komatreddy venkatreddy
-
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి
-
హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్
-
నిరుద్యోగులు, ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం: వెంకటరెడ్డి
-
నేడు ఎంపీ కోమటిరెడ్డి నివాసంలో టీ. కాంగ్రెస్ కీలక భేటీ
-
నేడు హైదరాబాద్ లో టీ-కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
-
తూచ్.. నేను అలా అనలేదు.. బ్రేకింగ్ పెట్టొద్దు: బండి సంజయ్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీతో టచ్‌లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొదంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. నిధుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోదీని కలుస్తుంటారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అన్నారు. చీకోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయన్నారు. చదవండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్.. మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేశారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తారని’’ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
నిరుద్యోగులకోసం కీలక ప్రకటన చేస్తానని సీఎం చెప్పటం సంతోషం
-
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడితో ముందుకెళ్లనుందా..? టీపీసీసీ అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్న వ్యవహారాన్ని తనదైన శైలిలో అధిష్టానం చేతిలోకి తెచ్చుకోనుందా..? తెలంగాణలోని నాయకులందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా గుజరాత్ తరహా ప్రయోగానికి సిద్ధమవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. గత కొన్ని రోజులుగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చి తెరదింపే దిశలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఆరు కమిటీలను కొత్త ఏడాదిలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఇతర కమిటీలు పనిచేసేలా దిశానిర్దేశం చేయనుందనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదవులపై కొత్త సంవత్సరంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్లు ఎవరికి వారు టీపీసీసీ అధ్యక్షుని ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అమ్ముడుపోయారనే ఆరోపణలు చేస్తున్నారు. బలహీనవర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే తన పేరు జాబితాలో చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ వ్యూహంతో ముందుకు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు దఫాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందలేక పోయిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే ఆలోచనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 162 మంది నాయకుల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఫలానా నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే వాదనలు పెరుగుతుండడంతో పార్టీకి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలవైపు హైకమాండ్ దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. 6 కమిటీలు.. అందరికీ పదవులు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కీలక పదవులు కట్టబెట్టాలన్నది సోనియా ఆలోచన అని చర్చ జరుగుతోంది. ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చి మిగిలిన ఇద్దరికి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. -
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
‘మా అన్న ఓడిపోతే.. రాజకీయ సన్యాసమే’
సాక్షి, యాదాద్రి భువనగిరి : డబ్బుల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్లను అమ్ముకుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ గనుక 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.(బలమైన అభ్యర్థిగా రంగంలోకి..) ఆయనే స్వయంగా చెబుతున్నారుగా.. తన ముఖం చూసి ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కేసీఆర్ కోరుతున్నారు అంటే.. వారంతా డమ్మీలేనని ఆయనే స్వయంగా ఒప్పుకొంటునట్లేగా అని రాజగోపాల్ రెడ్డి చమత్కరించారు. ‘గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టాం. కోమటిరెడ్డి సోదరుల జోలికి వస్తే మళ్లీ అదే జరుగుతుంది. నా సోదరుడు గనుక ఓడిపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని ఆయన పేర్కొన్నారు. -
భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సోమవారం అర్ధరాత్రి ఈమేరకు ఏఐసీసీ విడుదల చేసిన రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ప్రకటించింది. అనూహ్య మలుపుల నడుమ భువనగిరి అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది. భువనగిరి టికెట్ కోసం 30 మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లిన జాబితాతో సంబంధం లేకుండా అధిష్టానం కోమటిరెడ్డి పేరును ఖరారు చేసింది. కోమటిరెడ్డికి టికెట్ రావడం వెనుక ఆయన సోదరుడు, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నడిపిన మంత్రాంగం పనిచేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసింది అధిష్టానం. దీంతో జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థిగా రంగంలోకి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దించింది. కొన్ని రోజులుగా భువనగిరి నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. మధుయాష్కి కోమటిరెడ్డి సోదరుల అండదండలతోనే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయ్యారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంకట్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని అధిష్టానం తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. కోమటిరెడ్డితోపాటు నల్లగొండ నుంచి పోటీ చేయడానికి సీఎల్పీనేత జానారెడ్డి, రేవంత్‌రెడ్డి అనుచరుడు సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్‌రెడ్డి తమకు టికెట్ కావాలని అధిష్టానాన్ని కోరారు. నల్లగొండ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేయబోతున్నారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం రంగంలోకి దింపింది. మరోవైపు భువనగిరి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా విజయం దక్కించుకోవచ్చన్న ప్లాన్‌ను సిద్ధం చేసింది. కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే ప్రతి ఎంపీ సీటు ఎంతో ముఖ్యంగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కేటాయింపులో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2015 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పాటు నకిరేకల్ నియోజకవర్గంలో తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు బలమైన శిష్యగణం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు, జనగామ మినహా ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా చేసిన సేవలు కూడా సానుకూలంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. భువనగిరి నుంచి అయతే విజయం సాధించవచ్చన్న ధీమాతో చివరి నిమిషంలో భువనగిరి నుంచి ఎంపీగా పోటీకి రంగంలోకి దిగారు. ఆశావహులకు దక్కని అవకాశం.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని కొంతకాలంగా కార్యకర్తల మధ్యన ఉంటున్న మధుయాష్కీ వెంకట్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో యథావిధిగా గతంలో ఎంపీగా పనిచేసిన నిజామాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. కాగా భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి భువనగిరి లోక్‌సభ నుంచి పోటీ చేయడానికి చాలా రోజుల నుంచి సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పలు సేవా, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. అనూహ్యంగా శాసనసభ్యుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని గూడూరు నారాయణరెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయిం చింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. టీడీపీతో కలిసి కాంగ్రెస్‌కు 21మంది ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉండగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దీంతో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. నాయకత్వంలో సమన్వయ లోపం.. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయం లోపంఉంది. జనగామ, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో ఉన్న అసంతృప్తి, ఇబ్బందులు కల్పించే అవకాశం ఉంది. అందరూ నాయకులను సమన్వయం చేయగలిగితే గెలుపు అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కోమటిరెడ్డి బయోడేటా.. పేరు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు : భార్య సబిత, కుమార్తె శ్రీనిధి పుట్టిన తేదీ : 23.05.1965 స్వస్థలం : బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం, నల్లగొండ జిల్లా తల్లిదండ్రులు : పాపిరెడ్డి, సుశీలమ్మ రాజకీయ ప్రస్థానం : 1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగసాగర్లు ఎమ్మెల్యేగా గెలుపు, 2009 నుంచి 2014 వరకు రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్, క్రీడలు, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 శాసనసభ రద్దు వరకు సీఎల్పీ ఉపనేతగా పనిచేశారు. సకలజనుల సమ్మె సందర్భంగా తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో కోమటిరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. దివంగత సీఎం వైఎస్ఆర్, కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. -
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
సాక్షి,నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ పట్టణంలోని 15వ వార్డులో గల సతీష్‌నగర్, క్రాంతినగర్, గొల్లగూడ ప్రాంతాల్లో పర్యటించారు. ఓటర్లను పలకరిస్తూ తనకు ఓటేసి గెలిపిం చా లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి రావడం ఖాయమని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నిం టినీ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే మున్సిపాటీల్లో అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటికి పైసా నిధులను ఇవ్వడంలేదని విమర్శించారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యమై గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 40శాతం ప్రాజెక్టులు పూర్తి చేశామని నాపై ఉన్న కోపంతో సీఎం కేసీఆర్ ఎస్ఎల్బీసీ సొరంగం, బి.వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదన్నారు. ఇంది రమ్మ రాజ్యంలోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుం దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్, కౌన్సిలర్ అల్లి నర్సమ్మ, కేసాని కవతి, మందడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అల్లి సుభాష్, వేణు, కంచి మధు, జూలకంటి శ్రీనివాస్, చింతమల్ల వెంకటయ్య శంకర్, షమీ, సతీష్, వంశీ పాల్గొన్నారు. -
ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా...
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రం నుంచి నార్కట్‌పల్లి రోడ్డు మధ్య ఐటీ కంపెనీలు తీసుకువచ్చి స్థాపిస్తానని, నిరు ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తానని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం 7, 8, 12, 13, 15, 16, 37, 38, 39వ వా ర్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి వెళ్లి తనకే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఐటీ కంపెనీలు, మెడికల్ కాలేజీ తీసుకువరావడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. తెలంగాణలో జిల్లాను రాష్ట్రంలోనే హైదరాబాద్ అంతటి మహా నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింతగా చేసి చూపెడతానని స్పష్టం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుం దన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. శ్రీశైలం సొరంగ మార్గానికి గతం లో 2000 కోట్లు మంజూరు చేయించానని, దానిని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేయిస్తానని తెలిపారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు కూడా సాగర్ ఆయకట్టులాగా మారుతాయన్నారు. ఎస్ఎల్బీసీ పంట కాల్వలను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించడమే తమ ధ్యేయమన్నారు. పానగల్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రం గా చేసేందుకు 50 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. ఫౌంటెన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తనను అం దరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అలంపల్లి మల్లేష్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గాదె వినోద్‌రెడ్డి, ముదిరెడ్డి కళావతి, కాసరాజు వాసు, గౌతం నాయుడు, నాంపల్లి శ్రీని వాస్, బొడ్డుపల్లి శ్రీను, ఎ.శ్రీను, లక్ష్మీ, కవిత, శ్రీని వాస్, అల్లి వేణు, ఎం.వెంకన్న, మధుసూదన్, శ్రీనివాస్, కోమటిరెడ్డి దశరథరెడ్డి, బాబా, ఖయ్యూంబేగ్, అబ్బగోని రమేష్ పాల్గొన్నారు.