kidney patients
-
కిడ్నీ రోగులకు ఉపశమనం
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాసు్క్యలర్ సెంటర్లు, 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న డయాలసిస్ కేంద్రాల్లో అదనంగా 74 డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ తప్పనిసరి. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్ అవసరమవుతుంది. తొలిసారిగా డయాలసిస్ చేయాల్సినప్పుడు రోగికి ముందుగా శస్త్రచికిత్స చేయాలి.డయాలసిస్‌కు యాక్సెస్ పాయింట్‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా రోగి చేతి మణికట్టు దగ్గర ఈ పాయింట్ గుర్తించి సర్జరీ చేస్తారు. రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వాసు్క్యలర్ సర్జన్ ఈ ఆపరేషన్ చేస్తారు. ఈ యాక్సెస్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తేనే డయాలసిస్ ప్రక్రియ సులభతరమవుతుంది. ప్రస్తుతం వాసు్క్యలర్ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు కచి్చతంగా హైదరాబాద్ రావాల్సి ఉంటుంది. దీనివల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం కావడంతో పాటు, నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో వాసు్క్యలర్ యాక్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్స్, గాం«దీ, ఉస్మానియాలతో పాటు ఖమ్మం జనరల్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం, మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్‌లో వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వాసు్క్యలర్ సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. డయాలసిస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా వ్యవస్థ లేకపోవడంతో ఈ కేంద్రాలు అర్ధరాత్రి వరకూ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అదనంగా 74 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న సెంటర్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా రోగులకు ఉపశమనం కలగనుంది. -
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
-
ఆసుపత్రిలో సంగీత కచేరీలు...అక్కడ రోగులకు అదే ఔషధం!
సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్ క్లినిక్ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్లు, గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్‌లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా. (చదవండి: కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి) -
43 కేంద్రాలు .. 42 లక్షల డయాలసిస్ సెషన్లు.. కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ అండ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్యం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో కొందరికి క్రమం తప్పకుండా డయాలసిస్ (రక్తశుద్ధి) చేయాల్సి ఉంటోంది. కొందరికి వారానికి రెండుసార్లు... మరికొందరికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన అవసరముంటుంది. అయితే ఇదెంతో ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేటు ఆస్పత్రులు వేలల్లో వసూలు చేస్తుండటంతో పేదలు, మధ్యతరగతి రోగులకు ఈ చికిత్స భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందజేస్తోంది. ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా కాపాడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 కేంద్రాల ద్వారా రోగులకు పైసా ఖర్చు లేకుండా ఉచిత డయాలసిస్ నిర్వహిస్తున్నారు. డయాలసిస్ అవసరమైన ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఈ చికిత్సల కోసం ప్రభుత్వం 2014–15 నుంచి 2021–22 నవంబర్ 16 వరకు రూ.575.92 కోట్లు వెచ్చించింది. పెరుగుతున్న కిడ్నీ వైఫల్యాలు రాష్ట్రంలో 2014–15లో 5,598 మంది మూత్రపిండాల వైఫల్య బాధితులు ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదు కాగా..ఏటా ఈ సంఖ్య పెరుగుతోంది. ఆరేళ్లలో దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. 2015–16లో ఈ సంఖ్య 6,853కి చేరగా, 2016–17లో 7,612, 2017–18లో 8,786, 2018–19లో 10,452, 2019–20లో 10,848కి చేరినట్లు ఆరోగ్యశ్రీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020–21లో మాత్రం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 10,610గా నమోదయ్యింది. ఎప్పటికప్పుడు కొత్త కేసులు నమోదవుతున్నా ఏడాదికి సుమారు 2 వేల మందికి పైగా బాధితులు మృతి చెందుతుండడంతో గత మూడేళ్లుగా ఈ రోగుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల చోటు చేసుకోలేదని వైద్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల్ని కూడా లెక్కిస్తే ఈ రోగుల సంఖ్య రెట్టింపు ఉంటుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిలో అత్యధికం మూత్రపిండాల వైఫల్య బాధితుల్లో అత్యధికులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 02.06.2014 నుంచి 16.11.2021 వరకు రాష్ట్రంలో మొత్తం 42.61 లక్షల డయాలసిస్ సెషన్లు నిర్వహించగా హైదరాబాద్‌లో అత్యధికంగా 10,42,660 చికిత్సలు చేశారు. ఆ తర్వాత రంగారెడ్డిలో 4,87,696 చికిత్సలు జరిగాయి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల్లో కూడా లక్షకు పైగా డయాలసిస్ చికిత్సలు జరిగాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 5,142 డయాలసిస్ చికిత్సలు నమోదయ్యాయి. మూత్రపిండాల మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాధితులు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరుగు తుండడంతో డయాలసిస్ మెషీన్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదలపై పంజా.. దేశంలోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా లక్ష మంది కిడ్నీ వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. నిమ్స్ ఆసుపత్రి వైద్యుల నివేదిక ప్రకారం 2015లో ఏకంగా 1.36 లక్షల మంది మూత్రపిండాల వైఫల్యంతో చనిపోయారు. దశాబ్దం క్రితం అంతగా లేని కిడ్నీ వ్యాధి ఇప్పుడు నాలుగైదు రెట్లు పెరిగింది. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. వివిధ సంస్థలు దేశంలోని 52,273 మంది వ్యాధిగ్రస్తులపై సర్వే నిర్వహించాయి. ప్రాంతం, సామాజిక, ఆర్థిక స్థాయిల వారీగా అధ్యయనం చేశాయి. దక్షిణాది నుంచి వ్యాధికి గురైన వారిలో నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉన్నవారు ఏకంగా 44.3 శాతం మంది ఉండటం గమనార్హం. అలాగే రూ.20 వేల లోపు ఆదాయం కలిగినవారు 42.9 శాతం మందికి కిడ్నీ వ్యాధికి గురయ్యారు. దీనిని బట్టి కిడ్నీ రోగుల్లో ఎక్కువగా పేదలే ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. -
కిడ్నీ రోగులకు త్వరలో పింఛన్: ఈటల
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే వీరికి పింఛన్ మంజూరుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభ్యులు బిగాల గణేశ్, వివేకానంద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్, అబ్రహం, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు ఈటల బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 43 డయాలసిస్ కేంద్రాల్లో 270 మెషీన్లను ఏర్పాటు చేశామని, సగటున నలుగురు పేషెంట్లకు చికిత్సందిస్తున్నట్లు తెలిపారు. ఏటా ఒక్కో రోగిపై ప్రభుత్వం రూ.1.20 లక్షలను ఖర్చుచేస్తోందని, మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
కిడ్నీ బాధితులపై సీఎం జగన్ వరాలు
-
స్టేజ్ 3 పేషెంట్లకు రూ.5 వేల పెన్షన్: సీఎం జగన్
సాక్షి, పలాస/శ్రీకాకుళం : కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్ 3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్ అందజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని పేర్కొన్నారు. ఇదంతా ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తమ పార్టీని 151 స్థానాల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని... నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్ధానం ప్రాంతమంతా మంచినీటి తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. పలాస, ఇచ్చాపురం మొత్తం అన్ని గ్రామాల్లో నేరుగా ఇంటి వద్దకే తాగునీటిని అందించే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నానని తెలిపారు. తిత్లీ తుఫాను బాధితులకు చెక్కు పంపిణీ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 1500 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జీడితోట హెక్టారుకు పరిహారాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే చెక్కుల పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు. మత్స్యకార్మికుల కోసం ఫిషింగ్ జెట్టీ ‘ఆ రోజు పాదయాత్రలో మత్స్యకార సోదరులు ఫిషింగ్ జెట్టీ కావాలని అడిగారు. ఆ ఆలోచనను గత పాలకులు పట్టించుకోలేదు. వారి సమస్యలు విని నేనున్నానంటూ నాడు భరోసా ఇచ్చాను. ఈ రోజు మంచినీళ్లపేట, నువ్వులరేవులో ఫిషింగ్ జెట్టీ పెడుతున్నాం. దీంతో పాటు మత్స్యకార సోదరుల కోసం జెట్టీ నిర్మాణంతో పాటు అక్కడే అన్ని వసతులు కల్పిస్తాం. పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన హాలు ఏర్పాటు చేస్తాం. షెడ్డులు, బాత్రూరూంలు నిర్మిస్తాం. మార్కెట్ చేసుకునేందుకు అనుమతినిస్తాం. కోల్డు స్టోరేజీలు అందుబాటులోకి తెస్తాం’ అని సీఎం జగన్ తెలిపారు. అదేవిధంగా మత్స్యకార్మిక దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకార్మికులకు రూ.10వేల చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకం తీసుకువచ్చామని పేర్కొన్నారు. హామీలు నెరవేర్చి చూపిస్తున్నా.. ‘వంశధార నదిపై నేరేడు వద్ద బ్యారేజీ కట్టడంతో పాటు యుద్ధప్రాతిపదికన పనులు జరిగేందుకు చర్యలు తీసుకుంటాం. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టును పరుగులు తీయిస్తా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే విధంగా సెప్టెంబరు చివరికల్లా సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి రూ. 10 వేలు ఇస్తాం. అవ్వాతాతల పెన్షన్ కూడా సగటున 3 రెట్లు పెంచి వారిని ఆదుకుంటాం. అవ్వాతాతలకు రూ. 2250 పెన్షన్ ఇస్తున్నాం. అక్టోబరు 15న రైతు భరోసా పథకం కింద రూ. 12500 ఇస్తాం. 100 రోజుల్లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. లంచాన్ని, అవినీతిని అరికట్టేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చాం. ప్రతీ ప్రభుత్వ పథకాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తాం. డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి రూ. 24 వేలు అందజేస్తాం. అదేవిధంగా జనవరి 26న అమ్మఒడి పథకం ప్రారంభిస్తాం. ఫిబ్రవరి చివరివారంలో షాపులున్న నాయిబ్రాహ్మణులు, రజకులు, టెయిలర్లకు రూ. 10 వేలు ఇస్తాం. మార్చి చివరి వారంలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్లర్లకు పూర్తి చేయూత అందిస్తాం. ఉగాది రోజు అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా వైఎస్సార్ పెళ్లి కానుక పథకం అమలు చేస్తాం. అలాగే సున్నావడ్డీ పథకం ద్వారా డబ్బు మొత్తాన్ని నేరుగా అక్కాచెల్లెమ్మల అకౌంట్లో వేస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గత పాలకులు మాటలు చెప్పి మభ్యపెట్టారు. అందుకు భిన్నంగా నేను ఇచ్చిన హామీలను నేరవేర్చి చూపిస్తున్నా. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం వారికే కేటాయించేలా చట్టం తెచ్చాము’ అని సీఎం జగన్ తన పాలనలో అమలు చేస్తున్న, చేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉద్దానానికి ఊపిరి
-
‘ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10వేల ఆర్థిక సాయం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం.. పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్ జగన్‌ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తాం నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలో వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం కోసం ప్రతి నెలకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారి సమస్యలపై స్పందించిన జననేత.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు.. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన రైల్వేజోన్ సాధన సమితి సభ్యులు.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఉత్తరాంధ్ర రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు కలిశారు. రైల్వే జోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారు జననేతకు వివరించారు. -
ఉచిత మందులపై అవగాహన కల్పించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఉచితంగా అందజేస్తున్న మందులపై మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.ధనంజయరెడ్డి సూచించారు. ఉద్దానంలో మందుల పంపిణీ అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయట మార్కెట్లో మందులు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుందని వివరించాలన్నారు. ప్రస్తుతం 22 రకాల మందులను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రత్యేకంగా మరో ఆరు రకాలు ఉండాలని, వీటిలో ఒక రకాన్ని ఈ వారం నుంచి అందజేస్తామని పేర్కొన్నారు. వీటిపై గ్రామస్థాయిలో కమిటీలు వేసి, ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల అధికారులు ఆయా ప్రాంతాల ప్రైవేటు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగించాలని తెలిపారు. ప్రతి పంచాయతీ స్థాయిలో నోడల్ అధికారిని ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. కిడ్నీకి వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏడు మదర్ ఆర్వో ప్లాంట్లు, ఏడు మండలాల్లో 128 గ్రామాలకు చెందిన 1,89,010 మంది జనాభాకు ప్రయోజనం చేకూర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు నెఫ్రాలజిస్టులను ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 పి.రజనీకాంతరావు, డీఆర్డీఏ పీడీ జి.సి.కిషోర్‌కుమార్, డీసీహెచ్ డాక్టర్ బి.సూర్యారావు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ నాయక్, అడిషినల్ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, ఇమ్యూనైజేషన్ అధికారి బి.జగన్నాథరావు, గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీరు టి.శ్రీనివాసరావు ఉన్నారు. -
శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ వద్ద పవన్ కళ్యాణ్ అమరణ దీక్ష
-
ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించిన పవన్
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ 24 గంటల దీక్షకు దిగారు. ఎచ్చెర్ల మండలంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల వద్ద ఉదయం 9గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 5గంటల వరకు పవన్ దీక్ష కొనసాగనుంది. శనివారం సాయంత్రం దీక్ష ముగిసిన తరువాత ఆయన ప్రజాపోరాట యాత్ర కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా జనసేన మీడియా ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కల్యాణ్ 17 డిమాండ్లతో కూడిన ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య ఎమర్జెన్సీ విధించాలని, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి నేరుగా దీనిని పర్యవేక్షించాలని జనసేన డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన లేదన్నారు. కిడ్నీ వ్యాధితో జిల్లాలో రోజుకు ఒకరు మృత్యువాత పడుతున్నా సర్కార్ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. సాంకేతికంగా ప్రగతి సాధించిన ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన సమస్యగా మారిందన్నారు. -
కిడ్నీ రోగులకు దిక్కెవరు?
‘కిడ్నీ రోగులకు మంచి రోజులు రానున్నాయి. అతి త్వరలోనే స్థానికంగానే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..’ ఇవీ మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటీవల గుప్పించిన హామీలు. కొత్తగా వైద్యసేవలు మాట అటుంచితే ఉన్న వైద్యులు కూడా వేరే జిల్లాలకు వెళ్లిపోవడంతో కిడ్నీ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోనే ఏకైక నెఫ్రాలజిస్టు తాజాగా కర్నూలు జిల్లాలోని వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని కిడ్నీ రోగుల కోసం రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ప్రారంభిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు జిల్లాకు వచ్చినప్పుడల్లా హామీ ప్రకటించడం.. తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారింది. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా హామీ నెరవేకపోవడంతో రిమ్స్‌లో నెఫ్రాలజీ యూనిట్ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో ఇప్పటి వరకు సూపర్ స్పెషాలిటీ స్థాయిలో శిక్షణ పొందిన నెఫ్రాలజిస్టు డాక్టర్ జ్యోత్స్న మాత్రమే ఉన్నారు. ఈమె కొన్నాళ్లుగా రిమ్స్‌లో మెడికల్ విభాగంలో పనిచేస్తున్నారు. నెఫ్రాలజీలో పీజీ డిగ్రీ ఉన్నా స్థానికంగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యులుగా చేరి కిడ్నీ రోగులకు సేవలు అందించేవారు. ఆమెకు తాజాగా కర్నూలు వైద్య కళాశాలలో నెఫ్రాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ కావాలని ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఆమె రిలీవ్ అయ్యారు. రిమ్స్‌లోనే నెఫ్రాలజీ విభాగం ఉంటే ఆమె ఇక్కడే ఉండే అవకాశముండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఉద్దానం ప్రాంతంతో పాటు పలు మండలాల్లో కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్నారు. అధికారులు పలు సర్వేలు, పరీక్షలు చేసిన తర్వాత 13,000 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ రోగులకు క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందించే ప్రత్యేక వైద్యులు నెఫ్రాలజిస్టులు లేరు. దీంతో ఏ సమస్య వచ్చినా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెఫ్రాలజిస్టు లేకపోతే ఈ సమస్యలు తప్పవు.. ♦ కిడ్నీ రోగులకు నిరంతర నెఫ్రాలజీ విభాగం సేవలు ఇక అందవు, ♦ రోగికి డయాలసిస్ చేసేటప్పుడు ఎ.వి.ఫిçస్ట్టల్‌ను మెడ, ఇతర భాగాల్లో వైద్యులు, టెక్నీషియన్లు అమర్చలేరు. ♦ కిడ్నీ వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడు రోగికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సెంట్రల్ లైన్ ఏర్పాటు చేయాలంటే నెఫ్రాలజిస్టుకు మాత్రమే సాధ్యమవుతుంది. ♦ డయాలసిస్ జరుగుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తితే వారికి తక్షణ వైద్యం అందించే నెఫ్రాలజిస్టులు స్థానికంగా ఉండాలి. రిమ్స్‌లో ఇకపై ఆ సదుపాయం ఉండదు. -
కిడ్నీ బాధితుల పెన్షన్ సంగతేంటి !
-
ఏపీ కేబినెట్‌కు వైఎస్ జగన్ నవరత్నాల ఎఫెక్ట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాల’ ఎఫెక్ట్ తగిలింది. తాము అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తామని వైఎస్ జగన్ ఇటీవల జరిగిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాల్లో పర్యటన సందర్భంలోనూ ఆయన కిడ్ని బాధితులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో దిగొచ్చిన ఏపీ సర్కార్ కిడ్ని బాధితులకు రూ.2,500 పెన్షన్ ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కాగా ఏపీ కేబినెట్ ఇవాళ సుదీర్ఘంగా సమావేశమైంది. సుమారు నాలుగు గంటల పాటు పలు అంశాలపై చర్చించింది. కేబినెట్ నిర్ణయాలు.... ఏపీ స్టేట్ వాటర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం బెల్ట్ షాపుల తొలగింపుకు నిర్ణయం రోడ్డుపై మద్యం సేవిస్తూ కనబడినా అరెస్ట్ బహిరంగ మద్యం వాడకం నివారణకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం డయాలసిస్ రోగులకు రూ.2,500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం ఇసుకు అక్రమ రవాణాపై చర్చించిన కేబినెట్ ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీ వేయాలని నిర్ణయం కలెక్టర్, ఎస్పీలతో పాటు మరో ఇద్దరితో కమిటీ ఇసుక రవాణా చార్జీలపైనా నియంత్రణ ఉండాలని నిర్ణయం -
కామ్నేని!
► ఆరోగ్యశాఖ మంత్రి వస్తారు... వెళ్తారు! ► సిక్కోలులో మెరుగుపడని వైద్య సౌకర్యాలు ► ఆచరణకు నోచుకోని కామినేని హామీలు ► ఉద్దానం యేతర ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర శీర్షికతో ఈనెల 11న సాక్షి ప్రచురించిన కథనంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది! రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు! వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు! అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం ఇది తొలిసారి కాదు! శ్రీకాకుళం జిల్లా పర్యటనకొచ్చినప్పుడల్లా వైద్య సౌకర్యాలపై దృష్టి పెడతామని చెబుతున్నారు! ఇలా ఆయన ఎన్నిసార్లు పర్యటించి వెళ్లినా పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు. పలాస ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ప్రారంభించేందుకు మంత్రి కామినేని శ్రీకాకుళం జిల్లాకు శనివారం మరోసారి వస్తున్నారు. వాస్తవానికి మంత్రి స్థాయిలో ప్రారంభించాల్సిన కార్యక్రమం కాకపోయినా ఆయన వస్తే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి మారుతుందేమోనన్న ఆశలు జిల్లా ప్రజల్లో అలాగే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాను కిడ్నీ వ్యాధులు వణికిస్తున్నాయి. ఒక్క ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లోనే 28 శాతం మంది వాటిని బారినపడ్డారు. ప్రపంచంలో అంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధి ప్రబలిన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఎప్పుడో హెచ్చరించింది. ఇప్పుడు జిల్లాలో ఉద్దానం ఒక్కటే కాదు ఆమదాలవలస, ఫరీదుపేట, చిలకపాలెం, పాలకొండ తదితర ప్రాంతాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఉద్దానంలోనైనా నిపుణులు ఎవ్వరికి వారు పరిశోధనలు చేసి వెళ్లిపోవడమే తప్ప వాటినన్నింటినీ క్రోడీకరించి, తదుపరి పరిశోధనలను కొనసాగించే, సమన్వయం చేసే వ్యవస్థే లేకుండా పోయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు అనుబంధంగా పరిశోధన కేంద్రాన్ని శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా రాలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి కామినేని దీనిపై ఏదొక ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఉద్దానంలో ఇప్పటివరకు 39 వేల మందికి రక్తం, యూరియా, సీరం క్రియేటినిన్ పరీక్షలు నిర్వహించగా వారిలో 12 వేల మందికి సీరం క్రియేటినిన్ 1.2 శాతం కంటే ఎక్కువుగా ఉన్నట్లు వెల్లడైంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన వీరికి తక్షణమే వైద్య సహాయం అందించాల్సి ఉంది. మిగతావారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. గత జనవరి 19న సోంపేటలో జరిగిన సమావేశంలో పలాస, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చినప్పటికీ కేవలం పలాసలో మాత్రమే శనివారం ప్రారంభిస్తున్నారు. నిర్లక్ష్యం నీడలో రిమ్స్.. వెనుకబడిన సిక్కోలు జిల్లాకు ఆరోగ్య ప్రదాయినిలా ఉంటుందనే ఆశయంతో 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రిమ్స్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఛాయల్లోకి నెట్టేసింది. దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా చూడాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేస్తోంది. మొత్తం 13 బ్లాక్‌ల్లో ఇప్పటికీ ఏడు బ్లాకులు అందుబాటులోకి రాలేదు. పీజీ మెడికల్ సీటు ఒక్కటే రిమ్స్ బోధనాసుపత్రిలో ఉందంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పరిపాలన తూతూమంత్రంగా మారిపోయింది. కీలకమైన పోస్టులన్నింటిలోనూ ఇన్చార్జి్జలతోనే నెట్టుకొస్తున్నారు. ఎంతో కీలకమైన డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, డీన్ (ప్రిన్సిపాల్) వంటి పోస్టుల్లోనూ రెండేళ్లుగా ఇన్చార్జి్జలే కొనసాగుతున్నారు. ఇలా ముఖ్యమైన వైద్యసిబ్బంది కొరత ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీని పర్యవసానంగా వైద్య కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్రమైన పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రిమ్స్ ఫ్యాకల్టీ విభాగాల్లో 30 శాతం, వైద్యుల విభాగంలో 20 శాతం, దిగువ స్థాయి సిబ్బందిలో 20 శాతం మేర ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రిమ్స్‌కు వచ్చే రోగులకు తగినవిధంగా వైద్యసేవలు అందట్లేదు. వారంతా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులకో, లేదంటే విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకో పరుగులు తీస్తున్నారు. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
కిడ్నీ రోగులకు మరిన్ని సేవలు
► సర్వేలో గుర్తించిన వారికి తదుపరి పరీక్షలు చేయాలి ► కిడ్నీ రోగుల వైద్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► ఆరోగ్య శాఖ డైరెక్టర్ అరుణకుమారి శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్దానం ఇతర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని, వారిని గుర్తించి వ్యాధి ముదరక ముందే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.అరుణకుమారి అన్నారు. ఉద్దానం కిడ్నీ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రుల వైద్యాధికారులకు శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కిడ్నీవ్యాధులపై ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉద్దానం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ను కచ్చితంగా కొనసాగించాలని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిని హరిపురం, పలాసల్లోని సీఈసీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. రోగుల పరిస్థితులు, అలవాట్లపై అధ్యయనం చేయాలని అన్నారు. అలాగే కిడ్నీ రోగం దశలు, రకాలు కూడా గుర్తిం చాలని అన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న మందులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, వాటి పరిస్థితి, మం దుల కొరత, ఇంకా కావల్సిన వసతుల గురించి ఆరా తీశారు. రానున్న రోజుల్లో ఎ లాంటి సేవలు అం దించాలి, మెరుగైన సేవలకు కావల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి రోగికీ తప్పని సరిగా కౌన్సిలింగ్ చేయాలని అన్నారు. ఏపీ వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ రోగుల గుర్తింపు ప్రాథమిక దశలో ఉంటే మందుల ద్వారా ఎంతవరకు నయం చేయగలమో అంతవరకు వారికి తగిన సేవలు, మందులు అందించాలని తెలిపారు. సర్వేలో రోగి పూర్తి వివరాలు ఉండడంతో వారికి తగిన సూచనలు, సలహాలు అందించి, వారి జీవిత కాలం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంహెచ్ఓ తిరుపతిరావు మాట్లాడుతూ ఇప్పటివరకు 13 వేల మందిని సర్వే చేశామని, 9వేల మంది హైరిస్క్‌లో ఉన్నారని వివరించారు. మిగిలిన వారికి సర్వేలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కేజీహెచ్‌కు చెందిన నెఫ్రాలజీ ప్రొఫెసర్ ప్రసాద్ కిడ్నీ వ్యాధి రకాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ బొడ్డేపల్లి సూర్యారావు, వైద్యాధికారులు బగాది జగన్నాథరావు, మెండ ప్రవీణ్, 17 పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
రక్త కన్నీరు..!
పెద్దాస్పత్రిలో కిడ్నీ రోగుల వెతలు - ఏ పనీ చేయలేకపోతున్న బాధితులు - అత్తెసరు సౌకర్యాలతో దినదిన గండం - శాశ్వత పరిష్కారానికి డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన కర్నూలు(హాస్పిటల్): ఒకటి కాదు.. రెండు కాదు.. వారానికి మూడు సార్లు డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకోవాలి. ఇలా నెలకు 12 సార్లు, సంవత్సరానికి 144 సార్లు.. ప్రతిసారీ రక్తం తగ్గిపోవడమో, ఐరన్‌లోపం ఏర్పడమో జరుగుతుంది. దీనివల్ల వారికి ఏ పనీ చేతకాదు. జీవితం మంచానికే పరిమితం. కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉద్దానం, సింగోటం, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలే కాదు.. కర్నూలు జిల్లాలోని కిడ్నీ బాధితులనూ ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు పక్కనున్న అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా, మహబూబ్‌నగర్, రాయచూరు, బళ్లారి ప్రాంతాల నుంచి కూడా కిడ్నీ బాధితులు చికిత్స కోసం వస్తారు. వారికి ఆసుపత్రిలోని నెఫ్రాలజి విభాగం సేవలందిస్తుంది. ఆసుపత్రిలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేందుకు బీ బ్రాన్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. ఇందులో 20 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. కొత్తగా ఆసుపత్రికి 6 మిషన్లు వచ్చాయి. ప్రస్తుతం 25 మిషన్లు రోగులకు మూడు షిఫ్ట్‌లలో డయాలసిస్ చేస్తున్నాయి. రోజుకు ఇక్కడ 30 నుంచి 40 మందికి డయాలసిస్ చేస్తారు. ప్రస్తుతం స్టేజ్–5లో 104 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్దాసుపత్రిలో ఆరేళ్లుగా కిడ్నీ బాధితుల వివరాలు సంవత్సరం ఓపీ ఐపీ డయాలసిస్ చేయించుకుంటున్న వారు 2011 4,095 978 13,371 2012 5,380 992 12,939 2013 8,621 1228 15,893 2014 9,821 1240 17721 2015 5,036 1,224 16,675 2016 4,472 1,403 14,858 కిడ్నీ బాధితుల డిమాండ్లు ఇవీ...! 1. డయాలసిస్ కోసం పెద్దాస్పత్రిక వచ్చే ప్రతిసారీ రోగితో పాటు సహాయకునికి ఉచిత బస్సు పాస్ ఇవ్వాలి. 2. ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. 3. కిడ్నీ రోగులకు చేసే ఫిస్టులా ఆపరేషన్లు ఒకసారి ఫెయిలైనా రెండోసారి కూడా ఎన్టీఆర్ వైద్యసేవలో ఉచితంగా చేయాలి. 4. రోగి అవసరాన్ని బట్టి ప్రతి డయాలసిస్‌కు ఒకసారి బ్లడ్ ఇంజెక్షన్, ఐరన్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇవ్వాలి. 5. డయాలసిస్‌కు వచ్చిన రోజు రోగితో పాటు సహాయకునికి ఆహారం ఉచితంగా ఇవ్వాలి. 6. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాత డయాలసిస్ మిషన్లు మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలి. అక్కడ సిబ్బంది కొరత లేకుండా చూడాలి. రోగులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఆయాసంతో బాధపడే డయాలసిస్ రోగులకు ఉచితంగా నెబిలైజేషన్ పరికరాలు అందించాలి. 7. ప్రభుత్వమే దాతల ద్వారా మూత్రపిండాలు సేకరించి రోగులకు ఉచితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు చేయాలి. ప్రయాణ ఖర్చులకే నెలకు రూ.4వేలు –రాజానందబాబు, ఎమ్మిగనూరు కిడ్నీ ఫెయిలై నేను నాలుగు సంవత్సరాలుగా బాధపడుతున్నా. నేనో ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా.. వ్యాధి వచ్చిన తర్వాత మానేశా. నా భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్ఽ. ఆమె సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. నేను, నాతో పాటు ఒకరు డయాలసిస్‌కు కర్నూలు రావాలంటే నెలకు రూ.4వేలు ప్రయాణ చార్జీలకే అవుతుంది. వైద్యసేవ కింద 10 సార్లు వస్తే ఒక్కసారే టీఏ ఇస్తున్నారు. ఫిస్టులా ఆపరేషన్ ఉచితంగా చేయాలి –శ్రీనివాస్, కర్నూలు నేను గతంలో అపోలో సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసేవాన్ని. కిడ్నీ ఫెయిల్ కావడంతో ఉద్యోగం మానేశా. నాకు వైద్యసేవ కార్డు లేదు. సీఎంసీఓ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్నా. కానీ ప్రతి 10 డయాలసిస్‌లకు ఒకసారి సీఎంసీఓ లెటర్‌ను రెన్యూవల్ చేయించుకోవాలి. వైద్యసేవ కింద కిడ్నీ రోగులకు ఒకసారి ఫిస్టులా ఆపరేషన్ ఫెయిలైతే రెండోసారి ఉచితంగా చేయరు. దీనికి మళ్లీ రోగికి రూ.40వేలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే ఉచితంగా చేయాలి. ఏ పనీ చేయలేకపోతున్నా...! –జి.నరేష్, పోదొడ్డి, ప్యాపిలి మండలం మాది వ్యవసాయ కుటుంబం. నాకు 21 ఏళ్లు. రెండేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. చిన్న వయస్సులోనే రావడంతో ఏ పనీ చేయలేకపోతున్నా. ఆసుపత్రిలో ఎరిట్ప్రొటీన్(బ్లడ్ ఇంజెక్షన్), ఐరన్ ఇంజక్షన్లు రోగి అవసరం మేరకు ప్రతిసారీ ఇవ్వాలి. వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయాలి. ఏ పనీ చేయకపోతున్న మాకు నెలకు రూ.5వేల భృతి ఇవ్వాలి. ఉచిత బస్‌పాస్ ఇవ్వాలి –ప్రకాశం, సి.బెళగల్ మాది సి.బెళగల్ మండం కొండాపురం. నాకు ఒక ఎకరం పొలం ఉంది. వ్యవసాయంతో పాటు కూలీ పనిచేసుకునేవాన్ని. సంవత్సరం కిందట కిడ్నీ ఫెయిలైంది. అప్పటి నుంచి వారంలో మూడు రోజులు పెద్దాసుపత్రికి వచ్చి డయాలసిస్ చేయించుకోవాలి. వచ్చిన ప్రతిసారీ ప్రయాణ ఖర్చులు రూ.200 అవుతోంది. ప్రభుత్వం ఉచిత బస్సు పాస్‌ను కిడ్నీ బాధితులకు ఇస్తే కొంత సాంత్వన కలుగుతుంది. -
20న ప్రకాశం జిల్లాకు వైఎస్ జగన్
-
20న ప్రకాశం జిల్లాకు జగన్
పీసీ పల్లె మండలం కిడ్నీ బాధిత ప్రాంతాల్లో పర్యటన జిల్లాలో రెండేళ్లలో 424 కిడ్నీ వ్యాధిగ్రస్తుల మరణాలు సాక్షి, హైదరాబాద్: పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా విఫలమై ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 20వ తేదీన ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. 19న సీఆర్ డీఏ గ్రామాలకు వెళుతున్న జగన్ ఆ మర్నాడు ప్రకాశం జిల్లాకు వెళతారు. కనిగిరి శాసనసభా నియోజకవర్గంలోని పీసీ పల్లె మండలంతో పాటు పోలవరాన్నీ జగన్ సందర్శిస్తారు. కనిగిరి పరిసరాల్లో కిడ్నీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. పలువురు కిడ్నీ రోగులు సోమవారం హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి రోదన చూసి జగన్ చలించిపోయారు. తాను ఈ నెల 20న బాధి తుల వద్దకు వస్తానని, అక్కడ పర్యటించిన తరువాత కిడ్నీ రోగులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వారికి హామీ ఇచ్చారు. కిడ్నీ రోగులతో పాటుగా జగన్‌ను కలిసిన వారిలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, న్యాయవాది నాగిరెడ్డి ఉన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా చేయించాలనే బృహత్తరమైన ఆశయంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అవుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం కనిగిరి ప్రాంత కిడ్నీ రోగులేనన్నారు. జనవరి 2015 నుంచి 2016 డిసెంబర్ వరకూ ప్రకాశం జిల్లాలో 424 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు చనిపోయారని, ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతవాసులను ఆదుకోవాలి కోరారు. – వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీ -
'ఉద్దానం కిడ్నీ సమస్య దీర్ఘకాలికమైనది'
శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య దీర్ఘకాలికమైందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రోజురోజుకు రిమ్స్ అధ్వాన్నంగా తయారవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ( చదవండి : 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే ) ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. -
నెల రోజుల్లో డయాలసిస్ సేవలు
నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు ప్రారంభమైన టెండర్ల ప్రకియ పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్యసేవలు ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం ఎంజీఎం : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులలో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్. జనగామ, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. నెల రోజుల్లోనే ఈ నాలుగు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు సైతం పిలిచారు. ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం నాలుగు జిల్లాల నుంచి కిడ్నీ వ్యాధి బాధితులు డయాలసిస్ చేసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో డయాలసిస్ సేవలు కొనసాగుతుండగా సుమారు 300 మంది రోగులు రోజూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒక్కోరోగికి నెలకు 8 నుంచి పదిసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకు రోగులు పెరుగుతుండడంతో ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు సరిపోక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే డయాలసిస్ కేంద్రాలతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సేవలందుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్కో డయాలసిస్ కేంద్రానికి రూ.50 లక్షలు ఖర్చు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే 34 డయాలసిస్ కేంద్రాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆస్పత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనుందని వైద్యవిధాన పరిషత్ జిల్లా కోర్డినేటర్ ఆకుల సంజీవయ్య తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేవిధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఏర్పాటు చేసే డయాలసిస్ సెంటర్‌కు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని లె లిపారు. జిల్లాలో ప్రస్తుతం వంద పడకలతో మహబూబ్‌బాద్, జనగామ, 50 పడకలతో నర్సంపేట, 30 పడకలతో ఏటూరునాగారం ఆస్పత్రులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలైన నెప్రాలజీ, యురాలజీ వంటి విభాగంలో అందుబాటులోకి రావడం వల్ల పేదలకు మెరుగైన సేవలు అందుతాయని, ముఖ్యంగా ఏటూరునాగారం వంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
కిడ్నీ గండం
పక్క జిల్లా అయిన శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంత ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, వారి కుటుంబాలను వీధిన పడేస్తున్న కిడ్నీ వ్యాధి ఇప్పుడు జిల్లాలో కూడా విజృంభిస్తోంది. ఏడాదికి సుమారు ఏడు వేల మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన తరువాత వైద్యం, డయాలసిస్ చేయించుకోడానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుండడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అవగాహన లోపం, నిర్లక్షం వల్లే జిల్లాలో ఈ వ్యాధి గ్రస్తులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. విజయనగరంఆరోగ్యం: జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య ఆందోళనకలిగించేలా పెరుగుతోంది. గతంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యచాలా తక్కువగా ఉండేది. కాని ఆహారపు అలవాట్లలో మార్పులు, నిత్యం ఒత్తిడికి గురికావడంతో పాటు, వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, కలుషిత నీటి వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి 5 వేల నంచి 7 వేల మంది వరకూ కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఏడాదికి 500 మంది వరకు వ్యాధి బారిన పడేవారు. కానీ ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో అన్ని మండలాల్లోను కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బీపీ, మధుమేహం వల్లే 60 నుంచి 70 శాతం మందికి ఈ వ్యాధి సోకుతోంది. జిల్లాలో ప్రస్తుతం 25 వేల మంది వరకూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరిలో కొంతమంది విశాఖపట్నంలో, మరి కొంత మంది విజయనగరం పట్టణంలోని కేంద్రాస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కిటకిటలాడుతున్న డయాలసిస్ సెంటర్ జిల్లాలో కేంద్రాస్పత్రిలో ఒకటి, ప్రైవేటు ఆస్పత్రులో ఒక డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. ఈ రెండు సెంటర్లు నిత్యం వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. డయాలసిస్ చేయించుకోడానికి బాధితులు ఆస్తులు అమ్ముకోవలసి వస్తోంది. ఇంటి యజమానులకు కిడ్నీ వ్యాధి సోకడంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. వ్యాధి సోకడానికి కారణాలు : బీపీ, మధుమేహంలను అదుపులో ఉంచుకోలేకపోవడం, మలేరియా, డయేరియా వంటి వ్యాధులకు సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం, కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ వ్యాధి సోకుతుంది. తీవ్ర ఒత్తిడి, కలుషత నీరు తాగడం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడతారు. మధుమేహం వల్ల 50 శాతం, బీపీ వల్ల 20 శాతం, కలుషిత నీరు తాగడం వల్ల 10 శాతం, కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ వల్ల 10 శాతం, తీవ్ర ఒత్తిడి వల్ల ఈ వ్యాధి సోకుతోంది. రోగుల అభిప్రాయాలు : నాపేరు రామదాసు. మాది గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామం. నాకు కిడ్నీ వ్యాధిసోకి మూడు సంవత్సరాలైంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల, ఎక్కడపడితే అక్కడ నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి సోకిందని విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో మూడు ఏళ్ల క్రితం నిర్ధారించారు. అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను. నా పేరు లక్ష్మి, మాది పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామం. నాకు కిడ్నీవ్యాధి సోకి ఐదు సంవత్సరాలైయింది. బీపీ ఉండడం వల్ల కిడ్నీ వ్యాధిసోకిందని వైద్యులు తెలిపారు.అప్పటినుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను