karimnagar crime
-
పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, మంథని: వన్యప్రాణుల వేట కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు ఠాణా ఆవరణలోని బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామగుండం కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించింది. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం లక్కేపూర్ శివారులో ఈ నెల 24న వన్యప్రాణుల వేట కోసం మైదుపల్లికి చెందిన ఉప్పు కుమార్, మక్కాల మల్లేష్, సిద్దపల్లికి చెందిన తాటి సంపత్, రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్యలు విద్యుత్ తీగలు అమర్చుతుండగా మంథని ఎస్సై ఓంకార్‌యాదవ్ పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. (ఇండిగో ప్రయాణికుడికి కరోనా..) ఈ క్రమంలో ఠాణాలోని నిందితుల్లో ఏ–3గా ఉన్న రంగయ్య(52) మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలోని బాత్రూంలో ఇనుప పైపునకు తలపాగాతో ఉరేసుకున్నాడు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి నిందితులు బాత్రూం వద్దకు వెళ్లగా లోపల గడి పెట్టి ఉంది. వెంటనే తలుపు పగులగొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు వన్యప్రాణుల వేట కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. ఇటీవలే ఈ గ్యాంగ్ ఓ అడవి పందిని వేటాడి చ ంపినట్లు తెలిసిందన్నారు. ఫిజికల్ టార్చర్ ఏం లేదని, ఒకవేళ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతదేహానికి తహసీల్దార్ అనుపమరావు పంచనామా నిర్వహించారు. (మెట్రో ప్రయాణం: మరో 30 సెకన్లు పెంపు) మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి విచారణ జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలకు లోబడి కేసు విచారణ చేపడుతామని సీపీ సత్యనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ నరేందర్‌ను కేసు విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేటలో ఏటా 10 నుంచి 15 మంది చనిపోతున్నారన్నారు. గతేడాది సుమారు 450 మంది వేటగాళ్లను బైండోవర్ చేసినట్లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి, జైపూర్, సుందిళ్ల ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వాటికి ప్రాణహాని ఉందనే వన్యప్రాణులను వేటాడే వారిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ నుంచి కూడా సమాచారం వచ్చిందన్నారు. రంగయ్య కుటుంబసభ్యులతో పాటు మిగతా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీపీ పేర్కొన్నారు. వైద్య బృందం సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తామని తెలిపారు. భారీగా మోహరించిన పోలీసులు పోలీస్ కస్టడీలో ఉన్న రంగయ్య ఉరేసుకోవడంతో అతని కుటుంబసబ్యులు, ఇతర కుల సంఘాలు, రాజకీయ నాయకులు వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఏసీపీలు, సీఐలు, ఇతర విభాగాల పోలీసులు మంథని ఠాణాకు చేరుకున్నారు. ఇతరులను పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించలేదు. మృతుడి బంధువులతో సంప్రదింపులు జరిపి, నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లోనే ‘ఫావిపిరవిర్’ ) రామయ్యపల్లిలో విషాదం రామగిరి(మంథని): మంథని పోలీస్‌స్టేషన్‌లో రంగయ్య ఆత్మహత్మతో బుధవారంపేట పంచాయతీ పరిధిలోని రామయ్యపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం మృతుడి ఇంటి వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసు కేసు భయంతోనే రంగయ్య ఉరేసుకొని ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య రాజమ్మ, కుమారుడు అనిల్, కూతుళ్లు రజిత(వివాహం అయ్యింది), మౌనిక ఉన్నారు. సోమవారమే భోజనం తీసుకెళ్లాను నాలుగు రోజుల కిందట నా భర్తను కలిశాను. సోమవారం కూడా భోజనం తీసుకెళ్లాను. ఆయన నాకేం చెప్పలేదు. ఇంతలో ఇలా సచ్చిపోయాడు. – రాజమ్మ, రంగయ్య భార్య -
మోసగించిన బావ
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఓ బాలిక(16) స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరసకు మేనబావ అయిన ప్రతాప్‌ఠాకూర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసగించాడని బాధితురాలి తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల మేరకు... స్థానిక ఎన్టీఆర్నగర్కు చెందిన బాలికకు, ఒడిశా రాష్ట్రంకు చెందిన ప్రతాప్‌ఠాకూర్ వరుసకు మేనబావ అవుతాడు. ఒడిశాలోనే పని చేస్తున్న ప్రతాప్ ఠాకూర్ ఎన్టీఆర్నగర్లో ఉంటున్న తమ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఈ క్రమంలోనే సదరు బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఒడిశాకు వెళ్లిపోయిన ప్రతాప్‌ఠాకూర్ తిరిగి గోదావరిఖని రాలేదు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చింది. కొడుపులో నొప్పిగా ఉంద ని ఈనెల 16న బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో ఉందని తెలియడంతో ప్రసవం జరిపించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆం దోళనకు గురైన బాలిక తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రతాప్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. -
మాటువే షి ఆటకట్టిస్తారు!
‘నేను రోజూ బస్‌లో కాలేజీకి వెళ్తా.. ఓవ్యక్తి నాతో వారం రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులు ఇప్పుడు మరీ ఎక్కువైనయ్.. పోకిరీ బారి నుంచి నన్ను కాపాడండి’ అంటూ ఓ యువతి ‘డయల్ 100’కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న ఓ బృందం వెంటనే రంగంలోకి దిగింది. సదరు విద్యార్థిని అనుసరించింది. పోకిరీ చేష్టల్ని సీక్రెట్ కెమెరాలో చిత్రీకరించింది. దీని ఆధారంగా పోకిరీ ఆటకట్టించింది. ఈ ప్రత్యేక బృందం పేరే ‘షీ’. కరీంనగర్ క్రైం : ప్రస్తుతం హైదారాబాద్‌లో సమర్థవంతంగా పొకిరీలకు చెక్ పెడుతున్న ‘షీ’టీంలను కరీంనగర్లోనూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మహిళపై వేధింపులు, ఇతరత్రా నేరాలు పెరిగిపోవడంతో షీ బృందాలు అనివార్యమైని భావించి ఇందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలు 1200పైగా నమోదవుతున్నారుు. వీటిలో 330కిపైగా వేధింపుల కేసులు ఉంటున్నారుు. మహిళను వేధిస్తున్నవారిలో యువకులు, విద్యార్థులతో పాటు ఉద్యోగులు ఉంటున్నారు. ఇందులో 30నుంచి 50ఏళ్ల పురుషులుంటున్నారు. మఫ్టీలో నిఘా.. చిక్కితే జైలు.. జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్లు, కాలేజీలు, ఆటోలు, ఇతర ప్రాంతాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో షీ బృందాలు నిఘా పెడుతాయి. ఇందుకోసం త్వరలో అందుబాటులోకి రానున్న సిటీ బస్సుల్లో కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో ‘షీ’ బృందాలు కలిసిపోతాయి. ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తారుు. పోకిరీలు రెచ్చిపోగానే సీక్రెట్ కెమెరాల్లో చిత్రీకరించిన వెంటనే అదుపులోకి తీసుకుంటారుు. తాము ఎవరినీ వేధించడంలేదంటూ నిందితులు తప్పించుకునే వీలు లేకుండా కెమెరాల్లోని దృశ్యాలను సాక్ష్యంగా నిలుస్తాయి. తొలిసారి చిక్కితే కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేస్తారు. మరోసారి తప్పు చేయనని లిఖితపూర్వకంగా రాయించుకుని వదిలేస్తారు. రెండోసారి మహిళలను వేధిస్తూ చిక్కితే.. వెంటనే వివిధ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారు. ప్రస్తుతం ప్రతీ డివిజన్లో వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు డయల్ 100కు ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా పోలీసులు స్పందించి షీ బృందాలకు సమాచారం అందిస్తారు. ఉదయం నుంచి 8 నుంచి 10, రాత్రి 7 నుంచి 9గంటల వరకు ప్రధాన ప్రాంతాలు, బస్టాండ్లు, కాలేజీ అడ్డాల్లో షీ టీంలు మాటు వేస్తారుు. పోకిరీలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఠాణాకు తరలిస్తారుు. విస్తృత ప్రచారం.. బస్సులు, ఆటోలు, బస్టాంప్ల్లో మహిళలు, యువతులకు రక్షణగా తామున్నామంటూ షీ బృందాలు ప్రచారం చేస్తాయి. సాధారణ వ్యక్తుల్లో కలిసిపొయి వేధింపు లు ఆరంభం కాగానే తామున్నామంటూ బాధితులకు ధైర్యం చెబతారుు. అయితే షీ టీంలో ఎవరున్నది గోప్యంగా ఉంచుతారు. ఆపరేషన్ పూర్తి చేశాకా అక్కడినుంచి నిష్ర్కమిస్తారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి పోకిరీల ఆటకట్టిస్తారు. -
చిన్నారిపై సామూహిక లైంగికదాడి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్:మానకొండూరు మండలంలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు సామూహిక లైంగికదాడికి దిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వరుసకు అన్న, బాబాయి అయిన ఆ మృగాళ్లు చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఇరవై రోజుల క్రితం గంగిపల్లి పరిధిలోని నూనేపల్లికి చెందిన చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఇంటివద్ద ఉంచి పనికి వెళ్లారు. నిత్యం నీలిచిత్రాలు చూస్తూ జులాయిగా తిరుగుతున్న అదే గ్రామానికి చెందిన పదిహేను, పదహారేళ్ల ఇద్దరు బాలురు చిన్నారిపై కన్నేశారు. వారు ఆమెకు వరుసకు అన్న, బాబాయి అవుతారు. మధ్యాహ్నం ఇంటివద్ద ఎవరూ లేకపోవడంతో చిన్నారిని ఇంట్లోకి పిలిచారు. వారిని నమ్మి వెళ్లిన చిన్నారిపై ఇద్దరూ లైంగిక దాడికి దిగారు. ఆమె కేకలు వేయకుండా ఒకరు అదిమి పట్టుకొని, మరొకరు లైంగిక దాడికి దిగారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేసి పారిపోయారు. ఎవరికీ చెప్పవద్దని చిన్నారిని బెదిరించారు. రెండు రోజుల క్రితం ఆ చిన్నారి కడుపు నొప్పిగా ఉందని తల్లడిల్లింది. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో రక్తం రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకుపోయారు. అప్పుడు చిన్నారి తనపై జరిగిన లైంగికదాడి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తండ్రి సోమవారం మానకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చిన్నారిపై తామే లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ ఎస్సై రాజు తెలిపారు. -
'ప్రేమించి...పెళ్లి చేసుకున్న భర్త మొసం చేసాడు'
-
సుదర్శన్‌గౌడ్‌కు ఏఎస్పీగా పదోన్నతి
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్‌ను ఖమ్మం అడిషన ల్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వు లు జారీచేసింది. సుదర్శన్‌గౌడ్ జిల్లాలో అంతముందు ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. 2012లో ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాక అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అత్యధిక కేసులతో కరీంనగర్ రేంజ్ ను రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిపారు. పలు సంచలన కేసులు ఈయన హయాంలోనే నమోదయ్యాయి. లంచాలు తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులను పట్టుకుని సిండికేట్ల వ్యవహారాన్ని బయటకు తీశారు. జిల్లాలో పాతుకుపోయిన పలువురు అవినీతి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుపాలు చేశారు. అన్ని శాఖల అధికారులపై దాడుల చేసి సుమారు 58 కేసులు నమోదు చేశారు. 78 మందిని అరెస్టు చేశారు. అవినీతి అధికారులు ఎంతటి వారైనా సుదర్శన్‌గౌడ్ వదలిపెట్టలేదు. ఏసీబీని గ్రామీణులు, నిరక్షరాస్యుల వరకూ ఆయన తీసుకెళ్లారు. సుమారు 15 కేసుల్లో నిరక్షరాస్యులు ఇచ్చిన సమాచారంతోనే అవినీతిపరులను కటకటాల్లోకి నెట్టారు. యువత ముందుకు వస్తే మరింత సమర్థంగా అవినీతిని రూపుమాపేవారమని సుదర్శన్‌గౌడ్ పేర్కొనేవారు. సుమారు 26 నెలలు కరీంనగర్ రేంజ్లో పనిచేసిన ఆయన పలు కేసులను పరిశోధించారు. టీ బాయ్‌గా, రైతుగా, దుకాణదారుడిగా మారువేశాల్లో వెళ్లి అవి నీతిపరులను పట్టుకున్నారు. తాజాగా కరీంనగర్ రాంనగర్‌లోని బాలుర వసతిగృహంలో అవినీతిపై విచారణ చేపట్టారు. హాస్టల్ వార్డెన్‌పై వేటుపడింది. మరిన్ని దాడులకు సిద్ధమవుతున్న సమయంలో పదోన్నతిపై ఖమ్మం అడిషనల్ ఎస్పీగా వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.