kotta janta
-
ఇక వేరే దారి లేదు.. నేనే దిగాలి..!
-
చిన్న సినిమాలకు దూరం కాను!
‘‘పని ఒత్తిడి అనే మాట నా నిఘంటువులో లేదు. ఎంతో ఇష్టంగా పని చేస్తా. షూటింగ్ లేని సమయాల్లో కథలు రాస్తుంటాను. పని చేయడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది’’ అంటున్నారు మారుతి. ఇటీవల విడుదలైన ‘కొత్త జంట’ దర్శకునిగా తన ప్రతిష్ట పెంచిందని మారుతి వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ - ‘‘యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూడాలనే ఆకాంక్షతో చేసిన సినిమా ఇది. నా ఆశయం నెరవేరింది. విడుదలకు ముందు ఈ సినిమా రామ్చరణ్ చూసి, ‘చాలా తెలివిగా తీశావు’ అన్నాడు. బన్నీకి కూడా నచ్చింది. ‘రాధ’ కథ ఆలస్యం అవుతున్నందువల్లే వెంకటేశ్ ‘దృశ్యం’ ఒప్పుకున్నారని ఈ సందర్భంగా మారుతి పేర్కొన్నారు. డీవీవీ దానయ్య సంస్థలో ఓ సినిమా చేస్తాననీ, రవితేజ, నాగచైతన్య, సునీల్ తదితరులకు కూడా కథలు సిద్ధం చేస్తున్నానని చెప్పారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కోటి, రెండు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చిన్న సినిమాలు కూడా చేస్తానని, చిన్న సినిమాలకు ఎప్పటికీ దూరం కానని మారుతి స్పష్టం చేశారు. -
‘కొంత్త జంట’ మూవీ న్యూ స్టిల్స్
-
కెమిస్ట్రీ కుదిరిందా?
ఓ అందమైన అమ్మాయి... ఓ తెలివైన అబ్బాయి. అప్పటిదాకా ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఓ మధుర క్షణంలో ఇద్దరూ ఒకే ప్రపంచంగా గడపాల్సిన పరిస్థితులు. వారిద్దరి మధ్యనా లవ్ కెమిస్ట్రీ కుదిరిందా? లేక లైఫ్ మేథమేటిక్స్ చెడిందా? ఈ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కొత్త జంట’. అల్లు శిరీష్, రెజీనా ఇందులో హీరోహీరోయిన్లు. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం మే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ- ‘‘శిరీష్, రెజీనా పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. సప్తగిరి, పోసానిల కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సమ్మర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది’’ అని చెప్పారు. మారుతి మాట్లాడుతూ- ‘‘నా ‘ప్రేమకథా చిత్రమ్’ కన్నా రెండింతల కామెడీ ఇందులో ఉంటుంది. జేబీ సంగీతం సినిమాకే హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్. -
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ
-
కొత్తగా ఉండే జంట
‘‘ఈ ప్రచార చిత్రం బావుంది. దర్శకుడు మారుతి కొత్త జంటను కొత్తగా ఆవిష్కరించాడు’’ అని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘కొత్త జంట’ ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్లో జగపతిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లా డుతూ -‘‘ఈ టీమ్ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. బన్నీ వాసు దగ్గరుండి ఈ సినిమా రూపొందించాడు’’ అన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని మారుతి చెప్పారు. ఈ నెల 12న పాటలను, మే 1న చిత్రాన్ని విడుదల చేస్తామని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్, జెబి, డీఎమ్కె, బాబు నాయక్, రావిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్లు కొట్టేస్తున్న రెజీనా..!