kathi Karthika
-
అధికారంలోకి వస్తే.. రూ.500కే సిలిండర్
మెదక్: వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ. 500, మహిళలకు రూ. 4 వేల పింఛన్ అమలు చేస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గౌడ్ భరోసానిచ్చారు. మహిళల అభ్యన్నతే లక్ష్యంగా పార్టీ పాటుపడుతోందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శక్తి సూపర్ షీ పేరుతో మహిళలతో కలిసి పట్టణంలో మంగళవారం ప్రధాన వీధుల గుండా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ తోబుట్టువు కింద సొంత ఖర్చులతో నియోజకవర్గంలో అప్పుడే పుట్టిన 22 మంది ఆడ శిశువులకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున ఫోస్టాఫీప్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు తల్లులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శ్రీనివాస్‌రావు, దేవిరెడ్డి, జలేందర్‌రెడ్డిపాల్గొన్నారు. -
వరదలో జనం పాట్లు.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటుంటే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశ రాజకీయాలంటూ, తామే మూడోసారి అధికారంలోకి వస్తామంటూ చిల్లర వ్యవహారాలకు పాల్పడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్(టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీ వీ యాంకర్ కత్తి కార్తీక శనివారం రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ ‘వర్షాలు, వరదలపై మే నెలలోనే ఆయా శాఖలతో, మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సి ఉంది, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి గతంలో నిరంతరం ముఖ్యమంత్రులు పర్యవేక్షించేవారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలంటూ టైమ్‌పాస్ వ్యవహారాలు చేశారని ఆరోపించారు. అద్భుత ఇంజనీర్ అని ప్రచారం చేసుకున్న కేసీఆర్ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఏ ఒక్క పంప్‌హౌస్ అయినా మునిగిందా అని ప్రశ్నించారు. పంప్‌హౌస్‌లను కమీషన్ల కోసం కట్టి, నిర్వహణను గాలికొదిలేశారని ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీ లో కలుషితమైన తిండి వల్ల 800 మంది విద్యార్థులు రోగాల బారిన పడితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదని, మంత్రులు కేటీఆర్, హరీశ్ ఎక్కడున్నా బయటకు రావాలని డిమాండ్ చేశారు. వరదల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాల పంట మునిగిపోయిందని నివేదికలు చెబుతున్నా మంత్రి కేటీఆర్‌కు కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వరదల్లో చిక్కుకున్న కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధు ల నుంచి రూ.2 వేల కోట్లు రాష్ట్రానికి ప్రధాని మో దీ ప్రకటించేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ని అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుందని, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్‌దే అని ప్రచా ర కమిటీ చైర్మన్ మధుయాష్కీ స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ని బొంద పె డదామని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని కత్తి కార్తీక తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీలోకి కత్తి కార్తీకగౌడ్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ కత్తి కార్తీకగౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వెల్లడించింది. -
బీజేపీలోకి బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక..!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో తన నివాసంలో భేటీ అయ్యారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన కార్తీక.. ఆ తరువాత తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమచారం. కిషన్ రెడ్డితో భేటీ అనంతరం పార్టీలో చేరికపై ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు ఆమె కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. -
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన యాంకర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. భూమి వివాదాన్ని సెటిల్ చేస్తా అంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటి రూపాయల మోసానికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు తెలిపారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాగా లండన్‌లో ఆర్కిటెక్చర్ విద్యనభ్యసించిన కత్తి కార్తీక తెలంగాణ ప్రభుత్వంలో పలు ప్రాజెక్టులను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దుబ్బాక ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేసు వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిగ్‌బాస్‌లో అన్యాయం జరిగింది’
బిగ్‌బాస్‌లో కత్తి మహేష్, కత్తి కార్తీకలు తమకు అన్యాయం జరిగిందని ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎవరితో పెద్దగా వివాదాలు లేకపోయినా.. వీరిద్దరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు..? ఎలిమినేషన్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయా..? అసలు ఎంపిక ఎలా జరుగుతోంది..? ఆడియన్స్ చూస్తున్న దానికి హౌస్ లో జరుగుతున్న సంఘటనలకు వ్యత్యాసం ఉందా..? -
బిగ్‌బాస్‌లో అన్యాయం జరిగింది
-
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు కారణమేంటి..?
-
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలకు కారణమేంటి..?
బిగ్‌బాస్‌లో గొడవలకు అసలు కారణాలేంటి..? నిర్వాహకులు గొడవలు పడమని కంటెస్టెంట్ లకు చెబుతున్నారా..? లేక ఎలాగైన చివరి వరకు గేమ్ లో కొనసాగి 50 లక్షల ప్రైజ్ మనీ సాధించాలన్న కోరికతోనే ఒకరితో ఒకరు గొడవపడుతున్నారా.? -
బిగ్‌బాస్‌లో కత్తి కార్తీక గేమ్ ప్లాన్ ఫెయిలా?
-
బిగ్‌బాస్‌లో కత్తి కార్తీక గేమ్ ప్లాన్ ఫెయిలా?
బిగ్ బాస్ లో అందరి మనిషి అనిపించుకునేందుకు కత్తి కార్తీక గేమ్ ప్లే చేసిందా.? టీవీ షోస్ లో బబ్లీగా కనిపించే కార్తీక బిగ్ బాస్ లో రిజర్వ్డ్ గా కనిపించటం వెనుక కారణం ఏంటి..? కార్తీక నుంచి పార్టిసిపెంట్స్ షాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయా..? -
చురకత్తులు