kodanadaram
-
వీడని మిస్టరీ: అంతులేని ‘కొడనాడు’ కథ
కొడనాడు మిస్టరీ.. రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణ ముగిసినట్లు ప్రకటించగా.. డీఎంకే రాకతో మళ్లీ వేగవంతమైంది. తాజాగా దర్యాప్తు కోసం మరో 4 ప్రత్యేక బృందాలను నియమించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కొడనాడు ఎస్టేట్ ఘటనలపై విచారణ వేగం పుంజుకుంది. పోలీసు ఉన్నతాధికారుల రంగ ప్రవేశం, అదనంగా నాలుగు విచారణ బృందాల ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో కలవరానికి దారితీసింది. సినిమా తరహాలోనే.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఏడాదికి ఒకసారైనా కొడనాడు ఎస్టేట్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. ఆమెతో నెచ్చెలి శశికళ కూడా తప్పక ఉండేవారు. జయ మరణం తరువాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 ఏప్రిల్ 24వ తేదీన ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యారు. అలాగే ఏస్టేట్ బంగ్లాలోని విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇందుకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన సయాన్, వలయారు మనోజ్, మనోజ్ స్వామి, జితిన్‌రాయ్, సంతోష్స్వామి, ఉదయకుమార్ సహా 10 మందిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. పోలీసులు జయ కారు డ్రైవర్ కనకరాజ్‌ను అనుమానించి విచారణకు పిలిచే సమయానికి అతడు సేలంలో (ఏప్రిల్ 28) రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం, ఎస్టేట్ లోని కంప్యూటర్ ఆపరేటర్ దినేష్ ఆత్మహత్య చేసుకోవడం, కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సయాన్ భార్య, బిడ్డ మరణించడం..ఇలా వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు మరింత సంచలనానికి దారితీశాయి. కొత్తేరి టూ ఊటీ.. ఈ కేసు విచారణ కొత్తేరీ కోర్టు నుంచి ఊటీ కోర్టుకు మారింది. అప్పటి నుంచి నీలగిరి జిల్లా ఊటీలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్‌ను పశ్చిమ మండల ఐజీ సుధాకర్, నీలగిరి ఎస్పీ ఆశిష్ రావత్ తదితర పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈక్రమంలో మరికొందరు ముఖ్యులను విచారించేందుకు మరో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు రాజమోహన్, విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌ను విచారించేందుకు సమన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కేరళ, సేలం, చెన్నైకు ప్రత్యేక బృందాలు వెళ్లేందు కు నిర్ణయించుకున్నాయి. నాలుగు వారాల గడువు.. కొడనాడు ఘటనలపై ఊటీలోని న్యాయస్థానంలో ఇటీవల విచారణ జరిగింది. ఈ కేసులో ఇంకా పలువురిని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరగా, కోర్టు నాలుగువారాల గడువు ఇచ్చింది. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఊటీలోని పాత ఎస్పీ కార్యాలయ భవనంలో ప్రత్యేక విచారణ కేంద్రాన్ని పోలీసులు ఏర్పాటు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టులో 7న విచారణ కొడనాడు ఎస్టేట్ కేసులో కోయంబత్తూరుకు చెందిన రవి అనే పోలీసును అధికారులు సాక్షిగా చేర్చారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ విచారణపై స్టే విధించాల్సిందిగా మద్రాసు హైకోర్టులో రవి పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో రవి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈనెల 7వ తేదీన విచారణకు రానుంది. ఇవీ చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. ఇంటికి పిలిచి మత్తుమందు కలిపి.. వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు.. -
టీజేఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు : కోదండరామ్
-
ఈ నెల 19న ‘చలో ఉస్మానియా’
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న ‘చలో ఉస్మానియా’ సత్యాగ్రహ పోస్టర్‌ను శనివారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 48 లక్షలకు మందికిపైగా నిరుద్యోగులుంటే ప్రభుత్వం కేవలం 37 వేల పోస్టులే భర్తీ చేసిందన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు -
చెరుకు సుధాకర్‌ను పరామర్శించిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను టీజేఎస్ వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ కోదండరాం బుధవారం పరామర్శించారు. లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సుధాకర్ ఆరోగ్య వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పని చేశామన్నారు. మహాకూటమిలో ఒక సీటు వెనక్కి తీసుకున్నప్పటికీ, సుధాకర్ కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. మహాకూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని సుధాకర్ తనకు మాట ఇచ్చారని.. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుని మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నానన్నారు. కాగా తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇందులో భాగంగానే 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ చెరుకు సుధాకర్ గత బుధవారం విడుదల చేశారు. అంతేకాకుండా తమ పార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను మహాకూటమికి వ్యతిరేకం కాదని, త్వరలోనే మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
కోదండరాం పార్టీ పేరు ఇదే!
-
ఇట్స్ క్లియర్: కోదండరాం పార్టీ పేరు ఇదే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తన స్థాపించబోయే పార్టీ పేరును వెల్లడించారు. తెలంగాణ జనసమితి పేరిట పార్టీని ఏర్పాటుచేస్తున్నట్టు సోమవారం అధికారికంగా తెలిపారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఉంటుందని తెలిపారు. టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో గత కొన్నాళ్లుగా కీలక అడుగులు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయాలనే చర్చ టీజేఏసీలో కొన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే పార్టీ ఏర్పాటుకు లాంఛనంగా సమ్మతి తెలిపిన కోదండరాం.. ఆ దిశగా కొన్నిరోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటుచేస్తామని ఆయన గతంలో చెప్పారు. పార్టీ పేరును ప్రకటించడంతోపాటు.. పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్‌లో ఉంటుందని తాజాగా వెల్లడించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో ఏర్పాటుచేసిన జేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జేఏసీ చైర్మన్‌గా కోదండరాం ఉద్యమంలో విశేషమైన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో జేఏసీ ఒకరకంగా తటస్థమైన పాత్రనే పోషించింది. ఆ తర్వాత క్రమంగా జేఏసీ టీఆర్ఎస్కు దూరం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్ పరిపాలన విధానంపై జేఏసీ చైర్మన్ కోదండరాం గతకొంతకాలంగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శల ధాటి పెంచారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కోదండరాం రాజకీయ పార్టీని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. -
మిలియన్ మార్చ్ : ట్యాంక్‌బండ్ అష్ట దిగ్బంధం