Kiran Sarkar
-
కండలేరుకు ‘చంద్ర’ గ్రహణం
కిరణ్ హయాంలో రూ.4,300 కోట్లతో పథకం 8,468 గ్రామాలకు తాగునీరు లక్ష్యం మొదటి దశ పనులకు టెండర్లు పిలిచిన కిరణ్ సర్కార్ పథకాన్ని పక్కన బెట్టిన బాబు ప్రభుత్వం జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోని వైనం సాక్షి, చిత్తూరు : జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన కండలేరు తాగునీటి పథకానికి చంద్రగ్రహణం పట్టింది. జిల్లాలో సగం ప్రాంతానికి తాగునీరు అందించేలా రూ పొందించిన ఈ పథకాన్ని పూర్తిచేస్తే కిరణ్‌కుమార్‌రెడ్డికి పేరొస్తుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన బెట్టినట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.4300 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు తదితర ప్రాంతాల్లో 45 మండలాల పరిధిలోని 8,468 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యం. కండలేరు నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద 420 ఎంఎల్డీ సామర్థ్యంతో ట్యాంకు నిర్మించడంతోపాటు 32 చిన్నచిన్న రిజర్వాయర్లు సైతం నిర్మించేలా రూపకల్పన చేశారు. ఒక్కో క్లస్టర్ రిజర్వాయరు పరిధిలో 150 నుంచి 200 గ్రా మాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులను ఇన్‌క్యాప్‌కు అప్పగించారు. తొలి విడతలో రూ.750 కోట్ల తో 10 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కూడా పిలిచారు. తెలుగుగంగలో భాగమైన కండలేరు జలాశయం నుంచి 6.61 టీఎంసీ నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చినా అప్పట్లో కిరణకుమార్రెడ్డి ఆ జిల్లా నేతలను ఒప్పించిన విషయం తెలిసిందే. ఇంతలో ఎన్నికలొచ్చాయి. బాబు రాకతో కండలేరు పథకానికి గ్రహణం చంద్రబాబు అధికారంలోకి రావడంతో కండలేరు తాగునీటి పథకానికి గ్రహణం పట్టింది. ఈ పథకంతో వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా కిరణ్‌కుమార్‌రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని పక్క న బెట్టారు. రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఎలా ఉన్నా కృష్ణాజలాలు తమిళనాడుకు ఇవ్వాలన్న ఒప్పందం నేపథ్యంలో కండలేరులో నిత్యం నీళ్లు నిలువ ఉంటాయి. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే కిరణ్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. మరోవైపు జిల్లాలో రోజురోజుకూ తాగునీటి సమస్య పెరుగుతోంది. రెం డు నెలలక్రితం 1713 గ్రామాలకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2600 గ్రామాలకు పెరిగింది. గతంలో నెలకు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తుండగా ప్రస్తుతం నీటి సరఫరా ఖర్చు రూ.6 కోట్లకు చేరింది. అయినా సక్రమంగా నీళ్లివ్వలేని పరిస్థితి. నిధులపరంగా, నీటి పరంగా చూసుకున్నా కండలేరు తాగునీటి పథకాన్ని పూర్తిచేయడమే మేలని ఒకవైపు నిపుణులు పేర్కొంటున్నారు. చంద్రబాబు మాత్రం ఈ పథకాన్ని పక్కనబెట్టి హంద్రీ- నీవా అంటూ పాడిందే పాడుతూ మాటలతో సరిపెడుతున్నారు. -
మాఫీ అన్నారు..‘చేయి’చ్చారు
యాచారం: ప్రతీ నెల 50 యూనిట్లలోపు గృహ వినియోగానికి ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు మాఫీ అని కిరణ్ సర్కార్ హయాంలో ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమయ్యాయి. వారి ఆనందం నిలవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటి ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద నిధులు విడుదల చేయకపోవడంతో పైసా కూడా మాఫీ కాలేదు. మరోవైపు బకాయిలు చెల్లించాలని విద్యుత్ అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అప్పట్లో మండలంలోని 20 గ్రామాల్లో గృహ వినియోగానికి విద్యుత్ వాడుకునే ఎస్సీ,ఎస్టీలను 2,500 మంది వరకు గుర్తించారు. అందులో 900 మందికిపైగా ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేస్తున్నారని గుర్తించి వారికి సబ్‌ప్లాన్ మాఫీ వర్తించేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల్లోని రాజకీయపక్షాల నాయకులు సైతం విద్యుత్ వినియోగంపై చైతన్యం తెచ్చి అధిక శాతం మందికి మాఫీ వర్తింపజేసేలా కృషి