‘కాకతీయ’కు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ, న్యూస్‌లైన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా అధికారులు ఆదివారం నీటి విడుదలను నిలిపి వేశారు. ఆయకట్టుకు నీటి అవసరం లేకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 రోజులు నీటి విడుదల నిలిపివేత, 9 రోజులు విడుదల కొనసాగించేల అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 550 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. కాలువల ద్వారా నీటి విడుదల నిలిచి పోవడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.70 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
నిలిచిన విద్యుదుత్పత్తి..
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.24 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు.
నిలకడగా రామడుగు ప్రాజెక్ట్ నీటిమట్టం
ధర్పల్లి : మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ నీటి మట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1278.50 అడుగుల వద్ద ఉంది. ఎగువ ప్రాంతం నుంచి స్వల్పంగా 100 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.
కుడి కాలువ ద్వారా 100 క్యూసెక్కుల సాగునీటిని వదులుతున్నారు. దీనికింద వాడి, చెంగల్, పచ్చల నడ్కుడ చెరువుల్లోకి నీటిని నింపుతున్నారు. ఎడుమ కాలువ ద్వారా కలిగోట్ గ్రామ చెరువును నింపుతున్నారు. 20 క్యూసెక్కూల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద చెరువులను నింపేందుకు కుడి, ఎడుమ కాలువల ద్వారా నీటిని వదులుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ దేవేందర్ తెలిపారు.