kondapalli sitaramaiah
-
మావోయిస్టు పార్టీకి 15 ఏళ్లు
పెద్దపల్లి: పీపుల్స్‌వార్ పార్టీ, బిహార్‌కు చెందిన కమ్యూనిస్టు సెంటర్ మావోయిస్టు (ఎంసీసీ) పార్టీలు విలీనమై సెప్టెంబర్ 21కి 15 ఏళ్లు నిండనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించిన ఆ పార్టీ 2004, సెప్టెంబర్ 21న బిహార్ ఎంసీసీని తనలో విలీనం చేసుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979లో జగిత్యాల జైత్రయాత్ర అనంతరం మావోయిస్టు పార్టీని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, చత్తీశ్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ వివిధ రాష్ట్రాలకు పాకింది. అప్పటికే బీహర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పీపుల్స్‌వార్ పేరిట నక్సలైట్ల కార్యకలపాలు కొనసాగుతుండగా కిషన్‌దా నాయకత్వంలోని ఎంసీసీ ఆ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీల మధ్య చర్చలు ముగిసి ఏకాభిప్రాయానికి రావడంపై ఎంసీసీని పీపుల్స్‌వార్‌లో కలుపుకుని మావోయిస్టు పార్టీగా ప్రకటించారు. సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2004లో శాంతి చర్చలను జరుపుకున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సమయంలోనే నక్సల్స్ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ ఇకపై మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. ఎంసీసీ కంటే ముందు బీహర్, బెంగాల్, శ్రీకాకుళంలలో పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సీపీఐఎంఎల్ పార్టీ యూనిటీ సైతం మావోయిస్టుపార్టీలో అప్పటికే విలీనమైనట్లు చర్చల సందర్భంగా రామకృష్ణ వెల్లడించారు. మొదటి దఫా శాంతి చర్చలు ముగిసిన అనంతరం మావోయిస్టులు తిరిగి అజ్ఞాతవాసం వెళ్లారు. శాంతిచర్చలకు సైతం 15ఏళ్లు నిండినట్లు చెప్పుకోవచ్చు. మావోయిస్టులపై సర్కార్ ముప్పేట దాడి.. పీపుల్స్‌వార్‌పార్టీగా కార్యకలాపాలు కొనసాగించిన సమయంలో కంటే మావోయిస్టు పార్టీగా ఏర్పాటైన తర్వాత ఏకంగా అన్ని రాష్ట్రాల నుంచి నిఘా వర్గాలు మావోయిస్టు పార్టీపై ఒత్తిడి పెంచాయి. జాతీయస్థాయిలో మావోయిస్టుల బలం పెరుగుతుందనే సాంకేతం బయటకు రావడంతో మావోయిస్టుల కట్టడికి అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రం సైతం బలగాలను రాష్ట్రాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగానే అప్పటివరకు తెలంగాణలో బలంగా ఉన్న పీపుల్స్‌వార్ పార్టీ (మావోయిస్టులు) కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లాలతోపాటు నల్లమలను సైతం మావోయిస్టులు కొల్పోయారు. అప్పటి నుంచే క్రమంగా పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేతల పై గురిపెట్టి ఒక్కొక్కరినీ ఎన్కౌంటర్లతో మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. మావోయిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ బదిలీ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన బుర్ర చిన్నన్న, శాఖమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి, నల్లమల్ల సాగర్, దేవేందర్ ఇలా వరుసగా రాష్ట్ర పార్టీ కార్యదర్శులంతా ఎన్కౌంటర్లలో హతమయ్యారు. క్రమంగా తెలంగాణ మైదాన ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీ ఉనికి దెబ్బతీశామని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తలపెట్టిన ఆవిర్భావ వారోత్సవాలు తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో ప్రభావం ఉండదని, అటవీ ప్రాంతాల్లో మాత్రమే అంతంత మాత్రమే వారోత్సవాల నేపథ్యంలో కదలికలు ఉంటాయన్న అభిప్రాయంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. -
విలువల కోసం కడదాకా ఆరాటం
సరిగ్గా ఆరువారాల కింద ఆగస్టు 5 సాయంకాలం విశాఖ సముద్రతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపల్లి కోటేశ్వరమ్మ వందేళ్ల పుట్టినరోజు పండుగ జరి గింది. తెలుగుసీమ నలుమూలల నుంచీ వచ్చిన మూడు నాలుగు వందల మంది విభిన్న రాజకీయ, సామాజిక అభిప్రాయాలున్న స్నేహితులను ఉద్దేశించి కోటేశ్వరమ్మ ఒక అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ వయసులో సాధారణంగా గళంలో వినిపించే వణుకు, తడబాటు కూడా లేకుండా ఆమె చేసిన ఆ క్లుప్త ఉపన్యాసం సమాజానికి ఆమె ఇచ్చిన చివరి బహిరంగ సందేశం కావచ్చు. నిజానికి తుది శ్వాస విడవడానికి వారం ముందు కూడ రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా విశాఖలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఎట్లా జరిగిందనీ, రావలసినవారందరూ వచ్చారా, అందరినీ పిలి చారా అనీ వాకబు చేశారంటే ఆమె చివరిదాకా పడిన తపన, హృదయంలో నింపుకున్న ఆదర్శాలు అర్థమవుతాయి. సమాజం కోసం పనిచేయడం, అన్నివర్గాల అణగారిన ప్రజల బాగుగురించి ఆలోచించడం, వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమాజ సమస్యల గురించి ఆలోచించడం వంటి ఆదర్శాలవి. 20వ శతాబ్ది తొలి దశకాలలో జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ప్రేరేపించిన విలువలవి. వాటిని సంపూర్ణంగా తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కోటేశ్వరమ్మ. ఆ తపన, ఆదర్శాలు, విలువలు ఏదో ఒక సందర్భంలో ఏర్పడి ఆ సందర్భం ముగిసిపోగానే లుప్తమైనవి కాకపోవడమే కోటేశ్వరమ్మ ప్రత్యేకత. ఆ విలువలు తొలి యవ్వనంలో 1930ల చివర జాతీయోద్యమ ప్రభావంలోకి వచ్చినప్పుడు ప్రారంభమై, ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీల మీదుగా ఈ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచేవరకూ ఎని మిది దశాబ్దాలపైన నిరంతరంగా కొనసాగాయి. ఈ సుదీర్ఘ జీవితంలో కళాకారిణిగా, గాయకురాలిగా, అజ్ఞాత కార్యకర్తగా, కవిగా, కథారచయితగా, వార్డెన్‌గా, తల్లిగా, అమ్మమ్మగా ఆమె గడిపిన బహిరంగ ప్రజాజీవితం ఎంత ఉద్వేగభరితంగా గడిచిందో, బాల్య వితంతువుగా, సహచరుడితో విభేదాలు వచ్చిన భార్యగా, పిల్ల లకు దూరంగా ఒంటరిగా గడపవలసి వచ్చిన తల్లిగా ఆమె వ్యక్తిగత జీవితం అంత దుఃఖభరితంగా సాగింది. అటు ఉద్వేగభరితమైన సామాజిక జీవితాన్నైనా, ఇటు కష్టభరితమైన వ్యక్తిగత జీవితాన్నైనా స్థితప్రజ్ఞతతో గ్రహించి ఎన్నడూ తన విలువలను, ఆదర్శాలను వదులుకోకుండా జీవించడమే ఆమె సమాజానికి ఇచ్చిన సందేశం. అలా కష్టాల కొలిమిలో పదునుదేరిన విశిష్ట వ్యక్తిత్వం గనుకనే ఆమె నిలువెల్లా కరుణ గల మనిషి అయింది. తన కన్నబిడ్డ కరుణ చనిపోయినా, వ్యక్తిమాత్రమైన కరుణ కోసం దుఃఖిస్తూనే సమాజానికి అవసరమైన గుణంగా కరుణ బతకాలి అని కోరుకుంది. చివరి ఉపన్యాసంలో కూడా కరుణ బతకడమంటే, కరుణను బతికించడమంటే హెచ్చుతగ్గులు, కుల అసమానతలు, విభేదాలు లేకుండా, సమసమాజ నిర్మాణంకోసం పనిచేయడమే అని నిర్వచించింది. అలాగే చివరి చూపు కూడ దక్కని తన కన్నబిడ్డ చందు కోసం దుఃఖిస్తూనే, నా కొడుకు చేసిన త్యాగం చేయమని చెప్పను గానీ, చచ్చిపోయేంతవరకు దేశానికి ఉపకారం చేసే, స్నేహభావాన్ని కనబరచే, మంచిపనులు చేసే మంచి మనుషులు కావాలి అని చెప్పింది. ఆస్తినీ, భర్తనూ, పిల్లలనూ కోల్పోయినప్పటికీ తాను ఆశావాదం కోల్పోలేదని చెప్పింది. ఒక సమసమాజ నిర్మాణం కోసం, ఆ భవిష్యత్తుకూ వర్తమానానికీ ఉన్న దూరాన్ని దగ్గర చేయడం కోసం యువకులు వస్తారనీ, రావాలనీ, ఆ ఆశతోనే తాను జీవిస్తున్నాననీ చెప్పింది. కరుణతో కొనసాగాలంటే, ఆశను కొడిగట్టిపోకుండా నిలుపుకోవాలంటే అపారమైన త్యాగాలు అవసరమని కూడా తనకు తెలుసు. తనకు నాయకులుగా, గురువులుగా, మార్గదర్శులుగా ఉండిన చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యల త్యాగనిరతిని సన్నిహితంగా చూసింది గనుక ఆ మహనీయుల త్యాగాన్ని కొనసాగించాలనే స్ఫూర్తిని మొన్నటి ఉపన్యాసంలో కూడ ప్రకటించింది. వారిలాగ దేశాన్ని బాగు చేసేవాళ్లు మళ్లీ వస్తారు అనే ఆశాభావాన్ని ప్రకటించింది. ఆమె రూపొందిన క్రమంలో ఏర్పడిన, ఇవాళ మరింత ఎక్కువ ప్రాసంగికంగా మారిన ఒక విలువ గురించి చివరి ఉపన్యాసంలోనూ ప్రస్తావించారని గుర్తిస్తే ఆమె హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది. ఆ ఉపన్యాసంలో ఆమె చండ్ర రాజేశ్వర రావు గురించి చెపుతూ బెజవాడలో రౌడీల సమస్య లేకుండా చేశారు అన్నారు. ఆమె నవయవ్వనంలో ఉన్నప్పుడు బెజవాడలో ఉండిన ఆ రౌడీల సమస్య ప్రధానంగా సంఘ్ పరివార్ సమస్య. వారిని భావజాలపరంగా ప్రతిఘటించడానికి గాంధీ హత్యకు ఏడాది ముందే చండ్ర రాజేశ్వరరావుగారు పుస్తకం రాశారు. గాంధీ హత్యకు ముందూ వెనుక పెచ్చరిల్లిన ఆ రౌడీమూకలను అరికట్టడానికి లాఠీలు పట్టుకుని భౌతిక ఘర్షణకు కూడ దిగే కార్యకర్తలను తయారు చేశారు. ఆ అవసరం మళ్లీ పెరుగుతున్న సందర్భంలో ఉన్న మనం ఆ పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలను కనిపెట్టవలసి ఉంది. త్యాగాల పునాదులతో నిర్మాణమైన విలువల జీవితాలలో అత్యంత ఆదర్శప్రాయమైన కోటేశ్వరమ్మ జీవితాన్ని, ఆమె స్వప్నాలను, అర్థంతరంగా ఆగిపోయిన ఆమె ఆకాంక్షలను మరొక్కసారి మననం చేసుకోవలసి ఉంది. ఆ విలువలు జీవించినంతకాలం కోటేశ్వరమ్మ సజీవంగానే ఉంటారు. అవి ఉదాత్తమైన, మానవజాతి లక్ష్యంగా నిర్వచించుకున్న విలువలు గనుక వాటికెప్పుడూ మరణం లేదు. అంటే కొండపల్లి కోటేశ్వరమ్మకూ మరణం లేదు. వ్యాసకర్త ఎన్. వేణుగోపాల్ వీక్షణం సంపాదకులు ‘ 98485 77028 -
భూకబ్జా గొడవలో.. దానం నాగేందర్‌పై కేసు
-
భూకబ్జా గొడవలో.. దానం నాగేందర్‌పై కేసు
కొండపల్లి సీతారామయ్య... పీపుల్స్ వార్ గ్రూప్ అగ్ర నాయకుడు. స్వయానా ఆయన మరదలైన కొండపల్లి హైమావతికి చెందిన భూమి కబ్జా విషయంలో ఓ వ్యక్తిని బెదిరించారంటూ మాజీ మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదైంది. నాగేందర్‌తో పాటు కార్పొరేటర్ మహేష్ యాదవ్, సూరి, హేమా చౌదరి అనే వాళ్లపై కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీ డెయిరీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళిరెడ్డి భార్య అయిన కొండపల్లి హైమావతి గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో 889 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. ఆమె అల్లుడు జయేందర్ రెడ్డి ఎన్నారై. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఆయన తమ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. అయితే, ఈ భూమి హేమా చౌదరికి చెందినదని చెబుతూ కొంతమంది వచ్చి తమ నిర్మాణ పనులు ఆపేసి.. సైన్ బోర్డులను ధ్వంసం చేశారని జయేందర్ రెడ్డి తెలిపారు. వెళ్లి మాజీ మంత్రి దానం నాగేందర్‌తో మాట్లాడుకోవాలని వాళ్లు చెప్పడంతో తాము వెళ్లగా.. పనులు ఆపేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన బెదరించారన్నారు. దీంతో తాము హైదరబాద్ కమిషనర్‌కు మొరపెట్టుకోగా, ఆయన బంజారాహిల్స్ పోలీసులను తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. దాంతో దానం నాగేందర్, మహేష్ యాదవ్, హేమా చౌదరిలపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు ఆయన తెలిపారు. ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నారైలను ఆహ్వానిస్తూ బంగారు తెలంగాణ నిర్మిద్దామని పిలుపునిస్తుంటే.. మరోవైపు ఇక్కడ మాత్రం తమకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు జయేందర్ రెడ్డి వాపోయారు.