Kiran Rathod
-
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
నేను ప్రేమించిన వాడు రోడ్డున పడ్డాడు: హీరోయిన్
పెరగడం, విరగడం ఈ రెండూ చిత్ర పరిశ్రమలో సహజం. ఉన్నత స్థాయికి ఎదగడం, పాతాళంలోకి తొక్కివేయడం అనేవి చాలా జరుగుతుంటాయి. అలా నటిగా తొలి చిత్రంతో వెలిగిపోయిన హీరోయిన్ కిరణ్ రాథోడ్ గుర్తుందా? ఆమె ఇప్పుడు జీవితంలో చాలా కోల్పోయి మళ్లీ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. జెమిని చిత్రంతో కథానాయకిగా పరిచయం అయిన నటి కిరణ్. ఆ చిత్రం విజయంతో ఈమె పేరు మారుమ్రోగింది. అవకాశాలు వరుస కట్టాయి. అలా కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. ఐటమ్ సాంగ్స్‌లోనూ నటించారు. ఈమె గురించి చాలా వదంతులు దొర్లాయి. కాగా ఇటీవల ఒక టీవీ చానల్లో పాల్గొన్న కిరణ్ తన నట జీవితం, వ్యక్తిగతం గురించి తెలుపుతూ కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో తన ప్రియుడు చెప్పిన మాటలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చెసిన పెద్ద తప్పు అని ఆ తరువాత తెలుసుకున్నానన్నారు. దీంతో మళ్లీ నటించడానికి సిద్ధం కాగా కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అడ్జెస్ట్మెంట్ కావాలని అన్నారని బహిరంగంగానే చెప్పారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని చెప్పారు. ఒకసారి అతను తనను కొట్టారని, దాన్ని తాను సహించలేకపోయానని తెలిపారు. ఆ తరువాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి కోపంతో కసి తీరా గట్టిగా కొట్టానని చెప్పారు. అప్పుడు అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని చెప్పారు. ఈ కారణంగానో ఏమో కొందరు తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసేవాళ్లని చెప్పారు. వారంతా తప్పుడు వాళ్లని తాను అర్థం చేసుకున్నానన్నారు. తనకు మంచి స్నేహితులు లేరని కిరణ్ చెప్పారు. ఇలాంటి పలు కారణాల వల్ల తాను సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకు పెళ్లి అయ్యిందని, పిల్లలు పుట్టారని పుకార్లు పుట్టించారని, తాను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి పలు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చాన్సుల కోసం ఆమె ఎదురు చూస్తున్నారు. -
నేను అలాంటి చిత్రాల్లో నటించలేదు.. కిరణ్ రాథోడ్ ఆవేదన
హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది కిరణ్ రాథోడ్. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేనుతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో రంగప్రవేశం చేసింది. కాగా ఈమెకు రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో దీన్ని వదులుకోక తప్పలేదు. ఇప్పటికీ దీని గురించి బాధపడుతూ ఉంటుంది కిరణ్. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! తమిళంలో కమల్ హాసన్, అజిత్ కుమార్, విక్రమ్ సహా ప్రముఖ హీరోలతో నటించిన కిరణ్.. సినిమా ఛాన్సులు పీక్‌లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం తర్వాత తెలుగు బిగ్‌బాస్-7లో కనిపించిన కిరణ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఒక యూట్యుబ్ ఛానల్ కోసం ఆమెను నటి షకీల ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: వంద కోట్ల స్టార్ హీరో పుట్టినరోజు.. తెరపైకి పాత ఫోటోలు.. ఎవరో గుర్తుపట్టారా?) చాలా ఏళ్లుగా తనపై వస్తున్న రూమర్స్ గురించి కిరణ్ ఇలా చెప్పారు. 'నేను ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల చిత్రాల్లో నటించ లేదు. కానీ మీడియా నాపై ఎందుకు అలాంటి వార్తలను ప్రచారం చేసిందో తెలియదని కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది.' తమిళ్లో జెమిని సినిమా తర్వాత ఓవర్‌నైట్ స్టార్ అయిన కిరణ్ తర్వాత చాలా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. వాడి వల్లే సినిమా ఛాన్సులు తగ్గాయి గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను నటించాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. ఏవరైనా ఆఫర్లు ఇస్తే తప్పకుండా మళ్లీ నటిస్తాను. అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. సినిమా ఆఫర్లు ఇచ్చి రాత్రికి ఫోన్ చేస్తారు ప్రేమించిన వాడు దూరం అయ్యాడు.. చేతిలో సినిమాలు లేవు. అలాంటి సమయంలో కొందరు సినిమా ఛాన్స్ ఉందని కాల్ చేస్తారు. మీకు మంచి పాత్ర ఉందని కూడా ఆఫర్ చేశారు. ఎవరైతే ఆఫర్లు ఇస్తామని చెప్పారో మాట్లాడిన అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్ చేస్తారు. తనతో గడపాలంటూ ఫ్లాట్‌కు రమ్మంటారు. అలా ప్రతిరోజూ చాలామంది రాత్రి అయితే కాల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నాకు అర్థం అయింది. ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరూ స్నేహితులు లేరు.. ఎవరూ సాయం చేయరు. అని తన పాత రోజులను గుర్తు చేసుకుంది. యాప్‌లో గ్లామర్ ఫోటోలు, వీడియోలు సినిమా అవకాశాలు లేకపోవడంతో అదే సమయంలోనే నేనొక యాప్‌ని ప్రారంభించాను. అందులో నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాను. అది చూసి నిర్మాతలు, దర్శకులు ఆఫర్లు ఇస్తారనుకున్నాను. కానీ వారితో పాటు మరికొందరు డబ్బులిస్తామంటూ కమిట్మెంట్ అడిగారు. ప్రత్యేకంగా ఇక్కడ ఒకరి పేరు చెప్పనవసరం లేదు.. ఆ సమయంలో ఇలా చాలా మంది కాల్ చేశారు. తర్వాత దానిని ఆపేశాను. ఇప్పుడు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాను. కానీ ఎలాంటి ఆఫర్లు రాలేదు.. ఇప్పుడు కూడా కొన్ని తప్పుడు కాల్స్ వస్తూనే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. నేను శృంగార నటిని కాదు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేది నేనొక్కదాన్నే కాదు. చాలా మంది నటీమణులు చేస్తారు. కానీ నేను పోస్ట్ చేస్తే మాత్రం మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకో తెలియదు, నేను ఎలాంటి శృంగార చిత్రాల్లో నటించలేదు, వీడియోలు చేయలేదు. నాకిష్టమైన బట్టలు వేసుకుని వీడియోలు పోస్ట్ చేస్తాను. కానీ కొందరు మాత్రం కమిట్మెంట్ కోసం ఇతరులను ఆహ్వానిస్తున్నారా..? అంటూ కామెంట్లు చేస్తారు. ఇంటర్నెట్లో వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని నటి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరణ్‌పై ఆరోపణలు సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోందని ఆమెపై రూమర్స్ వచ్చాయి. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.15 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.. వాటి గురించి తొలిసారి కిరణ్ రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by KEIRA RATHORE (@kiran_rathore_official) -
సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు
బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చానా? అని ఫీలవుతోంది కిరణ్ రాథోడ్. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టిన ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడింది. తను మాట్లాడే భాష అర్థం చేసుకోలేక అటు ప్రేక్షకులు సైతం తెగ కష్టపడ్డారు. ఇరువురి బాధను చూడలేకపోయిన బిగ్‌బాస్ ఆమెను మొదటి వారంలోనే అవతలికి పంపించేశాడు. హీరోయిన్ అని కూడా చూడకుండా, తన టాలెంట్ కూడా బయటపెట్టనివ్వకముందే ఫస్ట్ వీక్‌లోనే ఎలా పంపించేస్తారని బాధపడుతోంది కిరణ్ రాథోడ్. తెలుగు బిగ్‌బాస్‌కు బదులు తమిళ, హిందీ బిగ్‌బాస్ షోకి వెళ్లాల్సిందని, అప్పుడు ఈ భాష అనే అడ్డుగోడ ఉండేదే కాదని వాపోయింది. అంత ఈజీ కాదు ఒకప్పుడు హీరోయిన్గా మెప్పించిన కిరణ్ రాథోడ్‌కు గతంలో రెండు సార్లు లవ్ బ్రేకప్ అయింది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన కూడా పడిందట. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. 'దక్షిణాదిన హీరోయిన్గా ఎంత పాపులారిటీ ఉన్నా సరే ముంబైకి వచ్చి కష్టాలు పడాల్సిందే! అప్పటికాలంలో సౌత్‌లో ఎవరు టాప్ హీరోయిన్ అనేది కూడా వారికి తెలియదు. అందుకే నేను బాలీవుడ్‌కు వెళ్లినప్పటికీ సరిగ్గా నిలదొక్కుకోలేక మళ్లీ వెనక్కు వచ్చేశాను. చెన్నైలోనే సెటిలయ్యాను. బాలీవుడ్లో క్రేజ్, ఫేమ్ తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు. కాంప్రమైజ్ అడిగారు, రిజెక్ట్.. అంతేకాదు అక్కడ ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల వల్ల డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కాంట్రాక్టు మీద సైన్ చేశాక అసలు రంగు బయటపెట్టేవాళ్లు. ఈరోజు రాత్రికి వస్తున్నావ్ కదా.. అని అడిగేవాళ్లు. అప్పుడు నా చేతిలో సౌత్ మూవీలు, బాలీవుడ్ చిత్రాలు.. ఏవీ లేవు. అయినా సరే కాంప్రమైజ్ అడిగేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసేదాన్ని. నటన మానేసి ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దామనుకున్నాను. ప్రస్తుతం అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏ పని గురించి ఎవరినీ అడగాల్సిన పని లేదు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. రెండుసార్లు బ్రేకప్.. గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ఆ వయసులో వారు కొట్టినా కూడా మనమీద అతి ప్రేమతో అలా చేశారేమో అనిపించేది. కానీ నెమ్మదిగా అన్నీ అర్థమయ్యాయి. గత ఏడేళ్లుగా ఎవరినీ డేటింగ్ చేయలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు' అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. చదవండి: శివాజీది కన్నింగ్ గేమ్, ప్రశాంత్ గురించి మాట్లాడటమే వేస్ట్.. -
బిగ్‌బాస్ 7: వారం రోజులకే అన్ని లక్షలు సంపాదించిందా?
కిరణ్ రాథోడ్.. ఈమెను ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు పంపించేశారో అర్థం కాని అయోమయంలో ఉన్నారు ప్రేక్షకులు. తనకు తెలుగురాదని తెలిసి కూడా తీసుకురావడం బిగ్‌బాస్ తప్పయితే.. కిరణ్ స్వయం తప్పిదాలు కూడా ఉన్నాయి. ఫలితంగా వారం రోజుల్లోనే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి వారం రోజులకు ఆమెకు ఎంత డబ్బు ముట్టింది? తన ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో ఓసారి చూసేద్దాం.. రీఎంట్రీ కోసం బిగ్‌బాస్ షో.. కిరణ్ రాథోడ్ కొందరికి తెలుసు.. మరికొందరికి ఎక్కడో చూసిన అమ్మాయిలా అనిపిస్తుంది. తెలుగులో 'అందరూ దొంగలే దొరికితే..', 'భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా', 'హై స్కూల్', 'కెవ్వు కేక' సినిమాలు చేసింది. 2016లో తమిళంలో ఓ సినిమా చేయగా అది తెలుగులో 'భాజా భజంత్రీలు' పేరిట విడుదలైంది. ఆ తర్వాత సినిమాలకు దూరమవడంతో ప్రేక్షకులూ ఆమెను మర్చిపోయారు. ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయిన ఆమె బిగ్‌బాస్ షోను అందుకు వాడుకోవాలని చూసింది. తెలుగు రాకపోవడమే పెద్ద మైనస్ అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో అడుగుపెట్టింది. కానీ తెలుగు రాకపోవడమే ఆమెకు పెద్ద శాపంగా మారింది. తెలుగు రాదనే వంకతో హౌస్మేట్స్ ఆమెను నామినేట్ చేశారు. తను కూడా హౌస్‌లో తెలుగులో తప్ప మిగతా భాషల్లోనే మాట్లాడింది. అందరితోనూ పెద్దగా కలవలేకపోయింది. అసలు షోలో ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. కుస్తీ పోటీలో మాత్రం కాస్త యాక్టివ్‌గా కనిపించింది. పెద్దగా టాస్కులు జరగలేవు కాబట్టి తన బలాన్ని, టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించే అవకాశం లేకపోయింది. నిరూపించుకునే ఛాన్స్ ఇస్తేగా? తెలుగు రాని కిరణ్ జనాలకు పెద్దగా కనెక్ట్ అవకపోవడంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు పడటంతో కిరణ్ ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడ కిరణ్‌కు తనను తాను నిరూపించుకునే అవకాశం బిగ్‌బాస్ కూడా ఇవ్వలేదు. మొదటి వారం ఎలిమినేషన్ ఎత్తేసుంటే కిరణ్ తన ఆట చూపించేదేమోనని, కానీ బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వారం రోజులకే అంత ముట్టిందా? మరోవైపు సోషల్ మీడియాలో కిరణ్ టీమ్ తన అసభ్య వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మరింత కంటెంట్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రచారం చేసింది. ఇది కూడా ఆమెకు నెగెటివ్‌గా మారింది. ఉన్నది వారం రోజులే అయినప్పటికీ తనకు డబ్బులు మాత్రం భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీకి రోజుకు రూ.45 వేల చొప్పున పారితోషికం ఫిక్స్ చేశారట! ఈ లెక్కన ఒక్క వారానికిగానూ కిరణ్ రాథోడ్ రూ.3 లక్షల పైచిలుకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: అనుకున్నదే జరిగినా.. ఆ ట్విస్ట్ ఊహించలే! -
'బిగ్‌బాస్ 7' ఫస్ట్ ఎలిమినేషన్.. కన్నీళ్లు పెట్టుకున్న షకీలా!
'బిగ్‌బాస్ 7' తెలుగులో ఫస్ట్ వికెట్ పడింది. ఆమె హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఈ విషయంలో చాలామంది అంచనాలు నిజమైనప్పటికీ.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే మాములుగా లేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆదివారం ఏం జరిగింది? Day-7 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్) సందీప్‌కి లక్కీ ఛాన్స్ శనివారం ఎపిసోడ్లో భాగంగా ప్రియాంకతో పోటీపడి ఫైనల్ టాస్కులో సందీప్.. పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. దీంతో శనివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. అదే టాపిక్ తో మళ్లీ ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. ఇది గెలుచుకున్నందుకు గానూ వీఐపీ (VIP) రూంలో ఉండే ఛాన్స్ సందీప్‌కి బిగ్‌బాస్ కల్పించినట్లు హోస్ట్ నాగ్ చెప్పారు. అలానే పవర్ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయనంటే కుదరదని చెప్పి, బ్యాటరీ ఒకటి ఉంటుందని షాకిచ్చారు. ఎప్పటికప్పుడు దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలని నాగ్ అన్నారు. ఇందులో రెడ్ మార్క్ వస్తే.. డేంజర్ లోకి వెళ్లిపోతావని నాగ్ చిన్నసైజ్ వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయిలు గెలుపు సండే ఫండే కాబట్టి హౌసులో అమ్మాయిలు vs అబ్బాయిలు అని యాక్టివిటీ రూంలో ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా అమ్మాయిలు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటే.. అబ్బాయిల్లో ఒకరు పాము ఆకారంలో ఉన్న కర్రతో కళ్లకు గంతలు కట్టుకుని.. గజ్జెల శబ్దం బట్టి వాళ్లని టచ్ చేయాల్సి ఉంటుంది. తేజ, అమర్దీప్, శోభాశెట్టి ఎవరినీ టచ్ చేయలేకపోయారు. శుభశ్రీ మాత్రం ఏకంగా నలుగురిని టచ్ చేసింది. దీంతో ఈ గేమ్‌లో అమ్మాయిలు విజయం సాధించారు. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) కౌంట్‌డౌన్ స్టార్ట్ అప్పటివరకు అంత కామెడీగా నడిచింది. కానీ ఎలిమినేషన్ టాపిక్ వచ్చేసరికి మళ్లీ సీరియస్ అయిపోయింది. చిన్నసైజు శవపేటికల్లాంటి బాక్సులో పూలు ఉంటే సేఫ్, అస్థి పంజరం ఉంటే డేంజర్ అని చెప్పారు. ఇందులో రతిక, శోభాశెట్టి సేవ్ కాగా.. కిరణ్, ప్రశాంత్, దామిని, ప్రిన్స్, గౌతమ్, షకీలా డేంజర్ జోన్లో ఉండిపోయారు. మరోవైపు 'లివ్ ఇన్ ద మూమెంట్' అని చిన్న ఫన్ టాస్క్ పెట్టగా.. అందరూ గుర్తుంచుకోదగ్గ మూమెంట్, మరిచిపోవాలనుకున్న మూమెంట్‌ని షేర్ చేసుకున్నారు. ఆమె ఎలిమినేట్ దీని తర్వాత మరో స్టేజీలో ప్రశాంత్, గౌతమ్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత మరోదశలో షకీలా, దామిని ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఫైనల్‌గా యాక్టివిటీ రూంలోకి ప్రిన్స్, కిరణ్ వెళ్లారు. ఎవరిపై అయితే రెడ్ స్పాట్లైట్ పడుతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పగా.. ప్రిన్స్‌పై గ్రీన్ లైట్ పడటంతో అతడు బతికిపోయాడు. కిరణ్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది. కిరణ్ ఫైనల్ టచ్ ఇకపోతే హౌస్ నుంచి స్టేజీపై వెళ్లిపోయిన కిరణ్.. వెళ్తూ వెళ్తూ అందరికీ షాకిచ్చింది. వాళ్ల స్వరూపాలు బయటపెట్టింది. ప్రిన్స్, షకీలా, శివాజీ, శుభశ్రీ సీదా క్యారెక్టర్స్ అని చెప్పింది. అదే టైంలో ప్రశాంత్‌కి ఓవర్ కాన్ఫిడెంట్, రతికకు ఆటిట్యూడ్ ప్రాబ్లమ్, శోభాశెట్టి చాలా సెల్ఫిష్ (స్వార్థపరురాలు) అని, టేస్టీ తేజ చాలా కన్నింగ్ అని అతడితో అందరూ జాగ్రత్తగా ఉండాలని బాంబు పేల్చింది. అయితే తన ఫ్రెండ్ కిరణ్ హౌస్ నుంచి వెళ్లిపోయేసరికి షకీలా కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ సోమవారం.. నామినేషన్స్ లో ప్రియాంక-శివాజీ, అమర్దీప్-శివాజీ మధ్య గొడవ హాట్‌హాట్‌గా సాగిందండోయ్! (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) -
బిగ్‌బాస్ 7: వారంలోనే ఇంటిబాట పట్టిన కంటెస్టెంట్!
నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా మాటను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటిసభ్యులు కాలేదని చెప్పారు. ఈ లెక్కన వాళ్లు హౌస్మేట్స్ కానప్పుడు ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తారన్న అనుమానాలు వచ్చాయి. కావున, ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ప్రచారం జరిగింది. చివర్లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఉల్టా పల్టా మాటకు తగ్గట్లుగా ఎలిమినేషన్ ప్రక్రియ జరిపించాడు. ఇంట్లో ఒకరిని ఎలిమినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం సోషల్ మీడియాలో లీకైంది. నామినేషన్స్‌లో ఉన్నవారిని నాగ్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ప్రిన్స్ యావర్, కిరణ్ ఇద్దరూ మిగిలారట. వీరిలో కిరణ్ రాథోడ్‌ను హౌస్ నుంచి పంపించివేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడుతోంది. ఈ కారణంతోనే మిగతా కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ కూడా చేశారు. కిచెన్‌లో పని చేసింది తప్పితే పెద్దగా టాస్కు ఆడింది, ఎంటర్టైన్ చేసిందంటూ ఏమీ లేదు. తెలుగురానివాళ్లను హౌస్‌లో ఉంచడం ఎందుకనుకున్నారో ఏమో మరి, జనాలు కూడా ఆమెకు పెద్దగా ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఓటింగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: తొలి వారం కదా.. అందుకే సుతిమెత్తగా కౌంటర్స్! -
హౌస్‌లో రజనీకాంత్ సినిమాను వదలుకున్న హీరోయిన్!
కిరణ్ రాథోడ్.. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్ వదిలేసుకుంది. 2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. తనకు తెలుగు మాట్లాడటం రాదని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానంది. మరి ఈ బ్యూటీ హౌస్‌లో తెలుగు నేర్చుకుంటుందా? లేదంటే తన వచ్చీరాని మాటలతో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుందా? చూడాలి!