'విప్లవోద్యమానికి తొలి గొంతుక చలసాని'
పలాస (శ్రీకాకుళం): విప్లవోద్యమానికి తొలిగొంతుకగా చలసాని ప్రసాద్‌ను విరసం నాయకుడు జి.కల్యాణరావు అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో సోమవారం జరిగిన చలసాని సంస్మరణ సభలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. బొడ్డపాడులో పుట్టిన విప్లవ పార్టీ శ్రీకాకుళ సాయుధ పోరాటమై దేశమంతా పాకిందని చెప్పారు.
నాటి తెలంగాణా పోరాటం నుంచి నేటి మావోయిస్టుల పోరాటం వరకు అన్నింటా చలసానికి భాగస్వామ్యం ఉందని, ఆయన అడుగుజాడల్లో నడవమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖరరావు, పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకురాలు పైల చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.