చేశారు. మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతుల్ల, నల్లవెల్లితండా, తక్కళ్లపల్లి తండా, గునుగల్ తదితర గ్రామాల్లో వందలాది మంది ప్రతి నెల 50 యూనిట్ల లోపు విద్యుత్ ఖర్చు చేసే లబ్ధిదారులున్నారు. బకాయిలు చెల్లించాలని ఒత్తిడి మండలంలోని 2,500 మంది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి బకాయిలు రూ.40 లక్షలకు పైగా ఉండడం, సబ్‌ప్లాన్ కింద అర్హులైన 900 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడాది కాలంగా రూ.20 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. అప్పట్లో ప్రభుత్వ హామీతో లబ్ధిదారులు మాఫీ అవుతుందిలే అని బిల్లులు చెల్లించడమే మానేశారు. రూ. లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. వాటిని ఎలాగైనా వసూలు చేయాల్సిందేనని అధికారులు పట్టుదలతో ఉన్నారు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమైంది. నెలకు రూ.వందల్లో చెల్లిస్తే నేడు బకాయిలు ఉండేవి కావని, ఇప్పుడు రూ. వేలల్లో ఉన్న బకాయిలను ఎలా చెల్లించాలని దిగులు చెందుతున్నారు. కిరణ్ సర్కార్‌ను నమ్మి నిండా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వమైనా తమపై జాలి చూపి విద్యుత్ బకాయిలు మాఫీ చేసేలా కృషి చేయాలని కోరుతున్నారు. -
మీరులేక.. మమ్మలి పట్టించుకోక...
అయ్యా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు. నేను మీ మానసపుత్రికను. నాకు 2008లో ‘108’ అని నామకరణం చేసింది మీరే. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు ‘108’అనే నంబర్‌కు డయల్ చేస్తే, అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ వాహనాన్ని క్షణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మండలాల విస్తీర్ణం, గ్రామాలు, జనాభా తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకుని అంబులెన్స్‌లను కేటాయించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్, గ్లూకోజ్ బాటిళ్లు, ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, తదితర సౌకర్యాలను సమకూర్చారు. అంబులెన్స్ వాహనాన్ని వేగంగా నడపడానికి మంచి శిక్షణ పొందిన వారిని పైలట్లుగా నియమించారు. ప్రథమ చికిత్స అందించడానికి శిక్షణ పొందిన వారిని టెక్నీషియన్లుగా నియమించారు. మీరు ఉన్నప్పుడు... మీరు బతికి ఉన్నప్పుడు 108 అంబులెన్స్‌లకు ఎలాంటి అవసరం ఉన్నా నిధులు వెంటనే కేటాయించారు. మీరు నన్ను ప్రవేశపెట్టిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, మరే ఇతర ప్రమాదాల్లో ఉన్నవారి పరిస్థితి విషమించక ముందే వారిని సకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి బతికి బట్టకట్టేలా చేశారు. పెద్ద పెద్ద కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారు వాటిని ఎలా సంరక్షించుకుంటారో మీరు మా అంబులెన్స్ వాహనాలను అలాగే చూసుకున్నారు. 108కి ఎలాంటి ఇబ్బంది, సమస్య లేకుండా కష్టం, నష్టం జరగకుండా మమ్మల్ని కన్నబిడ్డల వలే చూసుకున్నారు. మీరు చేసిన ఈ మంచి పనితో మాకు ‘సంజీవని’ అని పేరును ప్రజలు పెట్టారు. గర్భిణులు ప్రసవ వేదనతో ఉంటే వారిని సురక్షితంగా అంబులెన్స్లలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌లు వచ్చిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆస్పత్రులకు అద్దె వాహనాలు, అద్దె అంబులెన్స్‌లను ఉపయోగించుకునే అవసరం లేకుండా చేశారు. మీ మరణంతో మాకు కష్టాలు చాలు... అయితే మీ మరణంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. మీరు ఎంతో సహృదయంతో ప్రవేశపెట్టిన వైద్య సేవలను మీ తర్వాత రోశయ్య, కిరణ్ సర్కార్లు తొక్కి పడేశాయి. అంబులెన్స్‌లకు వినియోగిస్తున్న వాహనాలు 3 లక్షల కిలోమీటర్లు దాటితే వాటిని మార్చి కొత్త వాహనాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐదేళ్ల కింద మీరు ఇచ్చిన వాహనాలే అనేకం ఉన్నాయి. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏడాదికి ఒకసారి వాహనాలను మార్చివేస్తున్నారు. మార్కెట్లో కొత్త మోడళ్లు వస్తే నిన్న, మొన్న కొన్న వాహనాలను మార్చివేసిన ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అయితే నేను ఆపదలో ఉన్నవారిని చికిత్స అందిస్తూ తరలిస్తాను. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండే నాకు సుస్తి చేస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాహనాల లైఫ్ టైం అయిపోయినా మరమ్మతులు చేస్తూ వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వాహనాలను మార్చడానికి నిధులు ఉంటాయి. కాని అపర సంజీవనిగా పేరుపొందిన అంబులెన్స్‌లను మార్చడానికి ఎవరికి దయరాదు. వాహనం పాతబడటంతో మరమ్మతులు చేసినా ప్రయోజనం లేదు. మేమే బాగుంటే మహబూబ్ బతికేవాడేమో... మొన్న మోర్తాడ్ మండలం తడపాకల్ వద్ద చెట్టుపై నుంచి కిందపడిన మహబూబ్‌ను ఆస్పత్రికి తరలించడానికి నేను అక్కడికి వెళ్లాను. అయితే నా డోర్ తెరుచుకోలేదు. చాలాసేపు మా అంబులెన్స్ సిబ్బంది కష్టపడి డోర్ తెరిచారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించే సమయంలో మళ్లీ డోర్ ఊడిపోయింది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించడానికి నేను చాలా కష్టపడ్డాను. కాని విధి వక్రీకరించింది. క్షతగాత్రుడిని సకాలంలో నేను ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే బతికి బట్టకట్టేవాడేమో? నా నిర్లక్ష్యం ఇందులో లేకపోయినా.. ప్రభుత్వం నన్ను మార్చక పోవడం మాత్రం నిజం. మీరే బతికి ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? మమ్మల్ని మార్చేవారు కాదా? మమ్మల్ని మార్చి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేవారు. మీరులేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే మీరు మన్నించాలని మనస్పూర్థితో కోరుకుంటూ.... ఇట్లు మీ మానసపుత్రిక ‘108’ అంబులెన్స్ -
మళ్లీ ‘కరెంట్’ బాదుడు
తిరుపతి, న్యూస్‌లైన్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మరోసారి మోపడానికి కిరణ్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతుంటే డిస్కంల ప్రతిపాదనల ముసుగులో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేస్తోంది. డిస్కంలు సమర్పించిన తాజా ప్రతిపాదనల ప్రకారం వివిధ కేటగిరీలలో విద్యుత్ చార్జీలు యూనిట్‌కు 50 పైసల నుంచి ఒక రూపాయి వరకు పెరగనున్నాయి. గృహావసరాలకు సంబంధించి 150 యూనిట్ల వరకు యూనిట్‌కు 50 ైపైసల వంతును పెంచేందుకు డిస్కం ప్రతిపాదను విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సమర్పించింది. కస్టమర్ చార్జీలను రూ.5 నుంచి రూ.20కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలను ఈఆర్సీ ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా యధాతధంగా ప్రభుత్వానికి సమర్పిస్తే ఎస్పీడీసీఎల్ పరిధిలోని 6 జిల్లాల్లో వినియోగదారులపై సుమారు 2356 కోట్ల రూపాయల భారం పడనుంది. తిరుపతి కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్పీడీసీఎల్) పరిధిలో 0-50 యూనిట్ల విద్యుత్ వాడకందార్లు 15 లక్షల మంది ఉన్నారు. 51 నుంచి 100 యూనిట్ల వరకు వాడేవారు 16 లక్షల మంది, 101 నుంచి 200 యూనిట్ల వాడకందార్లు 10.5 లక్షలు, 201-300 యూనిట్ల వరకు వినియోగించేవారు 2.5 లక్షల మంది ఉన్నట్లు డిస్కం గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 301-500 యూనిట్లు వాడేవారు 90 వేల మంది, 500 యూనిట్లకు పైబడి వినియోగించేవారు సుమారు 30 వేల మంది ఉన్నారు. డిస్కంల తాజా ప్రతిపాదనలు అమలైతే సుమారు 45 లక్షల మంది వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడనుంది. అయితే కంపెనీని నష్టాల బాట నుంచి గట్టెక్కించడానికి పెంపు అనివార్యమని డిస్కం అధికారులు అంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎస్పీడీసీఎల్కు 13,649 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కాగా ప్రస్తుతం అమలులో ఉన్న టారిఫ్ ప్రకారం కంపెనీకి 8931 కోట్ల రూపాయల ఆదాయం మాత్రం వస్తుందని 4718 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. తాజా పెంపు ప్రతిపాదనల వల్ల 2356 కోట్ల రూపాయల లోటును పూడ్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అంటే డిస్కం ప్రతిపాదనలు యధాతథంగా అమలు జరిగినా కంపెనీకి ఇంకా 2362 కోట్ల రూపాయల లోటు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి వారి అభిప్రాయాలను ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనేది ప్రశ్నార్థకం. ప్రతిపాదనలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు డిస్కంలు సమర్పించింది కేవలం ప్రతిపాద నలు మాత్రమే. అప్పుడే కరెంట్ చార్జీలు పెరిగినట్లు కాదు. ఈఆర్సీ రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హియరింగ్ సమావేశాలు నిర్వహించి వినియోగదారులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయలు సేకరిస్తుంది. మార్పులు, చేర్పులు అవసరమని భావిస్తే చేసి అందరికీ ఆమోదయోగ్యమైన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ తతంగం అంతా పూర్తి కావడానికి 2014 మార్చి వరకు గడువు ఉంది. - రాధాకృష్ణ, డెరైక్టర్ (ఆపరేషన్), ఎస్పీడీసీఎల్ -
ప్రాజెక్టుల పనులు గాలికి
=సముద్రం పాలవుతున్న మూడు నదుల వర్షపు నీరు =ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే =నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు =ఊసేలేని కైగల్ ఎత్తిపోతల పథకం పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు పనులను అధికారులు, పాలకులు గాలికొదిలేశారు. ఫలితంగా ఏటా 150 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీరు తమిళనాడు రాష్ట్రం గుండా బంగాళాఖాతంలో కలసిపోతోంది. పలమనేరు, న్యూస్‌లైన్: రామసముద్రం మండలంలో పుట్టే కౌండిన్య నది పుంగనూరు, పెద్దపంజాణి, గంగవరం, పలమనేరుల మీదుగా కౌండిన్య అడవి నుంచి తమిళనాడు రాష్ర్టంలోకి పయనిస్తుంది. ఈ నదిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద మూడేళ్ల క్రితం కౌండిన్యా-1 ( వైఎస్ఆర్ జలాశయం) ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు తగినన్ని నీళ్లు లేకపోవడంతో దీనికి అనుసంధానంగా 2012 జనవరిలో గంగన శిరస్సు (కౌండిన్య-2) పనులను ప్రారంభించారు. ఈ పనులూ ఆరు నెలల క్రితం ఆగిపోయూరుు. బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద ఎత్తిపోతల పథకానికి కిరణ్ సర్కార్ రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసినా కార్యరూపం దాల్చలేదు. ఏటా 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడుకే కౌండిన్య, ఎగినేరి, కైగల్ నదుల నుంచి వర్షాకాలంలో 150 ఎంసీఎఫ్‌టీల నీరు తమిళనాడు గుండా బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం పలమనేరు మండల సరిహద్దులోని గుడియాత్తం సమీపంలో మోర్ధనా ప్రాజెక్టును నిర్మించింది. ఇక్కడి నుంచి వెళ్లే వృథా జలాలు మోర్ధనా ప్రాజెక్టుకు చేరి అక్కడి ప్రాంతవాసుల అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఇదే పని మన పాలకులు ఎందుకు చేయలేదని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. నత్తనడకన కౌండిన్య ప్రాజెక్టు పనులు పలమనేరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మూడేళ్ల క్రితం కౌండిన్య నదిపై కాలువపల్లె వద్ద రూ.53 కోట్లతో పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ఆర్ జలాశయం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రెండో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఎనగిరేరు వద్ద గంగన్న శిరస్సు నదిపై మరో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 55 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్)ల నీటిని జలాశయంలో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నీటిని పైప్లైన్ల ద్వారా వైఎస్ఆర్ జలాశయానికి మళ్లించి పట్టణవాసుల దాహార్తిని తీర్చవచ్చు. అలాగే బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ వద్ద దుముకురాళ్ల జలపాతం నుంచి వృథాగా వెళ్లేనీటిని ఎత్తిపోతల పథకం ద్వారా బెరైడ్డిపల్లె, పలమనేరు మండలాల్లోని చెరువులకు మళ్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు అంచనాల దశలోనే ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఈ నదుల విషయం మళ్లీ గుర్తుకొచ్చింది. దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు వృథాగా పోతున్న నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
అపహాస్యం పాలైన అమ్మ‘హస్తం’
=నాసిరకం సరుకులు మాకోద్దంటున్న పేదలు =ఆరు నెలల ‘అమ్మహస్తం’ పంపిణీ తీరుపై సమీక్ష విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం అపహాస్యం పాలైంది. జిల్లాలో ఈ పథకం నిర్వీర్యమైపోయింది. ఆదినుంచే అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న ఈ పథకం ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా... నేటికి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చౌకధర దుకాణాల ద్వారా రూ.185 లకే తొమ్మిది రకాల నాణ్యామైన నిత్యావసర సరుకులు అందించాలన్న లక్ష్యం బెడిసికొట్టినట్లయింది. సరుకుల నాణ్యత లేమీ, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సరుకుల ధరలో పెద్దగా తేడా కనిపించకపోవడంతో ప్రజల ఆదరణ కోల్పోయింది. దీంతో పేదలు సరుకులు కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో సరఫరా తగ్గుముఖం పట్టిందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 11లక్షల 80వేల మంది కార్డుదారులకు 2,100 చౌకడిపోల ద్వారా వీటినిఅంటగట్టేందుకు అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. నాణ్యతపై అనుమానాలు ‘అమ్మహస్తం’ పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందిపప్పు ఉడకటం లేదంటున్నారు. ఒక్కోసారి నిల్వ ఉన్న పప్పును సరఫరా చేస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. చింతపండు నల్లని రంగు ఉండి గింజలు అధికంగా ఉండటంతో అది నాసిరకమని భావిస్తున్నారు. గోధుమలు, గోధుమ పిండిలో పురుగులుంటున్నాయని వాపోతున్నారు. ఘాటివ్వని కారం పోడి, రుచిలేని నూనె ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. పలు రేషన్ షాపుల్లో అమ్మహస్తం సరుకులను చూసి ప్రజలు కంగుతింటున్నారు. కేవలం రూ.185 కే తొమ్మిది రకాల సరుకులు వస్తున్నాయన్న ఆశతో చౌకధర దుకాణాలకు వెళ్తున్న మహిళలు ముక్కిపోయిన సరుకులను చూసి పెదవి విరుస్తున్నారు. తొమ్మిదింటిలో మూడే .. అమ్మహస్తం తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు ముచ్చటగా మూడు సరుకులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కందిపప్పు, చక్కెర, పామాయిల్ మాత్రమే కొనుగోలు చేసి మిగతా ఆరు సరుకుల జోలికి వెళ్లడం లేదు. ప్రచార అర్భాటమే.... ‘అమ్మహస్తం’ ద్వారా ప్రజలకు కలిగే లబ్ధి గోరంతైనా ప్రభుత్వం కొండంత ప్రచారం చేసింది. తెల్లకార్డుదారులకు రూ. 185కే తొమ్మిది నిత్యావసర సరుకులుపై ప్రభుత్వం నెలసరి భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే. వాస్తవంగా ఈ పథకం కింద కొత్తగా ఇస్తున్న సరుకులు నాలుగు మాత్రమే. ఇందులో మూడు వస్తువులకు ప్రభుత్వం కొంత సబ్సిడీ భరిస్తుండగా పసుపును మాత్రం కొనుగోలు ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండటం గమనార్హం. నెలసరి సగటున ఒక్కో కార్డుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఉప్పుపై 91 పైసలు, మిరప్పొడి (చిల్లీ పౌడర్)పై రూ. 3.75, చింతపండుపై రూ. 4.25 (మొత్తం కలిపి రూ. 8.91) సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపు మాత్రం కొనుగోలు చేసిన ధర కంటే రూ. 1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే అమ్మహస్తం ద్వారా ప్రభుత్వం ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ. 7.78 మాత్రమే . వద్దు మొర్రో అంట్ను డీలర్లు .... రేషన్ డీలర్లు తొమ్మిది సరుకుల పంపిణీపై అసక్తి చూపడం లేదు. ఇవన్నీ వద్దు మొర్రో అంటూ మొత్తుకుంటున్నారు. ప్రజలు పంచదార, నూనె నెలవారీ కొంటున్నారని, గోధుమలు, కందిపప్పు కూడా అప్పుడప్పుడు కొంటున్నారని డీలర్లు చె బుతున్నారు. సరుకుల కోసం అదనపు పెట్టుబడి, కమీషన్ గిట్టుబాటుతో పాటు, లబ్ధిదారుల కొనుగోళ్లపై అనుమానాలతో డీలర్లు వెనుకంజవేస్తున్నారు. సాధారణంగా తొమ్మిది సరుకుల సరఫరా కోసం అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. తొమ్మిది సరుకులు(ఒక కిట్) విక్రయిస్తే లభించే కమీషన్ రూ. 4.09 పైసలు. పైగా సరుకుల దిగుమతి ఖర్చు,రవాణ అదనపు ఖర్చు. లబ్ధిదారులు సరుకులు కొనుగోలు చేయకుంటే జరిగే నష్టంతో పాటు ఉపాధికి గండిపడుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.