Khadga Prasad Sharma Oli
-
నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి నాలుగోసారి నియమి తులయ్యారు. ఆదివారం అధ్యక్షుడు రాం చంద్ర పౌడెల్ ఆయన్ను ప్రధానిగా నియమించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్– యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)–నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)లతో కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి చైనా అనుకూలవాదిగా పేరున్న ఓలి నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్లో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో పుష్ప కమల్ దహల్ ప్రచండ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఓలితోపాటు ఆయన మంత్రివర్గం సోమవారం ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు. -
నేపాల్‌లో కీలక పరిణామం
కఠ్మాండు: నేపాల్‌లో రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్–యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చారిత్రక విలీన ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. దీంతో నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బాటలు పడినట్లయింది. నేపాల్ సార్వత్రిక, ప్రావిన్షియల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈ కూటమి ఏకం కానుందని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఈ రెండు పార్టీలు విలీనం కావడంతో నేపాల్‌లో రాజకీయ స్థిరత్వానికి అవకాశం లభిస్తుందని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్–యూఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్టు సెంటర్ కలసి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 275 మంది సభ్యుల పార్లమెంట్లో ఈ కూటమి 174 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. -
నేపాల్ ప్రధానిగా ఓలీ
కఠ్మాండు: హిమాలయ దేశమైన నేపాల్‌కు 41వ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మహరాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లో అధ్యక్షురాలు బిద్యా దేవీ ఓలీ చేత ప్రమాణం చేయించారు. ఓలీ ఇంతకుముందు 2015 అక్టోబర్ నుంచి 2016, ఆగస్టు 3 వరకూ నేపాల్ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఓలీకి చెందిన సీపీఎన్–యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ 174 సీట్లు గెలిచింది. -
ప్రధాని పీఠం.. కమ్యూనిస్టుల కైవసం
కఠ్మాండు: ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్ కు కొత్త ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ నేత కె.పి.శర్మ వోలి (ఖడ్గ ప్రసాద్ శర్మ) ఎన్నికయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్ భవనంలో జరిగిన ఎన్నికలో శర్మ.. 598 ఓట్లకుగానూ 338 ఓట్లు సాధించి ప్రత్యర్థి సుశీల్ కోయిరాలాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశాధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్.. నూతన ప్రధాని చేత ప్రమాణం చేయించడం ఇక లాంఛనమే. కాగా, ప్రధానిగా ఎన్నికయిన శర్మకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు పీఎంవో ట్విట్టర్ ద్వారా తెలిపింది. సుశీల్ కోయిరాలా శనివారం ప్రధాని పదవికి రాజీనామాచేయడంతో నూతన ప్రధానిని ఎన్నుకోవడం అనివార్యమయింది. కాగా, రాజీనామా చేసినప్పటికీ కోయిరాలా.. నేపాలి కాంగ్రెస్ (ఎన్ సీ) తరఫున పదవికి పోటీలో నిలిచారు. అటు నేపాల్ మావోయిస్టు పార్టీ (యునైటెడ్ మార్క్సిస్టు, లెనినిస్టు) నుంచి కె.పి. శర్మ బరిలోకిదిగారు. సుశీల్ పేరును మాజీ ప్రధాని, సీనియర్ ఎన్‌సి నేత షేర్ బహదూర్ దూబే ప్రతిపాదించారు. ఏడేళ్ల సంప్రదింపుల అనంతరం నేపాల్‌లో గత సెప్టెంబర్ 20న కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కాగా మాదేసీ సహా కొన్ని మైనారిటీ వర్గాలు కొత్త రాజ్యాంగాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తునే ఉన్నాయి. ఆందోళనల్లో దాదాపు 40 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.