karif
-
‘కంది’ పోతోంది..
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతన్నలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. విత్తనం నాటిన నుంచి పంట చేతికి అందే వరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు అధికంగా కురవటంతో పంటల్లో ఎదుగుదల లేక నష్టపోగా ఖరీఫ్ చివరి కాలంలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయటంతో పంటలు ఆశాజనకంగా లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పత్తిలో దిగుబడి తగ్గి దెబ్బతీయగా కందిపై పెట్టుకున్న ఆశలు సైతం సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కంది పంట పూత దశలో ఉండగా వర్షాలు లేక ఎదుగుదల పూర్తిగా మందగించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దెబ్బతీసిన అధిక వర్షాలు ఖరీఫ్ ప్రారంభంలో జిల్లాలో కురిసిన అధిక వర్షాలు పత్తితోపాటు కంది పంటలను సైతం తీవ్రంగా దెబ్బతీశాయి. భూమిలో తేమశాతం అధికంగా మారటంతో పంటల్లో ఎదుగుదల పూర్తిగా లోపించింది. దాని ప్రభావం ఇప్పటికే పత్తి పంటలపై చూపగా ప్రస్తుతం కందిపై ప్రభావం పడింది. ప్రారంభంలో అధిక వర్షాలతో పంటల్లో పెరుగుదల లోపించగా ఖరీఫ్ చివరి కాలం నాటికి వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దాంతో పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడియాసలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్‌లో 12,495 హెక్టార్లలో రైతులు కంది పంటలను సాగు చేశారు. చాలా మంది రైతులు అధిక శాతం పత్తికి అంతర పంటలుగా కందిని సాగు చేయగా మిగిలిన వారు నేరుగా సాగు చేశారు. ప్రస్తుతం కంది పంటలన్ని పూతదశకు చేరుకోగా పంటల్లో పెరుగుదల లేకపోవటంతో కనీసం పెట్టుబడి సైతం దక్కేలా కనిపించటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 1,56,188 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి సగానికి సగం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు బావిస్తున్నారు. పంటల్లో పెరుగుదల లేక ఆశించిన స్థాయిలో పూత కనిపించటం లేదు. ముందుంది తెగుళ్ల కాలం.. జిల్లాలో ఇప్పుడిప్పుడే పూత పడుతున్న కంది పంటను పచ్చపురుగు, లద్దెపురుగు, మచ్చల పురుగు ఉధృతంగా ఆశిస్తుండడం రైతులను కలవర పెడుతోంది. పూత దశలోనే పురుగు ఉధృతి అధికంగా మారటంతో రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. దానికి తోడూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దాంతో కందికి పూతలు సరిగా రాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వాతావరణం మబ్బు పడితే కందిపై పురుగుల బెడద మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలిపోయి మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఆ దశలో వాతావరణం అనుకూలిస్తే తప్పా కనీసం పెట్టుబడులు సైతం రాబట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు, సూచనలు అందకపోవటంతో రైతులు తమకు తోచిన మందులు పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో కంది సాగు మండలం హెక్టార్లు సిర్పూర్(యు) 1,179 జైనూర్ 739 కెరమెరి 1,606 లింగాపూర్ 691 ఆసిఫాబాద్ 1,310 రెబ్బెన 480 వాంకిడి 1,198 తిర్యాణి 1,208 కాగజ్‌నగర్ 742 సిర్పూర్(టి) 894 కౌటాల 830 బెజ్జూర్ 462 దహెగాం 161 చింతలమానెపల్లి 722 పెంచికల్పేట్ 273 మొత్తం 12,495 -
నాలుగేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది
-
నాలుగేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వరుసగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు నీరు–ప్రగతి పేరుతో భూగర్భ జలాలను పెంచుతున్నామని, తద్వారా అదనపు ఆయకట్టు వచ్చిందని ప్రభుత్వం చెబుతుండగా అదే సర్కారు జిల్లా కలెక్టర్ల సదస్సుకు రూపొందించిన నివేదిక మాత్రం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ వరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది. నీరు–ప్రగతి కింద చెరువుల్లో పూడిక తీయడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఫాం పాండ్స్, ఇతర నీటి నిల్వ నిర్మాణాలు, చెరువుల సామర్థ్యం పెంపు పేరుతో గత మూడేళ్లలో అంటే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు మొత్తం రూ.9,906.88 కోట్లు వ్యయం చేశారు. ఇందులో జలవనరుల శాఖ రూ.2009.92 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.7896.96 కోట్లు వ్యయం చేసినట్లు జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు 2014–15 ఆర్థిక సంవత్సం ఖరీఫ్, రబీ కలిపి 155.24 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అలాగే 2016–17 ఆర్థిక సంవత్సరంలో 2.93 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ఖరీఫ్‌తో పోల్చి చూస్తే ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 16.51 లక్షల ఎకరాలు తగ్గిపోవడం గమనార్హం. నీరు–ప్రగతి పేరుతో దోపిడీ నీరు–ప్రగతి పేరుతో ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన వ్యయం చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా ఆయకట్టును సాగులోకి తీసుకొస్తుంటే సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతోందో పాలకులు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ల్యాండ్ రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడానికి కూడా గత మూడేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్ కింద కూడా గత మూడేళ్లుగా ఆయకట్టు తగ్గిపోయిందని, దీంతో ల్యాండ్ రెవెన్యూపై ప్రభావం పడిందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. నీరు–ప్రగతి పేరుతో పనులన్నీ కూడా నామినేషన్‌పై చేశారని, అంటే ఈ మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అయినట్లేనని సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతికి చేసిన వ్యయం ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు వ్యయం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని, లేదా ఆ మొత్తం నిధులను రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలకు వ్యయం చేస్తే ఆ నిధులు సద్వినియోగం అయ్యేవని ఆ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతి పనుల పేరుతో నిధులను అధికారికంగా ఖజానా నుంచి దోచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
లక్ష ఎకరాలు ఔట్
సమగ్ర సర్వే నుంచి రియల్ ఎస్టేట్, ఇతరత్రా బదిలీ అయిన భూముల తొలగింపు ► సర్వేలో 1.24 కోట్ల ఎకరాల భూమి నమోదు ► ఈ నెల చివరికి తుది నివేదిక ► వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి పథకం ► సీఎం భూములకూ ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.3.40 లక్షలు సాక్షి, హైదరాబాద్ : రైతు సమగ్ర సర్వేలో నమోదైన భూముల జాబితా నుంచి దాదాపు లక్ష ఎకరాలను తొలగించారు. రైతుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలున్నా ఆ భూమి రియల్ ఎస్టేట్‌కు మళ్లడం, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూసేకరణలో వెళ్లిపోవడం తదితర కారణాలతో ఆ భూములను జాబితా నుంచి తొలగించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే కొన్నిచోట్ల రైతులు స్థానికంగా లేకున్నా, కొందరు చనిపోయినా, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) రెవెన్యూ రికార్డులను ముందేసుకొని ఆయా భూముల వివరాలు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ఇలా గుర్తించిన భూమిని కూడా జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అదనపు భూమి వచ్చి చేరితే వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే పథకం బడ్జెట్ మరింత పెరగనుంది. రైతుల వద్దకు వెళ్లకుండా ఇలా రికార్డులు చూసి భూముల వివరాలు నమోదు చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి లక్ష ఎకరాల వరకు భూ వివరాలను సమగ్ర సర్వే జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28 లేదా 29 నాటికి రైతు సమగ్ర సర్వేపై స్పష్టత రానుంది. ఆ రోజు జిల్లాల నుంచి తుది నివేదిక వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే ఖరీఫ్‌కల్లా రైతులకు రూ.4,981 కోట్లు ప్రభుత్వం ప్రకటించినట్టుగా వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. పేద, ధనిక తేడా లేకుండా నగదు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుత లెక్కల ప్రకారం వచ్చే ఖరీఫ్‌లో రూ.4,981.32 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌కూ ఎర్రవల్లిలో 85 ఎకరాల భూమి ఉంది. ఆయన భూ వివరాలను కూడా సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో బొప్పాయి, వరి పంటలు సాగులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం సీఎంకూ వచ్చే ఖరీఫ్‌లో రూ.3.40 లక్షలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వ్యవసాయ భూములకు కూడా పెట్టుబడి పథకం కింద సొమ్ము జమ చేస్తామన్నారు. అయితే పెట్టుబడి పథకం తమకు వద్దంటూ ఎవరైనా విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఎవరి నుంచి కూడా తమకు అలాంటి విన్నపాలు రాలేదని అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన ఉద్యాన పంటలు సీఎంకు వ్యవసాయశాఖ పంపిన నివేదిక ప్రకారం 45.55 లక్షల మంది రైతుల చేతుల్లో 1,24,53,308 ఎకరాల పంట భూమి ఉన్నట్లు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. అందులో 51.30 లక్షల ఎకరాలు నీటిపారుదల వనరుల కింద ఉండగా.. 69.40 లక్షల ఎకరాలు వర్షాధార భూములు. ఉద్యానశాఖ పరిధిలో ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల పండ్లు, కూరగాయల తోటలున్నట్లు భావించారు. కానీ సమగ్ర సర్వేలో కేవలం 3.59 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. అందులో మామిడి తోటలు 2.25 లక్షల ఎకరాలు, నిమ్మ, బత్తాయి తోటలు 67,544 ఎకరాలు, జామ తోటలు 4,766 ఎకరాలు, ఇతర పండ్లు, కూరగాయల తోటలు 61,884 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్యాన పంటలకు సరైన ప్రోత్సాహకం లేకపోవడం వల్లే రైతులు ఆయా పంటల నుంచి వైదొలుగుతున్నట్టు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అదును దాటుతున్న ఖరీఫ్
- మృగశిరలో అందని నీరు - ఆరుద్ర రాకతో మరింత ఆలస్యం - ఇప్పుడు నాట్లు వేస్తేనే తుపాన్ల సమయంలో చేతికి వచ్చేది - శివారులో పునర్వసులోనే నారుమడులు అమలాపురం : ఆరుద్ర... డెల్టాలో ఏరువాకకు పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. పంట తుపాన్లు సమయంలో చేతికి వచ్చే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నారువేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. అయితే ముందస్తుగా మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసులో నారుమడులు వేయడం జిల్లాలో డెల్టాలో ఖరీఫ్ రైతులకు పరిపాటి. ఈసారి కూడా మృగశిరలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే పునర్వసులో నారువేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాడి కూడా ఖరీఫ్ ఆలస్యం కానుంది. గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆదునుదాటుతోంది. ముందస్తు ఖరీఫ్‌కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలానే సాగునీరు పొలాలకు ఆలస్యంగా విడుదల చేయడంతో సాగులో జాప్యం చోటుచేసుకుంటోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా..ఆధునికీకరణ, నీరు–చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్టు వేస్తూ 20వ తేదీ వరకు పొలాలకు అందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు కాగా ఇప్పటి వరకు 60 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదు. మృగశిర ఈ నెల 21 వరకు ఉన్నా ఆ సమయంలో నీరందక రైతులు నారుమడులు ఆలస్యం చేశారు. 22 నుంచి ఆరుద్ర మొదౖలై జూలై ఏడు వరకూ ఉంది. ఐదు నెలల పంట కాలం కావడం వల్ల ఈ సమయంలో నారు మడులు వేస్తే అక్టోబరు నెలఖారు నుంచి నవంబరు 15 మధ్య చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, తరువాత తుపాన్లు కారణంగా పంట నష్టపోవడం డెల్టాలో శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే జూలై మొదటి వారం తరువాత నారుమడులు వేయనున్నారు. అదే జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు వేసే అవకాశం ముంది. ఇదే జరిగితే రబీ ఆలస్యం కావడం, మూడో పంట అపరాలు లేకుండా పోనుంది. ఎగువున కొంతవేగం... – తూర్పుడెల్టాలో అనపర్తి సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో మూడుశాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల వద్ద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. – ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడగా, నాట్లు పది శాతం మాత్రమే అయ్యాయి. – మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంత వరకు నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు పడలేదని అంచనా కాగా, కేవలం 30 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. శివారులో మరింత ఆలస్యం... – తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం నియోజకవర్గం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. – సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం మాత్రమే నారుమడులు పోశారు. – కరప, కాకినాడ మండలాల్లో 28,700 ఎకరాలు ఆయకట్టు ఉండగా, ఇక్కడ నాట్లు ఆరంభం కాలేదు. ఇక్కడ సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. – మధ్యడెల్టాలోని సబ్ డివిజన్ల వారీగా చూస్తే పి.గన్నవరం 14,900 ఎకరాలకుగాను, 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకు గాను 25 శాతంచ రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు వేయలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. -
ముందస్తు నీళ్లు ఇస్తేనే మేలు
అమలాపురం : ముందస్తు ఖరీఫ్ సాగు చేపట్టాలన్న డెల్టా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. సుదీర్ఘకాలంగా తాము చేస్తున్న పోరాటానికి స్పందించి ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు 15 రోజుల ముందే సాగునీరు విడుదలకు ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. తాజాగా ముందుస్తుగా కాలువలకు సాగునీరందించేందుకు ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశ తీర్మానం ఉంటేకాని నీరు విడుదల చేయలేరని ఇరిగేషన్ అధికారులే చెబుతుంటుంటే ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు జూన్ ఒకటికి పంట కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 15 తరువాత సాగునీరు ఇవ్వడం వల్ల అక్టోబరులో పంట దెబ్బతింటుందని, రబీ సాగు చివరి కాలంలో నీరందకపోవడం, మూడో పంట అపరాల సాగు లేక పోవడం వంటి విపత్కర పరిస్థితులకు కారణమవుతోందని రైతులు ఆందోళన. సాగునీరు ఆలస్యమైనందున గతేడాది కోనసీమలో సుమారు 40 వేల ఎకరాల్లో సాగు చేయని సంగతి తెలిసిందే. ఇందుకు రైతులు చెప్పిన కారణం జూన్ 15 తరువాత నీరు ఇవ్వడం వల్ల సాగు చేయడం లేదనే. రైతులు డిమాండ్‌ను ‘సాక్షి’ పలు సందర్భాలలో వెలుగులోకి తీసుకురావడంతో స్పందించి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు అధికారులు జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరివ్వాలని నిర్ణయించారు. అధికారులు నిర్ణయంతో ముందస్తు సాగుకు అటు రైతులు, ఇటు వ్యవసాయశాఖాధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే ఇరిగేషన్ ఎడ్వజరీ బోర్డు (ఐఏబీ) సమావేశంలో ముందస్తు సాగునీరు విడుదలకు తీర్మానం చేయలేదని, అప్పటి సమావేశంలో జూన్ 15 నాటికే నీరు ఇవ్వాలని తీర్మానించినట్టు అధికారులు చెబుతున్నారు. దీనితో ముందస్తు సాగునీరు విడుదలపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గోదావరి ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు ఐఏబీలో తీసుకున్న నిర్ణయాన్ని కాదని, ముందస్తు సాగునీరు విడుదల చేయాలంటే సాధ్యం కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక ఇరిగేషన్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అలా చేయాలంటే మరోసారి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దీమాతోనే ఈ ఏడాది ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ఆరంభించారు. ఎప్పటిలానే ఈ సారి కూడా సాగునీరు ఆలస్యంగా విడుదలైతే ఖరీఫ్ దూరంగా ఉండాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
ఆరుతడి పంటలతో రైతుల్లో ఆనందం
7,015 హెక్టార్లలో సాగుచేసిన అన్నదాతలు వికారాబాద్ రూరల్: మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాత మోముల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో దోబూచులాడిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరు బావులున్న ప్రాంతాల్లో రైతులు వరి, పసుపు పంటలు సాగు చేయగా.. వర్షాధారిత ప్రాంతాల్లో గడ్డు పరిస్థితి నెలకొంది. దీంతో మండలంలోని రైతులు ఆరుతడి పంటలపై ఆశలు పెట్టుకుని.. ఆ దిశగా సాగుకు ఉపక్రమించారు. ఆయా పంటలు సాగు చేసిన రైతులకు వర్షాలు కరువయ్యాయి. దీంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న తరుణంలో.. ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల ఆశలు చిగురించాయి. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయింది. మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో రైతులు వరి 10 హెక్టార్లు, జొన్న 420, మొక్కజొన్న 2,830, పెసర 105, మినుము 75, కంది 2,300, పసుపు 305, పత్తి 720, సోయాబీన్ 250 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. మొత్తం కలిపి 7,015 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పంటలకు ప్రాణం పోసినట్లయిం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షం అన్నదాతలకు వరం లాంటిదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు వరుణిడి కరుణ ఉంటే నెలాఖరు నాటికి కాతకాసి పంటలు చేతికి అందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. -
‘పగటి’కలే!
* వచ్చే ఖరీఫ్ నుంచి సాగుకు పగటిపూట 9 గంటల కరెంటు అనుమానమే * ఇక మిగిలింది ఎనిమిది నెలలు మాత్రమే * కార్యరూపం దాల్చని రూ. 2 వేల కోట్ల పనులు * ఇప్పటివరకు టెండర్లు కూడా పిలవని వైనం * రెట్టింపు కానున్న విద్యుత్ డిమాండ్ * కరెంటు అందినా సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం పెంచాలి * హామీ అమలుకు మరో రెండు, మూడేళ్లు పట్టే అవకాశం * అప్పటిదాకా పగలు 4 గంటలు, రాత్రిపూట 4 గంటలు ఇవ్వడంపై యోచన * ప్రస్తుతం సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం 8,800 మెగావాట్లు * 9 గంటల కరెంటుకు కావాల్సిన సామర్థ్యం 14,000 మెగావాట్లు * రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 6,0006,500 మెగావాట్లు * 9 గంటల కరెంట్‌తో పెరగనున్న డిమాండ్ 10,50011,000 మెగావాట్లు సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి పగటిపూటే కరెంట్.. 9 గంటలపాటు నిరంతర సరఫరా.. వచ్చే ఖరీఫ్ నుంచే అందిస్తాం..’ ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయి ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా కనిపించడం లేదు. ఈ హామీ నెరవేర్చడానికి కేవలం 8 నెలల సమయమే మిగిలి ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యం దాదాపు రెట్టింపు స్థాయికి చేరాలి. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా పనులు కార్యరూపం దాల్చకపోవడంతో హామీ అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిమాండ్ మేరకు విద్యుత్‌ను సమీకరించుకున్నా... ఆ విద్యుత్‌ను సరఫరా, పంపిణీ చేసే వ్యవస్థలను స్వల్ప కాలంలో సిద్ధం చేసుకోవడం కాని పనే! ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకం అమలును మరో ఏడాది, రెండేళ్ల వరకు వాయిదా వేసుకోక తప్పదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. హామీని పాక్షికంగానైనా నెరవేర్చేందుకు కొన్ని మార్పులు చేయవచ్చనే చర్చ జరుగుతోంది. పగలు 4 గంటలు, రాత్రి 4 గంటలు చొప్పున 8 గంటల విద్యుత్ సరఫరా చేసే అంశం ఉన్నత స్థాయి వర్గాల పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 6,000-6,500 మెగావాట్ల మధ్యే ఉంది. ఈ విద్యుత్ అందించేందుకే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇక సాగుకు వచ్చే ఏప్రిల్ నుంచి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. ఈ డిమాండ్ ఒక్కసారిగా 10,500-11,000 మెగావాట్లకు పెరుగుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత రబీలో (2015 మార్చి 28న) అత్యధికంగా 6,755 మెగావాట్ల సరఫరా జరగ్గా.. అందులో వ్యవసాయ విద్యుత్ వాటా 2,500 మెగావాట్లుగా ప్రభుత్వం లెక్కలేసింది. ప్రస్తుతం రెండు, మూడు విడతల్లో 6 గంటలకు మించకుండా సరఫరా చేస్తేనే వ్యవసాయ రంగానికి 2,500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఇక పగలే 9 గంటలు నిరంతరంగా సరఫరా చేస్తే ఒక్క వ్యవసాయానికే ఈ డిమాండ్ 6,370 మెగావాట్లకు పెరగనుందని ప్రభుత్వ అంచనా. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం డిమాండ్ 10,500-11,000 మెగావాట్ల మధ్య ఉండనుంది. అంటే.. 9 గంటల పథకానికి అదనంగా 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ అంచనాల ఆధారంగానే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సరఫరా, పంపిణీ రంగాలను పటిష్టం చేసేందుకు దాదాపు రూ.2 వేల కోట్ల అంచనాలతో చేయాల్సిన పనులకు కేవలం 8 నెలలే మిగిలి ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే... రాష్ట్రంలో సాగుకు పగలే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం లభ్యమవుతున్న 6 వేల మెగావాట్ల విద్యుత్‌కు అదనంగా మరో 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మిస్తున్న కేటీపీపీ-2 యూనిట్‌తోపాటు జైపూర్‌లో సింగరేణి నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల సౌర విద్యుత్ టెండర్లు ముగిసిన నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. నిర్మాణంలో ఉన్న గాయత్రి థర్మల్ ప్రాజెక్టు నుంచి 600 మెగావాట్లు, థర్మల్ టెక్ ప్రాజెక్టు నుంచి 269 మెగావాట్ల వాటాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అనుకున్నట్లే ఈ ప్రాజెక్టులన్నీ గడువులోగా పూర్తై అదనంగా 5,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. సౌర విద్యుత్కేంద్రాలు ఆలస్యమైతే మాత్రం 2,500 మెగావాట్లకు మించి సామర్థ్యం పెరగదు. సరఫరా, పంపిణీలే అసలు సమస్య సాగుకు 9 గంటల విద్యుత్ పథకం అమలు కోసం సరిపడా విద్యుత్‌ను సమీకరిస్తే సరిపోదు. ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలూ ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రం 8,800 మెగావాట్ల విద్యుత్ సరఫరా, పంపిణీ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. వచ్చే ఏప్రిల్‌లోగా 14,000 మెగావాట్ల వరకు సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంది. అలాగే కేవలం వ్యవసాయ అవసరాల కోసమే గ్రామగ్రామాన ప్రత్యేక సరఫరా, పంపిణీ లైన్లను వేయాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టినా రాష్ట్రంలోని 8,600 గ్రామాల్లో ఏకకాలంలో పూర్తి చేయడం సాధ్యం కాని పని. సరఫరా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ట్రాన్స్‌కో రూ.950.50 కోట్లతో, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి డిస్కంలు రూ.1,066.98 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ పనుల కోసం ఇంకా టెండర్లే పిలవలేదు.