కెమిస్ట్రీ కుదిరిందా? | Does the Chemistry is fine ? | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ కుదిరిందా?

Published Wed, Apr 23 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

కెమిస్ట్రీ కుదిరిందా?

కెమిస్ట్రీ కుదిరిందా?

ఓ అందమైన అమ్మాయి... ఓ తెలివైన అబ్బాయి. అప్పటిదాకా ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఓ మధుర క్షణంలో ఇద్దరూ ఒకే ప్రపంచంగా గడపాల్సిన పరిస్థితులు. వారిద్దరి మధ్యనా లవ్ కెమిస్ట్రీ కుదిరిందా? లేక లైఫ్ మేథమేటిక్స్ చెడిందా? ఈ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కొత్త జంట’. అల్లు శిరీష్, రెజీనా ఇందులో హీరోహీరోయిన్లు. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం మే నెల 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ- ‘‘శిరీష్, రెజీనా పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. సప్తగిరి, పోసానిల కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సమ్మర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. మారుతి  మాట్లాడుతూ- ‘‘నా ‘ప్రేమకథా చిత్రమ్’ కన్నా రెండింతల కామెడీ ఇందులో ఉంటుంది. జేబీ సంగీతం సినిమాకే హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.కె.ఎన్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement