kondurgu
-
బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు.తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో అసహనం ఏర్పడిందన్న సీఎం.. ఈ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు.బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు సీఎం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయలేదని విమర్శలు గుప్పించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతో బీఆర్ఎస్ సర్కార్ పనిచేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసిందని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. 1020 రెసిడెన్సియల్ స్కూల్స్‌లో కనీస వసతులు లేవు. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ.. పోలింగ్ రోజు బూత్‌లలో చేయాల్సింది చేస్తారు. బర్రెలు, గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండుసున్నా వచ్చినా.. వాళ్ల బుద్ధి మారలేదని విమర్శించారు.ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
అవి చిత్తు కాగితాలు కాదండి.. విద్యార్థుల సర్టిఫికెట్లు
సాక్షి, రంగారెడ్డి: ఈ చిత్రాన్ని చూసి ఏవో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు అనుకుంటున్నారా.. కాదండి అవి విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే సర్టిఫికెట్లు. ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోంది. కొందుర్గు మండల కేంద్రంలోని అద్దె భవనంలో కొనసాగిన ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల రెండేళ్లుగా మూతబడింది. విద్యార్థుల సర్టిఫికెట్లు అందులోనే ఉండిపోయాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇంటి యజమాని ఆదివారం కూల్చివేసేందుకు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ బీరువాలో ఉన్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఒక్కసారిగా కుప్పలుగా బయటపడ్డాయి. విషయం ఆ నోటా.. ఈ నోటా.. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది అంతే అందుబాటులో ఉన్న విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తీసుకునేందుకు కళాశాల భవనానికి పరుగులు పెట్టారు. చెత్త కుప్పల్లా పడి ఉన్న కాగితాల్లో ఇలా తమ సర్టిఫికెట్లను వెతుక్కున్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్‌పై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడంపై మండిపడుతున్నారు. సర్టిఫికెట్ల భద్రత పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. -
కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు
సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్ ఆర్డీఓ కృష్ణ షోకాజ్ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్ కలెక్టర్, ప్రస్తుత ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్చార్జి తహసీల్దార్ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అవినీతి తిమింగళాలు..
సాక్షి, షాద్‌నగర్: ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా రెవెన్యూ సిబ్బందిలో మార్పు కానరావడం లేదు. యథేచ్ఛగా అక్రమాలను కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న పనుల కోసం వచ్చే రైతులను లంచాల పేరుతో వేధిస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ రైతు నుంచి కొందుర్గు వీఆర్వో రూ.4లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. హైదరాబాద్‌లోని కేశంపేట వీఆర్వో ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. భూమి ఆన్లైన్లో నమోదుకు రూ.9లక్షలు లంచం డిమాండ్ కొందర్గు వీఆర్ఓ అనంతయ్య ఇటీవల కేశంపేట నుంచి బదిలీపై వచ్చారు. కాగా, కేశంపేట మండలం దత్తాయపల్లె శివారులో సర్వే నంబర్ 85/ఆ లో 9–07 ఎకరాల విస్తీర్ణం భూమి మామిడిపల్లి చెన్నయ్య పేరున పట్టా ఉంది. వీఆర్ఓ అనంతయ్య చెన్నయ్యకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రూ.30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ తర్వాత అనంతయ్య జూన్ 13న కొందుర్గు బదిలీపై వచ్చారు. అయితే, రైతు చెన్నయ్యకు సంబందించిన భూమి 2019 జూన్ 18 వరకు ఆన్లైన్లో ఆయన పేరుపైనే కనిపించింది. కానీ, జూన్ 24న ఆన్లైన్లో చూడగా ఆ భూమి కనిపించలేదు. దీంతో బాధిత రైతు సంబందిత వీఆర్ఓ అనంతయ్యను సంప్రదించారు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయడం కోసం రూ.9 లక్షలు కావాలని, తనతోపాటు తహశీల్దార్ లావణ్యకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని అనంతయ్య రైతు చెన్నయ్య, అతడి కుమారుడు భాస్కర్‌కు చెప్పాడు. దీంతో వారు రూ.8 లక్షలు లంచం ఇవ్వడానికి వీఆర్ఓ అనంతయ్యతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్ఓ అనంతయ్యకు బుధవారం భాస్కర్ రూ.4 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ దాడల్లో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు గంగాధర్, మాజీద్, రామలింగారెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. రూ.9లక్షలు అడిగాడు : భాస్కర్ 1951లో మా నాన్న చెన్నయ్య భూమి కొనుగోలు చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా వచ్చాయి. ఆన్లైన్లో కూడా నమోదు చేశారు. కానీ, తిరిగి ఆన్లైన్లో నుంచి తొలగించారు. ఆన్లైన్ నమోదు చేయాలంటే రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 8లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. నాలుగు బృందాలుగా ఏర్పడి.. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి అవినీతి చేపలను పట్టుకున్నారు. అయితే బుధవారం ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి కొందుర్గు, షాద్‌నగర్, కేశంపేట రెవెన్యూ కార్యాలయాలతో పాటుగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేశంపేట తహిసీల్దార్ లావణ్య ఇంటిపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొందుర్గు తహిసీల్దార్ కార్యాలయంలో రైతు మామిడిపల్లి భాస్కర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో షాద్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుకు సంబంధించిన భూరికార్డులను అధికారులు పరిశీలించారు. ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం కార్యాలయంలోని కంప్యూటర్లతో పాటుగా, రికార్డులను పరిశీలించారు. భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకోవడం వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైతు మామిడిపల్లి భాస్కర్‌కు సంబంధించిన భూమి వివరాలను ఓసారి ఆన్లైన్లో నమోదు చేసి కొన్ని రోజుల తర్వాత ఏవిధంగా తొలగించారన్న విషయంపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో బదిలీ అయినా కేశంపేట మండలంలో సుమారు పదేళ్ళకు పైగా అనంతయ్య వీఆర్వోగా పనిచేశారు. కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ, దత్తాయపల్లి, ఇప్పలపల్లి, కేశంపేట గ్రామాల్లో వీఆర్వోగా పనిచేసిన అనంతయ్యపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేశంపేటకు చెందిన చందన అనే మహిళా రైతుకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఆమె తహిసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ వ్యవహారంలో తహిసీల్దార్ లావణ్య, వీఆర్వోలు ఇబ్బందులు పెడుతున్నారని మహిళా రైతు ఆరోపణలు చేసింది. ఇటీవల జిల్లా అధికారులు వీఆర్వోల బదిలీల నేపథ్యంలో అనంతయ్యను కొందుర్గు మండల కేంద్రానికి బదిలీ చేశారు. ఆయన బదిలీ అయినా కేశంపేట మండలానికి సంబంధించిన రైతుల భూ వ్యవహరాల్లో తలదూర్చి ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. ఇటీవల షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు కేశంపేట తహిసీల్దార్ లావణ్య కాళ్లుపట్టుకొని భూ సమస్యను పరిష్కరించాలని వేడుకున్న సంఘటన ఆ రోజు చర్చనీయాంశమైంది. ఆర్డీఓ కార్యాలయ అధికారుల పాత్ర? వీఆర్వో భారీ ఎత్తున లంచం డిమాండ్ చేయడంలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే అధికారుల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నా.. తొలగించాలన్నా.. ఆర్డీఓ కార్యాలయం అధికారుల ప్రమేయం కూడా ఉంటుంది. అయితే భూమికి సంబంధించిన వివరాలను ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. తొలగించడంలో ఎవరెవరి పాత్ర ఉంది, లంచాలు ఎవరెవరు డిమాండ్ చేశారు అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాపు చేపడుతున్నట్లు తెలిసింది. ఉలిక్కిపడిన అధికారులు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో షాద్‌నగర్ డివిజన్లోని అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు అధికారులు సమయాని కంటే ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున లంచం తీసుకుంటూ పట్టుబడటం, ఏకకాలంలో కార్యాలయాల్లో తనిఖీలు జరగడంతో అసలు ఏం జరుగుతుందోనని, ఎవరెవరు మెడకు ఉచ్చుబిగించుకుంటుందనే చర్చ జరుగుతోంది. అవినీతి దందాలో కుమ్మక్కు తహసీల్దార్, వీఆర్వో ఇద్దరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రైతుకు సంబంధించిన భూమి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. భూ వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించాలంటే.. ఎందుకు తొలగించాల్సి వస్తుందోనన్న వివరాలను రైతుకు తెలియజేయడంతో పాటుగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్‌లు విధిగా ఉండాలని, అప్పుడే ఆన్లైన్లో నుంచి తొలగించేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం అలాందేమీ లేకుండా ఆన్లైన్లో వివరాలు తొలగించినట్లు తెలుస్తోంది. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూర్యానారాయణ సూచించారు. అధికారులు లంచం అడిగితే 9440446140 సంప్రదించాలని తెలిపారు. -
‘రైస్ పుల్లర్స్’ మాయగాడు అరెస్టు
సాక్షి, కొందుర్గు: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తేనే తప్పా జీవనం సాగించేది కష్టంగా మారింది. కానీ సంపాదనకు ఓ రాజామార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారంలో కోటి రూపాయలు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు గడించిన ఓ మాయగాడు గురువారం జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వీరబల్లి మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుగౌడ్ తన చిన్నతనంలో కుటుంబాన్ని విడిచి కేరళ వెళ్లాడు. మతం మార్చుకొని రెహమాన్ సాబ్‌గా పేరు మార్చుకొని ఎత్తి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. అతడి కూమారుడు మహ్మద్ ఆసిఫ్ తన మామ స్వగ్రామం వరంగల్ వచ్చి సెంటు, అల్వా బిజినెస్ చేసేవాడు. అనంతర జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. కాలక్రమేణ హైదరాబాద్ బహద్దూర్‌పూరాలో సూర్యప్రకాష్ అనే వ్యక్తితో ఆసిఫ్‌కు పరిచయం ఏర్పడింది. అతడి సలహా మేరకు పాతకాలం లోహపుకాయిన్ వస్తువులకు అతీతమైన శక్తి ఉంటుందని, దీంతో అపారంగా సంపాదించవచ్చని భావించారు. ఈ లోహపు వస్తువే రైస్ పుల్లర్‌గా చలామణి చేస్తూ రైస్ పుల్లర్‌తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఎందరో వ్యక్తులను నమ్మించి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసం చేయడం మొదలెట్టాడు. ఇదే క్రమంలో జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఇతడి వలలోపడి ఉన్న భూమిని తాకట్టుపెట్టి లక్షలు నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, ముంబాయి, బెంగళూర్, తదితర ప్రాంతాల్లోని ఎందరో అమాయకులు ఇతడి వలలో పడి మోసపోయారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఇతడి మాయలోపడ్డారంటే అతిశయోక్తిలేదు. ఇతడి మాయమాటలు నమ్మి మోసపోయిన వారంతా మహ్మద్ ఆసిఫ్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇతడి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రూ. 60,20,73,000 జమచేయడం జరిగిందని షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఐదు పోలీసుస్టేషన్లలో కేసులు.. నిందితుడు మహమ్మద్ ఆసిఫ్‌పై ఇప్పటికే జిల్లేడ్ చౌదరిగూడతో పాటు షాద్‌నగర్, షాబాద్, కడప, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పద్మారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కక్కులూర్ అనంతస్వామి, ఎల్కగూడెం భూపాల్‌రెడ్డి, షాద్‌నగర్ వెంకటేష్, హేమాజీపూర్ శంకర్, షాద్‌నగర్ మారుతి, నాగప్ప, జైపాల్‌రెడ్డి, మాణిక్యం, అన్వర్, జడ్చర్ల శ్రీనివాసురెడ్డి, కాటేదాన్ కుమారస్వామి తదితరులు ఆసిఫ్‌ను నమ్మి మోసపోయినవారే. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.. జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులు 2018 జనవరి 8న ఇతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలింపులు చేపట్టారు. కానీ, ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు గురువారం నిందితుడు పట్టుకున్నారు. పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు మహ్మద్ ఆసిఫ్ వెళ్తుండగా లాల్‌పహాడ్ వద్ద పోలీసులకు చిక్కినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. నిం దితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇంతకాలం అమాయకులను నమ్మించి మోసం చేసి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితం గడిపాడని, ఎలాంటి స్థిరాస్తులు లేవని, ఇతడిపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. -
ఎంపీపీ ఎన్నిక ; ఎంపీటీసీ కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తన భర్త కనిపించడంలేదని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం మూట్పూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి అదే గ్రామం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. ఫలితాల వెల్లడి అనంతరం రాంరెడ్డి కనిపించడం లేదు. గురువారం ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఆయన భార్య జ్యోతి మండల కార్యాలయానికి వచ్చారు. తన భర్త జాడ తెలపాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రిజల్ట్స్ తెలుసుకుందామని వచ్చిన తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో రాంరెడ్డిని ఎవరైనా క్యాంపునకు తీసుకెళ్లారా అనే విషయం తేలాల్సిఉంది. -
పానీపాట్లే..!
► పల్లెల్లో తప్పని తాగునీటి తిప్పలు ► అడుగంటిన భూగర్భజలాలు ► వట్టిపోయిన బోర్లు.. ► అక్కడక్కడా ట్యాంకర్లతో సరఫరా ► అయినా తీరని నీటి కష్టాలు బిందెడు నీటికోసం బండెడు కష్టాలు పడుతున్నారు పల్లెజనం. ఏ గ్రామంలో చూసినా నీటి కష్టాలే. తాగడానికి చుక్కనీరు లేక గొంతెండుతుంటే నీళ్ల ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ట్యాంకర్ ద్వారా వచ్చే నీళ్లు కూడా సరిపోక కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకొని బతుకీడుస్తున్నారు. ఇదీ షాద్‌నగర్ నియోజక వర్గంలోని కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని దుస్థితి. కొందుర్గు: రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల భూగర్బజలాలు అడుగంటాయి. బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోవడంతో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని అన్ని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. చుక్కనీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందుర్గు, చౌదరిగూడ, ముట్పూర్, గుంజల్‌పహాడ్, రావిర్యాల, టేకులపల్లి, ఆగిర్యాల తదితర గ్రామాలతోపాటు, గాలిగూడ, జాకారం, ఎదిర, చిన్నఎల్కిచర్ల గ్రామాలకు సంబంధించిన గిరిజన తండాల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. రెండు మండలాల్లో కలిసి 250 చేతిపంపులుండగా 150 చేతిపంపులు పనిచేస్తున్నాయని, 800 సింగిల్‌ఫేస్ బోర్లకు 226 సింగిల్‌ఫేస్ బోర్లు, 63 త్రీ ఫేస్ బోర్లకు 20 మాత్రమే పనిచేస్తున్నాయి. బోరు బావుల్లో సరిపడా నీళ్లు రాకపోవడంతో గ్రామాల్లో మహిళలు కుళాయిల వద్ద బిందెలతో క్యూకడుతున్నారు. బిందెడు నీటికోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ కాలనీవాసులు నీటికోసం ఖాళీబిందెలు పట్టుకొని ఏకంగా మండలపరిషత్ కార్యాలయాన్నే ముట్టడించారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. నీటికొరత ఉన్న గ్రామాలను గుర్తిస్తున్నాం: నీటికోసం ఇబ్బంది పడే గ్రామాలను గుర్తిస్తున్నాం. అవకాశం ఉన్న గ్రామాల్లో వ్యవసాయబోర్లను లీజుకు తీసుకుంటున్నాం. లేకుంటే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. కొందుర్గు మండలంలోని ఆగిర్యాల, పాత ఆగిర్యాలతోపాటు జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ఏడు గ్రామాల్లో బోర్లు లీజుకు తీసుకున్నాం. –జయశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, కొందుర్గు బోరులో పూర్తిగా నీళ్లు తగ్గిపోయాయి. చుక్కచుక్క నీళ్లు వస్తున్నాయి. ఒక బిందె నిండాలంటే అరగంట సమయం పడుతుంది. నీటికోసం గంటలకొద్ది నిలబడాల్సి వస్తుంది. రాత్రింబవళ్లు నీటికోసం తిప్పలుపడుతున్నాం. నీటి సమస్య తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –పద్మమ్మ, రావిర్యాల -
పొగచూరుతున్న బతుకులు
► దీనావస్థలో కొందుర్గు పరిసర గ్రామాలు ► రాత్రి వేళల్లో పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు ► పరిశ్రమ వ్యర్థాలతో శరీరంపై దద్దుర్లు ► దట్టమైన పొగ, దుర్వాసనతో అల్లాడుతున్న జనం కొందుర్గు: కొందుర్గుతోపాటు పరిసర గ్రామాలైన గంగన్నగూడ, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్, చెక్కలోనిగూడ, తూంపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చర్మంపై విపరీతమైన దురద ఏర్పడి దద్దుర్లు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ దురద వల్ల వచ్చిన దద్దుర్లు ఎర్రగా ఏర్పడి మచ్చలుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వాడిన తగ్గడం లేదని.. ఇక చిన్నారులపై ఈ దురద ప్రభావం మరింత ఎక్కవగా చూపుతుందని పేర్కొంటున్నారు. పరిశ్రమల కాలుష్యం వల్లనే.. కొందుర్గు పరిసర ప్రాంతంలో ఉన్న దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, స్కాన్ ఎనర్జీ పరిశ్రమ, బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ, దిలీప్ టెక్స్టైల్స్ తదితర పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్లనే తమకు ఈ దురదలు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మొదటగా చిన్న కురుపులుగా ఏర్పడి, పెద్దగా దద్దుర్లు వస్తున్నాయని అనంతరం మచ్చలుగా మారుతున్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులు పగలంతా వ్యర్థాలను నిల్వచేసి, రాత్రివేళల్లో విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనాలతో కూడిన వ్యర్థపదార్థాలను పరిశ్రమ ఆవరణలో నిప్పంటించడం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగవస్తుందని, రోడ్డుపై వాహనాలు వెళ్లడానికి కూడా వీలుకావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ నుంచి రాత్రి సమయంలో విడుదలవుతున్న దట్టమైన పొగవల్ల గ్రామాల్లో ఒకరికికొకరు కనిపించడం లేదంటున్నారు. పొగతో ఇళ్లముందు ఉన్న వస్తువులు కూడా నల్లగా మారుతున్నాయంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజల జీవన మనుగడ అసాధ్యమేనంటున్నారు. పొగవల్లనే దురదలు.. పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదిలే పొగవల్లనే ఇలా దురదలు వస్తున్నాయి. దురదల కారణంగా పిల్లలు రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. ముఖ్యంగా కొందుర్గు శివారులోని దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమ వారు వదులుతున్న పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. కాలుష్యం నియంత్రించకుంటే ఇబ్బందులు తప్పవు. – సరిత, ఎంపీటీసీ, ఉత్తరాసిపల్లి వస్తువులన్నీ మసిబారుతున్నాయి.. దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదులుతున్న పొగవల్ల ఇళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ మసిబారుతున్నాయి. ఆహార పదార్థాలతోపాటు, కనీసం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ విషయమై పలుసార్లు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చంద్రశేఖర్, ఛత్రపతి యూత్ అధ్యక్షుడు కొందుర్గు వీపును గోడకేసి రాస్తున్నాడు.. మా బాబుకు శరీరంపై మొత్తం దురద ఏర్పడి రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. దురదకు భరించలేక వీపును గోడకేసి రాస్తున్నాడు. మా బాబుతోపాటు గ్రామంలో దాదాపు 20 మందికి పైనే ఇలాగే దురద పెట్టి శరీరమంతా దద్దుర్లు పోయాయి. రాత్రివేళల్లో గ్రామమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఈ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. – సిద్దులూరి స్వర్ణలత, గంగన్నగూడ -
విద్యావలంటీర్ల నియామకం పూర్తి
కొందుర్గు : మండలంలోని వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం మెరిట్‌ను ఆధారంగా తీసుకొని విద్యావలంటీర్లను నియమించిందని ఎంఈఓ కిష్టారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ స్థానాల్లో లక్ష్మికాంత్, ప్రమోద్‌కుమార్, వి.కృష్ణయ్య ఎంపికయ్యారన్నారు. ఎస్జీటీ పోస్టుల్లో బి.మంజులత, కె.కృష్ణవేణి, షహేదా, బిస్మిల్లాబేగమ్, అబ్దుల్ మతీన్, సి.సరిత, మర్రి మాలతి, రాధ, ఎం. గోవింద్, బోడంపాటి జ్యోతి, ఎం.ప్రియాంక, బోయపల్లి రాహుల్, బోయ చెన్నయ్య, బైరంపల్లి రజిత, టి.వెంకటేష్, సి.ప్రీతిక, పి.కిషన్ నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన వలంటీర్లు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం ఉదయం 10 గంటలకు ఎమ్మార్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్నాం తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని తెలిపారు. -
ఆడుకునేందుకు వెళ్లి..
కొందుర్గు, న్యూస్‌లైన్ : ఆడుతూ, పాడుతూ కళ్లముందే తిరిగిన ఇద్దరు చిన్నారులు కొద్ది క్షణాల్లోనే నీట కుంటలో పడి దుర్మరణం పాలు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే... కొందుర్గు మండలం జాకారం గ్రామపంచాయతీ పరిధిలోని లోక్యానాయక్తండాకు చెందిన ఆంగోతు పాండునాయక్, లాలి దంపతులకు కుమారులు గుండ్యా (5) 12 ఏళ్ల రాగ్యా, పదేళ్ల కూతురు అనిత ఉన్నారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అలాగే అదేతండాకు చెందిన రాములునాయక్, సోనిబాయి దంపతులకు కూతురు సవిత (7) కుమారులు ఎనిమిదేళ్ల సేవ్యా, ఏడాది చింటు ఉన్నారు. మూడేళ్లక్రితమే తండ్రి దుబాయ్‌కి వలస వెళ్లాడు. తల్లి స్థానికంగా కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికంగా పాఠశాల లేకపోవడం వల్ల ఈ తండాకు చెందిన విద్యార్థులు జాకారం ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి చదువుకుంటారు. ఇక్కడే గుండ్యా ఒకటో, సవిత రెండో తరగతి చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం తోటి పిల్లలతోపాటు పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. సాయంత్రం వీరిద్దరితో పాటు తోటి స్నేహితులు బాలు, చరణ్‌తో కలిసి ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తండాకు సమీపంలోని ఎర్రకుంటలో పడి నీట మునిగారు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే తండావాసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘనటతో తండాలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాలను ఎల్‌హెచ్‌పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు మంగులాల్‌నాయక్ తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం గిరిజన కుటంబాలకు ఉపాధి కల్పించకపోవడం వల్లే వలసలు పెరుగుతున్నాయని ఆరోపించారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
కొందుర్గు, న్యూస్‌లైన్ : మరికొన్ని నె లల్లో తమ కూతురు ఓ పాపకు జన్మనిస్తుంన్న సంతోషంలో ఉన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలాయి.. పిల్లాపాపల తో తన కూతురు ఎంతో సంతోషంగా గడుపుతుందని ఆశించిన వా రికికి విషాదం మిగిలింది.. జీవితాం తం కలి సుంటానని, కష్టసుఖాల్లో పాలు పం చుకుంటూ, జీ వితాంతం తోడుగా ఉం టానని, ఏడడుగులు నడిచిన భ ర్తే భార్య పాలిట యముడయ్యాడు.. గర్భిణి అన్న కనికరం లే కుండా తీవ్రంగా కొట్టి చంపేసి, ఆపై ఒంటిపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు.. అందుకు ప్రియురాలి సహకారం తోడైంది.. పోలీసుల కథనం ప్రకారం... కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన ఉమాదేవి (23) కి కొందుర్గు వాసి సర్వని శ్రీనివాస్‌తో ఏడాది క్రితమే వివాహమైంది. ఆ సమయంలో 12 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. రెండు లక్షల నగదు ఇచ్చారు. ప్రస్తుతం భార్య ఐదు నెలల గర్భిణి. కొన్నినెలల నుంచి ఆమెను భర్త అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధించసాగాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో మహిళ మంజులతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఉమాదేవి తండ్రి నారాయణ హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. తన కూతురు సంసారం బాగుండాలని అడిగినప్పుడల్లా కాస్తోకూస్తో ఇచ్చి పంపేవాడు. ఇటీవలే రూ. పది వేలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే గత నెల 7న భార్యాభర్తలు పెళ్లిరోజు సైతం జరుపుకొన్నారు. ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలవలేదు. చివరకు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇం ట్లోనే భర్తతోపాటు ప్రియురాలు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చా రు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించి మృతురాలి ఒంటిపై కి రోసిన్ పోసి నిప్పంటించారు. బుధవా రం ఉదయం చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ద్రోణాచార్యులు, సీఐ రవీందర్‌రెడ్డి, ఏఎస్ఐ కృష్ణయ్య, తహశీల్దార్ పాండు పరిశీలించారు. అనంతరం మృతదే హా న్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి త రలించారు. కాగా తమ కూతురును అ ల్లుడితోపాటు ప్రియురాలు కలిసి హ త్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు నారాయణ, యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిం దితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలు పరారీలో ఉంది.