koil sagar
-
ప్రాజెక్టులపై చెరగని సంతకం.. వైఎస్
♦ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ♦ కోయల్‌సాగర్ ప్రాజెక్టుల పనుల్లో ♦ చాలా భాగం ఆయన హయాంలోనే... సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి బీళ్లుగా ఉండిపోయిన పాలమూరు జిల్లా భూములకు నీరందించి, సస్యశ్యామలం చేయాలన్న మహోన్నత లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలు ఇప్పుడు ఆ జిల్లా వాసులకు అందుతున్నాయి. కరువు రక్కసితో అల్లాడుతూ వలసబాట పట్టిన ఆ జిల్లా రైతుల ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలన్న వైఎస్ కలలు నేడు నిజాలవుతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు) ప్రాజెక్టులను ఆయన హయాంలో చేపట్టారు. 7.8 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటితోపాటు 3.9 టీఎంసీల సామర్థ్యంతో 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా కోయల్‌సాగర్ ప్రాజెక్టును చేపట్టారు. నిర్మాణం వేగంగా జరగాలన్న ఉద్దేశంతో భారీగా నిధులు ఇవ్వడంతో శరవేగంగా ఆ ప్రాజెక్టుల పనులు జరిగాయి. సుమారు రూ.5 వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం కొన్ని అవాంతరాలు వచ్చినా... ప్రస్తుత ఏడాదిలో ఆ పనులన్నీ కొలిక్కి వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకు సుమారు 1.5 లక్షల ఎకరాలు వృద్ధిలోకి రాగా.. ఈ ఏడాది పాత ఆయకట్టు కలుపుకొని 4.6 లక్షల ఎకరాలకు నీరందనుంది. ప్రస్తుతం కృష్ణా నుంచి జూరాలను చేరుతున్న వరద మరికొంత కాలం కొనసాగితే నెట్టెంపాడు కింద 1.5 లక్షల ఎకరాలు, కోయల్‌సాగర్ కింద 20 వేల ఎకరాలు, భీమా కింద 1.40 లక్షల ఎకరాలకు నీరందనుండగా... కృష్ణా నీరు శ్రీశైలాన్ని చేరితే కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇన్నాళ్లూ బీడుగా ఉన్న భూములకు వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులతో జలాభిషేకం జరుగుతోంది. -
ఆ ప్రాజెక్టులు మా ప్రభుత్వం చేపట్టినవే
టీడీపీ నేత రావుల సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాం లో చేపట్టినవేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు గతంలో ప్రారంభించిన వాటినే మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డితో కలసి ఆయన ఎన్టీఆర్ట్రస్ట్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే మోటార్లు బిగించి జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా పైలాన్లు నిర్మించి మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వొచ్చని ఎప్పుడో ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ప్రతిపాదించి అంతర్రాష్ట్ర జల వివాదాల్లోకి లాగారని దయాకర్‌రెడ్డి అన్నారు. -
పర్యాటకులను ఆకట్టుకుంటున్న నీటిపక్షులు
మహబూబ్‌నగర్ (దేవరకద్ర) : భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కోయిల్‌సాగర్‌లో నీటి పక్షులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో ప్రాజెక్టులోని నీరు తగ్గుముఖం పడుతుండడంతో నీటిలోని చేపలు, వివిధ రకాల పురుగులను తినడానికి పలురకాల పక్షులు ప్రాజెక్టు వద్దకు వేలసంఖ్యలో తరలివస్తాయి. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వివిధ రకాల పక్షులు ప్రాజెక్టు నీటి వద్దకు వచ్చి సందడి చేస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రంవేళల్లో కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో పక్షులు చేసే సందడి అంతా ఇంతా కాదు. తెల్లమచ్చకోడి, వివిధ రంగుల కొంగలు, ఆరె పిట్టలు, నీటి బాతులు తదితర నీటి పక్షులు చేసే సందడితో కోయిల్‌సాగర్ ప్రాంతం కొల్లేరును తలపిస్తుంది. ప్రాజెక్టు నీటిలో శనివారం సందడి చేసిన పక్షులను 'సాక్షి' తన కెమెరాలో బంధించింది. -
‘కోయిల్‌సాగర్’ పనులు వేగవంతం
గండేడ్, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ నుంచిపరిగి నియోజకవర్గానికి తాగునీటిని తీసుకువచ్చేందుకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు, పీసీసీ కార్యదర్శి టి. రామ్మోహన్‌రెడ్డి రూట్ సర్వే చేశారు. పరిగి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.150 కోట్లతో పనులు చేపట్టేందుకు జీఓను విడుదల చేసింది. మొదటి విడతగా రూ.50 లక్షలతో అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. సోమవారం గండేడ్ మండలం పగిడ్యాల్ ప్రాంతం నుంచి కోయిల్ సాగర్ వరకు లిఫ్ట్ పద్ధతిన పైపులైన్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేపట్టారు. పనులు చేసేందుకు టెండర్లు తీసుకున్న జేసీఏ కంపెనీ అధికారులు కూడా సర్వే కోసం వచ్చారు. కోయిల్‌సాగర్ నుంచి తాగునీటిని పరిగికి తీసుకురావడంలో పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత అధికారులతో సర్వే సనులు చేయిస్తున్నారు. కోయిల్ సాగర్ నుంచి పగిడ్యాల్ వరకు సుమారు 38 కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నారు. పగిడ్యాల్ ప్రాంతంలో నీటిని శుద్ధి చేసి అక్కడి నుంచి పరిగి నియోజకవర్గంలోని గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, పూడూరు మండలాలకు 3 ప్రత్యేక పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు ఏడాదిలోగా పూర్తి కావచ్చని ఆయన తెలిపారు. అధికారులు కోయిల్ సాగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న తాగునీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఇక ప్రజల దాహార్తి సమస్య తీరినట్లే.. పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యను తీర్చేందుకే 2007 నుంచీ.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖరరెడ్డి ద్వారా ప్రయత్నం కొనసాగించినట్లు పీసీసీ కార్యదర్శి టీఆర్ఆర్ గుర్తు చేశారు. పరిగి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోయిల్ సాగర్ జలాలతో ఇక ఈ సమస్య తీరినట్లేనని టీఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాగునీరే కాకుండా పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు, రైల్వేలైన్, చేవెళ్ల ప్రాణహిత వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ నర్సింలు గౌడ్, గండేడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, గండేడ్, వెన్నాచేడ్ సర్పంచ్‌లు వెంకటయ్యగౌడ్, బోయిని గోపాల్, నాయకులు బాల్‌రెడ్డి, ఆశిరెడ్డి ఉన్నారు. -
కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ షటర్ల లీకేజీ