అధికారంలోకి వస్తే.. రూ.500కే సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే.. రూ.500కే సిలిండర్‌

Published Wed, Aug 16 2023 6:26 AM | Last Updated on Wed, Aug 16 2023 7:59 AM

- - Sakshi

వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండర్‌ రూ. 500, మహిళలకు రూ. 4 వేల పింఛన్‌ అమలు

మెదక్: వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండర్‌ రూ. 500, మహిళలకు రూ. 4 వేల పింఛన్‌ అమలు చేస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గౌడ్‌ భరోసానిచ్చారు. మహిళల అభ్యన్నతే లక్ష్యంగా పార్టీ పాటుపడుతోందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శక్తి సూపర్‌ షీ పేరుతో మహిళలతో కలిసి పట్టణంలో మంగళవారం ప్రధాన వీధుల గుండా జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఇందిరమ్మ తోబుట్టువు కింద సొంత ఖర్చులతో నియోజకవర్గంలో అప్పుడే పుట్టిన 22 మంది ఆడ శిశువులకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున ఫోస్టాఫీప్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్‌లు తల్లులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శ్రీనివాస్‌రావు, దేవిరెడ్డి, జలేందర్‌రెడ్డిపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement