కిరణ్ రాథోడ్.. ఈమెను ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు పంపించేశారో అర్థం కాని అయోమయంలో ఉన్నారు ప్రేక్షకులు. తనకు తెలుగురాదని తెలిసి కూడా తీసుకురావడం బిగ్‌బాస్ తప్పయితే.. కిరణ్ స్వయం తప్పిదాలు కూడా ఉన్నాయి. ఫలితంగా వారం రోజుల్లోనే కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి వారం రోజులకు ఆమెకు ఎంత డబ్బు ముట్టింది? తన ఎలిమినేషన్‌కు గల కారణాలేంటో ఓసారి చూసేద్దాం..
రీఎంట్రీ కోసం బిగ్‌బాస్ షో..
కిరణ్ రాథోడ్ కొందరికి తెలుసు.. మరికొందరికి ఎక్కడో చూసిన అమ్మాయిలా అనిపిస్తుంది. తెలుగులో 'అందరూ దొంగలే దొరికితే..', 'భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా', 'హై స్కూల్', 'కెవ్వు కేక' సినిమాలు చేసింది. 2016లో తమిళంలో ఓ సినిమా చేయగా అది తెలుగులో 'భాజా భజంత్రీలు' పేరిట విడుదలైంది. ఆ తర్వాత సినిమాలకు దూరమవడంతో ప్రేక్షకులూ ఆమెను మర్చిపోయారు. ఇన్నాళ్లకు రీఎంట్రీకి రెడీ అయిన ఆమె బిగ్‌బాస్ షోను అందుకు వాడుకోవాలని చూసింది.
తెలుగు రాకపోవడమే పెద్ద మైనస్
అలా బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో అడుగుపెట్టింది. కానీ తెలుగు రాకపోవడమే ఆమెకు పెద్ద శాపంగా మారింది. తెలుగు రాదనే వంకతో హౌస్‌మేట్స్ ఆమెను నామినేట్ చేశారు. తను కూడా హౌస్‌లో తెలుగులో తప్ప మిగతా భాషల్లోనే మాట్లాడింది. అందరితోనూ పెద్దగా కలవలేకపోయింది. అసలు షోలో ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. కుస్తీ పోటీలో మాత్రం కాస్త యాక్టివ్‌గా కనిపించింది. పెద్దగా టాస్కులు జరగలేవు కాబట్టి తన బలాన్ని, టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించే అవకాశం లేకపోయింది.
నిరూపించుకునే ఛాన్స్ ఇస్తేగా?
తెలుగు రాని కిరణ్ జనాలకు పెద్దగా కనెక్ట్ అవకపోవడంతో ఓట్లు కూడా పడలేదు. అందరికంటే తక్కువ ఓట్లు పడటంతో కిరణ్ ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడ కిరణ్‌కు తనను తాను నిరూపించుకునే అవకాశం బిగ్‌బాస్ కూడా ఇవ్వలేదు. మొదటి వారం ఎలిమినేషన్ ఎత్తేసుంటే కిరణ్ తన ఆట చూపించేదేమోనని, కానీ బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వారం రోజులకే అంత ముట్టిందా?
మరోవైపు సోషల్ మీడియాలో కిరణ్ టీమ్ తన అసభ్య వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ మరింత కంటెంట్ కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని ప్రచారం చేసింది. ఇది కూడా ఆమెకు నెగెటివ్‌గా మారింది. ఉన్నది వారం రోజులే అయినప్పటికీ తనకు డబ్బులు మాత్రం భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీకి రోజుకు రూ.45 వేల చొప్పున పారితోషికం ఫిక్స్ చేశారట! ఈ లెక్కన ఒక్క వారానికిగానూ కిరణ్ రాథోడ్ రూ.3 లక్షల పైచిలుకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment