karate raju
-
అప్పుడే నేను మళ్లీ పుట్టాను.. విశ్వక్ డైరెక్షన్ మానేయాలి: తారక్
‘‘సినిమా పట్ల విశ్వక్ సేన్‌కి ఎంతో పిచ్చి ఉంది. ఆ పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటివాళ్లను ప్రోత్సహిస్తేనే పరిశ్రమ ఇంకా ముందుకెళుతుంది. ‘దాస్ కా ధమ్కీ’ హిట్ అవ్వాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఒకే చట్రంలో ఇరుక్కుపోతున్నానని చాలా కాలం తర్వాత రియలైజ్ అయిన నేను, మీరు (అభిమానులు) కాలర్ ఎత్తుకునే సినిమాలు చేస్తానని మాట ఇచ్చాను.. ఆ మాట అన్నప్పుడే నటుడిగా నేను మళ్లీ పుట్టాను. వైవిధ్యమైన నటన కోసం నేను తాపత్రయపడుతున్నాను కాబట్టే మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తున్నానని అనుకుంటున్నాను. విశ్వక్ కూడా ఒకే తరహా పాత్రల నుంచి బయటికొచ్చి, కొత్తగా చేస్తున్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆ తర్వాత తను దర్శకత్వం మానేయాలి. ఎందుకంటే కొత్త యువ దర్శకులకు నీలాంటి వాళ్లు అవకాశాలు ఇవ్వాలి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ చిత్ర పటంలో ఆల్‌టైమ్ టాప్‌లో ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఈ రోజు ప్రపంచ చిత్రపటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుందంటే దానికి మా యూనిట్‌తో పాటు యావత్ తెలుగు, భారతదేశ చిత్రపరిశ్రమ, ప్రేక్షక దేవుళ్లు కూడా కారణం. కీరవాణి, చంద్రబోస్‌గార్లు ఆస్కార్ అవార్డు తీసుకుంటున్నప్పుడు నాకు వాళ్లు కనిపించలేదు.. ఇద్దరు భారతీయులు కనిపించారు.. ఇద్దరు తెలుగువాళ్లు కనిపించారు’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఎన్టీఆర్ అన్న అని నేను ఎప్పుడో చెప్పాను. నా సినిమాని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ వచ్చాడు. ఆయన రాకతో నా సినిమా బ్లాక్‌బస్టర్ స్టార్ట్ అయిపోయినట్లే’’అన్నారు. ‘‘ఫలక్‌నుమా దాస్’ తీసినప్పుడు మా అబ్బాయి విశ్వక్ ఎవరికీ తెలియదు. ఎంతో పబ్లిసిటీ చేసి, సినిమా విడుదలకి ముందే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ కోసం 15 నెలలు కష్టపడ్డాడు’’ అన్నారు కరాటే రాజు. -
ఏడు రోజులు.. ఏడు కోట్లు
విశ్వక్సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. వాంగ్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటేరాజు సమర్పణలో విశ్వక్సేన్ సినిమాస్, టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 31న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో కరాటేరాజు మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్‌వర్క్ చేసి, ఎంతో కష్టపడి విశ్వక్ సేన్ ‘ఫలక్‌నుమా దాస్’ చేశాడు.. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. మా సినిమా 7 రోజుల్లో 7 కోట్ల 50 లక్షలు వసూలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అనడంతో రీ ఎడిటింగ్ చేశాం. భారీ క్యాస్టింగ్‌తో ‘ఫలక్‌నుమా దాస్ 2’తో ప్రేక్షకుల ముందుకు వస్తాం’’ అన్నారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ ‘ఫలక్‌నుమా దాస్’తో ధమ్కీ ఇచ్చా.. నా తర్వాతి సినిమాతో షాక్ ఇస్తా’’ అన్నారు. ‘‘శివ, చందమామ’ సినిమాల్లో నా పాత్రలకు ఎంత పేరొచ్చిందో, వాటి తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’లో చేసిన పాత్రకూ అంతే పేరొచ్చింది’’ అన్నారు నటుడు ఉత్తేజ్. సహనిర్మాత: మాణిక్యరావు, హీరోయిన్ ప్రశాంతి, నటులు జీవన్, యశ్వంత్, సంజయ్, టోనీ, కౌశిక్, కార్తిక్, వివేక్ పాల్గొన్నారు. -
‘త్వరలో సీక్వెల్‌తో షాక్ ఇస్తాం’
వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రమర పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. మాస్ కా దాస్ టాగ్ లైన్‌తో విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ... ‘హైదరాబాద్ లోని 118 లొకేషన్స్‌లో తీసిన ఈ సినిమా అందరి మన్ననలు పొందుతూ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. దాదాపు రెండు సంవత్సరాలుగా స్క్రిప్ట్ వర్క్ చేసి ఎంతో కష్టపడి విశ్వక్ ఈ ప్రాజెక్ట్‌ను చేసాడు. ఆ కష్టం ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చింది. 7 రోజుల్లో 7కోట్ల 50 లక్షలు వసూలు చేసింది అని చెప్పడానికి సంతోష పడుతున్నా. ఇంత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ చిత్రంలో సెకండ్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువైందని అంటున్నారు. అందుకే కొత్తగా ఎడిటింగ్ చేసాము. ఆ ల్యాగ్‌ను తీసేసి సరికొత్తగా ప్రెసెంట్ చేస్తున్నాము. రేపటి నుంచి ఇది అమలు అవుతుంది. 50 థియేటర్స్‌తో పాటు మల్టిప్లెక్స్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇక మా నెక్స్ట్ చిత్రం ఫలక్‌నుమా దాస్ 2 భారీ క్యాస్టింగ్ తో మరోసారి మీ ముందుకు వస్తా’మని తెలిపారు. నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘శివ సినిమాలో యాదగిరి, చందమామ సినిమాలో పాత్రల తరువాత అంత మంచి పేరు మళ్లీ ఈ ఫలక్‌నుమా దాస్‌లో చేసిన పాత్రకు వచ్చింది. మలయాళంలో వచ్చిన ‘అంగమాలై’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే.. ఎక్కడా రీమేక్ అనే విషయం గుర్తుకు రాదు. జస్ట్ ఆ చిత్రాన్ని ఇన్సిపిరేషన్గానే తీసుకొని ఎంతో క్లారిటీతో పక్కాగా సినిమాను తెరకెక్కించి నటించాడు విశ్వక్ సేన్. అతను పడిన కష్టం ఫలించి ఇంత పెద్ద రిజల్ట్‌ను ఇచ్చింది. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అన్నారు. హీరో మరియు ఈ చిత్ర దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎన్నో జరిగాయి కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సినిమా అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇకపై కూడా అవుతూనే ఉంటుంది. నా టీమ్ కో ఆపరేషన్, కష్టం లేకపోతే సినిమా సక్సెస్ టాక్ వచ్చేది కాదు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ ఫలక్‌నుమా దాస్‌తో ధమ్కీ ఇచ్చా. నా నెక్స్ట్ సినిమాతో షాక్ ఇస్తా’ అన్నారు. -
దానికి వెరీ వెరీ సారీ
‘‘ఐదు కోట్లు ఖర్చు పెట్టుకుని నేను ఓ కమర్షియల్ సినిమా చేసుకోవచ్చు. కానీ, చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కు నా సినిమా ఒక మంచి లాంచింగ్ ప్యాడ్లా ఉండాలని 80 మంది కొత్తవాళ్లను పెట్టి, రెండేళ్లు కష్టపడి ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా తీశాం. మా సినిమాపై నెగటివిటీని ప్రచారం చేయడానికి ఓ గ్రూప్ తయారైంది’’ అన్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. డి.సురేశ్‌బాబు సమర్పణలో కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. తన సోషల్ మీడియా అకౌంట్లో విశ్వక్ సేన్ పోస్ట్ చేసిన వీడియోపై, విజయవాడ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలపై దుమారం రేగింది. దీనిపై విశ్వక్ సేన్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నేను ఏ రివ్యూ రైటర్ని కానీ మీడియాను కానీ ఏ హీరోనీ కూడా ఏమీ అనలేదు. కానీ కొందరు పని గట్టుకుని మా సినిమాపై నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టి వేసిన పోస్టర్స్‌ను కొందరు చించేయడం బాధ అనిపించింది నేను డబ్బులు ఎక్కువై సినిమా చేయలేదు. అందరి డబ్బూ తిరిగి ఇవ్వాలనే బాధ్యత నాకుంది. ఎవరినో ఏదో అనేసి పబ్లిసిటీ తెచ్చుకుందామనే చీప్ మెంటాలిటీ నాకు లేదు. నా సినిమాకు పదికోట్లు నష్టం వస్తుందని తెలిసినప్పుడు కంట్రోల్ తప్పి, ఒక మాట అన్నాను. దానికి వెరీ వెరీ సారీ! విజయవాడలో నేను మాట్లాడిన ఫుల్ వీడియో చూపకుండా, కట్ చేసి చూపిస్తున్నారు. అసలు నేను ప్రేక్షకులను ఎందుకు తిడతాను? ఆదివారం సెకండ్ షో కాకుండా 4.80 కోట్ల రూపాయల గ్రాస్‌ను మా సినిమా కలెక్ట్ చేసింది. ఈ వీక్‌లో విడుదలైన సినిమాలన్నింటిలో మాదే హయ్యస్ట్ గ్రాసర్. నేను ఎవరినీ హర్ట్ చేయలేదు.. ఎవరికీ సవాల్ విసరలేదు. ఎవరి ఫ్యాన్స్‌నూ ఏమీ అనలేదు. నాకు అన్నం పెట్టేదే సినిమా. అలాంటిది రివ్యూ రైటర్స్‌ను నేను ఎందుకు విమర్శిస్తాను. నిజంగా నేను వాళ్లని అన్నట్లు నిరూపిస్తే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. రేటింగ్స్‌ని పక్కన పెడితే మా సినిమాను ప్రేక్షకులు బతికిస్తున్నారు’’ అన్నారు. -
తెలుగు సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోతోంది
‘‘ఫలక్‌నుమా దాస్’ సినిమా మొదలైన పది నిమిషాల వరకు ఇదేం సినిమా? అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రేక్షకులు సినిమా మూడ్ లోకి వెళ్తారు. అంతగా కనెక్ట్ చేసేస్తుంది’’ అని హీరో నాని అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం, నా ‘వాల్‌పోస్టర్’ ప్రొడక్షన్ బేనర్లో నెక్ట్స్ విశ్వక్ సేన్ చేయబోతుండటం, ‘ఫలక్‌నుమాదాస్’ సినిమా నాకు చూపించడం వల్లే ఈ ఫంక్షన్‌కి వచ్చాను. ప్రివ్యూ థియేటర్లోనే ఎంజాయ్ చేశామంటే, ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేస్తారు? ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. అన్నింటినీ మించిన పెర్ఫార్మెన్స్ తరుణ్ భాస్కర్‌ది. తరుణ్ ఇక డైరెక్షన్ మానేయొచ్చు. యాక్టర్‌గా కంటిన్యూ చేస్తే డైరెక్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించొచ్చు. ఏడాదిలో ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండవు. అందుకు నాదీ గ్యారెంటీ. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నవారిని చూస్తుంటే మన తెలుగు సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లబోతోందనిపిస్తోంది’’ అన్నారు. హీరో, డైరెక్టర్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘సినిమా నేపథ్యం లేకున్నా సినిమాల్లోకి రావచ్చనే ధైర్యం నానీ అన్న వల్లే వచ్చింది. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు అందరూ భయపెట్టారు. నాకు ఎలానూ బ్యాక్‌గ్రౌండ్ లేదు.. ఏదైనా జరిగితే బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోవాలనుకున్నా. కానీ, అలా జరగదనే ఈ సినిమా తీశా. టీజర్‌కే బ్యాగ్ ప్యాక్ చేసుకునే చాన్స్ లేకుండా చేశారు’’ అన్నారు. ‘‘నన్ను యాక్టర్‌ను చేసినందుకు విశ్వక్‌కి థ్యాంక్స్. విజయ్ దేవరకొండ, విశ్వక్‌కు మధ్య వ్యక్తిత్వంలో పోలికలు ఉన్నాయి. సెట్లో అందరినీ ప్రేమగా చూసుకుంటారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. కరాటే రాజు, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, సహ నిర్మాత మీడియా 9 మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త
‘‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో సంభాషణలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం కూడా బాగుంది. ఇలాంటి చిత్రం తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్ ఎంతో ఇష్టంతో నటించి, దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. సలోని మిశ్రా కథానాయిక. కరాటే రాజు సమర్పణలో కరాటే రాజు, చర్లపల్లి సందీప్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో–దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. వారంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. మా చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘విశ్వక్ మీద మొదట్లో నమ్మకం లేదు. అయితే తను ఓ షార్ట్ ఫిల్మ్ చూపించడంతో నమ్మకం కలిగి ఈ సినిమాలో ఓ పాత్ర చేశా’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని కరాటే రాజు అన్నారు. ‘‘ఈ సినిమాలోని రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని సలోని మిశ్రా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మీడియా 9 మనోజ్‌కుమార్. -
నటుడి భార్య అదృశ్యం
చెన్నై: సినీ నటుడు కరా టే రాజా భార్య బుధవారం అదృశ్యమైంది. నటుడు కరాటే రాజా పోలీసులను ఆశ్రయించారు. కడలూరు జిల్లా సమీపంలోని మానలూరుకు చెందిన రాజా. ఈయన కరాటే రాజాగా చిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కరాటే రాజా పుదువై సారం పూంగోళం కామరాజర్‌నగర్‌కు చెందిన మురుగన్ కూతురు దివ్యను 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. సారం గ్రామం సమీపంలో అద్దె ఇంటిలో నివసిస్తున్నారు. కరాటే రాజా ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉంటూ నెలలో రెండు, మూడుసార్లు మాత్రం ఇంటికి వస్తుంటారు. ఈ విషయమై ఇటీవల భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో కరాటే రాజా భార్య దివ్య బుధవారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో తన ముగ్గురు కూతుళ్లను ఆమె తల్లి ఇంటికి తీసుకెళ్లి మార్కెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన రామన్ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతం అంతా గాలించారు. అయినా ఆమె జాడ తెలియలేదు. సమాచారం అందుకున్న నటుడు కరాటే రాజా గురువారం ఉదయం పుదువై కోరిమేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.