తొమ్మిది గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టగా ఐదు గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోగా, నాలుగు పంచాయతీలు అనుకూలంగా తీర్మానం చేశాయి. యు. కొత్తపల్లి మండలం శ్రీరాంపేట, రమణక్కపేట, పొన్నాడ, కొత్తమూలపేట, కొమరగిరి గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించగా.. యు. కొత్తపల్లి మండలం మూలపేట, పొండంగి మండలం ఏవీ నగరం, కేవీ పెరమాళ్లపురం, కోదాడ గ్రామ పంచాయతీలు అను కూలంగా తీర్మానాలను ఆమోదించాయి. గ్రామ పంచాయతీల తీర్మానాలను జత చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి డిసెంబరు 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. అయితే, గ్రామ పంచాయతీలు వ్యతిరేకించినా సెజ్ భూములపై పంచాయతీల అధికారాలను రద్దు చేసి, సెజ్‌కు విశేషాధికారాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. లోకేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధమైంది. లోకేశ్ ఈ ఫైలుపై సంతకం చేయడమే ఇక మిగిలింది. కాకినాడ సెజ్ ఒక్కటే స్పెషల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందకు పైగా సెజ్‌లు ఏర్పాటయ్యాయి. ఏ సెజ్‌కూ ఇలాంటి ప్రత్యేకాధికారాలు కల్పించలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలన్నా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఆ భవనం నుంచి ప్రతి ఏటా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు కల్పించబడిన ఇలాంటి ప్రత్యేకాధికారాలను కాకినాడ సెజ్ కోసం రద్దు చేయడంపై అధికారవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. -
కాకినాడ సెజ్‌లో చైనా కంపెనీల భారీ పెట్టుబడులు
రూ. 3,000 కోట్లతో జీఐఐసీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు * జీఐఐసీతో జీఎంఆర్ ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన విద్యుత్ ఉపకరణాలు తయారు చేసే గిజూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్(జీఐఐసీ), జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన మూడు తయారీ రంగ సంస్థలు జీఐఐసీ పేరుతో కన్సార్టియంగా ఏర్పడి 2,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తొలుత జీఐఐసీ రూ. 3,000 కోట్లతో (500 మిలియన్ డాలర్లు) విద్యుత్, ఎలక్ట్రానిక్స్, సోలార్, పవన విద్యుత్ తయారీకి చెందిన ఉపకరణాలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేయనుంది. చైనా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కాకినాడసెజ్ ప్రెసిడెంట్ చల్లా ప్రశన్న, జీఐఐసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. వచ్చే ఐదేళ్ళలో ఈ పారిశ్రామిక వాడ సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను (3.5 బిలియన్ డాలర్లు) ఆకర్షించడమే కాకుండా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి కల్పించగలదని జీఎంఆర్ ఇన్ఫ్రా బిజినెస్ చైర్మన్ బి.బి. ఎన్ రావు తెలిపారు. జీఎంఆర్ ఇన్ఫ్రా కాకినాడ సమీపంలో 10,500 ఎకరాల్లో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
కాకినాడ సెజ్‌లో తొలి వాణిజ్య కేంద్రం షురూ
టాటా-జీఎంఆర్ భాగస్వామ్యంలో రూరల్ బీపీఓ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ సెజ్‌లో తొలి కమర్షియల్ సెంటర్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలో జీఎంఆర్, దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఈ ఐటీ ఆధారిత సెంటర్లో ఆధార్‌కార్డుల తయారీ పనులు జరగనున్నాయి. జీఎంఆర్ ప్రెసిడెంట్ ప్రసన్న చల్లా, టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనివాస్ కొప్పోలు సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. రూరల్ బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్)లో కాకినాడ సెజ్ నిర్వాసిత కుటుంబాలకు చెందిన శిక్షణ ఇచ్చిన 20 మంది యువకులకు చల్లా, కొప్పోలు ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ మెట్రో, టైర్-2 నగరాల్లో బలీయంగా ఉన్న బీపీఓ పరిశ్రమను, ప్రతిభావంతమైన మానవ వనరులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావాలనేదే లక్ష్యమన్నారు. టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ యువత నగర యువత కంటే ఎంత మాత్రం తక్కువ కాదనే విషయాన్ని నిరూపించిందన్నారు. కాకినాడ సెజ్‌లో మొదటి దశ పనులు ప్రారంభించామని, దీనిలో భాగంగా మెరైన్ ఫుడ్స్ ప్రాసెసింగ్, బొమ్మల పరిశ్రమలు వచ్చే మూడు, ఆరు నెలల్లో రానున్నాయని ప్రసన్న చెప్పారు. ఏడాదిలో ఈ పరిశ్రమల ద్వారా రెండువేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీబీఎస్ఎస్ఎల్ ఎండీ శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ బీపీఓ వచ్చే రెండేళ్లలో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్త్తుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి బీపీఓ కార్యకలాపాలు నిర్వహిస్త్తుందన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ పోతుకూచి, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ డెరైక్టర్ మీరా రఘునాథన్, కాకినాడ సెజ్ ప్రాజెక్టు హెడ్ బీహెచ్ఏ రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ సెజ్‌లో రూ.40 వేల కోట్లతో రిఫైనరీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్)లో భారీ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. తునికి సమీపాన సముద్రతీరంలో రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల భారీ పెట్టుబడితో దీని ఏర్పాటుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ముందుకు వచ్చింది. తూర్పు తీరంలో పారిశ్రామిక ప్రగతితో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయనే ముందుచూపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోర్టు ఆధారిత ఎస్ఈజెడ్ ప్రతిపాదనకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2005లో ఆమోదింపజేశారు. భూ సేకరణ కొలిక్కి వస్తున్న సమయంలో ఆయన హఠాన్మరణం చెందారు. దాంతో కేఎస్ఈజెడ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. అప్పట్లో దేశవ్యాప్తంగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లిన 67 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో 36 మండళ్లకు ఆమోదం లభించగా అందులో పోర్టు ఆధారితమైనది కాకినాడ ఎస్ఈజెడ్ ఒక్కటే. ఎట్టకేలకు కేఎస్‌ఈజెడ్‌లో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక ప్రతినిధి బృందం ఇటీవల అక్కడి భూములను పరిశీలించింది. ఈ సెజ్‌లో జీఎంఆర్ పోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, పోర్టుకు ప్రతిపాదిత రిఫైనరీకి ఎంత దూరం ఉంటుంది, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ తదితర విషయాలన్నింటినీ ఆ బృందం పరిశీలించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఆయిల్ రిఫైనరీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శర్మ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు జనరల్ మేనేజర్లు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఈ బృందం తొలుత విశాఖ జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పరిశీలించింది. నక్కపల్లి కంటే అనువైన భూములు ఉండడం, తొండంగి సమీపాన జీఎంఆర్ పోర్టు అందుబాటులోకి రానుండటంతో భారీ యంత్ర పరికరాల దిగుమతికి, తక్కువ ఖర్చుతో విదేశాలకు చమురు, సహజవాయువు ఎగుమతికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ బృందం కాకినాడ సెజ్ వైపే మొగ్గు చూపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాలను పరిశీలించిన బృందం తొండంగి మండలం పెరుమాళ్లపురం-చోడిపల్లిపేట మధ్య తలపంటిపేటలో సుమారు 5,300 ఎకరాల్లో రిఫైనరీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తొలి దశలో ఏడాదికి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రిఫైనరీలో ముడిచమురు శుద్ధి అయ్యాక డీజిల్, పెట్రోలు, ఆయిల్, గ్రీజ్ వంటి ఉప ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కూడా కాకినాడతీరం కేంద్రం కానుంది.