నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా మాటను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటిసభ్యులు కాలేదని చెప్పారు. ఈ లెక్కన వాళ్లు హౌస్‌మేట్స్ కానప్పుడు ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తారన్న అనుమానాలు వచ్చాయి. కావున, ఈ వారం ఎలిమినేషన్ ఉండదని ప్రచారం జరిగింది. చివర్లో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఉల్టా పల్టా మాటకు తగ్గట్లుగా ఎలిమినేషన్ ప్రక్రియ జరిపించాడు. ఇంట్లో ఒకరిని ఎలిమినేట్ చేశాడు. ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం సోషల్ మీడియాలో లీకైంది. నామినేషన్స్‌లో ఉన్నవారిని నాగ్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో ప్రిన్స్ యావర్, కిరణ్ ఇద్దరూ మిగిలారట. వీరిలో కిరణ్ రాథోడ్‌ను హౌస్ నుంచి పంపించివేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడుతోంది.
ఈ కారణంతోనే మిగతా కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ కూడా చేశారు. కిచెన్‌లో పని చేసింది తప్పితే పెద్దగా టాస్కు ఆడింది, ఎంటర్‌టైన్ చేసిందంటూ ఏమీ లేదు. తెలుగురానివాళ్లను హౌస్‌లో ఉంచడం ఎందుకనుకున్నారో ఏమో మరి, జనాలు కూడా ఆమెకు పెద్దగా ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఓటింగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment