'బిగ్‌బాస్ 7' ఫస్ట్ ఎలిమినేషన్.. కన్నీళ్లు పెట్టుకున్న షకీలా! | Bigg Boss 7 Telugu Day 7 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 7 Highlights: అనుకున్నదే జరిగినా.. ఆ ట్విస్ట్ ఊహించలే!

Sep 10 2023 10:50 PM | Updated on Sep 11 2023 9:02 AM

Bigg Boss 7 Telugu Day 7 Highlights - Sakshi

'బిగ్‌బాస్ 7' తెలుగులో ఫస్ట్ వికెట్ పడింది. ఆమె హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఈ విషయంలో చాలామంది అంచనాలు నిజమైనప్పటికీ.. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే మాములుగా లేదు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆదివారం ఏం జరిగింది? Day-7 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్)

సందీప్‌కి లక్కీ ఛాన్స్
శనివారం ఎపిసోడ్‌లో భాగంగా ప్రియాంకతో పోటీపడి ఫైనల్ టాస్కులో సందీప్.. పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. దీంతో శనివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. అదే టాపిక్ తో మళ్లీ ఆదివారం ఎపిసోడ్ మొదలైంది. ఇది గెలుచుకున్నందుకు గానూ వీఐపీ (VIP) రూంలో ఉండే ఛాన్స్ సందీప్‌కి బిగ్‌బాస్ కల్పించినట్లు హోస్ట్ నాగ్ చెప్పారు. అలానే పవర్ అస్త్ర ఉన్నంత మాత్రాన ఏ పని చేయనంటే కుదరదని చెప్పి, బ్యాటరీ ఒకటి ఉంటుందని షాకిచ్చారు. ఎప్పటికప్పుడు దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలని నాగ్ అన్నారు. ఇందులో రెడ్ మార్క్ వస్తే.. డేంజర్ లోకి వెళ్లిపోతావని నాగ్ చిన్నసైజ్ వార్నింగ్ ఇచ్చారు.

అమ్మాయిలు గెలుపు
సండే ఫండే కాబట్టి హౌసులో అమ్మాయిలు vs అబ్బాయిలు అని యాక్టివిటీ రూంలో ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా అమ్మాయిలు తమ కాళ్లకు గజ్జెలు కట్టుకుంటే.. అబ్బాయిల్లో ఒకరు పాము ఆకారంలో ఉన్న కర్రతో కళ్లకు గంతలు కట్టుకుని.. గజ్జెల శబ్దం బట్టి వాళ్లని టచ్ చేయాల్సి ఉంటుంది. తేజ, అమర్‌దీప్, శోభాశెట్టి ఎవరినీ టచ్ చేయలేకపోయారు. శుభశ్రీ మాత్రం ఏకంగా నలుగురిని టచ్ చేసింది. దీంతో ఈ గేమ్‌లో అమ్మాయిలు విజయం సాధించారు.

(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!)

కౌంట్‌డౌన్ స్టార్ట్
అప్పటివరకు అంత కామెడీగా నడిచింది. కానీ ఎలిమినేషన్ టాపిక్ వచ్చేసరికి మళ్లీ సీరియస్ అయిపోయింది. చిన్నసైజు శవపేటికల్లాంటి బాక్సులో పూలు ఉంటే సేఫ్, అస్థి పంజరం ఉంటే డేంజర్ అని చెప్పారు. ఇందులో రతిక, శోభాశెట్టి సేవ్ కాగా.. కిరణ్, ప్రశాంత్, దామిని, ప్రిన్స్, గౌతమ్, షకీలా డేంజర్ జోన్‌లో ఉండిపోయారు. మరోవైపు 'లివ్ ఇన్ ద మూమెంట్' అని చిన్న ఫన్ టాస్క్ పెట్టగా.. అందరూ గుర్తుంచుకోదగ్గ మూమెంట్, మరిచిపోవాలనుకున్న మూమెంట్‌ని షేర్ చేసుకున్నారు.

ఆమె ఎలిమినేట్
దీని తర్వాత మరో స్టేజీలో ప్రశాంత్, గౌతమ్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత మరోదశలో షకీలా, దామిని ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఫైనల్‌గా యాక్టివిటీ రూంలోకి ప్రిన్స్, కిరణ్ వెళ్లారు. ఎవరిపై అయితే రెడ్ స్పాట్‌లైట్‌ పడుతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు అని చెప్పగా.. ప్రిన్స్‌పై గ్రీన్ లైట్ పడటంతో అతడు బతికిపోయాడు. కిరణ్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచింది.

కిరణ్ ఫైనల్ టచ్
ఇకపోతే హౌస్ నుంచి స్టేజీపై వెళ్లిపోయిన కిరణ్.. వెళ్తూ వెళ్తూ అందరికీ షాకిచ్చింది. వాళ్ల స్వరూపాలు బయటపెట్టింది. ప్రిన్స్, షకీలా, శివాజీ, శుభశ్రీ సీదా క్యారెక్టర్స్ అని చెప్పింది. అదే టైంలో ప్రశాంత్‌కి ఓవర్ కాన్ఫిడెంట్, రతికకు ఆటిట్యూడ్ ప్రాబ్లమ్, శోభాశెట్టి చాలా సెల్ఫిష్ (స్వార్థపరురాలు) అని, టేస్టీ తేజ చాలా కన్నింగ్ అని అతడితో అందరూ జాగ్రత్తగా ఉండాలని బాంబు పేల్చింది. అయితే తన ఫ్రెండ్ కిరణ్ హౌస్ నుంచి వెళ్లిపోయేసరికి షకీలా కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ సోమవారం.. నామినేషన్స్ లో ప్రియాంక-శివాజీ, అమర్‌దీప్-శివాజీ మధ్య గొడవ హాట్‌హాట్‌గా సాగిందండోయ్!

(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement