అక్క.. తమ్ముడు...యాక్షన్!
సాధారణంగా తాను హీరోగా నటించే చిత్రాలకు అప్పు డప్పుడూ ఫైట్స్ కంపోజ్ చేసుకుంటుంటారు మంచు మనోజ్. కానీ, ఈసారి ఆయన బయటి చిత్రానికి పోరాట సన్నివేశాలు సమకూర్చడం.. అది కూడా తన అక్క మంచు లక్ష్మి చిత్రం కావడం విశేషం. మంచు లక్ష్మి లీడ్ రోల్లో కార్తికేయ గోపాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. గునపాటి సురేశ్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్షీ్ష్మ నరసింహ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లయిమాక్స్ ఫైట్‌ను మంచు మనోజ్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో క్లయిమాక్స్ ఫైట్‌కు చాలా ప్రాముఖ్యం ఉందట. లక్ష్మి మాట్లాడుతూ- ‘‘ఫస్ట్ టైం చాలెంజింగ్ పాత్ర చేస్తున్నా. ఇప్పటి వరకూ ఇటువంటి పాత్రలో నటించలేదు. రెండు రోజులు షూటింగ్ బ్యాలెన్స్ మినహా పూర్తయింది. దీపావళి పండుగకు ముందే ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘మనోజ్ సమకూర్చిన ఫైట్ హైలైట్‌గా ఉంటుంది’’ అని దర్శక- నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేశ్‌రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: మల్హర్‌భట్ జోషి, లైన్ ప్రొడ్యూసర్స్: సుబ్బారావు, ఆర్. సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి.