KBR Park firing
-
కర్నూలుకు ఓబులేసు తరలింపు
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు ఓబులేసును బంజారాహిల్స్ పోలీసులు కర్నూలు తరలించారు. న్యాయస్థానం అనుమతితో అతడిని అయిదు రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాల్పులకు ఉపయోగించిన ఏకే-47ను దాచిన ప్రదేశమైన కర్నూలులోని ఓర్వకల్లుకు ఓబులేసును పోలీసులు తీసుకువెళ్లారు. కాల్పుల అనంతరం ఓబులేసును పోలీసులు కర్నూలులోనే అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈనెల 19న అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓబులేసు కాల్పులకు పాల్పడ్డాడు. కాగా నార్సింగిలోని ఓబులేసు ఇంటి నుంచి ఖాళీ తూటాలను పోలీసులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ తూటాలు గ్రేహౌండ్స్‌లో చోరీ చేసిన ఏకే-47వేనా లేక ఇతర ఆయుధానివా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉంది. -
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే..
-
జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే.. ఇలా చేశా: ఓబులేసు
ఓబులేసు రిమాండ్ రిపోర్టు 'సాక్షి' చేతికి చిక్కింది. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరిక్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని.. అందుకే డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఓబులేసు అంగీకరించాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వర్తించానని చెప్పాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని, అందుకోసమే ఏకే 47ను చోరీ చేశానని ఓబులేసు పోలీసు విచారణలో అంగీకరించాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే డబ్బున్నవాళ్లు, పెద్దపెద్ద కార్లలో వచ్చేవాళ్లను గమనించేవాడినన్నాడు. డ్రైవర్ లేని కార్లలో ఓనర్లు ఎక్కిన తర్వాత తాను వెంటనే దూరాలని పథకం వేశానన్నాడు. నిత్యానందరెడ్డి సీటుబెల్టు పెట్టుకుంటున్న సమయంలో తాను సీట్లోకి వెళ్లానని, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. అంతకుముందు 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించానని, యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షలు తీసుకున్నానని, తర్వాత అతడిని వదిలేసి నార్సింగిలోని తన ఇంటికి వచ్చానని చెప్పాడు. -
ఓబులేసు ఇంట్లో 22 తూటాలు స్వాధీనం
హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడు ఓబులేసు...నివాసం ఉంటున్న ఇంట్లో వివిధ తుపాకులకు చెందిన 22 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపయోగించిన 6 బుల్లెట్ షెల్స్, 2 డమ్మీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. -
తూటాల కలకలం
-
గన్ పాయింట్
-
నిందితుడి ఊహాచిత్రం విడుదల
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద బుధవారం ఉదయం అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడి ఊహా చిత్రాన్ని వెస్ట్ జోన్ పోలీసులు విడుదల చేశారు. నిందితుడు వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మెహిదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్నాడు. బ్యాగులో దొరికిన బిల్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 13న సూపర్ మార్కెట్లో అగంతకుడు వస్తువులు కొన్నాడు. అక్కడి సిసి కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పుటేజ్‌లను పోలీసులు నిత్యానందరెడ్డికి చూపించారు. **