kidney racket gang
-
కిడ్నీ రాకెట్ ఘటనలో కొత్త మలుపు
-
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను బంజారాహిల్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. నగర వాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీలు చేయిస్తున్న పవన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై శ్రీలంకతో పాటు భారత్‌లోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు వివరాలను వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరిస్తూ.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ ముప్పై కేసుల్లో నిందితుడని, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోయారని తెలిపారు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో శ్రీనివాస్ కిడ్నీ అమ్ముకున్నాడు. ఒక్కొక్క కిడ్నీ అమ్మకంలో డాక్టర్లకు రూ.15 లక్షలు, డోనర్‌కు రూ.5 లక్షలు, నిందితుడు శ్రీనివాస్ రూ.5 లక్షల నుంచి 7 లక్షలు తీసుకునే వాడు. 2013లో శ్రీనివాస్ కిడ్నీ వ్యాపారం ప్రారంభించాడని తెలిపారు. ఇప్పటివరకు 30 కేసుల్లో శ్రీనివాస్ నిందితుడని, కిడ్నీ అమ్మేవారిని తీసుకుని శ్రీలంకలోని 4 ఆస్పత్రుల్లో అమ్మేవాడు. అక్కడ 9 ఆపరేషన్లలో శ్రీనివాస్ నేరుగా పాల్గొన్నారని జాయింట్ సీపీ తెలిపారు. బంజారాహిల్స్ కమలాపురి కాలనీకి చెందిన నాగరాజుకు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన భార్య బిజ్జల భారతీ స్టార్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. డయాలసిప్ చేయించేందుకు భర్తను తీసుకొచ్చే క్రమంలో భారతీని గమనించిన నిందితుడు శ్రీనివాస్.. విదేశాల్లో మీ భర్తకి మెరుగైన చికిత్స చేయిస్తానని నమ్మబలికాడు. ఇందు కోసం రూ.34 లక్షలు ఖర్చవుతాయని చెప్పగా, బాధితురాలు పలు దఫాలుగా నిందితుడికి సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బును తీసుకుని నిందితుడు పరారీ అయ్యాడు. జూన్ 2019లో శ్రీనివాస్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. -
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
-
మూత్రపిండాలను అమ్ముతాం, కొంటాం..
మూత్రపిండాలను అమ్ముతాం,కొంటాం. ఇందుకు మొదట రూ.50 వేల వరకు వైద్య బీమా చెల్లించాలి.ఆ వెంటనే వ్యవహారం పూర్తి అని అమాయకుల నుంచి డబ్బులుకొల్లగొడుతున్న ఘరానా ముఠాకటకటాల పాలైంది. ముగ్గురు ఆఫ్రికావాసులు, ముగ్గురు త్రిపుర పౌరులు కలిసి బెంగళూరులో ఈ దందానడిపిస్తున్నారు. బాధితుల నుంచి డబ్బును త్రిపురలోని అమాయకుల ఖాతాల్లోకి మళ్లించి ఆ డబ్బును మళ్లీ వీరు ఏటీఎంల ద్వారా డ్రా చేసుకునేవారు. ఓ వైద్యుని ఫిర్యాదుతో డొంక కదిలింది. బనశంకరి: అనారోగ్యంతో బాధపడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని మూత్రపిండాల క్రయ విక్రయాల పేరుతో ఇంటర్నెట్లో ప్రకటనలు ఇచ్చి 300 మందికిపైగా మోసగించిన ఒక ముఠాను ఆదివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ఆఫ్రికావాసులు, మరో ముగ్గురు త్రిపుర రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. నైజీరియాకు చెందిన యెసన్లవ్లీ, సూడాన్‌వాసి మహమ్మద్ అహ్మద్ ఇస్మాయిల్ బాబూసాపాళ్యలో సన్మార్నగర మార్వన్ కమ్మనహళ్లిలో నివాసం ఉండేవారు. త్రిపుర రాష్ట్రం పారా దలాయి జిల్లాకు చెందిన హిరేంద్ర త్రిపురా, నగర బీడీఏ లేఔట్లో మానుఘాట్ దలాయి కేమిరంజన్, జతిన్‌కుమార్‌లు బొమ్మనహళ్లిలో ఉంటున్నారు. ఈ ఆరుమంది వంచకులు సుమారు 300 మంది వద్ద తలా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కిడ్నీ విక్రయం పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. వైద్యుని ఫిర్యాదుతో.. కిడ్నీల అమ్ముతాం, కొంటామంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చి డాక్టర్ల పేరుతో ఇ–మెయిల్ ద్వారా ప్రజలను సంప్రదించేవారు. తన ఆసుపత్రి పేరును దుర్వినియోగం చేసుకుని ఆరుమంది వంచకులు కిడ్నీ వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు బాణసవాడికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడుస్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రంగా పరిగణించిన బాణసవాడి ఏసీపీ రవిప్రసాద్ నేతృత్వంలోని పోలీస్‌బృందం ఆరుమంది ముఠాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. స్కాం చేసేవారిలా త్రిపుర రాష్ట్రానికి చెందిన పేద ప్రజల నుంచ వీరు మాయమాటలు చెప్పి పెద్దసంఖ్యలో బ్యాంకు అకౌంట్ల నంబర్లు తీసుకున్నారు. వారిపేరుతోనే సిమ్‌కార్డులు, ఏటీఎంలు పొందారు. ఇక కిడ్నీలు అమ్ముకుంటే పెద్దమొత్తంలో ధనం వస్తుందని ఇంటర్నెట్లో ప్రచారం చేసుకున్నారు. బాణసవాడిలో ఓ స్పెషలిస్ట్ ఆసుపత్రి డాక్టర్ పేరును వినియోగించి సుమారు 200 మందిని సంప్రదించారు. మీరు కిడ్నీ కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు, ఇందుకోసం మొదట బీమా చేయాలి, దీనికిరూ.50 వేల నుంచి 60 వేల ఫీజు అవుతుందని నమ్మించేవారు. ఎవరైనా సంప్రదిస్తే, వారి నుంచి డబ్బును త్రిపురలో ప్రజల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకుని ఏటీఎం ద్వారా డ్రా చేసుకునేవారు. ఏసీపీ రవిప్రసాద్, సీఐ హెచ్.జయరాజ్, ఎస్ఐ సంగీత చౌహన్తో కూడిన బృందం వంచక ముఠా ఆచూకీ కనిపెట్టింది. మోసగాళ్లు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు, వైద్యుల పేర్లను వాడుకుంటూ దగాకు పాల్పడినట్లు విచారణలో వెలుగుచూసింది. వీరిపై బాణసవాడిపోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
బాలాజీ సింగ్ మహాజాదూ!
సినిమాలకు డబ్బింగ్ అవకాశం ఇప్పిస్తానంటూ మహిళలకు ఎర కిడ్నీల దానం పేరిట రూ.లక్షల్లో వసూలు సాయికుమార్ కోసం కొనసాగుతున్న గాలింపు సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్లో కీలక నిందితుడైన బాలాజీ సింగ్ మోసాలు చేయడంలో దిట్టని తెలుస్తోంది. స్థానిక సత్యనారాయణపురం పోలీసులు కిడ్నీ రాకెట్ ముఠాను అరెస్టు చేసిన ప్పుడు అతడిని ప్రశ్నిస్తే క్షణం కూడా తడుముకోకుండా తన మోసాల చిట్టా విప్పాడు. అతని తండ్రి గోవింద్‌సింగ్, సోదరుడు పృధ్వీరాజ్‌సింగ్ కూడా మోసాల్లో సిద్ధహస్తులే. ఈ విషయాలను బాలాజీ సింగ్ స్వయంగా అంగీకరించాడు. దీంతో పోలీసులు పృధ్వీరాజ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. మోసపోయిన మహిళలు బాలాజీసింగ్ మళయాల డబ్బింగ్ సినిమాలు కొనుగోలు చేసి ఆడించడం ద్వారా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలని, మంచి గొంతు ఉంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానంటూ పలువురు యువతులు, మహిళలను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడ కొందరిని పరిచయం చేశాడు. గాత్రం బాగున్నవారికి మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేశాడు. విజయవాడలోనే ఐదుగురి నుంచి ఇలా డబ్బు వసూలు చేశాడని తెలిసింది. బాలాజీ సింగ్‌ను అరెస్టు చేశారని పత్రికల్లో వార్తలు రావడంతో విజయవాడకు చెందిన ఒక మహిళ తాను మోసపోయిన వివరాలను సత్యనారాయణపురం పోలీసులకు తెలిపింది. అయితే ఆమె నివసిస్తున్న ప్రాంతం సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులనే ఆశ్రయించాలని సత్యనారాయణపురం పోలీ సులు సూచించారు. బాలాజీ చేతిలో చాలామంది మోసపోయినా కేసు పెడితే పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అనంతరం ఇబ్బందికర పరిస్థితులు ఎదరవుతాయని పలువురు వెనుకాడుతున్నారని సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి కిడ్నీ విక్రయించి అప్పుల బారినుంచి బయటపడొచ్చంటూ కొందరికి లక్షల రూపాయల్లో ఎరవేసి మోసగించాడు. కొందరితో వ్యభిచారం కూడా చేయించాడని తెలిసింది. ఇలా మోసపోయిన వారు లోలోపల కుమిలిపోతున్నట్లు తెలిసింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తనతో పాటు చాలా మంది మోసపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్న నాగసాయిదుర్గ, జి.ఉమాదేవి కిడ్నీలను విక్రయించేందుకు కూడా సింగ్ సిద్ధమయ్యాడు. ఫోర్జరీ సంతకాల డాక్యుమెంట్ల వ్యవహారం బయటకు రాకుంటే వారిద్దరి కిడ్నీలు కూడా అమ్మేసేవాడు. బాలాజీసింగ్‌ను పోలీసులు కష్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కిడ్నీలు ఇప్పిస్తానంటూ మోసం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడల్లోని కిడ్నీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లోని సిబ్బందితో సంబంధాలు పెంచుకున్న బాలాజీ సింగ్ కిడ్నీ రోగులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారి వివరాలు తెలుసుకునేవాడు. కిడ్నీలు ఇప్పిస్తానంటూ రోగులు, వారి బంధువుల ఆర్థిక స్థాయిని బట్టి రూ.లక్షల్లో బేరం కుదుర్చుకుని కొంత మొత్తం ముందుగానే వసూలు చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్‌తో సంబంధాలు బలపడటంతో ఆయనకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యమైన వైద్యులతో కూడా బాలాజీ సింగ్ పరిచయం పెంచుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఐ.పోలవరం శివారు తిళ్ళకుప్పకు చెందిన కడియం అబ్బు నుంచి నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షలు వసూలుచేశాడు. అయితే కిడ్నీ ఇప్పించలేదు. ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారని సమాచారం. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బాలాజీసింగ్, పృధ్వీరాజ్ సింగ్‌లను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సత్యనారాయణపురం పోలీసులు గురువారం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.