KOULU RAITHU
-
కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ సజావుగా సాగిన పంటహక్కు సాగుదారు పత్రాల (సీసీఆర్సీ) జారీ ప్రక్రియలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని కాజేయడమే లక్ష్యంగా కౌలు కార్డులను అధికార టీడీపీ నేతలు కాజేస్తున్నారు. కనీసం సెంటు భూమి కూడా లేని వారితోపాటు సాగుకు దూరంగా ఉండే టీడీపీ కార్యకర్తలు సైతం సీసీఆర్సీ కార్డులు పొందుతున్నారు. భూ యజమాని అంగీకారం అనే నిబంధన వల్ల మెజార్టీ కౌలు రైతులు నష్టపోతున్నారనే సాకుతో సీసీఆర్సీ చట్టం స్థానంలో కౌలురైతు చట్టం–2024 తెస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. అయితే కొత్త చట్టం ముసాయిదా ఇంకా సిద్ధం కానందున పాత చట్టం ప్రకారమే నిర్దేశించిన లక్ష్యం మేరకు సీసీఆర్సీలు జారీ చేయాలి. గత సర్కారు ఏటా సగటున 5.19 లక్షల చొప్పున ఐదేళ్లలో 25.93 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేసింది. 2023–24లో రికార్డు స్థాయిలో 8.35 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. 2024–25 సీజన్లో కనీసం 10 లక్షల మందికి సీసీ ఆర్సీలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అనుగుణంగా మే 15వతేదీ నుంచే సీసీఆర్సీ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా ఎన్నికల కోడ్ సాకుతో విపక్షాలు అడ్డుకోవడంతో సీసీఆర్సీ కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జూన్ నెలాఖరులో సీసీఆర్సీల జారీ ప్రక్రియ చేపట్టింది. అయితే కేవలం 40 రోజుల్లో 8.50 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ కావడం సందేహాలకు తావిస్తోంది.టీడీపీ నేతల బెదిరింపులుఇది మా ప్రభుత్వం.. భూ యజమాని అంగీకారంతో పనిలేదు.. మేము చెప్పిన వారికే కౌలు కార్డులు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పలు చోట్ల క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. వాస్తవానికి కౌలుకిచ్చిన సాగుదారుడికే కౌలు కార్డు ఇచ్చేందుకు భూ యజమాని అంగీకారపత్రం ఇవ్వాలి. అలాంటిది భూయజమాని తాను కౌలుకిచ్చిన భూమినే భాగాలుగా విభజించి తమ కుటుంబ సభ్యుల పేరిట, తమకు నచ్చిన వారి పేరిట అంగీకార పత్రాలిస్తూ బోగస్ సీసీఆర్సీలు పొందుతున్నట్టు గుర్తించారు. మరికొన్ని చోట్ల భూ యజమానితో సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి దొడ్డిదారిన కౌలుకార్డులు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా కార్డుకు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.పెట్టుబడి సాయం కాజేసేందుకే..రూ.20 వేల పెట్టుబడి సాయంతో పాటు ఇతర సంక్షేమ ఫలాలు పొందేందుకు ఈ కార్డే ప్రామాణికం కావడంతో టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులు, కార్యకర్తల పేరిట సీసీఆర్సీలు పొందుతున్నారు. దీనివల్లే పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్డులు జారీ అయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల్లో మూడో వంతు బోగస్ కావచ్చని భావిస్తున్నారు.విచారిస్తున్నాం..సీసీఆర్సీల జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో భూమి ఖాతా ఆధారంగా సీసీఆర్సీలు జారీ చేస్తారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో సభ్యులు ఒకే భూమిపై వేర్వేరుగా సీసీఆర్సీ కార్డులు పొందుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆరోపణలపై సీఎంఆర్వో పీడీని వివరణ కోరాం. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటాం.– ఎస్.ఢిల్లీరావు, డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
కౌలు రైతులకు చకచకా కార్డుల పంపిణీ
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్స్) మేళాలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వహించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు నూరు శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌ల)ను ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీకేలతో అనుసంధానించింది. ప్రతి కౌలు రైతుకు రుణంతోపాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న భావనతో కౌలుదారులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ ఏడాది ఇప్పటికే 1.10 లక్షల మంది కౌలు రైతులకు కౌలు కార్డులను అధికారులు జారీ చేశారు. మిగిలిన వారికి జారీ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ ఏడాది తొలివిడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ కవచం సీసీఆర్సీ చట్టం రాష్ట్రంలో 76.21 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే దానిపై వేర్వేరు అంచనాలు ఉన్నాయి. గతంలో కౌలుదారులు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాల కోసం నానాఅగచాట్లు పడేవారు. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. బ్యాంకులు నిబంధనల పేరుతో మొండిచేయి చూపేవి. ఈ నేపథ్యంలో కౌలుదారులకు మేలు చేయాలన్న సంకల్పంతో 2019లో తెచ్చిన పంట సాగుదారుల హక్కు పత్రాల (సీసీఆర్సీ) చట్టంతో 11 నెలల కాల పరిమితితో ప్రభుత్వమే కౌలు కార్డులు జారీ చేస్తోంది. వీటిద్వారా కౌలు రైతులకు నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. వీరు పండించిన పంటలను ఈ క్రాప్ ఆధారంగా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. నూరు శాతం కౌలు కార్డుల జారీ లక్ష్యం సీసీఆర్సీ మేళాలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 1.10 లక్షల మందికి కౌలు కార్డులు జారీ చేశాం. భూ యజమానులు సహకరిస్తే మరింత మందికి మేలుచేసే అవకాశం ఉంటుంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందచేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఆదుకున్న సర్కార్‌పై నిందలా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కౌలు రైతుల బలవన్మరణాలను అడ్డుపెట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వినూత్న పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను పెద్ద మనసుతో ఆదుకుంటోంది. ఈ వాస్తవాలను పక్కనబెట్టి.. మృతి చెందిన కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ రాజకీయ లబ్ధి కోసం పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో 53 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష వంతున పంపిణీ చేశారు. ఈ రైతుల వాస్తవ పరిస్థితి పరిశీలించగా.. వీరిలో అర్హతలున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిహారం అందజేసింది. వీరిలో ఒక్కరు కూడా పట్టా రైతు కారు. అయినప్పటికీ పంట సాగు హక్కు పత్రం (క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్ – ప్రత్యేక చట్టం ద్వారా జగన్ ప్రభుత్వం ఇచ్చింది) ఉన్న ఏ ఒక్కరినీ విడిచి పెట్టకుండా రూ.7 లక్షల చొప్పున సాయం అందించింది. ఆ కార్డులు లేని వారికి కూడా వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.లక్ష ఇచ్చి ఆదుకుంది. అటు కౌలు రైతు కార్డు లేక, వయసు మీరడంతో ఇటు బీమా వర్తించక ఒకరికి మాత్రమే పరిహారం అందలేదు. ఇలాంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సాయమే చేయలేదని పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఇదివరకే ప్రభుత్వ పరిహారం అందుకున్న వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. రూపాయి లంచం లేకుండా రూ.7 లక్షలు ఇతని పేరు గుత్తుల వెంకట్రావు (54). వరి పంట సాగుచేసే కౌలు రైతు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు స్వగ్రామం. అప్పుల బాధతో 2021 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య భవాని, కుమారుడు సురేష్, కుమార్తె దేవి ఉన్నారు. ఇతనికి కౌలు రైతు కార్డు ఉండటంతో కుటుంబ సభ్యులు నేరుగా అధికారులను ఆశ్రయించారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. ఈ సాయం భవాని బ్యాంక్ ఖాతాలో జమ అయింది. దరఖాస్తు చేయగానే పరిహారం ఇతని పేరు శీలం త్రిమూర్తులు. కౌలు రైతు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం గ్రామ పంచాయతీ ప్రత్తిగొంది గ్రామం. ఆరు ఎకరాల్లో వరి సాగు చేసేవాడు. సాగులో నష్టాలు రావడంతో 2021 ఏప్రిల్ 12 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో భార్య శీలం సుజాత ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.7 లక్షల పరిహారం ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయింది. ప్రభుత్వం ఆదుకోక పోయుంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనని ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతోంది. ఎవరి సిఫారసు లేకుండా సాయం ఈమె పేరు సుంకర నాగమణి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి. భర్త సుంకర చంద్రయ్య కౌలు రైతు. నాలుగున్నర ఎకరాల పొలం కౌలుకు చేసేవాడు. పంట నష్టపోవడంతో 2020 నవంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో వలంటీర్ ద్వారా విషయాన్ని ఎవరి సిఫారసు లేకుండానే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ.7 లక్షలు పరిహారం మంజూరైంది. తమ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకుందని వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి ఆధారం చూపారు.. ఈమె సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన ఉమ్మిడిశెట్టి వెంకటలక్ష్మి. భర్త ఉమ్మిడిశెట్టి వెంకట దుర్గారావు (45) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వర్జీనియా పొగాకు సాగు చేసేవాడు. అప్పులపాలై 2022 ఫిబ్రవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు దొరబాబు, కుమార్తె దేవి, పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్న తండ్రి సుబ్బారావు, తల్లి మంగమ్మ పోషణ ఇబ్బందిగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన కౌలు రైతు కార్డు ఉండటంతో ప్రభుత్వం రూ.7 లక్షలు మంజూరు చేసింది. ఆ డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు జమ చేశారు. కౌలు కార్డు లేకపోయినా సాయం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన పట్టపగలు సురేష్ (28) 2021 నవంబర్ 30న, ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన కర్రి శ్రీనివాస్ (28) 2021 జూలై 11న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు కార్డు కోసం భూ యజమాని సంతకం చేయకపోవడంతో వీరికి కౌలు కార్డు మంజూరు కాలేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వైఎస్సార్ బీమా పథకం ద్వారా సురేష్ భార్య మహాలక్షి, శ్రీనివాస్ భార్య కర్రి వీరవేణి బ్యాంకు ఖాతాలకు రూ.లక్ష చొప్పున జమ చేసింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకర పాలెం శివారు చింతాకుల వారి పాలెంకు చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ (65) పంట నష్టంతో పాటు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి కూడా కౌలు రైతు కార్డు లేదు. 65 ఏళ్లు దాటడంతో బీమా వర్తించలేదు. -
ఇకపై కౌలుదారీ ‘చుట్టం’
కౌలు సేద్యం ఇక.. సంతోషాలను సుసాధ్యం చేయనుంది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా.. కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): సెంటు భూమి లేకపోయినా భూమాతను నమ్ముకుని ఆరుగాలం శ్రమించే కౌలు రైతుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కౌలు రైతు కోసం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా కేవలం పండించే పంటలకు హక్కు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో జిల్లాలో 3.50 లక్షల మంది కౌలు రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ‘నేను విన్నాను.. నేనున్నాను’.. అంటూ ప్రజాసంకల్ప పాదయాత్రలో భరోసా కల్పించిన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కౌలు రైతుల కోసం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ను కౌలు రైతులకూ వర్తింపజేయాలన్న ప్రతిపాదనకు గత గురువారం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సోమవారం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో కౌలు రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం అన్నదాతలకు కల్పించే రాయితీలన్నీ కౌలు రైతులకు కల్పించింది. దీంతో కౌలు రైతులు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేందుకు వీలు కలుగుతుంది. భూ యజమానులు, కౌలు రైతులు పరస్పర అంగీకారంతో చేసుకునే ఒప్పందాలు రాతపూర్వకంగా ఉంటాయి. భూ యజమానులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు ఊరట కల్పించే బిల్లును రూపొందించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో కౌలు రైతులూ పంట రుణాలు తీసుకునేందుకు అర్హులవుతారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీతో పాటు వ్యవసాయశాఖ అందించే ఇతర రాయితీలన్నీ కౌలు రైతులకూ వర్తిస్తాయి. జిల్లాలో ఇలా.. మొత్తం కౌలు రైతులు 3.50 లక్షలు సాగు చేసే భూమి విస్తీర్ణం 7లక్షల ఎకరాలు ఎల్ఈసీ కార్డులు పొందిన వారు 2.20 లక్షలు భూములే లేని కౌలు రైతులు 1.50 లక్షలు 2019–20లో కౌలురైతు రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2 వేల కోట్లు అందరికీ వైఎస్సార్ రైతు భరోసా.. జిల్లాలో ఉన్న కౌలు రైతులందరికీ అక్టోబరు నెల నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయంగా రూ.12,500 అందించనున్నారు. ఇది వరకూ పంటలు సాగు చేసుకునేందుకు బయట వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని సాగు చేసుకునేవారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోతే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని దుస్థితి ఉండేది. దీంతో పంట చేతికిరాగా, మరోవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం దండగ కాదు పండగలా చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. ఉచిత పంటల బీమా పంటలు సాగు చేసిన తర్వాత వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంటలు కోల్పోతే రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. పంటలకు బీమా చేసినా ప్రైవేటు బీమా సంస్థల నిబంధనల వల్ల పరిహారం అనుకున్నంత మేరకు వచ్చేది కాదు. దీనికితోడు ఈ ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోతే వచ్చే ఖరీఫ్‌కు కూడా పరిహారం రైతు చేతికి అందడం లేదు. దీనికితోడు మిర్చి, పత్తి, వరి పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో చాలా మంది బీమా చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కౌలు రైతులకు అసలు బీమానే వర్తించేది కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతుకూ బీమా సదుపాయాన్ని కల్పిస్తామని, ఆ బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇవ్వడంతో రైతుల మోముల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోంది. బీమా సొమ్ము చెల్లించడం చరిత్రే రైతులు, ముఖ్యంగా కౌలురైతులు బీమా విషయాన్ని పట్టించుకోరు. కానీ ప్రభుత్వం వారి కోసం ఆలోచించి బీమా ప్రీమియం కూడా చెల్లించేందుకు ముందుకు రావడం చరిత్రలో లేదు. ఏ ప్రభుత్వమూ కౌలురైతు కోసం ఆలోచించిన పాపాన పోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. – సి.హెచ్.సంజీవరావు, కౌలురైతు -
కౌలు రైతుకు గుర్తింపు ఏది?
దెందులూరు : రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా పాలకులు అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వల్ల కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అత్యధిక భూములను కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు ఎంతోకొంత మేలు చేకూర్చే గుర్తింపు కార్డుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదు. ఖరీఫ్‌కు సిద్ధం కావాలంటూ ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఊదరగొడుతున్నా గుర్తింపు కార్డుల పంపిణీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. భూములను సాగు చేసేది కౌలు రైతులే అయినా ప్రభుత్వ రాయితీ పొందాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీని సక్రమంగా చేపట్టకపోవడంతో ఏటా వేల మంది రైతులకు రాయితీలు అందక అప్పుల పాలవుతున్నారు. భూయజమానుల బినామీలకు కార్డులు ప్రభుత్వం గ్రామ గ్రామాన గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తీసుకునేలా గుర్తింపుకార్డుల ద్వారా ప్రభుత్వ రాయితీలు, సహాయ, సహకారాలు, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, పంట రుణాలు ఇతర రాయితీలను ఇస్తారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో భూయజమానుల బినామీలకు, అనర్హులకు కార్డులు కట్టబెడుతున్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు అందటం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ప్రక్రియ, గ్రామ సభలు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. జిల్లాలో 3 లక్షల 25 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గ్రామాల్లో 2 లక్షల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం విచారకరం.వీరంతా గుర్తింపుకార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కార్డులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రూ.20 నుంచి రూ.120 వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కార్డుకు రూ.120 వరకు వసూలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఉచితంగా ఇవ్వాలి. రూ.20 నుంచి రూ.120 వరకూ కొన్నిచోట్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలి. దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి. నేటూరి గోపాలకృష్ణ, కౌలు రైతు, కొవ్వలి అర్హులందరికీ కార్డులివ్వాలి ఉపాధి హామీ పథకం పనుల వివరాలు గ్రామ పంచాయతీల్లో బోర్డులు ఏర్పాటు చేసి ఎలా చెబుతున్నారో, అదే విధంగా రైతులకు ప్రభుత్వం ద్వారా అందే పంట రుణాలు, రాయితీలు పూర్తిస్థాయి వివరాలు తెలియజేయాలి. కౌలు రైతులందరికీ కార్డులివ్వాలి ఎ.మోహనరావు, కౌలు రైతు, రాజుపేట 2 లక్షల మందికి రాలేదు 2011 భూఅధీకృత సాగుదారు చట్టం అమలు లోపభూయిష్టంగా ఉంది. ఉన్నతాధికారులు అంకితభావంతో పర్యవేక్షణ, విధులు నిర్వహణ చేయాలి. లక్ష్యానికి అనుగుణంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, 2 లక్షల మందికి ఇవ్వకపోవడం, భూయజమానుల బంధువులకు, బినామీ కార్డులు అధికమవ్వడం దురదృష్టకరం. కె.శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి