Komatireddy rajagopalreddi
-
కేసీఆర్ ఆబ్సెంట్‌తో అసెంబ్లీలో కిక్కులేదు: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల సభలో తమకు కిక్కు రావడం లేదని, కేసీఆర్ వస్తే మజా వస్తదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం(ఆగస్టు2) రాజగోపాల్‌రెడ్డి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు తల్లి లేని పిల్లలుగా అనిపిస్తోందన్నారు. ప్రతిపక్షనేత హోదా కేటిఆర్, హరీశ్లలో ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఆగం అవుతుందన్నారు. ‘హరీశ్ రావు వర్కర్ ..కానీ ఆయనకు ఇవ్వరు. కేటీఆర్‌కు అవగాహన లేదు. విద్యుత్ మీద డిస్కషన్లో కేసిఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేది. కేసిఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నాడు. ఆయన ఊహల్లో బతుకుతుండు అని రాజగోపాల్‌రెడ్డి సెటైర్లు వేశారు. -
రాజగోపాల్‌రెడ్డిని ఓడించి తీరాల్సిందే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడు. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్‌లోనే ఉంటాను అని అనేవారు. అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం పాల్వాయి స్రవంతి అభ్యర్థిగా లేకపోతే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకరి భుజంపై ఒకరు చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం. నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్’ అని కేటీఆర్ చెప్పారు బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ చాలా ఆలోచించి నేను బీఆర్ఎస్లో చేరాను. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పిన మాట. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇచ్చారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరుకుంటున్న. అందరం కలిసి ముందుకు వెళ్దాం’ అని తెలిపారు. ఇదీ చదవండి...శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి -
వేడెక్కిన ప్రచారం!
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మండలానికి ఒక ప్రచార వాహనం ఏర్పాటు చేసి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ పాటల ద్వారా ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ రోజు తమ కార్యకర్తలను వెంట తెచ్చుకొని బలనిరూపణ చేసుకున్నారు. మునుగోడుకు సాగు జలాలే ప్రధాన అజెండాగా అన్నిపార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్ ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరో దఫా నియోజకవర్గంలో ప్రతిరోజు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రచారం చేస్తున్నారు. చేసిన అభివృద్ధి, ప్రత్యర్థుల లోపాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ హయాంలో ఏవిధంగా అభివృద్ధి చేశారో చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం ఇలా.. బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి బీజేపీ జాతీయ నాయకుడు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామితో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. మండలం వారీగా ప్రణాళిక రూపొందించుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే ఏవిధంగా అభివృద్ధి చేస్తానో చూపిస్తాను అంటూ అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామాల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దూకుడు.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వం ప్రకటించడం ఆలస్యమైనప్పటికీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చాలా రోజులుగా చాపకింద నీరులా తమ కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారిలో జోష్ నింపారు. మిత్రపక్షాలైన సీపీఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి మిత్రధర్మం పాటిస్తామని హామీ ఇచ్చి ప్రచారానికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వివిధ పార్టీల అసంతృప్త నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. రోడ్డుషోలతో పాటు, ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. బీఎల్ఎఫ్, ఇతరుల ప్రచారం.. బీఎల్ఎఫ్ అభ్యర్థి కరుణాకర్ నియోజకవర్గంలో ఆలస్యంగా ప్రచారం మొదలు పెట్టారు. వీరు కాకుండా ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో అన్నిపార్టీల అభ్యర్థులతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. -
గ్రామాలను అభివృద్ధి చేయాలి
మర్రిగూడ, న్యూస్‌లైన్ :‘మన కోసం మనం’ కార్యక్రమం ద్వార గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. సోమవారం మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన కోసం మనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ప్రవేశ పేట్టిన మనకోసం మనం కార్యక్రమం ద్వారా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధన ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్‌లు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మార్పు తీసుకొచ్చిన ముగ్గురు సర్పంచ్‌లకు నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చూసి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని కోరారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ వారికి 856 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని తెలిపారు. లింగ వివక్షను రూపు మాపేందుకు కృషి చేయాలని కోరారు. డ్వామ పీడీ కోటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి గానూ ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 9100లను అందజేస్తున్నట్లు తెలిపారు. ఆనతరం సాక్షరభారత్ ఆధ్వర్యంలో ప్రచురించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో మర్రిగూడ మండల ప్రత్యేకాధికారి పావులూరి హనుమంతరావు, ఎంపీడీఓ బి.ఉష, తహసీల్దార్ డి.గోవర్దన్, ఎంఈఓ టి.తిరుపతిరెడ్డి, సీనియర్ పబ్లిక్ హెల్త్ అఫీసర్ ఎస్.దాస్‌నాయక్, ఎస్ఐ కె.శంకర్‌రెడ్డి, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలో పూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మర్రిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మన తెలంగాణను మనం సాధించుకున్నామని, ఇక అభివృద్ధి వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేన్నమనేని రవీందర్రావు, వజ్రమ్మ, రమావత్ భీమానాయక్, సర్పంచ్‌లు పాశం సురేందర్‌రెడ్డి, పాముల యాదయ్య, రాచమళ్ల నరేందర్‌రెడ్డి, నాయకులు ఏర్పుల యాదయ్య, చెరుకు లింగం తదితరులు పాల్గొన్నారు.