kondachiluva
-
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ నడిబొడ్డున భారీ కొండచిలువ కలకలం
-
18 అడుగుల కొండచిలువ హతం
పెద్దాపురం : మండలంలోని కాండ్రకోట గ్రామంలోని పొలాల్లో కనిపించిన కొండ చిలువను స్థానిక రైతులు మంగళవారం హతమార్చారు. ఏలేరు కాలువ గట్టు ద్వారా ఈ కొండచిలువ పంట పొలాల్లోకి వచ్చి ఉంటుందని రైతులు భావిస్తున్నారు. 18 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ స్థానిక రైతులు ఉల్లంకల శ్రీను, నారియ్య తదితరులు చంపేశారు. -
25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ
25 పిల్లలకు జన్మనిచ్చిన కొండచిలువ కేకే.నగర్ : వండలూర్ జూలో ఓ కొండచిలువ 25 పిల్లలకు జన్మనిచ్చింది. వండలూరు అన్నా జువాలజికల్ పార్కులో 25 కొండచిలువలు సంరక్షణలో ఉన్నాయి. అందులోని ఒక ఆడ కొండచిలువ ఏప్రిల్ 8వ తేదీ 45 గుడ్లుపెట్టింది. అందులో గత నెల 23న 20 గుడ్ల నుంచి 20 కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి. అనంతరం ఈ నెల 18న మరో 25 గుడ్ల నుంచి 25 కొండచిలువ పిల్లలు వచ్చాయి. ప్రస్తుతం వీటితో కలిపి మొత్తం కొండచిలువ పిల్లల సంఖ్య 45కు చేరింది. సరాసరి బరువు 89.28 గ్రాములు ఉన్న ఈ కొండచిలువ పిల్లలు సుమారు 28 అడుగుల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంది.